Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని అతి ఎత్తైన జలపాతం యొక్క విషాదగాధ గురించి మీకు తెలుసా ?

భారతదేశంలోని అతి ఎత్తైన జలపాతం యొక్క విషాదగాధ గురించి మీకు తెలుసా ?

జలపాతం అంటే అదేమో ఖుషి. పై నుండి పడే పాల వంటి జలపాతం, పక్శుల కిలకిల రావాలు, దట్టమైన సహ్యాద్రి అడవి, సువాసనలు గొలిపే పువ్వులు,ఆహా ఎంత సౌందర్యం.

By Venkatakarunasri

కాలినడకన 2300 మెట్లను ఎక్కి తిరుమలకు చేరిన ఆవుకాలినడకన 2300 మెట్లను ఎక్కి తిరుమలకు చేరిన ఆవు

జలపాతం అంటే అదేమో ఖుషి. పై నుండి పడే పాల వంటి జలపాతం, పక్శుల కిలకిల రావాలు, దట్టమైన సహ్యాద్రి అడవి, సువాసనలు గొలిపే పువ్వులు,ఆహా ఎంత సౌందర్యం. ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసి దేశమూలమూలల నుండే కాకుండా విదేశాలనుండి కూడా ప్రకృతిప్రేమికులు వస్తారు.

సామాన్యంగా ప్రతియొక్క దేశంలో కూడా అందమైన జలపాతాలు వుంటాయి. అయితే భారత దేశంలో అత్యంత ఎత్తైన జలపాతం గురించి మీకు తెలుసా? ఈ జలపాతం యొక్క విషాద
కథను వింటే ఎవరికైనా సరే దుఃఖం కలగకుండా వుండదు.

ఈ అందమైన జలపాతం వుండేది మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజిలో ప్రస్తుత వ్యాసంలో విషాద కథ వున్న జలపాతం గురించి తెలుసుకుంటాం.

భారతదేశంలోని అతి ఎత్తైన జలపాతం యొక్క విషాద కథ గురించి మీకు ఎంత తెలుసు?

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. జలపాతం

1. జలపాతం

1115 అడుగుల ఎత్తులోవుండే మేఘాలయలోని చిరపుంజికి సమీపంలో నోకలికాయ్ జలపాతం భారతదేశం యొక్క అతిపెద్ద జలపాతంగా వుంది. ఈ జలపాతం కా లికై అనే విషాద మహిళ పేరు పెట్టడం జరిగింది.

PC:SangitaChatterjee

 2. జంప్ ఆఫ్ కా లికై

2. జంప్ ఆఫ్ కా లికై

ఖాసి భాషలో జలపాతం పేరు " జంప్ ఆఫ్ కా లికై " అని అర్ధం వచ్చే ఈ స్థలం మహిళా లికాయ్ కు సంభందించిన అందరూ చెప్పుకునే కథ.

PC:Dhwani Shree

3. విషాద కథ

3. విషాద కథ

విషాద కథ ప్రకారం లికాయ్ అనే మహిళ ఒకరు ఒక గ్రామంలో నివసిస్తూ వుండేది. అయితే ఆమె భర్త ,మరణిస్తాడు.

PC:भवानी गौतम

4. ఉద్యోగం

4. ఉద్యోగం

ఆమెకు ఒక చిన్నపాప వుంటుంది. జీవనం సాగించుటకు ఉద్యోగాన్ని చేయవలసివచ్చింది. అందువల్ల ఎక్కువసమయం ఆమెకు పుట్టిన బిడ్డతో గడపలేకపోయేది.

PC:Cryptickk

5.విరామం

5.విరామం

తీరిక దొరికినప్పుడల్లా తన పాపను ఆడిస్తూ కాలం గడిపోయేది. తన ఒంటరితనంతో వున్న లికాయ్ భర్త మరణానంతరం మరొక పెళ్లి చేసుకుంటుంది.

PC:Sohel78bd

6. పునర్వివాహం

6. పునర్వివాహం

లికాయ్ మరలా పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్త కన్నా ఎక్కువగా తన బిడ్డను ప్రేమిస్తుంది. ఇది తన రెండవ భర్తకు ఇష్టంలేదు.

PC:Vikrantdhiman189381

 7. చంపటం

7. చంపటం

అసూయపడి ఆ చిన్న పాపను ఆమె రెండవ భర్త చంపివేసెను. ఆ బిడ్డ తల మరియు ఎముకలు పారేసి మిగిలిన మాంసంలో వంటను తయారుచేస్తాడు

PC:Pic Boy 101

8. మాంసం

8. మాంసం

లికాయ్ తన కూతురికి తెలీకుండా ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది. పని చేసి ఆయాసంగా వున్నందువలన ఆమె వంటింట్లోకి వెళ్లి మాంసాన్ని తింటుంది.

PC:Kunal Dalui

9. బిల్ విత్తనం

9. బిల్ విత్తనం

పని ముగించుకుని తిరిగి వచ్చే సమయంలో బిల్ విత్తనాలు మరియు బిల్ ఆకులను కత్తిరించే స్థలంలో ఆమె భర్త కట్ చేసిన చేతి వేళ్ళను చూస్తుంది.

PC:Sujan Bandyopadhyay

10. అనుమానం

10. అనుమానం

ఆ చేతి వేళ్ళ మాంసం తినేటప్పుడు ఆమెకు గుర్తుకు వస్తుంది. తన కూతురు కనిపించకుండా పోవటం ఏమయింది అన్న అనుమానం ఆమెకు వస్తుంది. తరువాత ఆమెకు అంతా అర్థమవుతుంది.

PC:Sujan Bandyopadhyay

11. దుఃఖం

11. దుఃఖం

తన కూతురుని ఆ స్థితిలో చూసిన కోపం మరియు దుఃఖం వల్ల ఆమె పిచ్చిదయిపోతుంది. తన కూతురిని తలచుకుని ఆమె కూడా ఆ జలపాతంలో దూకి చనిపోతుంది. అందువల్ల ఈ జలపాతాన్ని
విషాద నోకలికాయ్ జలపాతం అని పిలుస్తారు.

PC:PurohitHimanshu

12. ప్రకృతి సౌందర్యం

12. ప్రకృతి సౌందర్యం

ఈ విషాద కథ పక్కనపెడితే ఈ జలపాతం యొక్క అందమైన పచ్చిక, పొదలు మరియు ఎత్తైన వృక్షాలు ప్రకృతిలో మైమరపిస్తుంది. ఇక్కడకు వచ్చిన పర్యాటకులకు స్వర్గం అనే భావనను కలిగిస్తుంది.

PC:Udayaditya Kashyap

13. సాంబారు పదార్ధాలు

13. సాంబారు పదార్ధాలు

ఈ చిరపుంజి ప్రదేశంలో వున్న స్థలంలో దాల్చినచెక్క, తేనె, మిరియాలు అనేకరకాలైన ఆకులు అత్యంత తక్కువ ధరలలో సాంబారు పదార్ధాలను అమ్ముతారు.

PC:Vijayakumarblathur

14. ఉత్తమ కాలం

14. ఉత్తమ కాలం

చిరపుంజిలో సంవత్సరమంతా అద్భుతమైన వాతావరణమున్నందున ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళవచ్చును. అయితే ఋతుపవనాల సమయంలో ఈ జలపాతం చాలా అందంగా కనిపించే కారణంగా వర్షాకాలం అత్యంత ఉత్తమమైన కాలమై వుంది.సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలు అత్యంత ఉత్తమమైన కాలమై వుంది.

PC:David Borgoyary

15. ట్రెక్కింగ్ సాహసం

15. ట్రెక్కింగ్ సాహసం

సాహాస ప్రియులకు ఈ జలపాతం అత్యంత పరిపూర్ణమైనదని చెప్పవచ్చును. ట్రెక్కింగ్, క్యాపింగ్, పక్షి వీక్షణం, ఫోటోగ్రఫీ, స్విమింగ్ మొదలైనవి ఇక్కడ ఆనందించవచ్చును.
ఇక్కడ రిసార్ట్ లు, హోటళ్ళు, కుటీరాలు, అతిధి గృహాలు వున్నాయి.

PC:Sujan Bandyopadhyay

16. విమాన మార్గం

16. విమాన మార్గం

ఈ అందమైన దృశ్యాన్ని చూచుటకు సమీపవిమానాశ్రయం గోవాహటి భోర్ జార్ విమానాశ్రయం. ఇక్కడి నుండి నోకలికాయ్ ఫాల్స్ కి సుమారు 166 కి.మీ ల దూరంలో వుంటుంది.

 17. రైలు మార్గం

17. రైలు మార్గం

మేఘాలయ నుండి గోవాహటి రైల్వే స్టేషన్ అత్యంత సమీపంలో వుంది.ఇక్కడినుండి చిరపుంజికి సుమారు 99 కి.మీ దూరంలో ఈ నోకలికాయ్ ఫాల్స్ వుంది.

18. రహదారి మార్గం

18. రహదారి మార్గం

మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి సుమారు 54 కి.మీ ల దూరంలో వుంది.

PC:Sai Avinash

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X