Search
  • Follow NativePlanet
Share
» »ఈ శ్రీ కృష్ణుడి దేవాలయానికి వెలితే చావు ఖచ్చితం?

ఈ శ్రీ కృష్ణుడి దేవాలయానికి వెలితే చావు ఖచ్చితం?

బృందావన్ లో ఉన్న రహస్య ప్రాంతం నిధివన్ గురించి కథనం.

భారత దేశంలో ఎన్నో రహస్య ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. అందులో కొన్ని పురాణ ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలూ ఉన్నాయి. వాటి రహస్యాన్ని ఎంత ప్రయత్నించినా ఛేదించడానికి వీలు కావడం లేదు. మరికొంతమంది ఈ రహస్యాన్ని ఛేదించాలని ప్రయత్నించి తమ ప్రాణాలను కూడా పోగొట్టుకొన్నారు. సాధారణంగా ఉదయం, సాయంత్రం దేవాలయాల దర్శనం సామాన్యం. అయితే సూర్యాస్తమయం తర్వాత మాత్రం ఒక శ్రీ శ్రీ కృష్ణుడి దేవాలయానికి వెలితే చావు ఖచ్చితం అని చెబుతారు. అందుకు గల కారణాలు మాత్రం నిఘూడ రహస్యం. అయితే ఆ దేవాలయం ఎక్కడ ఉంది. ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలి తదితర వివరాలు మీ కోసం....

ఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయి.ఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయి.

అక్టోబర్ లో హాయి హాయిగా కర్నాటకను ఇలా చుట్టేదాంఅక్టోబర్ లో హాయి హాయిగా కర్నాటకను ఇలా చుట్టేదాం

కృష్ణుడి దేవాలయం

కృష్ణుడి దేవాలయం

P.C: You Tube

భారత దేశంలో అత్యంత రహస్యమైన ప్రాంతాల్లో శ్రీ కృష్ణుడి దేవాలయం కూడా ఉంది. అదే నిధివన్. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడి, రాధాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఈ నిధివన్.

సూర్యాస్తమయం తర్వాత

సూర్యాస్తమయం తర్వాత

P.C: You Tube

అయితే ఈ నిధివన్ కు సూర్యాస్తమయం తర్వాత ఇక్కడికి వెళ్లకుండా ఉండటానికి గల కారణాలను ఏమిటన్న విషయం ఇప్పుటు తెలుసుకొందాం.

ప్రణయ సంబంధం

ప్రణయ సంబంధం

P.C: You Tube

ద్వారపర యుగంలో శ్రీ శ్రీ కృష్ణుడికి రాధకు ఉన్న ప్రణయ సంబంధం గురించి మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ రాధా కృష్ణులిద్దరూ ఇప్పటికీ నిధివన్ కు రోజు వస్తుంటారని చెబతారు.

బృందావన్ అనే చిన్న పట్టణంలో

బృందావన్ అనే చిన్న పట్టణంలో

P.C: You Tube

ఆ నిధివన్ ఉత్తర ప్రదేశ్ లోని మధు జిల్లాలో ఉన్న బృందావన్ అనే చిన్న పట్టణంలో ఉంది. ఈ నిధివన్ లో ప్రతి రోజూ రాత్రి ఆ రాధా కృష్ణులిద్దరూ చేరి రాస క్రీడల్లో మునిగి పోతారని చెబుతారు.

గోపికలు కూడా

గోపికలు కూడా

P.C: You Tube

అంతేకాకుండా ఆ సమయంలో గోపికలు కూడా చేరుతారని చెబుతారు. అందువల్లే సూర్యాస్తమయం తర్వాత నిధివన్ ప్రవేశ ద్వారంతోనే కాకుండా అక్కడ ఉన్న దేవాలయంలోకి ఎవ్వరినీ ప్రవేశింపచేయరు.

జంతువులు, పక్షులు కూడా

జంతువులు, పక్షులు కూడా

P.C: You Tube

ఈ ప్రదేశానికి సూర్యస్తమయం తర్వాత మనుష్యులే కాదు జంతువులు, పక్షులు కూడా ప్రవేశించవు. సాధారణంగా ఈ ప్రాంతంలో ఉదయం సమయంలో కోతులు, చిలుకలు ఎక్కువగా ఉంటాయి.

ఒక్కరూ కూడా ఉండరు

ఒక్కరూ కూడా ఉండరు

P.C: You Tube

అయితే సూర్యాస్తమయం తర్వాత ఒక్కరూ కూడా ఉండరు. ఈ ప్రదేశాన్ని ఆ నల్లనయ్య ఏకాంత ప్రదేశంగా గుర్తించారు. ఆ పరమాత్ముడి రక్షణ భటులు అశరీర రూపంలో నిత్యం ముఖ్యంగా సూర్యస్తమయం తర్వాత ఇక్కడ కాపాలా కాస్తుంటారని చెబుతారు.

చావు ఖచ్చితమని

చావు ఖచ్చితమని

P.C: You Tube

అందువల్లే సూర్యాస్తమయం తర్వాత ఎవరు ఇక్కడికి వెళ్లినా చావు ఖచ్చితమని స్థానిక ప్రజలు చెబుతూ ఉంటారు. కొంతమంది రాత్రి సమయంలో ఈ నిధివన్ లో ఏమి జరుగుతోందన్న కుతూహలంతో పరిశోధనలు చేయడానికి వెళ్లి చనిపోయారు.

కిటికీలను కూడా

కిటికీలను కూడా

P.C: You Tube

మరికొంతమంది బుద్ధిమాంధులయ్యారు. అందువల్లే కొద్ది సంత్సరాలుగా ఈ నిధివన్ లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఈనిధివన్ చుట్టు పక్కల ఉన్నవారు కూడా రాత్రి సమయంలో ఆ నిధివన్ వైపు ఉన్న కిటికీలను మూసివేస్తారు.

ద్వారం కూడా ఉండదు

ద్వారం కూడా ఉండదు

P.C: You Tube

అంతేకాకుండా ఆ వైపునకు ఏ ఇంటి ద్వారం కూడా ఉండదు. ఈ నిధవన్ చుట్టు పక్కల ఉన్నవారికి రాత్రి సమయంలో వేణునాదం, గజ్జెల శబ్ధం వినిపిస్తుందని స్థానికులు చెబుతుంటారు.

రావణుడు స్వర్గానికి సోపానాలు నిర్మించడానికి ఎంపిక చేసుకున్న స్థలాలు ఇవేరావణుడు స్వర్గానికి సోపానాలు నిర్మించడానికి ఎంపిక చేసుకున్న స్థలాలు ఇవే

హరిదాస్

హరిదాస్

P.C: You Tube

ఈ నిధివన్ ప్రాంతంలో స్వామి హరిదాస్ అనే భక్తుదు ఆ రాధా కృష్ణులిద్దరి గురించి తపస్సు చేశాడని చెబుతారు. ఆయన తపస్సుకు మెచ్చి ఆ రాధా కృష్ణులిద్దరూ ప్రత్యక్షమయ్యారని చెబుతారు.

రంగమందిరం

రంగమందిరం

P.C: You Tube

దీంతో ఆయన ఇక్కడ ఓ దేవాలయాన్ని కూడా నిర్మించారు. దీనినే రంగ మహల్ అని కూడా పిలుస్తారు. రాత్రి సమయంలో ఇక్కడకు వారిద్దరూ ఏకాంతంగా గడపడానికి వస్తారని చెబుతారు.

మంచెం, వెండి గ్లాసులో పాలు

మంచెం, వెండి గ్లాసులో పాలు

P.C: You Tube

అందువల్లే ఈ దేవాలయంలో ఓ పట్టె మంచెం, ఓ వెండి గ్లాసు నిండా పాలను, తీపి పదార్థాలను, రాగి చెంబు నిండా నీళ్లు, పళ్లుతోముకోవడానికి రెండు వేప పుల్లలు, అంకరణ సామానులు ఆ దేవాలయంలో ఉంచి రాత్రి ద్వారానికి తాళాలు వేస్తారు.

అవన్నీ చెల్లాచెదురుగా

అవన్నీ చెల్లాచెదురుగా

P.C: You Tube

మరుసటి రోజు ఆ దేవాలయంలో ఆ వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఉంటాయి. అంతేకాకుండా రాగి చెంబులో నీరు అర్థానికి మాత్రమే ఉంటుంది. వేప పుల్లలు కూడా విగిరిపోయి ఉంటాయి.

కారణాలు

కారణాలు

P.C: You Tube

తీపి పదర్థాలు ఎవరో తిన్నట్లు ఉంటాయి. అంతేకాకుండా రాధ ధరించే వస్తువులన్నీ చెల్లాచెదరుగా పడి ఉంటాయి. ఇందుకు గల కారాణాలు మాత్రం రహస్యంగా ఉన్నాయి.

గోపికలు

గోపికలు

P.C: You Tube

అంతేకాకుండా ఈ నిధివన్ లో ఉన్న చెట్లు గోపికలుగా మారి నాట్యం చేస్తాయని చెబుతారు. అయితే ఆ చెట్లు ఉదయం ఎథాస్థితికి చేరుకొంటాయని చెబుతారు. ఇందుకు గల కారణాలు మాత్రం ఎవరూ వివరించడం లేదు.

విశాఖ బావి

విశాఖ బావి

P.C: You Tube

ఈ వనంలో ఒక బావి ఉంది. దీనిని విశాఖ బావి అని అంటారు. ఆ నల్లనయ్య జతలో నాట్యం చేసే సమయంలో విశఆఖ అనే గోపికకు దాహం వేస్తే ఆమె దాహం తీర్చడానికి శ్రీ క`ష్ణ పరమాత్ముడు ఈ బావిని ఏర్పాటు చేశారని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X