Search
  • Follow NativePlanet
Share
» »శైలపుత్రీ దయ ఉంటే దాపత్య సమస్యలన్నీ బలాదూర్

శైలపుత్రీ దయ ఉంటే దాపత్య సమస్యలన్నీ బలాదూర్

శైలపుత్రి దేవాలయానికి సంబంధించిన కథనం.

నవరాత్రి ఉత్సవాలు దేశంలోని అన్ని చోట్ల రంగరంగ వైభోగంగా మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులు ఆ ఆదిపరాశక్తిని మనం వివిధ రూపాల్లో పూజిస్తాం. ముఖ్యంగా నవదుర్గలను ఒక్కొక్క రోజు పూజిస్తే ఒక్కక్క ఫలితం ఉంటుందని చెబుతారు. ఈ నేపథ్యంలో నవదుర్గలో మొదటి అమ్మవారి దేవాలయం గురించిన పూర్తి వివరాలు మీ కోసం...

నవరాత్రి

నవరాత్రి

P.C: You Tube

శైలపుత్రి దేవాలయం ఒక ప్రాచీన దేవాలయం. భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందినది. ఇక్కడికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. ఈ దేవతను ఒక్కసారి దర్శనం చేసుకొంటే మనోవాంచలన్నీ తీరిపోతాయని చెబుతారు. ఈ దేవాలయం వారణాసిలో ఉంది.

ముగ్గురమ్మల నుంచి ఇద్దరిద్దరు మొత్తం తొమ్మిది మంది, నవదుర్గలు వీరేముగ్గురమ్మల నుంచి ఇద్దరిద్దరు మొత్తం తొమ్మిది మంది, నవదుర్గలు వీరే

ఎక్కడ ఉంది.

ఎక్కడ ఉంది.

P.C: You Tube

శైలపుత్రి దేవాలయం ఉత్తరప్రదేశ్ వారణాసి ఏ-40/11, మర్హియ ఘాట్ వద్ద ఉంది. ఉత్తర భారత దేశంలో నవరాత్రి ఉత్సవాలను తిలకించాలనుకొనే పర్యాటకులకు ఈ దేవాలయం దర్శనానికి ఈ సమయం అత్యంత అనుకూలమైనది.

ఇక్కడ అమావస్య, పౌర్ణమి రోజుల్లో అమ్మవారి శక్తి రెట్టింపవుతుంది. అందుకే అఘోరాలుఇక్కడ అమావస్య, పౌర్ణమి రోజుల్లో అమ్మవారి శక్తి రెట్టింపవుతుంది. అందుకే అఘోరాలు

పర్వత రాజు కుమార్తే

పర్వత రాజు కుమార్తే

P.C: You Tube

శైలపుత్రి పర్వత రాజు కుమార్తే. ఈమె రూపంలో దుర్గాదేవిని పోలి ఉంటుంది. భవాని, హేమావతి అని కూడా పిలుస్తారు. శైలపుత్రి అంటే అర్థం పర్వత రాజు కుమార్తే. ప్రక`తిలోని అణువణువు ఆమెలో దాగి ఉంటుందని నమ్ముతారు. అందువల్లే శైలపుత్రి ఆరాధనకు నవరాత్రి దినోత్సవాల్లో అంతటి ప్రాధాన్యత.

కోరిన కోర్కెలన్నీ

కోరిన కోర్కెలన్నీ

P.C: You Tube

కాశీలోని అలయిపురలో శైలపుత్రి ప్రాచీన దేవాలయం ఉంది. నవరాత్రి తొమ్మిది రోజుల్లో ఏ రోజైనా అమ్మవారిని దర్శించి పూజలు జరిపితే కోరిన కోర్కెలన్నీ తీరుతాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా వైవాహిక సమస్యలన్నీ తీరిపోతయాని నమ్ముతారు. అందువల్లే నవరాత్రి రోజుల్లో ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో ఉంటారు.

ఈ దేవాలయాల్లో మంత్ర, తంత్రాలనూ నేర్చుకోవచ్చుఈ దేవాలయాల్లో మంత్ర, తంత్రాలనూ నేర్చుకోవచ్చు

పురాణ కథనం.

పురాణ కథనం.

P.C: You Tube

హిమాలయాలతో పాటు ఈ జగత్తున ఉన్న అన్ని పర్వతాలకు రాజైన పర్వత రాజు లేదా శైలరాజు కుమార్తెగా పార్వతీ జన్మిస్తుంది. ఒకాకొన సమయంలో ఆ శివుడి పై కోపగించుకొని ఆమె కాశీకి వస్తుంది. అలా కాశీకి చేరుకొన్న ఆమెకు ఆ పరిసర ప్రాంతాలు బాగా నచ్చుతాయి.

దసరా సందర్భంగా ఈ దుర్గామాత దేవాలయాల్లో ఒక్కటిని సందర్శించినా చాలుదసరా సందర్భంగా ఈ దుర్గామాత దేవాలయాల్లో ఒక్కటిని సందర్శించినా చాలు

జంటగా

జంటగా

P.C: You Tube

భార్యను వెదుక్కొంటూ శివుడు కూడా కాశీకి చేరుకొంటాడు. అయితే పార్వతీ దేవి తనకు ఈ ప్రాంతం బాగా నచ్చిందని తాను ఈ ప్రాంతం వదలి రారని కరాఖండిగా చెబుతుంది. దీంతో శివుడు కూడా కాశీలోనే ఉండటానికి సమాయత్తమవుతాడు. ఈ ఘటన జరిగింది నవరాత్రి సమయంలో కాబట్టి ఆ ఆది దంపతులను జంటగా దర్శనం చేసుకోవడం వల్ల ఆలుమగల మధ్య ఉన్న అలకలు దూరమవుతాయని నమ్ముతారు.

మూడుసార్లు పూజ

మూడుసార్లు పూజ

P.C: You Tube

వారణాసిలోని శైలపుత్రి దేవాలయంలో రోజుకు మూడుసార్లు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ దేవికి కొబ్బరి నీరుతో పాటు ముత్తైదు సామానులను పూజ కోసం అందజేస్తారు. శైలపుత్రి వాహనం వృషభం. కుడిచేతిలో త్రిశూలం. ఎడమచేతిలో తామర ఉంటుంది.

మొదటి రూపం శైలపుత్రి

మొదటి రూపం శైలపుత్రి

P.C: You Tube

నవదుర్గలో మొదటి రూపం శైలపుత్రి. ఈ శైలపుత్రి పర్వత రాజు కుమార్తెగా జన్మించడానికి ముందు దక్షప్రజాపతి కుమార్తెగా జన్మించింది. అప్పుడు ఆమె పేరు సతీదేవి. ఈ సతీదేవి శివుడిని వివాహం చేసుకొన్న విషయం తెలిసిందే.

ఈ తిరుపతిలో స్వామివారికి పాదరక్షలు దళిత పూజారులు సమర్పిస్తారు, అమావాస్య రోజు దర్శిస్తారుఈ తిరుపతిలో స్వామివారికి పాదరక్షలు దళిత పూజారులు సమర్పిస్తారు, అమావాస్య రోజు దర్శిస్తారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X