Search
  • Follow NativePlanet
Share
» »జగన్నాథ ఆలయం - ఆసక్తికర విషయాలు !

జగన్నాథ ఆలయం - ఆసక్తికర విషయాలు !

By Mohammad

దేశంలో పూరీ కి విశిష్టమైన ప్రాముఖ్యత ఉన్నది కారణం అక్కడున్న జగన్నాథుని ఆలయం. ఈ ఆలయం ఎప్పటిదో ... ఎప్పుడు వెలసిందో ఖచ్చితమైన ఆధారాలు లేవు. తొలుత దీన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు నిర్మించారని కొంతమంది భావన. కాదు కాదు దీన్ని 12 వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగదేవ్ కట్టించారని మరికొందరి భవన. ఎవరెన్ని చెప్పుకున్నా ఆలయం మాత్రం ప్రాచీనమైనదే. దీని గురించి విష్ణు పురాణంలో పేర్కొనటం జరిగింది.

జగన్నాథుని ఆలయం (పూరీ) భారతదేశ తూర్పు భాగంలోని ఓడిశా రాష్ట్రంలో కలదు. రాష్ట్ర రాజధానైన భువనేశ్వర్ నుండి ఇది 60 కి. మి. దూరంలో ఉంది. పూరీ సమీపంలోనే బంగాళాఖాతం సముద్రం పర్యాటకులతో, స్థానికులతో సందడి చేస్తుంటుంది. చూడటానికి ఏవైనా ఉన్నాయా ? అంటే .. ఆలయాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణీయ స్థలాలు. ఇవేకాక పిప్లి గ్రామం (హస్తకళ లకు ప్రసిద్ధి), పూరీ బీచ్ చూడదగ్గవిగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : ఓడిశా - సందర్శనీయ స్థలాలు !

అసలు విషయానికి గనక వస్తే, జగన్నాథుని ఆలయం గురించి ఇటీవల కొంత మంది పరిశోధకులు, ఆధ్యాత్మిక వేత్తలు, తత్వ భోధకులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అవేంటివో తెలుసుకొనే ముందు అందరూ ఒక్కసారిగా 'జై జగన్నాథా' అంటూ నినదించండి.

మొదటిది

మొదటిది

పూరీ జగన్నాథ ఆలయం నీడ ఏ సమయంలోనూ కనిపించదు.

చిత్ర కృప : Abhishek Barua

రెండవది

రెండవది

ఏడు మట్టి పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టి వంట చేస్తారు. ముందుగా పైన ఉండే మట్టి పాత్ర వేడి అవుతుంది. ఆతరువాత ఒకదానికొకటి వేడవుతూ చివరగా, అడుగున ఉన్న మట్టి పాత్ర వేడవుతుంది.

చిత్ర కృప : Yuv103m

మూడవది

మూడవది

ఆలయం మీద ఉన్న సుదర్శన చక్రాన్ని మీరు పూరీ లో ఎక్కడినుంచైనా, ఎటు వైపునుంచైనా చూస్తే, చక్రం మీ వైపే చూస్తున్నట్లు ఉంటుంది.

చిత్ర కృప : Srikanta Mahapatra

నాల్గవది

నాల్గవది

పక్షులు, విమానాలు పూరీ జగన్నాథుని ఆలయం మీద నుంచి వెళ్ళవు.

చిత్ర కృప : Loveless

ఐదవది

ఐదవది

ఇదివరకే చెప్పానుగా ..! ఈ ఆలయం ప్రాచీనమైనదని. ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే కట్టించినట్లు, వేదాల ఏండ్ల చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు.

చిత్ర కృప : Bernard Gagnon

ఆరవది

ఆరవది

ఇక్కడ చెప్పుకోవలసినది ప్రసాదం / నైవేద్యం. 64 రకాల పిండివంటలతో స్వామివారికి నైవేద్యం పెడతారు. రోజూ వేలమంది భక్తులు స్వామీ వారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు.

చిత్ర కృప : Yuv103m

ఏడవది

ఏడవది

ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్ని 20 లక్షల మందికి పెట్టవచ్చట. ఆయినా సరే ప్రసాదం వృధా కాదు, తక్కువా కాదు.

చిత్ర కృప : Yuv103m

ఎనిమిదవది

ఎనిమిదవది

దేశంలోని ఏడు మోక్షదాయక క్షేత్రాలలో పూరీ ఒకటి. మత్స్య, స్కంద, విష్ణు, వామన పురాణాల్లో ఈ క్షేత్రం గురించి వివరించారు.

చిత్ర కృప : William Henry Cornish

తొమ్మిదవది

తొమ్మిదవది

పూరీ జగన్నాథుని ఆలయం లోపల 120 ఆలయాలు ఉన్నాయట ..!

చిత్ర కృప : Suresh Kumar

పదవది

పదవది

పూరీ కి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉందని తెలుసుకదా ..! ఆ సముద్ర ఘోష (శబ్దం) కూడా ఇక్కడ వినిపించదట. ఆలయ సింహ ద్వారం (ప్రధాన ద్వారం) ప్రవేశం వరకు సముద్ర ఘోష వినిపిస్తుంది. అది దాటి లోనికి వెళితే శబ్దం వినిపించదు. బయటికి వస్తే ఆ శబ్దం మరళా వినిపిస్తుంది.

చిత్ర కృప : suvadeep ghosh

పదకొండవది

పదకొండవది

పూరీ ఆలయం సుమారు వెయ్యి ఎకరాల సువిశాల మైదానంలో ఉంటుంది. ఆలయ ప్రాగణం శంఖాన్ని పోలి ఉంటుంది. దాంతో ఈ ఆలయానికి శంఖ ఆలయం అన్న పేరొచ్చింది.

చిత్ర కృప : Aditya Mahar

పన్నెండవది

పన్నెండవది

ఆలయ గోపురం మీద ఉండే జెండా వీచే గాలికి ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే రెపరెపలాడుతుంది.

చిత్ర కృప : Partha Misra

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X