Search
  • Follow NativePlanet
Share
» » ఢిల్లీ లో నవరాత్రి ఉత్సవాలు !

ఢిల్లీ లో నవరాత్రి ఉత్సవాలు !

భారత దేశం లోని పండుగలలో నవరాత్రి పండుగ ను హిందువులు అధిక భాగం జరుపుకుంటారు. నవ రాత్రి అంటే ‘ తొమ్మిది రాత్రులు' అని అర్ధం చెపుతారు. దేశంలో ఈ పండుగ ఎక్కడ జరిపి నప్పటికీ తొమ్మిది రాత్రులు జరుపుతారు. కొలకత్తా, గుజరాత్, మైసూరు, విజయవాడ, మొదలైన ప్రదేశాలతో పాటు, దేశ రాజధాని అయిన ఢిల్లీ లో కూడా ఈ పండుగ అత్యంత అట్టహాసంగా జురుపు కుంటారు. నవరాత్రి ఉత్సవ పండుగలలో మాత శక్తి ని మూడు రూపాలలో కొలుస్తారు. ఐశ్వర్యం కొరకు లక్ష్మి దేవి ని , చెడును పారద్రోలేందుకు మాత దుర్గ ను, విజ్ఞానాన్ని ప్రసాదించేందుకు సరస్వతి రూపాలుగా శక్తిని పూజిస్తారు.

 ఢిల్లీ లో నవరాత్రి ఉత్సవాలు !

మొట్ట మొదటి మూడు రోజులూ మాత దుర్గా దేవిని పూజిస్తారు. తర్వాతి మూడు రోజులూ లక్ష్మి దేవిని చివరి మూడు రోజులూ సరస్వతి దేవిని పూజిస్తారు. ఈ పండుగకు ఢిల్లీ నగరం యావత్తూ ఎంతో సందడిగా వుంటుంది. భక్తులు తొమ్మిది పగళ్ళూ పూజలు ఉపవాసాలతో మరియు తొమ్మిది రాత్రులూ వైభవోపేత ఊరేగింపు లతో గడిపేస్తారు. నగరాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో, మాత చిత్రాలతో అలంకరిస్తారు. మహిళలు మాతకు దేవాలయాలలో పాటలు పాడుతూ భజనలు చేస్తారు.

ఢిల్లీ లోని కల్కాజీ టెంపుల్ ఈ నవరాత్రి వేడుకలకు ప్రసిద్ధి. ఈ దేవాలయాన్ని తొమ్మిది రోజుల పాటు పూర్తిగా అలంకరిస్తారు. అమ్మవారికి వివిధ అలంకారాలు చేస్తూ అనేక రకాల పూజలు , కానుకలు సమర్పించుకొంటారు. ఢిల్లీ లో కొన్ని హోటళ్ళు కూడా ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. తమ కస్టమర్లకు వారు వివిధ రకాల స్వీట్లు, హాట్లు చేసి ఆనందింప చేస్తారు. రాడిస్సన్ బ్లూ హోటల్, ది నీరులాస్, సురుచి, హల్దిరాం వంటి హోటళ్ళు ఈ సమయంలో ప్రత్యేకత వంటకాలు చేయటంలో ప్రసిద్ధి.

ఢిల్లీ లోని రాం లీలా మైదాన్ వంటి ప్రధాన ప్రదేశాలలో కొంతమంది కళా కారులు రామాయణ కావ్యం లోని వివిధ ఘట్టాలను ప్రదర్శిస్తారు. తొమ్మిది రోజుల పాటు వివిధ రామాయణ కండలు ప్రదర్శించి పదవ రోజున శ్రీరాముడు, రావణుడిని సంహరించే ఘట్టం ప్రదర్శిస్తారు.
యువతులు, యువకులు గాగ్రా చోళీ, శేర్వాని వంటి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆనందోత్సాహాలతో కోలాటం వంటి ఆటలు ఆడతారు. కోలాటం లేదా గర్బా డాన్స్ లు ఇక్కడ స్థానికులలో బాగా ప్రసిద్ధి. ఈ పండుగ సమయంలో ఢిల్లీ లో కుటుంబాలు అనేకం కలిసి ఆనందిస్తారు. పండుగకు తాము చేసిన స్వీట్లు, ఇతర ఆహారాలను పంచుకొంటారు. యువతీ, యువకులు వివిధ రకాల ప్రోగ్రాములతో ఆనందిస్తారు.

ఢిల్లీ నగరం లో వివిధ ప్రదేశాల నుండి వచ్చిన వారు ఉండటంతో ఈ పండుగను వారి వారి సంస్కృతుల మేళవింపుతో జరుపుకుంటారు కనుక ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడ ఈ పండుగ కొద్దిపాటి విభిన్నంగా కనపడుతుంది.

ఈ సమయం లో మీరు కనుక ఢిల్లీ వెళితే, అక్కడకల ప్రధాన ఆకర్షణలు అయిన ఇండియా గేటు, లోటస్ టెంపుల్, అక్షరధాం, రెడ్ ఫోర్ట్ , కుతుబ్ మినార్ వంటి చారిత్రక ఆకర్షణలు కూడా తప్పక చూడండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X