Search
  • Follow NativePlanet
Share
» »వేల కోట్లు ఖర్చుచేసి అమ్మవారి పూజకు వేదిక సిద్ధం చేసి

వేల కోట్లు ఖర్చుచేసి అమ్మవారి పూజకు వేదిక సిద్ధం చేసి

దుర్గాదేవి పండల్స్ కు సంబంధించిన కథనం

ఉత్తర భారత దేశంలో దుర్గాపూజతో పాటు రాముడు రావణాసురుడిని సంహరించిన రోజున రామలీల ఉత్సవాలు జరుపుకొంటారు. ఇక దక్షిణ భారత దేశంలో దుర్గామాత మహిషాసురుడిని సంహరించినందుకు గుర్తుగా ఆ తల్లిని ఆరాధిస్తారు. ఇక తూర్పు భారతదేశంలో అయితే ఆశ్వయుజ శుక్లపక్ష షష్టీ నుంచి దశమి వరకూ ఐదు రోజుల పాటు దుర్గోత్సవ్ ను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో వేసే పండల్స్ లేదా దుర్గామాత వేదికలకు ఒకటి కాదు రెండు కాదు పదల కోట్ల రుపాయలను ఖర్చుచేస్తారు. ఈ ఏడది ఎక్కడెక్కడ ఎంత ఖరీదైన వేదికలను ఏర్పాటు చేశారన్న విషయానికి సంబంధించిన కథనం మీ కోసం....

దుర్గాదేవి పెండల్స్

దుర్గాదేవి పెండల్స్

P.C: You Tube

దుర్గోత్సవ్ మొదటి రోజున అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి పెద్ద వేదికలను సిద్ధం చేస్తారు. ఆ వేదిక ఏదో సాదాసీదాగా కాకుండా ఒక ప్రత్యేక థీమ్ తో సెట్టింగుల రూపంలో వేస్తారు. ఇందుకోసం పదుల కోట్ల రుపాయలు ఖర్చుచేస్తారు.

సాయి జీవసమాధి చెందినది ఎప్పుడో తెలుసోసాయి జీవసమాధి చెందినది ఎప్పుడో తెలుసో

దుర్గాదేవి పెండల్స్

దుర్గాదేవి పెండల్స్

P.C: You Tube

అంతేకాకుండా వేలాది మంది కార్మికులు దాదాపు మూడు నెలల ముందు నుంచి రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తారు. ముఖ్యంగా మధురమీనాక్షి దేవాలయం, అక్షరధామ్, సోమనాథ్ దేవాలయం నుంచి మొదలుకొని ఐఫిల్ టవర్, బకింగ్ హామ్ ప్యాలెస్ వరకూ దేశవిదేశాల్లోని ప్రసిద్ధ కట్టడాలు పెండల్స్ రూపంలో చక్కగా అమరి పోతాయి.

దయ్యాల హోటల్స్ చూశారా?దయ్యాల హోటల్స్ చూశారా?

దుర్గాదేవి పెండల్స్

దుర్గాదేవి పెండల్స్

P.C: You Tube

స్థానికంగా ఒకరిని మించి మరొకరు ఈ పండాల్స్ ని రూపొందించి, అమ్మవారిని అలంకరిస్తారు. దీంతో ప్రతి ఏడాది ఈ పండల్స్ బడ్జెట్ దాటిపోతోంది. గత ఏడాది ఈ పండల్స్ కోసం ఒక్క కలకత్తాలోనే రూ.1000 కోట్లు ఖర్చయింది. ఈ ఏడాది ఆ ఖర్చు మరో 20 శాతం ఎక్కువగా ఉంటుంది.

ఉప్పుతో ఆరోగ్యం చీరతో విద్య ఇక్కడ మీకు తథ్యంఉప్పుతో ఆరోగ్యం చీరతో విద్య ఇక్కడ మీకు తథ్యం

దుర్గాదేవి పెండల్స్

దుర్గాదేవి పెండల్స్

P.C: You Tube
ఈ పండాల్స్ లో ప్రతిష్టించిన ఆ దుర్గామాతను పూజించేందుకు స్థానికులు తండోపతండాలుగా వస్తుంటారు. ప్రాచూర్యం పొందిన కొన్ని పండాల్స్ దగ్గరైతే ఈ సంఖ్యల లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. గత ఏడాది శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్ ఏకంగా రూ.10 కోట్ల రుపాలయతో బాహుబలి సినిమాలో మహిష్మతి సామ్రాజ్యాన్ని పోలిన సెట్ వేసి రికార్డు నెలకొల్పింది.

గరళకంఠుడికి చేపలంటే ఇష్టంగరళకంఠుడికి చేపలంటే ఇష్టం

దుర్గాదేవి పెండల్స్

దుర్గాదేవి పెండల్స్

P.C: You Tube

అదే క్లబ్ ఈ ఏడాది సంజయ్ లీలా బన్సాలీ పద్మావత్ సినిమాలోని ఛిత్తోడ్ ప్యాలెస్ సెట్ వేస్తోంది. ఇందు కోసం రూ.15 కోట్ల బడ్జెట్ కేటాయించారు. సంతోష్ మిత్రా స్కేర్ కమిటీ గతేడాది రూ.10 కోట్ల విలువ చేసే 30 కిలోల బంగారంతో అమ్మవారికి చీర తయారు చేయించింది.

నగ్నత్వం ఇక్కడ అందంనగ్నత్వం ఇక్కడ అందం

దుర్గాదేవి పెండల్స్

దుర్గాదేవి పెండల్స్

P.C: You Tube

ఈ ఏడాది దాదాపు రూ.40 కోట్లతో పది టన్నుల వెండి రథం సెట్ వేస్తునప్నారు. ఈ రథాన్ని అటు పై ఒడిశా రథయాత్రలో వాడుతారు. కేవలం ఈ రెండు పెండల్స్ కాకుండా కలకత్తా నగరంలో రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఖచ్చు చేసి దుర్గాదేవి పెండల్స్ నిర్మించే సంస్థలు దాదాపు 50కి పైగా ఉన్నాయి.

దుర్గాదేవి పెండల్స్

దుర్గాదేవి పెండల్స్

P.C: You Tube

పిత`పక్షం చివరి రోజైన మహాలయ అమావస్య రోజు మట్టితో తయారుచేసిన విగ్రహానికి కళ్లను దిద్దడం ద్వారా బెంగాళీలు దుర్గాదేవి ఆరాధన మొదలు పెడుతారు. అమ్మవారు అమావస్య రోజే మట్టిలో ప్రవేశిస్తుందన్న కారణంతోనే మొత్తం విగ్రహం తయారైనా ఆ రోజున మాత్రమే కళ్లను తీర్చిదిద్దుతారు. దీన్నే చోకు దాన్ అంటారు.

దుర్గాదేవి పెండల్స్

దుర్గాదేవి పెండల్స్

P.C: You Tube

మిగిలిన చోట్లకు భిన్నంగా ఆరోరోజునే పూజ ప్రారంభించడం వెనుక అనేక పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. రావణ సంహారం కోసం రాముడు శుక్ల పక్ష షష్టీ రోజునే అమ్మవారిని అర్చించాడని చెబుతారు. అదే విధంగా ఏటా తన సంతానమైన సరస్వతి, లక్ష్మీ, గణేశుడు, కార్తికేయులతో పాతర్వతీ దేవి ఆ రోజునే పుట్టింటికి వచ్చి విజయదశమి రోజున భర్త దగ్గరకు వెళ్లిపోతుందని బెంగాళీలు విశ్వసిస్తారు.

దుర్గాదేవి పెండల్స్

దుర్గాదేవి పెండల్స్

P.C: You Tube

షష్టి నుంచి వరుసగా మూడు రోజులూ శ్లోకాలతో అమ్మవారిని వేద, తాంత్రి, మాంత్రిక విధానాల్లో అమ్మవారిని పూజిస్తారు. అటు పై సప్తమినాడు కుమారి పూజ. ఆ రోజున ఇంట్లోకాని వేదికమీద కాని 5 నుంచి 8 ఏళ్లలోపు పిల్లల్ని పూజిస్తారు. అష్టమి వెళ్లి నవమి వచ్చే సమయంలో అటు 24 ఇటు 24 మొత్తం 48 నిమిషాలు ఈ పూజ కొనసాగుతుంది.

దుర్గాదేవి పెండల్స్

దుర్గాదేవి పెండల్స్

P.C: You Tube

కొన్ని ప్రాంతాల్లో మేక లేదా గుమ్మడికాయను బలి ఇచ్చి ఆ దుర్గమ్మ తల్లి మీద చిందిన రక్తాన్ని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. నవమిరోజున దేవిమాత విజయానికి గుర్తుగా హోమం చేస్తారు. దశమిరోజున స్త్రీలంతా సింధూరం పూసుకొంటూ ఆనందంగా నాట్యం చేస్తారు. అటు పై కన్నీటితో వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేస్తారు.

మీరిక్కడికి వస్తే శని మీ నుంచి దూరంమీరిక్కడికి వస్తే శని మీ నుంచి దూరం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X