Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ రొట్టెను తీసుకొంటే మీకు ఉద్యోగం, సంతానం ఖచ్చితం.

ఇక్కడ రొట్టెను తీసుకొంటే మీకు ఉద్యోగం, సంతానం ఖచ్చితం.

రొట్టెల పండుగ కథనం.

సాధారణంగా జొన్నరొట్టే, రాగి రొట్టే, సజ్జ రొట్టెలు అందరికీ తెలుసు. అయితే నెల్లూరులోని బారాషహీద్ అంటే 12 మంది యుద్ధ వీరుల దర్గా వద్ద మాత్రం పెళ్లి రొట్టే, ఉద్యోగరొట్టే, ఆరోగ్య రొట్టే, సంతాన రొట్టే, ఇల్లు రొట్టేలు ఒకరికి ఒకరు పంచుతూ ఉంటారు. మనకు కావాల్సిన కోర్కెకు సంబంధించిన రొట్టెను తీసుకోవడం వల్ల మన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఉదాహరణకు మీకు పెళ్లి కావాలనుకొంటే పెళ్లి రొట్టెను పంచేవారి వద్దకు వెళ్లి సదరు రొట్టెను తీసుకోవాల్సి ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా ఈ ఆచారం కొన్ని వందల ఏళ్ల నుంచి కులమతాలకు అతీతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నెల 21న ఆ రొట్టెల పండుగను ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో జరపనున్నారు. ఈ సందర్భంగా ఈ రొట్టెల పండుగకు సంబంధించిన కథనం.

ఇక్కడికి వెళితే మీ తలరాత మారిపోవడం ఖచ్చితంఇక్కడికి వెళితే మీ తలరాత మారిపోవడం ఖచ్చితం

రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube

మొహర్రం నెలలో నెలవంక కనిపించిన 11వ రోజు నుంచి ఐదు రోజుల పాటు ఈ రొట్టెల పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

కొండగట్టుకు అంతమంది భక్తులు ఎందుకు వస్తారో తెలుసాకొండగట్టుకు అంతమంది భక్తులు ఎందుకు వస్తారో తెలుసా

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
ఈ రొట్టెల పండుగను కులమతాలకు అతీతంగా హిందువులు, ముస్లీం సోదరులు కలిసి చేసుకొంటారు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది.

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
క్రీస్తు శకం 1751లో సౌదీ అరేబియాలో మక్కా షరీఫ్ నుంచి 12 మంది వీరులు భారత్ కు వచ్చారు. అప్పుడు కర్నాటకలో హైదర్ అలీ పాలన ఉండేది.

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
12 మంది వీరులు హైదర్ అలీతో కలిసి అనేక ప్రాంతాల్లో ప్రవక్త సందేశాలను వివరిస్తూ ఉండేవారు. అదే కాలంలో తమిళనాడు వాలాజా రాజులకు, బీజాపూర్ సుల్తాన్ లకు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరంలో భీకర యుద్ధం జరిగింది.

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
ఈ పోరాటంలో టర్కీ కమాండర్ జుల్ఫెఖార్ బేగ్ తో పాటు 12 మంది యుద్ద వీరుల తలలు నరికివేశారు. ఈ యుద్ధవీరుల తలలు గండవరంలో పడిపోగా మొండేలు గు్రాల సాయంతో నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు చేరాయి.

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
అప్పటి నెల్లూరు ఖాజీకి 12 మంది షహీద్లు కలలో కనిపించి మాకు స్వర్ణాల చెరువు సమీపంలో సమాధులు కట్టించమని చెప్పారు. వారి సూచనలను అనుసరించి వారికి వేర్వేరుగా 12 సమాధులు నిర్మించారు.

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
అప్పటి నుంచి బారా షహీద్ దర్గా, దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని దర్గా మిట్టగా పిలుస్తారు. అంతేకాకుండా ఇక్కడకు వచ్చే భక్తుల కోర్కెలు నెరవేరుతూ ఉండేవి.

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
ఇదిలా ఉండగా అర్కాటు నవాబుల కాలంలో నెల్లూరు స్వరాల చెరువు వద్ద రజకులు బట్టలు ఉతికేవారు. ఈ సందర్భంలో రజకులైన భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతుకుతుండగా పొద్దు పోవడంతో అక్కడే నిద్రపోయారు.

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారా షహీద్ లు కలలోకి వచ్చి అర్కాటు నవాబు భార్య ఆనారోగ్యంతో బాధపడుతోందని సమాధుల పక్కనున్న మట్టిని తీసుకెళ్లి అమె నుదిటి పై రాస్తే కోలుకొంటుందని చెప్పారు.

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
ఉదయాన్నే భార్యభర్తలిద్దరూ గ్రామంలో వెలుతుండగా అక్కడ అర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమెకు సరైన వైద్యం చేసిన వారికి విలువైన బహుమతిని అందజేస్తామని దండోరా వేస్తుంటారు.

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
దీంతో రజక భార్యాభర్తలు తమకు కలలో వచ్చిన విషయాన్ని నవాబు రాజుకు వివరిస్తారు. దీంతో రాజు తన అనుచరులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడి మట్టిని తెప్పించుకొని రాజు భార్య నుదిటి పై పూస్తారు.

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
వెంటనే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది. దీంతో ఆ రాజు భార్యతో కలిసి నెల్లూరు స్వర్ణాల చెరువు వద్దకు వచ్చి బారాషామీదు మసీదులకు ప్రార్థనలు చేస్తారు. అటు పై తాము తెచ్చుకొన్న రొట్టెలను అక్కడ ఉన్నవారికి పంచుతారు.

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
అప్పటి నుంచి ఈ రొట్టెల పండుగ ప్రారంభమైనట్లు చెబుతారు. ప్రతి ఏడాది దాదాపు 10 లక్షల మంది ఈ రొట్టెల పండుగకు హాజరవుతారని చెబుతారు.

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
ఇక ఒక్కొక్క రొట్టె ఒక్కో రకం. ఆరోగ్య రొట్టెలను గోధుమ, బియ్యం పిండితో తయారు చేస్తారు. అరకేజీకి ఐదు వచ్చేట్లు చేస్తారు. ఆకుకూర, మునగకూర ఏదైనా తాళింపు ఉంచి అందిస్తారు.

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
ఉద్యోగ, పెళ్లి రొట్టెలకు బెల్లం ఉంచి అందించాలనేది నియమం. కోరిన కోర్కె నెరవేరిన వారు మొత్తం ఐదు రొట్టెలను తయారు చేస్తారు. వాటిని ఒకటి ఇంట్లో ఉంచుకొని మొగిలిన నాలుగింటిని దర్గా వద్దకు తీసుకువస్తారు.

 రొట్టెల పండుగ, నెల్లూరు

రొట్టెల పండుగ, నెల్లూరు

P.C: You Tube
రెండు స్వర్ణాల చెరువలో దేవుడి పేరుతో సమర్పించి మిగిలిన రెండింటిని మార్పిడి చేసుకొంటారు. ఇలాంటి కోర్కె కలిగిన వారు ఆ రొట్టెలను స్వీకరిస్తారు. ఇక ప్రస్తుతం ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ తరుఫున నిర్వహిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X