Search
  • Follow NativePlanet
Share
» »సతీదేవి మరణించిన ప్రాంతం?

సతీదేవి మరణించిన ప్రాంతం?

కేరళలోని కొట్టియూర్ దేవాలయం గురించి కథనం

దక్షయాగానికి తన భర్తను పిలవకపోవడమే కాకుండా తనను అవమానించారన్న కోపంతో సతీదేవి యాగ గుండంలోకి దూకి ఆత్మార్పణ చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె దేహాన్ని శివుడు ఎత్తుకొని ప్రణవ నాట్యం చేస్తుంటే ముల్లోకాలు అల్లాడిపోతాయి. దీంతో సమస్య పరిష్కారం కోసం ఆ విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండించగా ఆ శరీర భాగాలు దేశంలోని పలుచోట్ల పడి శక్తిపీఠాలుగా మారిపోయాయి. ఈ విషయం కూడా చాలా మందికి తెలిసిందే. అయితే సతీదేవి అలా ఆత్మార్పణ చేసుకున్న స్థలం ఎక్కడ ఉందన్న విషయం మీకు తెలుసా? ఆ స్థలంతో పాటు అక్కడి వివరాలన్నీ మీ కోసం....

కొట్టియూర్ దేవాలయం...

కొట్టియూర్ దేవాలయం...

P.C: You Tube

కొట్టియూర్ దేవాలయం కేరళలోని ఒక ప్రముఖ శైవక్షేత్రం. వడక్కేశ్వరాలయం అని ప్రాచీన కాలం నుంచి ఈ దేవాలయాన్ని పిలుస్తారు. ఇక స్థానికులు ఈ దేవాలయాన్ని ఇక్కరే కొట్టియార్ అని పిలుస్తారు.

కొట్టియూర్ దేవాలయం...

కొట్టియూర్ దేవాలయం...

P.C: You Tube

కొట్టూరు గ్రామం గుండా ప్రవహించే నదీ తీరంలోనే ఈ ఇక్కరే కొట్టియార్ దేవాలయం ఉంది. థ్రూచ్చరుమనా క్షేత్రం అని పురాణాల్లో ఈ దేవాలయన్ని పేర్కొంటారు. ఇప్పటికీ ఇదే పేరుతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి?కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి?

కొట్టియూర్ దేవాలయం...

కొట్టియూర్ దేవాలయం...

P.C: You Tube

ఇది కేరళ దేవస్థన్ మహామండలి ఆధీనంలో ఉన్న విశేష దేవాలయం. కొట్టియార్ లో రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒకటి బవలి నది పశ్చిమ తీరం ఒడ్డున ఉంటే మరొకటి తూర్పు తీరం ఒడ్డున ఉన్నాయి. ప్రక`తి రమణీయత మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

చల్లదనంలో కూడా వెచ్చదనం కోసంచల్లదనంలో కూడా వెచ్చదనం కోసం

కొట్టియూర్ దేవాలయం...

కొట్టియూర్ దేవాలయం...

P.C: You Tube

ఈ తూర్పు తీరంలో ఉన్న దేవాలయాన్ని కిజాకేశ్వరం లేదా అక్కరే కొట్టియూర్ దేవాలయం అని పిలుస్తారు. ఈ దేవాలయాన్ని వైశాఖ ఉత్సవ సమయంలో మాత్రమే తాత్కాలికంగా తెరుస్తారు. ఈ సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

కొట్టియూర్ దేవాలయం...

కొట్టియూర్ దేవాలయం...

P.C: You Tube

వైశాఖ ఉత్సవం జరిగే 27 రోజుల తర్వాత ఈ దేవాలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. దట్టమైన అరణ్య ప్రాంతంలో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయం ఉంది. పురాణాలను అనుసరించి అక్కరే కొట్టియార్ దేవాలయం దక్షయాగం జరిగిన స్థలంగా పేర్కొంటారు.

కొట్టియూర్ దేవాలయం...

కొట్టియూర్ దేవాలయం...

P.C: You Tube

సతీదేవి యాగం గుండంలోకి దూకి ప్రాణ త్యాగం చేసిన స్థలం ఇదేనని బలంగా విశ్వసిస్తారు. అటు పై స్వయంభువుగా లింగం వెలిసిందని చెబుతారు. స్వయంభువుగా లింగం వెలిసిన తర్వాత థ్రూచ్చురమనా దేవాలయాన్ని నిర్మించారు.

కొట్టియూర్ దేవాలయం...

కొట్టియూర్ దేవాలయం...

P.C: You Tube

అయితే ఈ దేవాలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందన్న దానికి సరైన నిదర్శనాలు ఇప్పుడు చూపించలేక పోతున్నారు. కొట్టియార్ దేవాలయాన్ని కేరళతో పాటు చుట్టు పక్కల ఉన్న అనేక రాష్ట్రాల ప్రజలు దర్శిస్తూ ఉంటారు.

కొట్టియూర్ దేవాలయం...

కొట్టియూర్ దేవాలయం...

P.C: You Tube

ఇక్కడ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరలతో పాటు ఆది శక్తి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. భారత దేశంలో సతీదేవికి ఉన్న అతి తక్కువ దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో శాశ్వత కట్టడాలను నిర్మించడాన్ని నిషేదించారు.

కొట్టియూర్ దేవాలయం...

కొట్టియూర్ దేవాలయం...

P.C: You Tube

ఉత్సవాల సమయంలో తాత్కాలిక కట్టడాలకు మాత్రం అనుమతి లభిస్తుంది. ఇక్కడికి దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి భక్తులు పాదయాత్ర ద్వారా వస్తారు. ఇక్కడి తాత్కాలిక నిర్మాణాలకు అవసరమైన పనుల్లో ఒక్కొక్క పనిని ఒక్కొక్క సముదాయానికి కేటాయిస్తారు.

కొట్టియూర్ దేవాలయం...

కొట్టియూర్ దేవాలయం...

P.C: You Tube

తమ సముదాయానికి కేటాయించిన పనిని భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం కొన్ని శతాబ్దాల నుంచి వస్తోంది. ప్రస్తుతం ఈ దేవాలయం రక్షిణ అభయారణ్య పరిధిలో ఉంది. ఇక థ్రూచ్చురుమన దేవాస్థానంలోని లింగాన్ని పరుశరాముడు కూడా పూజించాడని చెబుతారు.

కొట్టియూర్ దేవాలయం...

కొట్టియూర్ దేవాలయం...

P.C: You Tube

వైశాఖ మహోత్సవం ప్రతి ఏడాది మే జూన్ రోజుల్లో జరుగుతుంది. 27 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా స్వయంభువైన శివలింగానికి కొబ్బరి నీరుతో అభిషేకం చేస్తారు.

కొట్టియూర్ దేవాలయం...

కొట్టియూర్ దేవాలయం...

P.C: You Tube

ఇందు కోసం కొబ్బరి కాయలను ముడుపుగా చెల్లించే సంప్రదాయం ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతోంది. ఇక పశ్చిమ తీరంలో ఉన్న దేవాలయాన్ని మాత్రం ఏడాదిలో ఏ రోజులోనైనా సందర్శించుకోవచ్చు. ఈ దేవాలయాన్ని కూడా ప్రతి రోజు వందల మంది సందర్శిస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X