Search
  • Follow NativePlanet
Share
» »నెమలిగుండ్ల రంగనాయక ఆలయం కేరాఫ్ నల్లమల అడవి !

నెమలిగుండ్ల రంగనాయక ఆలయం కేరాఫ్ నల్లమల అడవి !

By Mohammad

నెమలిగుండం రంగనాయక స్వామి ఆలయం - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతిపురాతనమైన ఆలయంగా పేర్కొంటారు. గర్భగుడిలో రంగనాథస్వామి నిజరూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. త్రేతాయుగం కాలం నుంచీ ఈ ఆలయంలో స్వామి పూజలు అందుకుంటున్నట్లు చెబుతారు.

రంగనాయక స్వామి ఆలయం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కలదు. ఆలయం పక్కనేఉన్న జలపాతం వద్ద స్నానాలు ఆచరించవచ్చు. ఒక్కరోజు పర్యటన కు నెమలిగుండం (లేదా నెమలిగుండ్ల) ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. చుట్టుపక్కల స్థానికులు, పర్యాటకులు ముఖ్యముగా పండుగ మరుసటి రోజులలో (సద్ది పండగ) కుటుంబసభ్యులతో, బంధుమిత్రులతో కలిసివచ్చి వనభోజనాలు చేస్తుంటారు. మీరు కూడా వీలైతే శని, ఆది వారాలలో లేదా సెలవుదినాలలో ఇక్కడికి వచ్చి గడపండి. ఇక్కడికి ఎలా చేరుకోవాలో ? ఏమేమి చూడాలో ఒకసారి తెలుసుకుందాం !

గుండ్ల బ్రహ్మశ్వర ఆలయం - సమీప పర్యాటక ప్రదేశాలు !గుండ్ల బ్రహ్మశ్వర ఆలయం - సమీప పర్యాటక ప్రదేశాలు !

నల్లమల అడవిలో

నల్లమల అడవిలో

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జల్లివానిపుల్లల చెరువు కు పడమటి దిక్కున అరు కిలొమీటర్ల దురంలో వున్న నల్లమల అటవి ప్రాంతంలో నెమిలిగుండల్ల రంగనాయకస్వామి దేవాలయం ఉంది.

చిత్రకృప : Siva Racharla

మయూర మహర్షి

మయూర మహర్షి

నల్లమల అటవి ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమాన్ని ఎర్పరుచుకొని మహావిష్ణువును ప్రసన్నం చేసుకొడానికి తపస్సు చేస్తూ తదేక దీక్షతొ తన ముక్కుపుటమతో ఒక గుండమును తవ్వి మట్టీని బయటకు తీయడంతొ మరుసటి సూర్యోదయానికి గుండం జలయంగా మారిందని ప్రతీతి.

చిత్రకృప : నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం

నెమెలిగుండ్ల రంగనాయకస్వామి

నెమెలిగుండ్ల రంగనాయకస్వామి

నెమలి ముఖ ఆకారంతో వున్న మహర్షిచే నిర్మితమెనందున నెమిలిగుండం అనే పేరు వచ్చింది. దీని చేంతనే మహా విష్ణువు రంగనాయకస్వామిగా వెలయడంతో నెమెలిగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రంగా వాసికెక్కింది.

చిత్రకృప : నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం

పెళ్ళడాలనీ

పెళ్ళడాలనీ

నల్లమల్ల కొండలలో ఇసుకగుండమనెచోట చెంచు జాతికి చెందిన బయన్న, బయ్యక్క దంపతులుండేవారు. వారి ఏకైక కుమార్తె పేరు రంగ. పెళ్ళిడు కొచ్చిన రంగ తన కులాచారాన్ని దిక్కరించి, కులపెద్దలతో విభేదించి మహావిష్ణువును పెళ్ళడాలనీ తలంపుతో చెంచుగూడెం వదలి నెమిలిగుండం చేరుకొని తపమాచరిస్తున్న మయార మహర్షికి తన మనోగతాన్ని వెల్లడి చేసింది.

చిత్రకృప : నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం

స్వయంభుగా

స్వయంభుగా

మనో భీష్ట సిద్దికొసం మహర్షితో కలసి తపమాచరించిది. ఎట్టకేలకు వారి తపస్సుకు చలించిన విష్ణువు ప్రసంన్నుడై రంగను భార్యగా . స్వీకరించెను. మయార మహర్షి కొరిక మేరకు నెమలిగుండం ప్రక్కనే పడమటి కొండపైన స్వయంభుగా వెలసి భక్తుల పాలిట ఆరాధ్యదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు.

చిత్రకృప : నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం

ఉపవాసాలు

ఉపవాసాలు

ఈ ప్రదేశాన్ని లక్ష్మణ వనంగా పిలుస్తారు. ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత గొప్పదనం నెమలిగుండ రంగనాయక స్వామికి వుంది. గత కొన్ని సంవంత్సరాలుగా ప్రతి ఎటా చైత్ర మాసంలో బహుళ పాడ్యమి, విదియ, తదియలో మూడు రోజుల పాటు ఉపవాసాలు నిర్వహిస్తారు.

చిత్రకృప :నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం

సాయంత్రం 6 అయ్యిందంటే

సాయంత్రం 6 అయ్యిందంటే

ఆలయాన్ని శని మాత్రమే తెరుస్తారు మరియు సాయంత్రం 6 అయ్యిందంటే ఎవ్వరినీ అనుమతించరు.

చిత్రకృప : నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం

అద్భుతం

అద్భుతం

నెమలిగుండాన్ని 'గుండ్లకమ్మ' జన్మస్థానం అని అంటారు. ఏడాది పొడవునా ఈ జలపాతం జాలువారుతూనే ఉంటుంది. ఎత్తైన కొండలు, జాలువారే జలపాతం, ప్రకృతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది.

చిత్రకృప : Ramireddy

గిద్దలూరు

గిద్దలూరు

నెమలిగుండం వెళ్లాలంటే గిద్దలూరు, మార్కాపురం, నంద్యాల ప్రాంతాల నుండి ప్రతి శనివారాలలో బస్సులు ఉంటాయి. కానీ చాలా తక్కువగా నడుతాయి. అయితే గిద్దలూరు నుండి ప్రవేట్ ఆటోలు ఉంటాయి. ప్రయాణ సమయం : గంట లేదా గంటన్నర. గిద్దలూరు లో రైల్వే స్టేషన్ కలదు.

చిత్రకృప : నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X