Search
  • Follow NativePlanet
Share
» »ఇంత అందమైన నెహ్రూ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉందో తెలుసా?

ఇంత అందమైన నెహ్రూ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉందో తెలుసా?

భూతల స్వర్గం,తూర్పు వెనిస్ నగరం అని ప్రసిద్ధికెక్కిన శ్రీ నగర్ అందమైన కాశ్మీర్ లోయ లో ఉంది. జీలం నదీ తీరంలో ఉన్న ఈ నగరం, అందమైన సరస్సులు, పడవ-ఇళ్ళు, అసంఖ్యాకమైన మొఘల్ ఉద్యానవనాల కి పేరు మోసింది. శ్రీనగర్ అనే పదం రెండు సంస్కృత పదాల కలయిక. శ్రీ అనగా సంపద. నగర్ అనగా నగరం. అందువలన, శ్రీనగర్ అంటే సంపద నగరం అనే అర్ధం వస్తుంది. జమ్ము కాశ్మీర్ రాజధాని అయిన శ్రీనగర్ అనేక ప్రకతి అందాలకు నిలయం. సరస్సులు, మొఘల్ గార్డెన్లు, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు ఒక్కటేమిటి ప్రకతిలోని ప్రతి అందం ఈ కాశ్మీర్ లోనే ఉందన్న అనుభూతి అక్కడకు వెళ్లిన పర్యాటకులు పొందుతారు. అందువల్లే కాశ్మీర్ ను భూతల స్వర్గం అని అంటారు.

శ్రీనగర్ ... వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన టూరిస్టు స్పాట్... దాల్ లేక్. ఈ సరస్సు 22 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ సరస్సు ఫిషింగ్, వాటర్ ప్లాంట్ హార్వెస్టింట్ లాంటి వాటి ద్వారా శ్రీనగర్ ఆర్థికాభివృద్ధికి ఎంతో తోడ్పడుతోంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ 'షికారాలు'. అంటే గూటి పడవలు. అందంగా అలంకరించిన ఈ పడవల్లో ప్రయాణించడానికి పర్యాటకులు ఇష్టపడతారు. చలికాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డ కట్టేస్తుంది. అందుకే దీన్ని చూడాలంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే వెళ్లాలి.

భారతదేశంలో ఉన్న ఏకైక ఫ్లోటింగ్ మార్కెట్ శ్రీనగర్లోనే ఉంది. కూరగాయలు, పండ్లు, పూలు అన్నిటినీ పడవల్లోకెక్కించి, దాల్ సరస్సు నీటిపై తేలియాడుతూ అమ్ముతుంటారు. ఈ పూలు, కూరగాయలు, పండ్లు అన్నీ దాల్ లేక్ పరిసర ప్రాంతాల్లో సాగు చేసినవే. రోజూ ఉదయం 5 నుంచి 7 గంటల వరకు ఈ మార్కెట్ ఉంటుంది. పడవలో ప్రయాణిస్తూ అన్నీ కొనుక్కోవడం....ఓ అనుభూతి.

శ్రీనగర్లో ఎన్ని గార్డెన్స్ ఉన్నాయో లెక్క లేదు

శ్రీనగర్లో ఎన్ని గార్డెన్స్ ఉన్నాయో లెక్క లేదు

శ్రీనగర్లో ఎన్ని గార్డెన్స్ ఉన్నాయో లెక్క లేదు. 17వ శతాబ్దంలో కట్టిన షాలిమార్ బాగ్... శ్రీనగర్లో ఉన్న మూడు మొఘల్ గార్డెన్స్లోనూ పెద్దది. మే నుంచి అక్టోబర్ నెలల మధ్య ప్రతి రోజూ సాయంత్రం ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది. శుక్రవారం సెలవు. నిషాత్ గార్డెన్ కూడా ఫేమస్. ఈ రెండూ పర్షియన్ పద్ధతిలో నిర్మితమయ్యాయి. శరదృతువు (ఆకులు రాలే కాలం)లో ఈ మొఘల్ గార్డెన్స్ రాలిపడిన ఎరుపు-బంగారం రంగు ఆకులతో కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. ఇక మొక్కలపై ఆసక్తి ఉన్నవాళ్లెవరైనా జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ బొటానికల్ గార్డెన్ను చూడాల్సిందే. ప్రతి ప్రకృతి ప్రేమికుడు ఇష్టపడే ఆధునిక ఉద్యానవనం.

PC: Dvellakat

ఇక్కడ లేని మొక్క ఉండదు.

ఇక్కడ లేని మొక్క ఉండదు.

ఇక్కడ లేని మొక్క ఉండదు. నెహ్రూ బొటానికల్ గార్డెన్‌ను 1969 లో 80 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గార్డెన్ లో 17 హెక్టార్ల మేర ఓ అందమైన సరస్సు ఉంటుంది. అలాగే నసీం బాగ్. ఇది ప్రశాంతతకు మారు పేరు. 1586లో అక్బర్ చక్రవర్తి దీన్ని నిర్మించా రు. ఈ గార్డెన్ ను నాలుగు వేరువేరు విభాగాలుగా చూడవచ్చు. ఇక్కడి ప్రకృతి అందాన్ని చూడటానికి, అలసిన మనసును శాంతపర్చుకోడానికి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.

PC: Dvellakat

ఈ గార్డెన్ లో 100 రకాల పువ్వులను ఒకే చోట చూడవచ్చు.

ఈ గార్డెన్ లో 100 రకాల పువ్వులను ఒకే చోట చూడవచ్చు.

ఈ గార్డెన్ లో 100 రకాల పువ్వులను ఒకే చోట చూడవచ్చు. వసంత బుుతువులో నెహ్రూ బొటానికల్ గార్డెన్ రంగురంగుల పువ్వులతో నిండి పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. నెహ్రూ బొటానికల్ గార్డెన్ రుంటెక్ మొనాస్టరీకి దగ్గరలో ఉన్నది. ఇది ఒక పర్యాటక ఆకర్షణగా ఉంది. ఈ గార్డెన్ ను ఆధునిక పద్దతులు మరియు నియమాను సారం 4 విభాగాలుగా రూపొందించారు.వాటినే రిక్రియేషనల్ గార్డెన్, బొటానికల్ గార్డెన్ ,ప్లాంట్ ఇంట్రడక్షన్ సెంటర్ మరియు రీసెర్చ్ డివిజన్ అని వర్ణించవచ్చు.

PC: Dvellakat

Boat

అందమైన పుష్పాలు కాకుండా ప్రధాన ఆకర్షణలో బోటింగ్ కూడా ఒకటి

ఈ జవహర్ లాల్ నెహ్రు బొటానికల్ గార్డెన్ లో అందమైన పుష్పాలు కాకుండా ప్రధాన ఆకర్షణలో బోటింగ్ కూడా ఒకటి. అలాగే ఈ గార్డెన్ లో ఒక అందమైన సరస్సు ఉంది మరియు ఈ సరస్సులో పడవలలో విహరిస్తూ ఆనందం చెందవచ్చు. మొత్తానికి శ్రీనగర్ లో ప్రసిద్ది చెందిన బొటానికల్ గార్డెన్ ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలిచింది.

 ఈ ప్రదేశంలో పిల్లలు ఆడుకోవటానికి ఆట స్థలం కూడా ఉంది

ఈ ప్రదేశంలో పిల్లలు ఆడుకోవటానికి ఆట స్థలం కూడా ఉంది

ఈ ప్రదేశంలో పిల్లలు ఆడుకోవటానికి ఆట స్థలం కూడా ఉంది. ఈ అందమైన గార్డెన్ లో విరామ సమయంలో సరదాగా నడిచివెళ్లి ఆస్వాదించడానికి ఒక సుందరమైన రహదారిని కలిగి ఉంది. ఈ గార్డెన్ ను వేసవి మరియు శీతాకాలం రెండు ప్రధాన బుుతువుల్లో సందర్శించవచ్చు. శ్రీనగర్ లో పరిమిత వర్షపాతం కారణంగా ఈ స్థలాన్ని ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు సందర్శించవచ్చు.

PC: Dvellakat

అసమానమైన ప్రకృతి సౌందర్యం

అసమానమైన ప్రకృతి సౌందర్యం

శ్రీనగర్ లోని దర్శనీయ విశేషాలలో దాల్ సరస్సు, నాగిన్ సరస్సు, అంచర్ సరస్సు మరియు మనస్బల్ సరస్సు లాంటి సరస్సులు కూడా ఉన్నాయి. అసమానమైన ప్రకృతి సౌందర్యం మరియు మనోహరమైన పరిసరాలు ఈ సరస్సులని యాత్రికులకు ఆదర్శనీయమైన పర్యాటక ప్రదేశాలుగా చేస్తున్నాయి.

కాశ్మీర్ కిరీటంలో కలికితురాయి

కాశ్మీర్ కిరీటంలో కలికితురాయి

కాశ్మీర్ లోయ లోని రెండవ అతి పెద్ద సరస్సు అయిన దాల్ సరస్సు "కాశ్మీర్ కిరీటంలో కలికితురాయి" అని పేరు పొందింది. దీనికి అందమైన హిమాలయాలు నేపథ్యం గా ఉంటాయి. శ్రీనగర్ సరస్సు ఒడ్డున లభ్యమయ్యే పడవ-ఇళ్ళకి మరియు షికారా (కలప పడవ సవారి) కి కూడా ప్రసిద్ధి. యాత్రికులు "షికారా"లో విహరిస్తూ మనోహరమైన పరిసరాలని వీక్షించవచ్చు.

PC: Dvellakat

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం: శ్రీనగర్ ను విమానం ద్వారా చేరుకోవచ్చు. ఇండియన్ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్‌వేస్ వంటి కొన్ని ప్రధాన విమానయాన సంస్థలు శ్రీనగర్ విమానాశ్రయం నుండి నడుస్తాయి, ముంబై, కోల్‌కతా మరియు .ఢిల్లీ వంటి ప్రధాన నగరాలను కలుపుతున్నాయి.

రైలు మార్గం ద్వారా: శ్రీనగర్ కు సమీప రైల్వే స్టేషన్ జమ్మూలో ఉంది. ఇది జమ్మూ తవిలో ఉంది. ఇది ఈ ప్రాంతంలో ఒక ప్రధాన రైలుమార్గం. ఇది ఢిల్లీ, ముంబై మరియు చండీగఢ్ వంటి ఇతర నగరాలకు శ్రీనగర్ ను కలుపుతుంది.

రోడ్డు మార్గం: శ్రీనగర్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రోడ్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించబడి ఉంది. చండీగర్, గుల్మార్గ్, జమ్మూ, సోనమార్గ్ మరియు ఢిల్లీ రోడ్ల ద్వారా దీన్ని సులభంగా చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X