Search
  • Follow NativePlanet
Share
» »నవకైలాస క్షేత్రాలు చూశారా?

నవకైలాస క్షేత్రాలు చూశారా?

నవకైలాస దేవాలయాలకు సంబంధించిన కథనం.

హిందూ ధర్మంలో తొమ్మిదికి విశిష్ట స్థానం ఉంది. నవగ్రహాలు, నవ నందులు, నవ తిరుపతులు, ఇలా అనేక పుణ్యక్షేత్రాలు తొమ్మిది అంకెతో ముడిపడి ఉన్నాయి. అదే విధంగా నవ కైలాస క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ నవ కైలాస క్షేత్రాల్లో ప్రధాన దైవం ఆ పరమశివుడే. జీవితంలో ఒక్కసారైనా ఈ నవ క్షేత్రాలను సందర్శిస్తే మోక్షం ఖచ్చితమని శైవధర్మాన్ని అనుసరించే వారి నమ్మకం. ఈ నేపథ్యంలో ఆ నవ కైలాస దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి. వాటి విశిష్టతలు ఏమి తదితర వివరాలన్నీ మీ కోసం...

నవకైలాస క్షేత్రాలు

నవకైలాస క్షేత్రాలు

P.C: You Tube

ఈ నవ కైలాస క్షేత్రాలకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. దీని ప్రకారం పూర్వం అగస్త్య మహాముని వద్ద ఒక శిష్యుడు ఉండేవాడు. అతనికి మోక్షం పొందాలన్న ఆశ ఉండేది.

నవకైలాస క్షేత్రాలు

నవకైలాస క్షేత్రాలు

P.C: You Tube

అదే విధంగా అగస్త్య మహాముని కూడా శిష్యుడి నడవడిక చూసి అతనికి మోక్షం ప్రసాదించాలని భావిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు ధాన్యంలో గుర్చొన్న అగస్త్యమహాముని అకస్మాత్తుగా కళ్లుతెరిచాడు.

నవకైలాస క్షేత్రాలు

నవకైలాస క్షేత్రాలు

P.C: You Tube

అంతేకాకుండా తన ఎదురుగా ఉన్న పువుల్లో తొమ్మిదింటిని తీసుకొని శిష్యుడికి ఇచ్చాడు. ఆ పుష్పాలను నీటిలో వదిలి వాటిని వెంబడిస్తూ వెళ్లాలని చెప్పాడు. అంతేకాకుండా ఒక్కొక్క పుష్పం ఎక్కడైతే భూమిని తాకుతుందో అక్కడ శివలింగాన్ని ప్రతిష్టింపజేయాలని శిష్యుడికి చెప్పాడు.

నవకైలాస క్షేత్రాలు

నవకైలాస క్షేత్రాలు

P.C: You Tube

చివరికి ఆ నది సముద్రంలో కలిసే చోట పవిత్ర స్నానాన్ని చేయాల్సిందిగా శిష్యుడికి సూచించారు. గురువు చెప్పినట్లే చేసి ఆ శిష్యుడు మోక్షం పొందాడు. ఇక ఆ శిష్యుడు ప్రతిష్టించిన తొమ్మిది శివలింగాలను కలిపి నవ కైలాస క్షేత్రాలని అంటారు.

నవకైలాస క్షేత్రాలు

నవకైలాస క్షేత్రాలు

P.C: You Tube

ఈ నవ కైలాస క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. అంతేకాకుండా పాపనాశం అని పిలుస్తారు. ఈ పాపనాశనం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అంబసముద్రంలో ఉంది. తామిరభరణి నది ఒడ్డున ఈ పాపనాశం ఉంది.

నవకైలాస క్షేత్రాలు

నవకైలాస క్షేత్రాలు

P.C: You Tube

ఇక్కడ కొలువై ఉన్న పరమశివుడిని పాపనాశనాథార్ అని పిలుస్తారు. అంటే పాపాలను నాశనం చేసేవాడు. ఇక్కడ ఉన్న అమ్మవారిని లోకనాయకి అని పిలుస్తారు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు నంది వాహన సమేతులై అగస్త్యమహామునికి దర్శనమిచ్చినట్లు చెబుతారు.

నవకైలాస క్షేత్రాలు

నవకైలాస క్షేత్రాలు

P.C: You Tube

కాగా ఇక్కడ ఉన్న నీటిలో తామ్రం అంటే రాగి లోహం ఎక్కువగా ఉండటం వల్ల ఈ నీటిలో స్నానం చేస్తే చర్మరోగాలు సమిసిపోతాయని భక్తుల నమ్మకం. ఈ పాపనాశం చుట్టు పక్కల చూడటానికి అనేక జలపాతాలు ఉన్నాయి. అందులో అగస్తియార్ జలపాతం అత్యంత అందంగా కనిపిస్తుంది.

నవకైలాస క్షేత్రాలు

నవకైలాస క్షేత్రాలు

P.C: You Tube

శివరాత్రి పర్వదినాన ఈ నవకైలాస క్షేత్రాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామివారిని సందర్శించుకొంటారు. ముఖ్యంగా పాపనాశం వద్ద భక్తుల రద్ది ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఒక్కొక్క శివుడి దేవాలయం ఒక్కొక్క గ్రహానికి ప్రతీకగా చెబుతారు.

నవకైలాస క్షేత్రాలు

నవకైలాస క్షేత్రాలు

P.C: You Tube

అందువల్లే నవకైలాస యాత్ర నవగ్రహ యాత్ర దర్శన ఫలం అందిస్తుందని స్థానక భక్తుల నమ్మకం. ముఖ్యంగా శని, కాలసర్ప దోషాలతో బాధపడేవారికి ఈ నవ కైలాసయాత్ర వల్ల ఉపశమనం లభిస్తుందని చెబుతారు.

నవకైలాస క్షేత్రాలు

నవకైలాస క్షేత్రాలు

P.C: You Tube

ఇక ఈ దేవాలయాలు తమిరభరణి నదీతీరంలో పాపనాశం నుంచి ప్రతి రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ప్రతి అరల్ముగు కైలాసనాథార్ దేవాలయం అనే పిలుస్తారు. వీటిని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని బలంగా నమ్ముతారు.

నవకైలాస క్షేత్రాలు

నవకైలాస క్షేత్రాలు

P.C: You Tube

ఆ తొమ్మది క్షేత్రాల వివరాలతోపాటు ఏ ఏ ప్రదేశంలోని దేవాలయంలోని మూలవిరాట్టు ఏ ఏ గ్రహాలను ప్రతిబింబిస్తుందన్న విషయం మీ కోసం...
పాపనాశనం ...............................సూర్యుడు, చరణ్ మహాదేవి ...................... చంద్రుడు, కొడగన్నలూర్....................................అంగారకుడు, కున్నత్తుర్.....................................రాహువు, మరపన్నాడు................................గురుడు, తిరువైకుండమ్.........................శని, తెంతిరుప్పేరయ్.................బుధుడు, రాజపతి.......................................కేతువు, సయిద పొమంగళం...............శుక్రుడు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X