Search
  • Follow NativePlanet
Share
» »నవనందులు ... పాపహరణాలు !

నవనందులు ... పాపహరణాలు !

By Staff

 </a></strong><a href=కోహినూర్ వజ్రం గుంటూరు మారుమూల గ్రామంలో దొరికింది అని తెలుసా ? ఎలా దొరికిందో తెలుసా ?" title=" కోహినూర్ వజ్రం గుంటూరు మారుమూల గ్రామంలో దొరికింది అని తెలుసా ? ఎలా దొరికిందో తెలుసా ?" loading="lazy" width="100" height="56" /> కోహినూర్ వజ్రం గుంటూరు మారుమూల గ్రామంలో దొరికింది అని తెలుసా ? ఎలా దొరికిందో తెలుసా ?

శివాలయంలో శివునికి ఎదురుగా ఎవరుంటారు? నంది అవునా. అనుక్షణం శివుణ్ని అంటిపెట్టుకొని ఆరాధిస్తుంటాడాయన. అందుకే వారిద్దరి మధ్య నుంచి వెళ్ళకూడదని, నందిని పూజిస్తే సాక్షాత్తూ శివుని అనుగ్రహం పొందవచ్చని చెబుతారు. మన రాష్ట్రంలోని నవ నందులను దర్శిస్తే జన్మ జన్మల పాపాలు పోయి పుణ్యం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

పురాణాల ప్రకారం చూసినట్లయితే, శివుని కుటుంబం లో ఒక్కొక్కరికి ఒక్కో వాహనం ఉంటుంది. పార్వతి దేవి కి పులి, వినాయకునికి మూషికం, కుమారస్వామి కి నెమలి మరియు శివునికి నంది వాహనంగా ఉంటుంది. అన్నింటిలోకీ నంది ప్రత్యేకమైనది. నందిని పూజిస్తే పిల్లలు పుడతారనేది భక్తుల నమ్మకం. అలాంటి నంది మన రాష్ట్రంలో నవ నందుల రూపంలో కర్నూలు జిల్లాలో కొలువై ఉన్నాడు.

ఇది కూడా చదవండి : నల్లమల అడవిలో ఆధ్యాత్మిక యాత్రలు !

మహానంది నవ నంది క్షేత్రాలలో ఒకటి. మిగిలిన 8 క్షేత్రాలు మహానందికి చుట్టుపక్కల 15 - 20 కి.మీ ల పరిధిలో ఉన్నాయి. వీటన్నింటినీ ఒకే రోజులో ఉదయం నుండి సాయంత్రం లోపల దర్శించుకోవచ్చు. కార్లు కాకుండా, వీలైతే ఒక డీజిల్ ఆటో ను అద్దెకు (రూ. 600 వరకు ఉండవచ్చు) మాట్లాడుకోని ఈ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.

ప్రథమ నంది

ప్రథమ నంది

నందుల్లో మొదటిది ప్రథమ నంది. ఇది చామకాల్వ ఒడ్డున, నంద్యాల రైల్వే స్టేషన్ కు సమీపాన ఉంది. సూర్యాస్తమ సమయాల్లో(కార్తీక మాసంలో) నందీశ్వరుని మీద సూర్య కిరణాలు పడటం ఇక్కడ విశేషం.

చిత్ర కృప : Mohan Krishnan

నాగ నంది

నాగ నంది

నంద్యాల బస్ స్టాండ్ కు సమీపాన ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో నాగ నంది కొలువై ఉంటాడు. నాగులు గరుత్మంతుని ధాటికి తట్టుకోలేక ఇక్కడే శివుని కోసం తపస్సు చేశాడు.

చిత్ర కృప : Mohan Krishnan

సోమ నంది

సోమ నంది

సోమ నంది నంద్యాల కు తూర్పు వైపున (ఆల్మోస్ట్ నంద్యాల పట్టణానికి లోపల) జగజ్జనని ఆలయానికి సమీపంలో ఉంది. చంద్రుడు (సోముడు) ఈశ్వరుని కోసం ఇక్కడే తప్పసు చేసాడు.

చిత్ర కృప : Mohan Krishnan

సూర్య నంది

సూర్య నంది

సూర్య నంది నంద్యాల నుండి మహానందికి వెళ్లే మార్గంలో రోడ్డు పై ఉన్నది. సరిగ్గా చెప్పాలంటే నంద్యాల నుండి 4 కి. మీ. దూరం వెళితే యు. బొల్లవరం అనే గ్రామం వస్తుంది. అక్కడి నుంచి కుడి వైపు తిరిగి కిలోమీటరు దూరం వెళితే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. రోజూ సూర్యకిరణాలు లింగం పై పడటం ఇక్కడి విశేషం.

చిత్ర కృప : Mohan Krishnan

శివ నంది

శివ నంది

శివ నంది కూడా నంద్యాల నుండి మహానంది కి వెళ్లే మార్గంలో ఉంటుంది. నంద్యాల నుండి సుమారు 13 కి. మీ. దూరంలో తిమ్మవరం గ్రామం దాటినాక ఎడమవైపున ఉంటుంది. కడమల కాల్వా ల్యాండ్ మార్క్ గా చెప్పవచ్చు. ఇది మిగిలిన 8 నంది ఆలయాల కంటే పెద్దది. అరణ్యంలో ఉంటుంది కనుక ప్రశాంతంగా ఉంటుంది.

చిత్ర కృప : Mohan Krishnan

విష్ణు లేదా కృష్ణ నంది

విష్ణు లేదా కృష్ణ నంది

మహానంది రోడ్డు మార్గంలో, మహానంది ఇంకా రాకమునుపే 2 మైళ్ళ ముందర ఎడమ వైపు తిరిగితే తెలుగు గంగ కెనాల్ కనిపిస్తుంది. ఆ కెనాల్ ను ఆనుకొని ఉన్న మట్టి రోడ్డు గుండా 4 కి. మీ. వెళితే విష్ణు ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ శ్రీహరి శివుణ్ని ప్రార్ధించాడట. ఆలయంలోకి వచ్చి పోయే నీరు, పాలరాతి నంది విగ్రహం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.

చిత్ర కృప : Mohan Krishnan

గరుడ నంది

గరుడ నంది

నంద్యాల నుండి మహానందికి వెళ్ళటప్పుడు, మహానంది గుడికి ముందర కొద్ది దూరంలో ... పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని దాటితే గరుడ నందిని దర్శించుకోవచ్చు. గరుత్మంతుని తల్లి వినతాదేవి తను వెళ్ళే పనిలో ఎటువంటి ఆటకం కలగకుండా ఉండేందుకై పరమేశ్వరుణ్ణి ప్రార్ధించిన ప్రదేశమిది.

చిత్ర కృప : Mohan Krishnan

మహానంది

మహానంది

మహానంది లోనిది స్వయంభూలింగం. ఆలయంలోకి ప్రవేశించేముందు భక్తులు ఇక్కడి పవిత్ర కొలనులలో మునిగితేలుతారు. కొలను లోని నీరు 5 అడుగుల మేర లోతు ఉంటుంది. నీరు స్వచ్చంగా ఉండి, వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. సెలవు దినాల్లో, పండుగల సమయాల్లో జనం అధికంగా వస్తారు కాబట్టి మిగితా సమయాల్లో వెళితే బాగుతుంది.

చిత్ర కృప : sai sreekanth mulagaleti

వినాయక నంది

వినాయక నంది

వినాయక నంది చిన్న ఆలయం. ఇది మహానంది ఆలయానికి వాయువ్య దిక్కున ఉంటుంది. ఆలయ గోపురం దాటి బయటకు వచ్చిన తరువాత ఎడమ పక్కన, కోనేటి గట్టున ఉంటుంది. పూర్వం వినాయకుడు ఇక్కడ తపస్సు చేసినాడని వినికిడి.

చిత్ర కృప : Geeta Kulkarni

వసతి ... నంద్యాలలో

వసతి ... నంద్యాలలో

నంద్యాలలో ఉండటానికి లాడ్జీలు, హోటళ్లు అందుబాటులో ఉన్నాయి(12 - 15 వరకు హోటళ్లు ఉన్నాయి). మీ బడ్జెట్ ను బట్టి ఏసీ, నాన్- ఏసీ గదులను అద్దెకు తీసుకోవచ్చు.

చిత్ర కృప : Andhra Pradesh Tourism

మహానంది లో వసతి

మహానంది లో వసతి

కాదూ .. మహానందిలోనే వసతి కావాలంటే టిటిడి నిర్మించిన 28 గదుల సత్రంలో ఉండవచ్చు. అలాగే మహానంది దేవస్థానం నిర్మించిన 5 గదుల సత్రం, పాపిరెడ్డి కాటేజి, నాగనంది సదనంలో 25 గదులతో పాటు ఆర్యవైశ్య, బ్రాహ్మణ కులాలకు చెందిన వసతి గృహాలు వున్నాయి. వీటితో పాటు ప్రైవేట్ వసతి, టూరిజం అతిథి గృహాలు వున్నాయి.

ఫోన్ నెంబర్లు : దేవస్థానం కార్యాలయం - 08514 234726, 234727, 234728 పున్నమి అతిథి గృహం 9441733829

చిత్ర కృప : Andhra Pradesh Tourism

భోజనం

భోజనం

నంద్యాలలో అనేక భోజనశాలలు ఉన్నాయి. అక్కడ మీకు అన్ని రకాల టిఫిన్ లు, మీల్స్ అందుబాటు ధరల్లో లభిస్తాయి. మహానందిలో కూడా భోజన శాలలు, సత్రాలు, దేవస్థానం నిర్వహించే ఉచిత అన్నదానం అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : secretlondon123

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

నంద్యాలకు సమీపాన కడప విమానాశ్రయం 126 కి. మీ దూరంలో కలదు. 273 కి.మీ. దూరంలో శంషాబాద్ ఏర్ పోర్ట్ కూడా ఉన్నది. అక్కడి నుండి ప్రజారవాణా ద్వారా సమీప ప్రధాన బస్ స్టాండ్ లకు వెళ్ళి నంద్యాల చేరుకోవచ్చు.

రైలు మార్గం

నంద్యాల లో రైల్వే స్టేషన్ ఉన్నది. హైదరాబాద్, గుంతకల్(163 కి.మీ), బెంగళూరు, విజయవాడ, గుంటూరు, వైజాగ్(669 కి.మీ) ల నుండి నిత్యం రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం

హైదరాబాద్(296 కి.మీ), విజయవాడ(322 కి.మీ), గుంటూరు(286 కి.మీ), కడప(129 కి.మీ), తిరుపతి(269 కి.మీ), కర్నూలు(74 కి.మీ), బెంగళూరు(394 కి.మీ) నగరాల నుండి నంద్యాలకు ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు ఎల్లవేళలా తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Lakshman Thodla

ఉచిత సలహా

ఉచిత సలహా

నంద్యాల నుండి ఆటో లేదా ఏదేని ట్రావెల్ ను మాట్లాడుకోని 14 కి.మీ. దూరంలో ఉన్న మహానంది క్షేత్రం తో పాటుగా, మిగిలిన ఎనిమిది నందులను దర్శించుకోవచ్చు. నా ఉచిత సలహా ఏంటంటే, ట్రావెల్ కంటే ఆటోనే బెటర్. ఎందుచేతనంటే కొన్ని నందులు సందుల్లో ఉంటాయి, మరికొన్ని పల్లెటూర్లలో ఉంటాయి. అక్కడికి ఆటోలైతేనే వెళ్ళగలవు.

చిత్ర కృప : swarat_ghosh

మ్యాప్

మ్యాప్

నవ నందుల రూట్ మ్యాప్ పటం రూపంలో

చిత్ర కృప : Nsmohan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X