Search
  • Follow NativePlanet
Share
» »హనీమూన్ రైలులో వెలుతూ...బాహుబలి దున్నలను చూస్తూ

హనీమూన్ రైలులో వెలుతూ...బాహుబలి దున్నలను చూస్తూ

నీలగిరి మౌంటైన్ రైల్వే లైను విషయానికి సంబంధించి

నీలగిరి ప్రకతి సోయగాలకు నెలవు. కనుచూపుమేర పచ్చటి రంగేసినట్లు ఉండే ఈ పర్వత శిఖరం పైకి క్వీన్ నీలగిరిలో వెళ్లడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్వీన్ నీలగిరిలో ప్రయాణమంటే ప్రకతి ఒడిలో పరవశించడమే. దశాబ్దాల చరిత్రకు, అద్భుత ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నీలగిరి మౌంటైన్ రైల్వే (ఎన్ ఎం ఆర్) నిలుస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

నీలగిరి మౌంటైన్ రైల్

నీలగిరి మౌంటైన్ రైల్

P.C: You Tube

భారత దేశం మొత్తం మీద మూడంటే మూడు మౌంటైన్ రైల్వే లైన్లు ఉన్నాయి. అందులో ఎన్ ఎం ఆర్ ఒకటి. అంతేకాదు ఈ నీలగిరి మౌంటైన్ రైల్వే లైన్ ఏకైక రాక్ అండ్ పినియన్ మార్గం కూడా. అంటే రైలు కొండలు ఎక్కేటప్పుడు వాలులో వెనక్కి జారిపోకుండా ఈ సాకేతిక పరిజ్జానం చూస్తుంది.

నీలగిరి మౌంటైన్ రైల్

నీలగిరి మౌంటైన్ రైల్

P.C: You Tube
తమిళనాడులోని మెట్టుపళయం వద్ద ప్రారంభమైన ఈ రైలు 46 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఊటిని చేరుతుంది. సముద్ర మట్టానికి మెట్టుపళయం 1,000 అడుగుల ఎత్తులో ఉంటే ఊటీ మాత్రం సముద్ర మట్టానికి దాదాపు 7వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.

నీలగిరి మౌంటైన్ రైల్

నీలగిరి మౌంటైన్ రైల్

P.C: You Tube
తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లోని ఈ క్వీన్ నీలగిరి రైలు తన ప్రయాణంలో 250 వంతెనలు, 108 వంపులు, 16 సొరంగాల ద్వారా తన ప్రయాణం కొనసాగిస్తుంది. తమిళనాడులోని నీలగిరి కొండలు ఆకుపచ్చని అందాలకే కాదు, ఆహ్లాదకరమైన వాతావరణానికి కూడ ఎంతో పేరుగాంచాయి.

నీలగిరి మౌంటైన్ రైల్

నీలగిరి మౌంటైన్ రైల్

P.C: You Tube
దీంతో అప్పట్లో బ్రిటీష్ వారు ఈ నీలగిరి పర్వత ప్రాంతాలకు వేసవి తాపం తీర్చుకునేందుకు వెళ్లేవారు. అయితే రవాణా సౌకర్యం అంతగా ఉండేది కాదు. దీంతో అప్పటికే కోయంబత్తూర్ దగ్గరగా ఉండే మెట్టుపళయం వరకూ ఉన్న రైలుమార్గాన్ని ఊటీకి దగ్గరగా ఉండే కన్నూర్ వరకూ విస్తరించాలని 1854లో ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

నీలగిరి మౌంటైన్ రైల్

నీలగిరి మౌంటైన్ రైల్

P.C: You Tube
కష్టసాధ్యమైన ఈ మార్గంలో రైలు మార్గం నిర్మించడానికి దాదాపు 45 ఏళ్లు పట్టింది. మొదటిసారిగా క్రీస్తుశకం 1899 జూన్ 15న మెట్టుపాళయం నుంచి కన్నూర్ మధ్య నీలగిరి మౌంటైన్ రైల్వే సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత క్రీస్తుశకం 1908లో కన్నూర్ నుంచి ఊటీ వరకూ ఈ సేవలను విస్తరించారు.

నీలగిరి మౌంటైన్ రైల్

నీలగిరి మౌంటైన్ రైల్

P.C: You Tube
ఈ మార్గంలో అడుగడుగునా అప్పటి గుర్తులు కనిపిస్తాయి. స్టీమ్ ఇంజిన్, ఐరోపా తరహా రైలు బోగీలు, మీటర్ గేజ్ ట్రాక్, ఐరోపా నిర్మాణ శైలి, అలనాటి వంతెనలు ఇలా ఎన్నో. నాటి రైల్వే స్టేషన్లు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయంటే వాటి నిర్మాణంలో అనుసరించిన నాణ్యతను అర్థం చేసుకోవచ్చు.

నీలగిరి మౌంటైన్ రైల్

నీలగిరి మౌంటైన్ రైల్

P.C: You Tube
పచ్చని ప్రక`తిలో ఆకాశాన్ని తాకే పర్వతాల మధ్య మబ్బులను ముద్దాడుతూ సాగిపోయే ఈ రైలులో ప్రయాణం ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతుంది. హనీమూన్ కోసం ఊటీకి వచ్చే జంటలు, ప్రేమికులు ఈ రైలులో ప్రయాణిస్తుంటారు. అందువల్లే దీన్ని హనీమూన్ ట్రైన్ అని కూడా అంటారు.

నీలగిరి మౌంటైన్ రైల్

నీలగిరి మౌంటైన్ రైల్

P.C: You Tube
నీలగిరి అడువులు అనేక వన్యప్రాణులకు ఆలవాలం. చిరుత పులులు, అడవి దున్నలు, ఏనుగులు ఇలా ఎన్నో జీవులు ఇక్కడ ఉంటాయి. దేశ సినీచరిత్రను తిరగరాసిన బాహుబలి సినిమాలో భళ్లాల దేవుడు పోరాడే అడవి దున్నాల్లాంటివి ఇక్కడ చాలా కనిపిస్తాయి. ఏడాదికి దాదాపు 6 లక్షల మంది ఈ రైలు ద్వారా ప్రయాణం చేస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X