Search
  • Follow NativePlanet
Share
» »నామక్కల్ ఆంజనేయస్వామిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలనేవి ఉండవు

నామక్కల్ ఆంజనేయస్వామిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహ బాధలనేవి ఉండవు

ఇది బెంగళూరుకు సుమారు 250కిలోమీటర్ల దూరంలో బెంగళూరు -మధురై జాతీయ రహదారిలో నామక్కల్ క్షేత్రం ఉంది. నామక్కల్ ఆంజనేయస్వామి ఆలయానికి ప్రసిద్ది. ఇక్కడ నిలువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు 20అడుగుల ఆంజనేయ విగ్రహ

తమినళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది.ఇక్కడ అనేక చారిత్రక అవశేషాలు కలవు. రంగనాథ స్వామి టెంపుల్ మరియు నరసింహస్వామి టెంపుల్ లను గుణశీల రాజు నిర్మించాడు. ఆయనకు పల్లవ వంశీకులతో గల వివాహ సంబంధాలు శిల్పశైలిని ప్రభావించాయి. తర్వాత ఈ రాజ్యం చోళుల ఆధీనంలోకి మరియు తర్వాత 14వ శతాబ్దం వరకూ హోయసలుల పాలనలోకి వచ్చింది. వీరి తర్వాత విజయనగర రాజులు, మదురై నాయకులు, బీజాపూర్ సుల్తాన్ లు, గోల్కొండ మైసూరు రాజులు, మరాఠాలు, హైదర్ అలీ మరియు చివరకు బ్రిటిష్ వారు ఈ నగరాన్ని పాలించారు. ప్రాంత సంస్కృతిపై ప్రతి పాలకుడు తనదైన ముద్ర వేసాడు.

ఇది బెంగళూరుకు సుమారు 250కిలోమీటర్ల దూరంలో బెంగళూరు -మధురై జాతీయ రహదారిలో నామక్కల్ క్షేత్రం ఉంది. నామక్కల్ ఆంజనేయస్వామి ఆలయానికి ప్రసిద్ది. ఇక్కడ నిలువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు 20అడుగుల ఆంజనేయ విగ్రహంతో ఉండటం వల్ల బాగా ప్రసిద్ది చెందాడు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్న అక్ష్మీ నరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు . అందుకు ఆశ్చర్యకరమైన కారణాలు చెప్పారు అక్కడ దేవాలయ ప్రదాన అర్చకులు. మరి ఆ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

స్వామి విగ్రహం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతోందని

స్వామి విగ్రహం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతోందని

ఈ ఆలయంలో స్వామి విగ్రహం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతోందని అంటారు. ఎందురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని గర్భాలయానికి పైకప్పు లేనందువల్ల. గతంలో పైకప్పు వేయాలని ప్రయాత్నాలు జరిగాయని కానీ వేసిన కప్పు వేసినట్టుగానే కూలిపోయాయని చెబుతున్నారు ప్రదాన అర్చకులు.

ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారని

ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారని

ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారని..అందువల్లే పైన కప్పు వేయడానికి వీలుకాలేదని ఆలయ కథనం. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈయన్ను దర్శించుకుంటారు. ఆయన కరుణ ఉంటే శత్రుశేషం, గ్రహ దోషం నుండి ఎలాంటి సమస్యలు ఉండవంటారు. ఆయన చల్లని దీవెనలు మనపై పడితే చాలు జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది. అనేది వాస్తవం.

నామక్కల్ లోని ఆంజనేయుడు కొన్ని వందల సంవత్సరాలుగా

నామక్కల్ లోని ఆంజనేయుడు కొన్ని వందల సంవత్సరాలుగా

ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో సేలం జిల్లాలో నామక్కల్ లోని ఆంజనేయుడు కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడి ప్రజల సుఖశాంతులను పర్యవేక్షిస్తున్నాడు.

ఈ దేవాలయం సుమారు 1500 ఏళ్ల నాటిది.

ఈ దేవాలయం సుమారు 1500 ఏళ్ల నాటిది.

ఈ దేవాలయం సుమారు 1500 ఏళ్ల నాటిది. నామక్కల్ కోట దిగువ భాగంలో ఈ గుడి ఉంది. నరసింహ స్వామి ఆలయానికి సుమారు వంద మీటర్లు ఎదురుగా ఉంటుంది ఈ గుడి. ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం. ఈ విగ్రహం చాలా ప్రసిద్ధి చెంది నమక్కల్ హనుమాన్‌గా పిలువబడుతుంది.ఆంజనేయుడు దిగంబర దేవాలయంలో (ఆకాశం పైకప్పుగా) లక్ష్మీ నృసింహ స్వామి మరియు సాలగ్రామం వైపు తిరిగి కొలుస్తూ ఉంటాడు.

స్వామి వారి విగ్రహం సుమారు 18అడుగుల పై మాటే

స్వామి వారి విగ్రహం సుమారు 18అడుగుల పై మాటే

స్వామి వారి విగ్రహం సుమారు 18అడుగుల పై మాటే ఉంటుంది. ఆంజనేయుడి విగ్రహం నరసింహస్వామి మూర్తికి అభిముఖంగా ఉండటం విశేషం.ఆంజనేయుడి కన్ను లక్ష్మీ నరసింహ స్వామి పాదాలతో (పాద పద్మాలు) సరళ రేఖలో ఉంటుంది. ఆంజనేయుడి విగ్రహం ఇక్కడి కోటకు రక్షకునిగా ఉంటుందని, అక్కడి ప్రజలను శత్రువుల నుండి రక్షిస్తుందని చెబుతుంటారు స్థానికులు.

కమలాలం చెరువు మెట్ల మీద ఆంజనేయ స్వామి పాదముద్రలను

కమలాలం చెరువు మెట్ల మీద ఆంజనేయ స్వామి పాదముద్రలను

ఆంజనేయుడు స్వామి యొక్క పాదపద్మాలను దర్శించుకోవడాన్ని నేటికీ గరుడాళ్వార్ సన్నిథి నుండి గమనించవచ్చు. కమలాలం చెరువు మెట్ల మీద ఆంజనేయ స్వామి పాదముద్రలను గమనించవచ్చు.

కోట పురాణం

కోట పురాణం

నామగిరి కొండలపై ఉన్న నామక్కల్ కోటను 16వ శతాబ్ధంలో రామచంద్ర నాయకర్ నిర్మించారు. ఈ కోటలో ప్రస్తుతం పురాతనమైన విష్ణు ఆలయ శిథిలాలు కూడా ఉన్నాయి. నామక్కల్ దుర్గం కోట సుమారు ఒకటిన్నర ఎకరం వరకూ ఉంటుంది.

నామ గిరి హిల్స్ కు ఇరువైపులా ఉన్న గుహలో నరసింహస్వామి

నామ గిరి హిల్స్ కు ఇరువైపులా ఉన్న గుహలో నరసింహస్వామి

ఈ కోటకు నైరుతి భాగంలో మొట్లు ఉన్నాయి. నామ గిరి హిల్స్ కు ఇరువైపులా ఉన్న గుహలో నరసింహస్వామి , రంగనాథ స్వామి ఆలయాలున్నాయి. కొండరాయితో చెక్కబడిన విగ్రహాలు కావటంతో నేటికి అవి చెక్క చెదరకుండా ఉన్నాయి.

ఈ కొండలలో ఎనిమిది కొలనులు ఉన్నాయి. వీటిలో తామర పువ్వులు పెరుగుతాయి

ఈ కొండలలో ఎనిమిది కొలనులు ఉన్నాయి. వీటిలో తామర పువ్వులు పెరుగుతాయి

ఈ కొండలలో ఎనిమిది కొలనులు ఉన్నాయి. వీటిలో తామర పువ్వులు పెరుగుతాయి. ఈ దుర్గంలో కొంత కాలం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి కనపడకుండా తలదాచుకున్నాడట.

తర్వాత కాలంలో ఈ కోటను బ్రిటిష్ వారు వశం

తర్వాత కాలంలో ఈ కోటను బ్రిటిష్ వారు వశం

తర్వాత కాలంలో ఈ కోటను బ్రిటిష్ వారు వశం చేసుకున్నారట. ఇక్కడి అద్భుతమైన శిల్పకళ ఈ ప్రదేశానికి మళ్లీ మళ్ళీ సందర్శించేలా చేస్తాయి.స్వామికి ప్రతి ఏడాది మార్గశిర నెల తొలి నక్షత్రం రోజున జయంతి వేడుకలను నిర్వహి స్తారు. నామక్కల్లో చూడవల్సిన ఇతర ప్రధాన ఆకర్షణలు

నైనా మలై

నైనా మలై


నైనా మలై నమక్కల్ సిటీ కి 10 కి.మీ.ల దూరంలో కల ఒక చిన్న కొండ. తిరుమలై పట్టి గ్రామానికి సమీపంగా వుంటుంది. నైనా మలై కొండపై వెంకట చలపతి టెంపుల్ కలదు. దీనిని చేరాలంటే , 2500 మెట్లు ఎక్కాలి. అయినప్పటికీ భక్తులు శనివారాలు ఇతర పండుగ దినాలలో అధిక సంఖ్యలో ఈ టెంపుల్ దర్శిస్తారు. pc : kurumban

కూలిప్పటి మురుగన్ టెంపుల్

కూలిప్పటి మురుగన్ టెంపుల్

నమక్కల్ నుండి 3 కి.మీ.ల దూరంలో కలదు. ఇది తురయార్ మార్గం లో కలదు. ఒక కొండ పై కల ఈ ప్రదేశం స్థానికులకు పర్యాటకులకు ఒక ప్రసిద్ధ ఆకర్షణ. పురాతన ఈ టెంపుల్ కు తప్పక వెళ్ళ వలసినదే.
pc : kurumban

నమక్కల్ రాక్ ఫోర్ట్ రాక్ ఫోర్ట్

నమక్కల్ రాక్ ఫోర్ట్ రాక్ ఫోర్ట్

ఒక కొండపై వుంటుంది. దీనికి చేరాలంటే కష్టపడి ఒక అరగంట పాటు కొండ ఎక్కాలి. ఈ కోట ప్రసిద్ధి చెందినది, మరియు దేశం లోని కోటలు అన్నిటిలోకి సురక్షితమైనది. సుమారు 75 మీటర్ల ఎత్తున కలదు. ఈ కోటను 9 వ శతాబ్దంలో నిర్మించారు.
pc : Thamizhpparithi Maari

నామగిరి లక్ష్మి నరసింహ టెంపుల్

నామగిరి లక్ష్మి నరసింహ టెంపుల్

శ్రీ నరసింహ టెంపుల్ కొండ దిగువ భాగంలో కలదు. ఇది పురాతన టెంపుల్. దీనిని అడియామన్ తెగ రాజు గుణశీల నిర్మించాడు. ఇక్కడ నరసింహ విగ్రహం రాతితో చేయబడినది. శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ నరసింహ టెంపుల్ కు అనేక మంది భక్తులు వచ్చి ఆశీస్సులు పొందుతారు. ఇది ఒక వైష్ణవ క్షేత్రం.
pc : Balajijagadesh

తిరుచెంగోడు అర్ధనారీస్వర్ టెంపుల్

తిరుచెంగోడు అర్ధనారీస్వర్ టెంపుల్

తిరుచెంగోడు అర్ధనారేశ్వర టెంపుల్ నమక్కల్ లో ఒక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ఒక శివ టెంపుల్. సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తున కలదు. అర్ధనారేశ్వర్ విగ్రహం లో శివ మరియు పార్వతి లు కలవు. విగ్రహం సగం పురుష మరియు సగం మహిళగా కనపడుతుంది.
pc : Ravindraboopathi

తాతగిరి మురుగన్ టెంపుల్

తాతగిరి మురుగన్ టెంపుల్


తాతగిరి మురుగన్ టెంపుల్ నమక్కల్ నుండి ముతూగాపట్టి వెళ్ళే మార్గంలో 10 కి.మీ.ల దూరంలో కలదు. దీనిని ఒక చిన్న కొండపై నిర్మించారు. మహర్షి కిరుపానంద వారియర్ ఈ టెంపుల్ ను ప్రశాంతత కొరకు తరచుగా దర్శించేవాడని చెపుతారు.
pc : yoursloving.sunil59

నమక్కల్ ఎలా చేరుకోవాలి

నమక్కల్ ఎలా చేరుకోవాలి

సమీప ఎయిర్ పోర్ట్ : తిరుచిరప్పల్లి - 74 కి.మీ. సమీప రైల్వే స్టేషన్లు : సేలం మరియు కరూర్ రైల్వే స్టేషన్లు బస్సు మార్గం : చెన్నై, సేలం, కరూర్ నుండి నమక్కల్ కు బస్సులు తిరుగుతాయి.
pc : Rsrikanth05

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X