Search
  • Follow NativePlanet
Share
» »సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం ! 10 లక్షల మంది చూసి షాక్....

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం ! 10 లక్షల మంది చూసి షాక్....

పాము పేరు చెపితేనే ఎటువంటి వారికైనా వెన్నులో వణుకు మొదలవుతుంది. కానీ ఆ గ్రామంలో ప్రతీఇంటికీ గుట్టలుగుట్టలుగా పాములు ఉంటాయి. అవి కరిచినా వారికి ఏమీ కాదు.ఈ వూరి రహస్యమేంటో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

By Venkatakarunasri

పాము పేరు చెపితేనే ఎటువంటి వారికైనా వెన్నులో వణుకు మొదలవుతుంది. కానీ ఆ గ్రామంలో ప్రతీఇంటికీ గుట్టలుగుట్టలుగా పాములు ఉంటాయి. అవి కరిచినా వారికి ఏమీ కాదు.ఈ వూరి రహస్యమేంటో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

కర్ణాటక రాష్ట్రంలో దావణగిరి జిల్లలో వున్న పంచాయత్ అనే పట్టణానికి దగ్గరగా నాగేనహళ్లి అనే గ్రామం వుంది. దేవనాగరి పట్టణానికి 50కి.మీ ల దూరమలో ఈ పట్టణం వుంది. సర్పాల యొక్క మహత్యం కారణంగా ఈ గ్రామం చాలా కాలంగా వార్తల్లోకి వస్తుంది.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

ఈ గ్రామంలోని విశేషం ఏంటంటే ఈ గ్రామంలో వున్న వారు గానీ ఈ గ్రామంలోకి వచ్చిన వారు గానీ ఏ విధమైన సర్పకాటుకి గురికావటం లేదు. ఈ గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ తాచు పాములు సంచరిస్తూవుంటాయి.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

అయినప్పటికీ ఈ గ్రామంలో ఎవరూ త్రాచుపాములను చూసి ఎంత మాత్రం భయపడరు.అసలు నాగేనహళ్లి అంటేనే తాచుపాముల గ్రామం అని అర్ధం. ఈ ప్రాంతంలో త్రాచుపాములు మానవులతో కలిసి సహజీవనం చేస్తూ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలోని అనేకమంది ప్రజలు చాలా సార్లు కొన్ని కారణాల వల్ల సర్పాలకాటుకు గురైనా వాళ్లకు ఏమీకాలేదు. సర్పం చేత కరవబడ్డ వాళ్లకు ఆ గ్రామంలో వున్నంతవరకూ వాళ్లకు ఏమీకాదు.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

ఏ కారణంచేతైనా పాము కాటుకు గురైనవాళ్ళు ఆ వూరు పొలిమేరు దాటిన మరుక్షణం చచ్చి క్రిందపడి పోతారు. అంటే పాము కరిచినప్పటికీ ఆ గ్రామంలో వున్నంతవరకూ వాళ్ళ మీద ఆ విషం పనిచేయదు. ఇలా ఎందుకు జరుగుతుందో కొమ్ములు తిరిగిన సర్పశాస్త్రఘ్నులకు కూడా అర్థం కాలేదు.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

ఆ గ్రామంలో ఎవరినైనా ఒక సర్పం కరిస్తే ఆ సర్పాన్ని తీసుకుని ఆ వూరి స్మశానంలో వున్న యతీశ్వర మండపం దగ్గర వుంచుతారు. ఆ గ్రామంలో సర్పాల చేత కరవబడ్డ వారు మొదట దగ్గరలో ఉన్న హనుమాన్ ఆలయానికి వెళతారు.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

అక్కడ స్వామివారి తీర్ధం తీసుకుని మరునాడు ఉదయం వరకు ఆ గుడిలోనే వుండిపోతారు. అంతే ఎక్కిన తాచు పాము విషం నిర్వీర్యం అయిపోయి వాళ్ళు క్షేమంగా భయటపడతారు. ఒకప్పుడు ఈ గ్రామంలో యతీశ్వరస్వామి అనే సాధువు స్వామివారికి భక్తుడిగా వుండేవారట.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

ఆయన ప్రతీరోజూ ఉదయం గ్రామంలోని ఇంటింటికి వెళ్లి భిక్షం ఎత్తుకుని హనుమాన్ గుడి పరిసరాలలో విశ్రాంతి తీసుకుంటూవుండేవారట.ఒక రోజు ఆయన ఇంటింటికీ తిరిగి భిక్షం ఎత్తుకుంటుండగా ఒక చోట పొదల మధ్యలో పడివున్న శిశువు కనిపించింది.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

అది ఒక మగబిడ్డ.అనాదిగా పడివున్న ఆ బిడ్డను చూసి ఆ సాధువు హృదయం కరిగిపోయింది.ఫలితంగా ఆయన ఆ బిడ్డను తీసుకుని వెళ్లి పెంచటం ప్రారంభించాడు. కాలచక్రంలో 12 సంలు గడిచిపోయాయి.ఆ మగ బిడ్డకు 12ఏళ్ళు నిండాయి.ఒక రోజున ఆయన ఆ పిల్లవాడిని గుడి దగ్గర విడిచి భిక్షం ఎత్తుకోవటానికి ఊర్లోకి వెళ్ళాడు.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

మధ్యాహ్నానికి భిక్ష తీసుకుని గుడి దగ్గరకు వచ్చిన సాధువుకి పాముకాటుకు గురై చనిపోయివున్న తన పెంపుడు బిడ్డ కనిపించాడు.తన పెంపుడు బిడ్డకు అకాలమృత్యువు కలిగించిన సర్పంమీద ఆ సాధువుకు విపరీతమైన ఆగ్రహం కలిగింది.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

అమోఘమైన తపశ్శక్తి కలిగిన ఆ సాధువు ఆగ్రహంతో నాగలోకాన్ని పరిపాలించిన నాగలోకాన్ని పరిపాలించిన నాగ రాజును శపించటానికి ప్రయత్నించాడు.ఆ విషయాన్ని పసిగట్టిన నాగరాజు కన్నుమూసి తెరిచేలోగా తన పరివారంతో సహా పాతాళలోకం నుండి ఆ సాధువున్న ప్రాంతానికి వచ్చి శపించబోతున్న ఆ సాధువు కాళ్ళమీద పడి తన జాతి పాము చేసిన పాపాన్ని క్షమించమని వేడుకున్నాడు.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

అంతేకాకుండా సర్పకాటుకి గురై చనిపోయిన భార్యని వెంటనే బతికించాడు.అప్పుడు ఆ సాధువు శాంతించి నాగరాజుతో ఇలా అన్నాడు. ఇకపై గ్రామంలో నివశించే వారిని లేదా వున్నవారిని ఇకపై ఏ సర్పమైనా కరిచినట్లయితే కరవబడ్డ వారు గ్రామం పొలిమేర దాటనంతవరకూ వారిలోవున్న పాము విషం శక్తిహీనమవుతుంది.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

అందువలన వాళ్ళు చావరు. ఏ కారణంగానైనా పాముకాటుకు గురైనవాళ్ళు ఈ గ్రామపొలిమేరలు దాటంగానే చనిపోతారు. నాగరాజు సాధువు చెప్పిన షరతుకు అంగీకరించాడు. ఆ తర్వాత ఆ సాధువు ఆ గ్రామ సరిహద్దులపై 4 బండ రాళ్ళను పాటి వాటిపై ఆయనే స్వయంగా ఇలా చెక్కాడు.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

ఈ నాలుగురాళ్ళు సరిహద్దులపై వుండే నాగేనహళ్లి గ్రామంలో వున్నంతవరకూ సర్పం చేత కరవబడిన ఏ వ్యక్తికీ ప్రాణ హాని వుండదు. సర్పం కరిచినవారు వెంటనే గ్రామ పొలిమేరలు దాటినట్లైతే వారికి మరణం తప్పదు.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

ఈనాటికి ఆనాడు యతీశ్వరస్వామి చేత భూమిలో స్థాపించబడ్డ నాలుగుసరిహద్దు బండరాళ్ళు యధాతధంగా నిలిచేవున్నాయి. అయితే ఈ యతీశ్వరస్వామి ఏ శతాబ్దానికి చెందినవాడో తెలీటంలేదు.ఈ గ్రామంలోని ప్రజలు మాంసాహారం తినగూడదని,సర్పాలను చంపకూడదని ఒక నియమాన్ని ఆ సాధువు ఏర్పాటుచేసాడు.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

తెలిసిగానీ,తెలీకగానీ ఈ గ్రామంలోని వారు ఏ సర్పాన్నైనా చంపినట్లయితే తీవ్రఫలితాలను ఎదుర్కోవాల్సివుంటుందని ఆ సాధువు తెలియచేసాడు. ఆ సాధువు కధ తరతరాలుగా ఒకళ్ళనుంచి ఇంకొకళ్ళకి అందుతూనే వుంది. ఆ గ్రామంలో దాదాపు 70ఇళ్ళు వున్నాయి.

PC:youtube

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

సైన్సుకే చుక్కలు చూపిస్తున్న గ్రామం !

ఆ గ్రామంలోని ఇళ్ళ వెంట,తోటల్లోనూ,పోదల్లోనూ, పొలాల్లోనూ భారీపరిమాణాల్లో వుండే తాచుపాములు నిరాటంకంగా సంచరిస్తూవుంటాయి.అయినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ పనుల్ని తాము చేసుకుంటూ పోతూంటారు ఆ గ్రామస్థులు.

PC:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X