Search
  • Follow NativePlanet
Share
» »నిలంబూర్ : అందమైన 'టేకు చెట్ల భూమి' కి ప్రయాణం !

నిలంబూర్ : అందమైన 'టేకు చెట్ల భూమి' కి ప్రయాణం !

By Mohammad

నిలుంబూర్ కేరళ రాష్ట్రంలోని చిన్న పట్టణం. ఉత్తర కేరళలోని మలప్పురం జిల్లాలోని మలప్పురం నగరం నుండి 40 కిలోమీటర్ల దూరంలో, తిరువనంతపురం నుండి 385 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. విశాలమైన అడవులు, జలపాతాలు, ప్రకృతి సౌందర్యం, రాజభవనాలు ఈ ప్రాంతానికి మలాబార్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాయి.

ఇది కూడా చదవండి : మలప్పురం - కేరళలోని మలాబార్ ప్రాంతం !

నిలంబూర్ లో టేకు చెట్లు అధికం. ప్రపంచంలోనే నాణ్యత గల టేకు వృక్షాలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పురాతన టేకు తోట అయిన కొనీలీ ప్లాట్ నిలంబూర్ లో కలదు. ఇది పట్టణం నుండి కేవలం 2 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ గిరిజన వాసులు ఆవాసాలు ఏర్పరుచుకొని జీవిస్తుంటారు. ఈ ప్రాంతం అంతా టేకు చెట్లతో నిండి ఉంటుంది కాబట్టే దీనిని 'టేకు చెట్ల భూమి' గా అభివర్ణిస్తుంటారు.

ప్రపంచంలో కెల్లా తొలి టేకు మ్యూజియం కూడా నిలుంబూర్ లో కలదు. ప్రతి ఏటా వేల సంఖ్యలో దేశ, విదేశాల నుండి యాత్రికులు వచ్చి ఈ మ్యూజియాన్ని సందర్శిస్తుంటారు. ఇంకా ఇక్కడ ఏమేమి చూడవచ్చో, ఎక్కడెక్కడికి వెళ్ళి ఆనందించవచ్చో ఒకసారి గమనిస్తే ..

నిలంబూర్ ఎలా చేరుకోవచ్చు ?

నిలంబూర్ ఎలా చేరుకోవచ్చు ?

నిలుంబూర్ చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

నిలంబూర్ కు సమీపాన 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయం కాలికాట్ అంతర్జాతీయ విమానాశ్రయం. అలాగే సమీపాన కోయంబత్తూర్ లో పీలమేడు విమానాశ్రయం కలదు. ఇది 85 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయాల నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లను అద్దెకు తీసుకొని గంట లేదా గంటన్నారా లో చేరుకోవచ్చు.

చిత్ర కృప : SAM OMAN

నిలంబూర్ ఎలా చేరుకోవచ్చు ?

నిలంబూర్ ఎలా చేరుకోవచ్చు ?

రైలు మార్గం

నిలంబూర్ లో రైల్వే స్టేషన్ కలదు. తిరువనంతపురం, కొట్టాయం, కొచ్చి, త్రిసూర్ వంటి పట్టణాల నుండి తరచూ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. రైళ్లో ప్రయాణించే యాత్రికులు మొదట కాలికాట్ చేరుకొని అక్కడి నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సుల్లో ప్రయాణించడం ఉత్తమం.

చిత్ర కృప : Pramodh K

నిలంబూర్ ఎలా చేరుకోవచ్చు ?

నిలంబూర్ ఎలా చేరుకోవచ్చు ?

రోడ్డు మార్గం

కాలికాట్, పాలక్కాడ్, తిరువనంతపురం, కొచ్చి, కోయంబత్తూర్, కొట్టాయం నుండి నిలంబూర్ కు చక్కటి బస్సు సదుపాయం కలదు. మలప్పురం నుంచైతే చెప్పనవసరం లేదు ఎన్నో ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నిత్యం ప్రతి 20 నిమిషాలకోసారి నిలంబూర్ పట్టణానికి బయలుదేరుతుంటాయి.

చిత్ర కృప : Noushad EK

కొనోలీ ప్లాట్

కొనోలీ ప్లాట్

నిలంబూర్ లో మొదట చూడవలసినది కొనోలీ ప్లాట్. ఇది పట్టణం నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో కలదు. బ్రిటీష్ కాలంలో పనిచేసే కలెక్టర్ హెచ్. వి. కనోలీ పేరు మీద ఈ తోట కి ఆ పేరు వచ్చింది.

చిత్ర కృప : Vengolis

కొనోలీ ప్లాట్

కొనోలీ ప్లాట్

కొనోలీ ప్లాట్ లో ప్రధాన ఆకర్షణ అతి పురాతనమైన టేకు వృక్షం కన్నిమరి. ఇది సుమారు 2.31 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్రమించినది. దానిని చూస్తే బహుశా ప్రపంచంలోనే అతి పొడవైన, పెద్దదైన టేకు వృక్షం ఇదే కాబోలు ..! అనిపిస్తుంది.

చిత్ర కృప : Satheesh Kunjappan

చలియూర్ నది

చలియూర్ నది

అరువకోడ్ వద్ద ఉండే చలియూర్ నది యాత్రికులు సందర్శించటానికి అనువైన ప్రాంతం. నదిలో విహరించటానికి దేశీయ పడవలు లభ్యమవుతాయి. వాటిలో విహరిస్తూ చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలను తనివితీరా చూడవచ్చు. ఊరిలోకి వెళితే షాపింగ్ కూడా చేయవచ్చు.

చిత్ర కృప : jksigns

టేకు మ్యూజియం

టేకు మ్యూజియం

నిలంబూర్ పట్టణం నుండి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో, నిలంబూర్ - గడలూరు వెళ్లే మార్గంలో ప్రపంచంలోనే తొలి టేకు మ్యూజియం ఉన్నది. ఇది రెండంతస్తుల భవనం. భవంతి ప్రవేశ ద్వారం నుండి బయటకు వెళ్లే ద్వారం వరకు టేకు కు సంభంధించిన విస్తృతమైన సమాచారాన్ని పర్యాటకులకు అందిస్తుంది.

చిత్ర కృప : Vengolis

నెడుం కాయం

నెడుం కాయం

నెడుం కాయం పట్టణం(నిలంబూర్) నుండి 18 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సౌందర్యాలకు నిలయంగా ఉన్నది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ బ్రిటీష్ వారు కలపతో నిర్మించిన రెస్ట్ హౌస్. ఈ రెస్ట్ హౌస్ నుండి పరిసరాలలోని ప్రకృతి పచ్చదనాన్ని, జంతుజాలాన్ని వీక్షించవచ్చు.

చిత్ర కృప : Noushad EK

నెడుం కాయం

నెడుం కాయం

నెడుం కాయం లోనే చూడవలసిన మరొక ప్రధాన ఆకర్షణ ఏనుగుల మచ్చిక శిబిరం. ఈ శిబిరానికి ప్రతి ఏటా వేలాది యాత్రికులు వస్తుంటారు. వీలుంటే మీరు ఏనుగులను మచ్చిక చేసుకోండి.

చిత్ర కృప : Scott Hanko

ఫారెస్ట్ జోన్

ఫారెస్ట్ జోన్

నెడుం కాయం సమీపంలోని ఫారెస్ట్ జోన్ లోనికి ప్రవేశించాలంటే అక్కడి అటవీ అధికారుల అనుమతి తప్పనిసరి. అటవీ క్షేత్రంలో ఏనుగులు, పులులు, కుందేళ్ళు, జింకలు, ఎలుగుబంట్లు వంటి ఎన్నో రకాల జంతు జాలాన్ని, పక్షులను ఓపెన్ టాప్ జీపుల్లో ప్రయాణించి చూడవచ్చు.

చిత్ర కృప : Shiyas Ahamed

వెల్లంతోడ జలపాతం

వెల్లంతోడ జలపాతం

వెల్లంతోడ ఒక కొండ ప్రాంతం. ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. సాహసాలు చేసేవారిని, ప్రేమికులని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇక్కడి నుండి చుట్టూ ఉన్న పరిసరాలని, జలపాతాల సోయగాలను వీక్షించవచ్చు. నిలంబూర్ నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి అరికోడ్ - ముక్కం రహదారి లో కోజికోడ్ మీదుగా చేరుకోవచ్చు.

చిత్ర కృప : Muneef Hameed

కోవిలకోమ్

కోవిలకోమ్

పురాతన కాలంలో నిలంబూర్ రాజులు, పాలకులు కోవిలకోమ్ లో ఉండేవారు. ఇక్కడి భవంతి నిర్మాణాల్లో అందంగా మలిచిన చెక్క పనితానాన్ని చూడవచ్చు. నేలపై చిత్రాలను ముగ్గులతో గీయటం వంటి డ్రాయింగ్ కాంపిటీషన్ ప్రతి ఏటా ఫిబ్రవరి లో నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనటానికి స్థానికులు, యాత్రికులు ఆసక్తిని కనబరుస్తారు.

చిత్ర కృప : Kalari Kovilakom

అడ్యన్ పర జలపాతం

అడ్యన్ పర జలపాతం

నిలంబూర్ పట్టణం నుండి 12 కిలోమీటర్ల దూరంలో, నిలంబూర్ - ఊటీ జాతీయ రహదారి పక్కన కుర్మబాల౦గోడ్ గ్రామంలోని ఒక అద్భుతమైన జలపాతం అడ్యన్ పర జలపాతం. ఈ జలపాతం దాని సుందర పరిసరాలు, పచ్చదనం, రాళ్ళకు ఎంతో ప్రసిద్ది.

చిత్ర కృప : Sidheeq

అడ్యన్ పర జలపాతం

అడ్యన్ పర జలపాతం

రాళ్ల మధ్య నుండి కిందకు పారిన తర్వాత అడ్యన్ పర జలపాతం సందర్శకులను ఆకర్షించే ఒక చిన్న సెలయేరుగా మారుతుంది. ఈ జలపాతం అందమైన దృశ్యాలతో ఒక రోజు పర్యటనకు, కుటుంబ విహార యాత్రకు సరైన ప్రదేశం.

చిత్ర కృప : Sidheeq

కేంద్రీయ అటవీ నర్సరీ

కేంద్రీయ అటవీ నర్సరీ

నిలంబూర్ పట్టణానికి దగ్గరలోని కేంద్రీయ అటవీ నర్సరీ లో టేకు, అకేశియా, యూకలిప్టాస్ వంటి ఉన్నత వర్గానికి చెందిన మొక్కలు ఉన్నాయి. సెంట్రల్ ఫారెస్ట్ నర్సరీ కేరళలో ఏర్పాటుచేసిన 4 నర్సరీలలో ఇది కూడా ఒకటి. నర్సరీలంటే ఇష్టపడేవారు సమయముంటే ఈ నర్సరీను సందర్శించండి.

చిత్ర కృప : Vengolis

ఎలంబలై కొండ

ఎలంబలై కొండ

కేరళ - తమిళనాడు సరిహద్దులలోని ఎలంబలై కొండలు, ప్రకృతి ప్రేమికులు, వన్య ప్రాణి ఔత్సాహికులకు ఒక ప్రముఖ గమ్యస్థాన౦. నిలంబూర్ కు దగ్గరగా ఉన్న ఈ కొండ కు రోడ్డు ద్వారా సులభంగా చేరవచ్చు. ఏనుగులు, జింకలు, నీలి కోతులు, దున్నలు, ఎలుగుబంట్లు, అడవి పిల్లులు ఉన్న ఈ ప్రాంతం వన్యప్రాణి ప్రేమికులను ఆకర్షిస్తున్నది.

చిత్ర కృప : jksigns

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X