Search
  • Follow NativePlanet
Share
» »మీలో ‘వికృత’భావాలను పెంచే ‘కీచక’వధ జరిగిన ప్రాంతం

మీలో ‘వికృత’భావాలను పెంచే ‘కీచక’వధ జరిగిన ప్రాంతం

నేలకొండపల్లి గురించిన కథనం.

By Kishore

మీ లవర్ తో పెళ్లి వద్దనుకుంటున్నారా? ఇక్కడ మాత్రం మీ కోరిక నెరవేరదుమీ లవర్ తో పెళ్లి వద్దనుకుంటున్నారా? ఇక్కడ మాత్రం మీ కోరిక నెరవేరదు

మీ శత్రువును ఓడించే 'పాకిస్తాన్' హింగ్లజ్ దేవి మన దేశంలో కూడా ఉంది తెలుసామీ శత్రువును ఓడించే 'పాకిస్తాన్' హింగ్లజ్ దేవి మన దేశంలో కూడా ఉంది తెలుసా

అ (హో) బిలంలో 'అనంత'సంపద ఉందా? రాబోయే తరం వారికి అది సొంతమా?అ (హో) బిలంలో 'అనంత'సంపద ఉందా? రాబోయే తరం వారికి అది సొంతమా?

ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అదే విధంగా ఒక్కో ప్రాంతానికి వెలితే ఒక్కో భావన కలుగుతుంది. ఉదాహరణకు కాశీ, రామేశ్వరం వంటి ప్రాంతలకు వెళితే మనస్సు భక్తి భావంతో నిండిపోతుంది. ఇందుకు కారణం అక్కడ ఉన్న దేవాలయాలు, అందులో ఉన్న మూల విరాట్టు. అదే సింమ్లా, డార్జిలింగ్ వంటి ప్రాంతాలకు వెళితే మనస్సులో శృంగార పరమైన ఆలోచలను వద్దన్నా పుట్టుకు వస్తాయి. చుట్టూ ఉన్న చల్లని పరిసర ప్రాంతాలతో పాటు అక్కడకు వచ్చిన జంటలు చేసుకునే చిలిపి పనులు కూడా కారణం కావచ్చు. అదే విధంగా తెలంగాణలోని ఓ ప్రాంతానికి వెళితే మీలో రాక్షస భావాలు కలుగుతాయిని చెబుతారు. ఆ ప్రాంతం మహాభారతం తో పాటు బౌద్ధ మతంతో పాటు ముడిపడి ఉంది. ఇందుకు సంబంధించిన కథనం ఈ ప్రాంతాంలో తెలుసుకుందాం.

2. విరాట రాజ్యం

2. విరాట రాజ్యం

Image Source:

అలా వచ్చిన వారు ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లా వద్ద ఉన్న విరాట రాజ్యంలో మారు పేర్లతో అత:పురంలోనే ఉద్యోగాలు సంపాదిస్తారు. పాండవులతో పాటు అరణ్యవాసం చేసిన ద్రౌపతి కూడా భక్తలతో పాటు ఈ విరాట రాజ్యంలోనే ఉంటుంది.

3. కీచకుడు

3. కీచకుడు

Image Source:

ఈ విరాట రాజు భావ మరది, అత్యంత బలవంతుడైన కీచకుడు ద్రౌపతి అందం చూసి ఆమెను ఒక్కసారైనా అనుభవించాలని భావిస్తాడు. ఈ విషయం తెలిసిన భీమ సేనుడు ఆడ వేశంలో వెళ్లి ఆ కీచకుడిని సంహరిస్తాడు. ఈ విషయం పై నర్తనశాల అనే సినిమా కూడా వచ్చింది.

4. వారిద్దరికి పోరు జరిగిన ప్రాంతం

4. వారిద్దరికి పోరు జరిగిన ప్రాంతం

Image Source:

వారిద్ధరికీ భీకర పోరు జరిగిన ప్రాంతమే నేటి నేల కొండపల్లి అని చెబుతారు. అంతేకాకుండా సదరు కీచకుడు మరణించిన తర్వాత ఇక్కడే పాతి పెట్టారు. అలా పాతి పెట్టిన ప్రాంతాన్ని కీచక దిబ్బ లేదా కీచక గుండం అని కూడా ఉంటారు.

5. వికృతఆలోచనలు

5. వికృతఆలోచనలు

Image Source:

కొన్ని ప్రత్యేక రోజుల్లో ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తదితర రోజుల్లో ఈ కీచక గుట్ట ఉన్న ప్రాంతానికి వెళితే ఎంత మంచి వారికైనా విక`తమైన ఆలోచనలు వస్తాయని స్థానికులు చెబుతుంటారు. అందువల్లే చాలా కాలం నుంచి ఇక్కడకు సదరు రోజుల్లో ఎవరూ వెళ్లరు. దీనికి శాస్త్రీయ ఆధారం లేకపోయినా ప్రజలు విశ్వసిస్తున్నారు.

6. బాణాలు ఇక్కడ దాచిపెట్టారు

6. బాణాలు ఇక్కడ దాచిపెట్టారు

Image Source:

మారువేశంలో విరాటరాజ్యంలోకి వెళ్లే ముందు పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మి చెట్టు పైన పెట్టారని తెలుసుకదా. ఆ జమ్మి జట్టు ఈ కీచక గుండంకు అంటే నేలకొండపల్లికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాణాపురంలో ఉంచారని చెబుతారు. అందుకే ఆ ఊరికి బాణాపురం అని పేరు వచ్చినట్లు స్థానిక కథనం.

7. బుద్ధ విగ్రహాల తయారీ ఇక్కడే

7. బుద్ధ విగ్రహాల తయారీ ఇక్కడే

Image Source:

దాదాపు రెండు వేల ఏళ్ల క్రితమే ఇక్కడ బుద్ధ విగ్రహాల తయారీ కేంద్రం ఉండేదని చెబుతారు. ఆ రోజుల్లో దక్షిణ భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడ నుంచే బౌద్ధ విగ్రహాలు ఎగుమతి అయ్యేవి.

8. బౌద్ధ స్తూపం

8. బౌద్ధ స్తూపం

Image Source:

ఇక్కడ జరిపిన తవ్వకాల్లో బౌద్ధ స్తూపం బయట పడింది. ఇది దాదాపు క్రీస్తు పూర్వం రెండేవేల సంవత్సరాలకు పూర్వం నిర్మించారని పురావస్తు శాఖ అధికారులు లెక్కలు గట్టారు. అంతే కాకుండా ఇక్కడ ముడి ఇనుముతో తయారుచేసిన నిలబడిన స్థితిలో ఉండే బుద్ధ విగ్రహం కూడా లభించింది.

9. రామదాసు జన్మించింది ఇక్కడే

9. రామదాసు జన్మించింది ఇక్కడే

Image Source:

భద్రాచల రామాలయం నిర్మాణానికి ప్రధాన కారకుడిగా భావించే కంచర్ల గోపన్న జన్మించింది ఈ నేల కొండపల్లిలోనే. ఆయన పుట్టిన ఇంటిని ప్రస్తుతం భక్తరామదాసు ధ్యాన మందిరంగా పిలుస్తారు. ఈ గ్రామాలయంలో అత్యంత పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. గోపన్నను రామ మందిరం నిర్మాణం తర్వాత భక్త రామదాసుగా పిలిచిన విషయం తెలిసిందే.

10. మరింత పరిశోధన అవసరం

10. మరింత పరిశోధన అవసరం

Image Source:

నేలకొండపల్లి లో పురావస్తు శాఖ మరిన్ని తవ్వకాలు జరిపితే అటు మహాభారతానికి సంబంధించి మరుగున పడిన ఎన్నో విషయాలతో పాటు బౌద్ధ మతానికి సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయని భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ ప్రాంతాన్ని సరిగా అభివ`ద్ధి చేస్తే పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X