Search
  • Follow NativePlanet
Share
» »UPలో నైమిషారణ్యంలోని చక్ర తీర్థం..మీరు నీళ్ళల్లోకి దిగితే మీప్రమేయం లేకుండానే చక్రంలాగా తిరుగుతారు

UPలో నైమిషారణ్యంలోని చక్ర తీర్థం..మీరు నీళ్ళల్లోకి దిగితే మీప్రమేయం లేకుండానే చక్రంలాగా తిరుగుతారు

ఇది UPలో నైమిషారణ్యంలోని చక్ర తీర్థం...మీరు నీళ్ళల్లోకి దిగితే మీ ప్రమేయం లేకుండానే చక్రం లాగా తిరుగుతారు.ఇది బ్రహ్మ సృష్టి..!!

ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఎంతో మంది పర్యాటకులు ఇక్కడ విహారానికి వస్తుంటారు. దేశంలోనే కాదు విదేశాల నుండి కూడా అనేక మంది పర్యాటకులు ఇక్కడికి విహారానికి వస్తుంటారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లక్నో సమీపంలోని అనేక ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దింది.

లక్నో నుండి 94కిలోమీటర్ల దూరంలోని సీతాపూర్ జిల్లాలో ఉన్న నైమిషారణ్యం వైదిక యుగం నుండే హిందువులకు ముఖ్యమైన తీర్థ స్థానంగా నిలుస్తోంది. నిమి అంటే చక్రం, అరణ్యం అంటే అడివి. ఒక పెద్ద చక్రం అటవీ ప్రాంతంలోకి వచ్చి విరిగిపోయిన ప్రదేశం కనుకనే ఇది నైమిశారణ్యం అయింది.

నైమిశారణ్యంకు ఆ పేరు ఎలా వచ్చింది

నైమిశారణ్యంకు ఆ పేరు ఎలా వచ్చింది

ఈ ప్రాంతానికి ఈ పేరు రావడానికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. వాయు పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. వీటో చాలా ప్రాచూర్యంలో ఉన్న పురాణం ప్రకారం మహాభారత యుద్ధ అనంతరం కలియుగ ఆరంభ సమయంలో శౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని యజ్ఞ నిర్వహణ కోసం చూపించమని బ్రహ్మను ప్రార్థిస్తారు.

P.C: You Tube

బ్రహ్మదేవుడు దర్భలతో ఓ పెద్ద చక్రాన్ని సృష్టించి

బ్రహ్మదేవుడు దర్భలతో ఓ పెద్ద చక్రాన్ని సృష్టించి

దీంతో బ్రహ్మదేవుడు దర్భలతో ఓ పెద్ద చక్రాన్ని సృష్టించి ఆ చక్రం వెంట కదిలివెళ్లాల్సిందిగా సూచిస్తాడు. ఈ మనోమయ ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైనదని, యాగం చేయడానికి అర్హత కలిగినదని చెబుతారు.

P.C: You Tube

జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది

జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది

దీంతో చక్రం ప్రస్తుతం నైమిశరణ్యం ఉన్న చోటుకు రాగానే పెద్ద శబ్దంతో విరిగిపోతుంది. ఆంతేకాకుండా చక్రం విరిగిపోయిన చోటు నుంచి ఉదృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది.

P.C: You Tube

దీంతో మునులు ఆ ఆది పరాశక్తిని పూజించగా

దీంతో మునులు ఆ ఆది పరాశక్తిని పూజించగా

దీంతో మునులు ఆ ఆది పరాశక్తిని పూజించగా ఆ జల ఉదృతిని మహాశక్తి ఆపివేస్తుంది. కాల క్రమంలో ఆ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది, లింగధారిణి శక్తి రూపంలో లలితా దేవి ఆలయంగా పేరుగాంచింది. ఆ చక్రం ఆగి విరిగిపడిన ప్రాంతం చక్రతీర్థం అయ్యింది. అదిశంకరులు ఇక్కడి లలితా దేవిని దర్శించి లలితా పంచకాన్ని రచించినట్టు చెబుతారు.

P.C: You Tube

నైమిశారణ్యంలోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడు

నైమిశారణ్యంలోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడు

నైమిశారణ్యంలోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించినట్లు చెబుతారు. మహాభారతంతో పాటు రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్యం ప్రస్తావన ఉంది. నైమిశారణ్యం వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటి.

P.C: You Tube

ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతో పాటు

ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతో పాటు

ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతో పాటు మరికొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. మహా భారతం, రామాయణం, వాయు పురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసింది ఇక్కడే, లవకుశులను కలుసుకున్నది కూడా ఇక్కడే. సీతా దేవి పేరుతో రాముడు బ్రాహ్మణులకు దానం చేసిన ప్రాంతమే నేటి సీతాపురం అని చెప్పుకుంటారు. శివపురాణంలోనూ నైమిశారణ్య ప్రస్తావన ఉంది. అప్పటి పాంచాల, కోసల రాజ్యాల మధ్య నైమిషారణ్యం ఉండేది. శుక్రాచార్యుల ద్వారా ఈ క్షేత్ర పవిత్రత తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్లు చెబుతారు.

P.C: You Tube

ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించాడు.

ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించాడు.

ఇక్కడికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిశ్రిక్ అనే ప్రాంతంలో దధీచి కుండం ఉంది. ఇంద్రుని కోరిక మీద వృత్రాసురుడిని వధించేందుకు దధీచి మహర్షి ఈ కుండంలో స్నానం చేసి తన ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించాడు.

అసురులను సంహరించిన ప్రాంతం

అసురులను సంహరించిన ప్రాంతం

వరాహ పురాణం ప్రకారం విష్ణువు అసురులను సంహరించిన ప్రాంతం. లిప్తకాలంలో విష్ణువు అసురులను అంతమొందించిన అటవీ ప్రాంతం కాబట్టి నైమిశారణ్యంగా దీనికి పేరు వచ్చింది.

P.C: You Tube

వేంకటేశ్వరుడి విగ్రహాన్ని పోలిన నల్లని విగ్రహం చూడటానికి మనోహరంగా ఉంటుంది.

వేంకటేశ్వరుడి విగ్రహాన్ని పోలిన నల్లని విగ్రహం చూడటానికి మనోహరంగా ఉంటుంది.

ఇక్కడ వనరూపిగి ఉన్న స్వామివారు ప్రధాన దైవం. నైమిశనాథ దేవాలయంలో స్వామివారు కొలువై ఉంటారు. వేంకటేశ్వరుడి విగ్రహాన్ని పోలిన నల్లని విగ్రహం చూడటానికి మనోహరంగా ఉంటుంది.

P.C: You Tube

నైమిశారణ్య విశిష్టత

నైమిశారణ్య విశిష్టత

నైమిశారణ్యంలో తెల్ల తెగడ, కొడగోగు, ధన, ఉమ్మెత్త, చండ్ర, మామిడి, నేరేడు, వెలగ , మర్రి, రావి, పారిజాత, చమ్దన, అగరు, కొలికొట్టు, పొగడ, సప్తవర్ణ, పున్నాగ, సురపొన్న, నాగకేసర వంటి చాలా రకాల ఔషధ గుణాలు కలిగిన వృక్షాలు, మొక్కలు ఉన్నాయి. నైమిశారణ్యం తొమ్మిది తపోవనాల్లో ఒకటి. దండకారణ్యం, సైంధవారణ్యం, జంబుకారణ్యం, పుష్కరారణ్యం, ఉత్పలారణ్యం, బదిరికారణ్యం, జంగాలరణ్యం, అరుపుత్తరణ్యం, నైమిషారణ్యం తొమ్మిది తపోవనాలు. ఇక్కడ ప్రవహించే గోమతీ నదీ స్నానం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.

P.C: You Tube

మహాభారత కథను మొదటిసారిగా

మహాభారత కథను మొదటిసారిగా

ఇక్కడ శౌనకాది మహర్షులకు సూత మహాముని మహాభారత కథను మొదటిసారిగా ఇక్కడే వినిపించాడని చెబుతారు. కురుక్షేత్ర సంగ్రామానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో బలరాముడు తాను తటస్థంగా ఉండిపోవాలని నిర్ణయించుకొంటాడు.

P.C: You Tube

నైమిశారణ్యం చేరుకొంటాడు

నైమిశారణ్యం చేరుకొంటాడు

ఇందుకోసం తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. ఈ క్రమంలోనే నైమిశారణ్యం చేరుకొంటాడు. ఆ సమయంలో మునులందరూ ఆధ్యాత్మిక విషయాల పై సుదీర్ఘమైన చర్చలో మునిగి ఉంటారు. బలరాముడిని చూసి అందరూ లేచి నమస్కరిస్తారు.

P.C: You Tube

అయితే సభకు ఆచార్యపీఠాన ఉన్నవారు రోమహర్షణుడు

అయితే సభకు ఆచార్యపీఠాన ఉన్నవారు రోమహర్షణుడు

అయితే సభకు ఆచార్యపీఠాన ఉన్నవారు రోమహర్షణుడు సభా మర్యాదను అనుసరించి లేవలేదు. దీనిని బలరాముడు అవిధేయతగా భావించి అతని శిరస్సును ఖండిస్తాడు. దీంతో అక్కడ ఉన్న మునులు బలరాముడిని తీవ్రంగా నిందిస్తాడు.

P.C: You Tube

తనతప్పును తెలుసుకొన్న బలరాముడు

తనతప్పును తెలుసుకొన్న బలరాముడు

తనతప్పును తెలుసుకొన్న బలరాముడు ప్రాయశ్చిత్తం సూచించమని వేడుకొంటాడు. స్థానికంగా ఉన్న బల్వుడనే రాక్షసుడిని సంహరిస్తే బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందడానికి మార్గం చెబుతామంటాడు.

P.C: You Tube

అమిత బలవంతుడైన బలరాముడు తన ఆయుధాలతో

అమిత బలవంతుడైన బలరాముడు తన ఆయుధాలతో

దీంతో అమిత బలవంతుడైన బలరాముడు తన ఆయుధాలతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. తర్వాత మునుల సూచనమేరకు ఇక్కడి చక్రతీర్థంలో స్నానం చేసి తన బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకొన్నాడు. అందువల్లే ఈ చక్రతీర్థంలో స్నానం చేస్తే ఎటువంటి పాపాలైనా పటాపంచలైపోతాయని చెబుతారు. గోమతీనది తీరాన ఉన్న ఈ ప్రదేశం ప్రాచీన కాలంలో ఎంతో మంది సాధువులు తపస్సు కారణంగా కూడా ప్రసిద్ది చెందింది.

P.C: You Tube

నైమిషారణ్యంలో ఇతర ప్రత్యేక ఆకర్షణలు

నైమిషారణ్యంలో ఇతర ప్రత్యేక ఆకర్షణలు

సూతగద్దె, దేవరాజేశ్వర మందిరం, అనందమయి ఆశ్రమం, సేతుబంధరామేశ్వరం, రుద్రావర్తము అనే ఆలయాలు ఇక్కడ ప్రసిద్ధి చెందిన దేవాలయాలు.చక్ర తీర్తం, వ్యాసపీఠం, సూరజ్ కుండ్, పాండవుల కోట, హనుమాన్ గఢీ, లలితాదేవీ మందిరం వంటి ముఖ్యమైన పూజా స్థలాలు భక్తులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. తీర్థయాత్రలు చేస్తున్న వారికి నైమిషారణ్యంలో ప్రతి ఏటా మార్చిలో నిర్వహించే ప్రదక్షిణలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.

P.C: You Tube

పరిక్రమణ

పరిక్రమణ

నైమిశారణ్యంలో 84 క్రోసుల పరిక్రమణ అనే ఒక ప్రక్రియను ఇక్కడి వారు విశ్వసిస్తుంటారు. ఫల్గుణ మాసంలో ఈ పరిక్రమణలో భాగంగా భక్తులు నైమిశారణ్యంలో మొదలుపెట్టి, 11 పవిత్ర క్షేత్రాలలో మజిలీలు చేసుకుంటూ మాఘమాసంలో ప్రయాగలోని త్రివేణి సంగమంలో ముగిస్తారు.

P.C: You Tube

సమయం:

సమయం:


నైమిషారణ్యం దేవాలయాన్ని సాయంత్రం 6లోపు సందర్శించడం మంచిది. దాని తర్వాత ఆలయం మూసివేయబడుతుంది.

P.C: You Tube

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

P.C: You Tube
లక్కో-బాలాము మధ్య గల శాండిలా స్టేషన్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో నైమిశారణ్యం రైల్వే స్టేషన్ ఉంది.
ఇక్కడకు వివిధ నగరాల నుంచి నేరుగా బస్సు, రైలు సౌకర్యాలు ఉన్నాయి.
నైమిశారణ్యం స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో అనేక సందర్శనీయ స్థలాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X