Search
  • Follow NativePlanet
Share
» »సమాధుల మధ్య రెస్టోరెంట్...ఖైదీలు ఛెఫ్ లుగా పనిచేసే కెఫే

సమాధుల మధ్య రెస్టోరెంట్...ఖైదీలు ఛెఫ్ లుగా పనిచేసే కెఫే

అహ్మదాబాద్ లోని న్యూ లక్కీ రెస్టోరెంట్, సింమ్లా లోని బుక్ కెఫేల గురించిన కథనం

By Beldaru Sajjendrakishore

స్మశానం... చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ వెళ్లాల్సినది ఇక్కడికే. అయితే ఈ పేరు వింటూనే చాలా మంది భయపడుతారు. అటు వైపు వెళ్లడానికే జంకుతారు. మరికొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి ఆ స్మశానం వైపు వెళ్లితే ఏదో అరిష్టం జరుగుతుందని నానా హైరాణ పడిపోతారు. అయితే అదే స్మశానాన్ని రెస్టోరెంట్ గా మారిస్తే. నీ కేమైనా పిచ్చిపట్టిందా అని అడగకండి. ఈ ఆలోచన కార్యరూపం దాల్చడమే కాకుండా వినియోగదారులు ఎంచక్క ఆ స్మశానంలో సమాధుల మధ్య వేడి వేడి ఛాయ్ లాగించేస్తున్నారు.

మద్యం, మాంసం, గంజాయి....కాదేదీ ప్రసాదానికి అనర్హం.మద్యం, మాంసం, గంజాయి....కాదేదీ ప్రసాదానికి అనర్హం.

ఇదిలా ఉండగా అయితే తెలిసి తెలియక, క్షణికావేశంలో చేసిన తప్పుకు జీవితం మొత్తం ఖైదీలు కటకటాల వెనుక గడపాల్సిందేనా. ఇదే ఆలోచన అక్కడి ప్రభుత్వానికి వచ్చింది. దీంతో వారికి కొంత స్వేచ్ఛ ఇచ్చారు. బేడీలు వేయాల్సిన చేతికి గరిటలు ఇచ్చి నలభీమ పాకాన్ని వండిస్తున్నారు. వినియోగదారులు కూడా లొట్టలేసుకుని మరీ లాగించేస్తున్నారు. ఆ రెండు రెస్టోరెంట్లు ఎక్కడ ఉన్నాయి తదితర వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకలు కోసం

1. పదార్థాల కంటే...

1. పదార్థాల కంటే...

Image source:


సాధారణంగా ఏ రెస్టోరెంట్ అయినా కూడా అక్కడ అందజేసే పదార్థాల రుచి అదేనండి టేస్ట్ వల్ల, మరియు అక్కడ పనివారు ఎలా మనకు పదార్థాలను అందజేస్తున్నారన్న విషయం పై ఆధారపడి ఆ రెస్టోరెంట్ ప్రాచుర్యం పొందుతుంది. అయితే అహ్మదాబాద్ లోని లాల్ ధర్ వాజా ప్రాంతంలోని ఓ రెస్టోరెంట్ మాత్రం ఆ రెస్టోరెంట్ ఎక్కడ కట్టారన్న విషయాన్ని అనుసరించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.

2. అర్థరాత్రి అమావాస్య...

2. అర్థరాత్రి అమావాస్య...

Image source:


ఈ రెస్టోరెంట్ ఓ స్మశానం ఉన్న ప్రాంతంలో కట్టబడింది. అర్థరాత్రి, అమావాస్య అన్న బేధం, భయం లేకుండా వినియోగదారులకు ఇక్కడ వేడివేడి ఛాయ్, సమోస, పఫ్ తదితర స్నాక్స్ దొరుకుతాయి. రాత్రి 12 దాటిన తర్వాత కూడా ఇక్కడకు ఎంచక్కా వెళ్లి మనం మనకు కావాల్సినవి తిని మంచి ఛాయ్ ను సిప్ చేసి ఇంటికి తిరిగి వచ్చేయవచ్చు. అన్నట్టు ఇలా వెళ్లిన వారి వెంట దెయ్యాలు ఏమీ పడవులేండి.

3. ఎం.ఎఫ్. హుసేన్ కూడా...

3. ఎం.ఎఫ్. హుసేన్ కూడా...

Image source:


ఎం. ఎఫ్ హుసేన్ కూడా వంటి ప్రఖ్యాతి చెందిన కళాకారులతో పాటు స్థానికంగా పేరొందిన రాజకీయ నాయకులు ఎందరో ఈ స్మశానంలోకి వచ్చి సమాధుల మధ్య తమకు ఇష్టమైన వాటిని లాగించేసి వెలుతుంటారు. అన్నట్టు ఈ రెస్టోరెంట్ కు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక మంచి వార్తను వినడం జరుగుతుందని నమ్ముతున్నారు. అంతేకాకుండ కొంతమందికి ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు కూడా సమాధానాలు లభించినట్టు స్థానికుల కథనం

4. చిన్న టీ కొట్టుగా ప్రారంభమయ్యి

4. చిన్న టీ కొట్టుగా ప్రారంభమయ్యి

Image source:


ఈ రెస్టోరెంట్ 1950 లో ప్రారంభమయ్యింది. ముస్లీం సోదరులకు చెందిన స్మశానం ముందు హెచ్. మహ్మద్ అనే వ్యక్తి ఓ చిన్న టీ స్టాల్ ను ప్రారంభించారు. టీ రుచి చాలా మందికి నచ్చడంతో పక్కన స్మశానం ఉందని కూడా ఆలోచించకుండా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తమ జిహ్వచాపల్యాన్ని తీర్చుకునేవారు. ఇలా క్రమేణ వ్యాపారం పెరగడంతో తన టీ స్టాల్ ను కూడా మహ్మద్ విస్తరించాడు. కొన్నేళ్ల క్రితం ఈ రెస్టోరెంట్ ను కుట్టినాయర్ అనే వ్యక్తికి మహ్మద్ కుటుంబ సభ్యులు విక్రయించారు.

5. 26 సమాధులు

5. 26 సమాధులు

Image source:


ఈ రెస్టోరెంట్ లోపల 26 సమాధులు ఉన్నాయి. సమాధుల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ ఈ సమాధుల పై శుద్ధి కూడా చేస్తారు. అటు పై సమాధుల పై జరీ అంచులు గల దుస్తులు, పూలతో అలంకరిస్తారు. ఈ రెస్టోరెంట్ అంటే ఎం.ఎఫ్ హుసేన్ కు చాలా ఇష్టం అందువల్లే ఓ ఫెంయింటింగ్ ను కూడా ఆయన ఈ రెస్టోరెంట్ కు బహూకరించాడు. ఆ పెయింటింగ్ ను ఇప్పటికీ అక్కడ సందర్శకులు చూస్తూ ఉంటారు.

6. న్యూ లక్కీ రెస్టోరెంట్...

6. న్యూ లక్కీ రెస్టోరెంట్...

Image source:


అన్నట్టు ఈ రెస్టోరెంట్ పేరు ప్రస్తుతం న్యూ లక్కీ రెస్టోరెంట్. చనిపోయిన వెంటనే శరీరాన్ని ముట్టుకోవడానికి కూడా అసహ్యించుకునే ఈ సమాజంలో చనిపోయిన వారికి గౌరవాన్ని అందజేస్తూ వారి పక్కనే అంటే వారి సమాధుల పక్కన కుర్చొనడమే కాకుండా మనకు ఇష్టమైన వాటిని తినడం ఒక రకంగా వారికి గౌరవం తెలియజేయడమే అవుతుందనడంలో సందేహం ఏముంది. అన్నట్టు మీరు ఎప్పుడైనా అహ్మదాబాద్ వెలితే న్యూ లక్కీ రెస్టో రెంట్ కు వెళ్లడం మరిచిపోకండి.

7.సింమ్లా ...

7.సింమ్లా ...

Image source:


దేశంలోని అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో శిమ్లా లేదా సింమ్లా మొదటి స్థానంలో ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకు దగ్గట్టుగానే ఇక్కడ స్ట్రీట్ రెస్టోరెంట్ లతో పాటు ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. అందులో ఒక రెస్టోరెంట్ గురించి మాత్రం అందరూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందు కంటే ఆ రెస్టోరెంట్ ను నిర్వహిస్తున్నది నలుగురు శిక్ష ఖరారైన ఖైదీలు కావడమే.

8. బుక్ కెఫ్

8. బుక్ కెఫ్

Image source:


ఈ నలుగురు శిక్షపడిన ఖైదీలు నిర్వహిస్తున్న రెస్టోరెంట్ పేరు బుక్ కెఫ్. స్థానికంగా ఉంటున్న కేంద్ర కారాగారంలో వీరు శిక్ష అనుభవించేవారు. అయితే అధికారులు శిక్షణ కాలంలో వీరి సత్ఫ్రవర్తన గుర్తించి వంట వండటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీంతో వీరు చేయి తిరిగిన వంటవాళ్లుగా మారారు. ఇంకేముందు వీరు బుక్ కెఫ్ నిర్వాహకులుగా మారిపోయారు. వీరి చేతి రుచి మరిగిన స్థానికులు చాలా మంది వీరి రెస్టోరెంట్ కు రెగులర్ కష్టమర్లుగా మారిపోయారు.

9. గైడ్ సదుపాయం కూడా

9. గైడ్ సదుపాయం కూడా

Image source:


ఇక ఈ కెఫెలో ఉదయం ఫలహారం నుంచి రాత్రి భోజనం వరకూ అన్నీ దొరుకుతాయి. మొదలే చెప్పుకున్నట్లు భారత దేశంలో సింమ్లా పర్యాక ముఖ్య ప్రర్యాటక ప్రాంతం. ఇక్కడకు విదేశీయులు కూడా ఎంతో మంది వస్తుంటారు. దీంతో వారికి దగ్గర్లోని పర్యాటక ప్రాంతాలను చూపించడానికి వీలుగా గైడ్ సదుపాయం కూడా బుక్ కెఫే కల్పిస్తోంది. గైడ్ లకు స్థానిక పరిస్థితులతోపాటు విదేశీ భాషలు కూడా బాగా వస్తాయి. దీంతో ఒకసారి ఈ రెస్టోరెంట్ కు వచ్చిన వారు మరళా మరళా ఇక్కడికే వస్తుంటారు.

10. నూతన జీవితం...

10. నూతన జీవితం...

Image source:


ఖైదీలు ఎల్లకాలం జైలులోనే ఉండిపోకుండా వారికి కొంత స్వేచ్ఛ ఇవ్వాలన్న ఉద్దేశంతో స్థానిక ప్రభుత్వం మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలను గుర్తించి వారికి ఈ విధమైన సదుపాయం కల్పిస్తోంది. ఈ హోటల్ నిర్వాహనకు ఎంపిక చేసినప్పుడు మా ఆనందం మాటల్లో చెప్పడానికి వీలుకాలేదని ఇక్కడ పనిచేస్తున్న ఖైదీ ఒకరు తెలిపారు. అన్నట్టు స్థానిక పర్యాటక శాఖ వీరి శిక్షణకు అవసరమై అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోంది.

11. రూ.20 లక్షల వ్యయం చేసి

11. రూ.20 లక్షల వ్యయం చేసి

Image source:


దాదాపు రూ.20 లక్షల వ్యయంతో 40 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ రెస్టోరెంట్ను నిర్మించారు. ఇక్కడ ఖైదీలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ విధులు నిర్వర్తించి తరువాత దగ్గర్లోని జైలుకు వెళ్లిపోతారు. 24 గంటలూ జైలులోనే కాకుండా ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసి అందుకు తగ్గట్టు వేతనం పొందడం బాగుందని ఖైదీలు చెబుతున్నారు. సింమ్లా రైల్వేస్టేషన్ నుంచి 7.5 కిలోమీటర్ల దూరంలోని ఈ రెస్టోరెంట్ కు వెళ్లడం మరిచిపోకండి. అన్నట్టు ఏ ట్యాక్సీ డ్రైవర్ ను అడిగినా బుక్ కెఫె కు నేరుగా తీసుకుని వెలుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X