Search
  • Follow NativePlanet
Share
» »6 నెలలు భక్తులకు, 6 నెలలు బుుషులకు ప్రవేశం కల్పించే మళ్లపంది, పాములు ఉన్న గుహాలయం

6 నెలలు భక్తులకు, 6 నెలలు బుుషులకు ప్రవేశం కల్పించే మళ్లపంది, పాములు ఉన్న గుహాలయం

నల్లితీర్థం గుహాలయానికి సంబంధించిన కథనం.

నెల్లి తీర్థ సోమేశ్వర గుహాలయం కర్నాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ శివుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు. అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన ఈ దేవాలయం క్రీస్తుశకం 1487 నుంచి క్రమం తప్పకుండా పూజలు జరుగుతున్నాయి. ఈ గుహాలయంలో తేళ్లు, పాములు, ముళ్లపంది వంటి జంతువులు ఉన్నా భక్తులను అవి ఏమి చేయక పోవడం గమనార్హం. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

ముత్తప్పన్ దేవుడు...మాంసం, మద్యం, చేపలకూరంటే ముద్దు, శునకాలన్నా కూడాముత్తప్పన్ దేవుడు...మాంసం, మద్యం, చేపలకూరంటే ముద్దు, శునకాలన్నా కూడా

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube

అత్యం ప్రచీనమైన ఈ దేవలయం ఒక గుహలో ఉంది. ఇక్కడ శివలింగంతో పాటు పవిత్రమైన సరోవరం కూడా ఉంది. ఈ దేవాలయం కర్నాటకలోని మంగళూరులో ఉంది.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
గుహలోపలి సరోవరంలోకి నీరు ఉసిరి కాయ రూపంలో పడటం వల్ల దీనికి నల్లితీర్థం అని పేరు వచ్చింది. ఈ పుణ్యక్షేత్రం ప్రస్థావన స్కాందపురాణంలో కూడా ఉంది.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
దీని ప్రకారం అరుణాసుర అనే రాక్షసుడు జబాలి అనే ముని నుంచి పవిత్రమైన గాయిత్రీ మంత్రాన్ని నేర్చుకొంటాడు. ఆ మంత్రం పఠనం వల్ల లభించిన శక్తిని మంచి కోసం కాకుండా చెడుకోసం వినియోగిస్తూ ఉంటాడు.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
ఈ ప్రాంతంలోని బుుషులను, సాధారణ ప్రజలను హింసించడం ప్రారంభిస్తాడు. అయితే ఈ విధంగా అరుణాసుడు గాయిత్రీ మంత్రాన్ని దురుపయోగం చేస్తుండటం అక్కడ తపస్సులో లీనమైన జబాలి మహర్షికి తెలియదు.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
అయితే ఈ అరుణాసురుడు చేస్తున్న అఘాయిత్యాలు ఎక్కువ కావడంతో నారదముని ఈ అరుణాసురుడి గురించి జబాలి బుుషికి తెలియజేస్తాడు.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
విషయం తెలిసిన వెంటనే ఎలాగైనా ఆ రాక్షసుడి ఆట కట్టించాలని జబాలి మహర్షి నిర్ణియించుకొంటాడు. అటు పై జబాలి మహర్షి దుర్గా పరమేశ్వరి గురించి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
అతని తపస్సుకు మెచ్చిన దుర్గా పరమేశ్వరి జబాలి మహర్షి ఎదుట ప్రత్యక్షమవుతుంది. అటు పై అరుణాసరుడిని సంహరిస్తానని బుుషికి మాట కూడా ఇస్తుంది.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
ఇచ్చినమాట ప్రకారం అరుణాసురుడితో నందినీ నదీ తీరంలో సంహరిస్తుంది. అదే ప్రస్తుత నల్లితీర్థ గుహ అని చెబుతారు. అందువల్లే ఈ నల్లితీర్థంలో దుర్గాపరమేశ్వరి దేవాలయాన్ని కూడా చూడవచ్చు.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
ఈ దేవాలయాన్ని కటిల్ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం మంగళూరులో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇక ఇక్కడ శివుడు, విష్ణువు, దుర్గా మాత దేవాలయాలను కూడా చూడవచ్చు.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
ఇక నల్లితీర్థంలోని శివుడు సోమేశ్వరుడి పేరుతో భక్తులతో పూజలు అందుకొంటూ ఉన్నాడు. ఈ తీర్థంలో మహాగణపతి, జబలి మహర్షి విగ్రహాలను కూడా మనం చూడవచ్చు.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
ఈ సోమనాథేశ్వర లింగాన్ని అర్థనారీశ్వర లింగం అని పేర్కొంటారు. ఇది సాలగ్రామ విగ్రహమని స్థానిక పూజారులు చెబుతారు. ఈ నల్లి తీర్థానికి ఉత్తర దిశలో నాగప్ప సరోవరం ఉంది.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
ఈ నాగప్ప సరోవరం అత్యంత పవిత్రమైనదని చెబుతారు. నల్లితీర్థం గుహలోకి ప్రవేశించేముందు భక్తులు ఈ నాగప్ప సరోవరంలో పవిత్రస్నానాలు చేస్తారు.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
ఇదిలా ఉండగా పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలించే అరసోలే మంజు అనే రాజు నిత్యం ఈ గుహలయాన్ని సందర్శించేవాడని చెబుతారు. అతను చనిపోయిన తర్వాత కూడా అతని ఆత్మ ఈ దేవాలయం దగ్గరగా వస్తుందని చెబుతారు.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
అందువల్లే ఈ సూర్యాస్తమయం తర్వాత ఎవరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించరు. ఈ నల్లితీర్థానికి ఏ జాతి, ధర్మానికి చెందినవారైనా వెళ్లి అక్కడ సోమేశ్వరుడికి పూజలు చేయవచ్చు.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
ఇక ఈ నల్లితీర్థంలోకి ప్రవేశం కేశం ఆరునెలలు మాత్రమే. ఈ పవిత్ర గుహాలయం సందర్శనకు అక్టోబర్ నుంచి ఏప్రిల్ మార్చి చివరి వరకూ సాధారణ భక్తులకు అనుమతి.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
అటు పై ఈ గుహాలయాన్ని మూసివేస్తారు. తదుపరి ఆరునెలలు ఈ గుహాలయాన్ని దేవతలు, బుుషులు సందర్శిస్తారని చెబుతారు. అందుకే ఆ సమయంలో ఈ గుహాలయాన్ని మూసివేస్తారు.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
ఇక ఈ గుహాలయంలో తేళ్లు, పాములతో పాటు ముళ్లపంది వంటి జంతువులు కూడా ఉంటాయి. అయితే అవి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకపోవడం గమనార్హం.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
అదేవిధంగా భక్తులు కూడా ఈ గుహాలయంలోకి వెళ్లిన తర్వాత వాటికి ఎటువంటి ఇబ్బందులు కలిగించరు. మంగళూరు నుంచి మూడబిద్రి వైపు వెళ్లే మార్గంలో ఈ నల్లితీర్థం వస్తుంది.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
అదేవిధంగా మంగళూరు నుంచి కటిలుకువెళ్లితే అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మనకు ఈ నల్లితీర్థం కనిపిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

నల్లి తీర్థం, కర్నాటక

నల్లి తీర్థం, కర్నాటక

P.C: You Tube
బెంగళూరు నుంచి వెళ్లేవారు మొదట బీ.సీ రోడ్ చేరుకోవాలి. అక్కడి నుంచి వూలాలి, కైకంబద నుంచి నల్లితీర్థం చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X