Search
  • Follow NativePlanet
Share
» »కడప లంకమల్ల అడవిలో దాగున్న నిత్య పూజ కోన క్షేత్రం !

కడప లంకమల్ల అడవిలో దాగున్న నిత్య పూజ కోన క్షేత్రం !

కొండల్లో, అడవుల్లో వెలసిన శివాలయాలకు వెళ్ళాలంటే భక్తులు ఉత్సాహం చూపుతారు. మరి అలాంటి ఒక క్షేత్రం గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ...!

కొండల్లో, అడవుల్లో వెలసిన శివాలయాలకు వెళ్ళాలంటే భక్తులు ఉత్సాహం చూపుతారు. మరి అలాంటి ఒక క్షేత్రం గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ...! కడప జిల్లా శివాలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడి కొండల్లో, కోనల్లో చాలావరకు శివుని ఆలయాలు కనిపిస్తాయి. అటువంటి కొండల్లో కోనల్లో వెలసినదే నిత్యపూజ కోన క్షేత్రం. చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పెద్ద పెద్ద కొండలు గుట్టల మధ్య ప్రయాణం ... ఇదీ నిత్యకోన కు వెళ్లే మార్గం లోని అనుభూతులు. దీనికి తోడు గలగల పారే జలపాతాలు, భారీ చెట్ల మధ్య లో సవ్వడులు చేసే సెలయెర్లు అక్కడి అందాలను మరింత పెంపొందించాయి. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుందో చెప్పలేదు కదూ ..! కడప జిల్లాలోని సిద్దవటం సమీపంలోని లంకమల్ల అడవిలో.

ఇది కూడా చదవండి : కడప - విభిన్న సంస్కృతుల నిలయం !

ఈ క్షేత్రానికి నిత్య పూజ కోన అనే పేరు రావటానికి కారణం అక్కడ దేవతలు స్వామిని నిత్యం పూజిస్తుంటారు కాబట్టి. కోరిన కోర్కెలను తీర్చే నిజమైన స్వామిగా పూజలందుకుంటున్న నిత్య పూజ స్వామి (శివుడు) లీలలు అంతా ఇంతా కావు. మరి ఆ లీలలు ఏంటి ?? అక్కడికి ఎలా వెళ్ళాలి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం ..!

చిత్ర కృప : మా రాయలసీమ

సిద్దవటం

సిద్దవటం

రవాణా మార్గం

కడప నుండి సిద్దవటం 33 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడి నుండి దట్టమైన అడవి మార్గాన వెళితే నిత్య పూజ కోన క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండ కింద ఉన్న పంచలింగాల వరకు బస్సులు, షేర్ ఆటోలు తిరుగుతుంటాయి. బస్సు మార్గంలో అయితే 12 కిలోమీటర్లు వెళ్ళవచ్చు. కడప నుండి ప్రతి సోమవారం ఒక ఆర్టీసీ బస్సు ఉన్నది.

నడక మార్గంలో కనిపించే సెలయేరు

నడక మార్గంలో కనిపించే సెలయేరు

నడక మార్గం

పంచలింగాల గుడి నుండి ప్రధాన గుడి వరకు కాలినడకన వెళ్ళాలి. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యన సాగే నడక మార్గం చాలా ఆహ్లాదకరంగా ఉండి, ట్రెక్కింగ్ ను తలపిస్తుంది.

జలపాతం

జలపాతం

నడక మార్గంలో ...

అలా మార్గం వెంబడి నడుచుకుంటూ వెళితే ముందుగా కనిపించేది అందమైన జలపాతం. భక్తులు ఆ జలపాతం లో స్నానాలు ఆచరించి నిత్య పూజయ్య స్వామి దర్శనానికి మెట్ల మార్గాన వెళతారు.

క్షేత్రం వద్ద భక్తులు

క్షేత్రం వద్ద భక్తులు

నిత్య పూజయ్య స్వామి

అలా చివరకు వెళ్ళిన తరువాత ఒకపక్క లోయ, మరో పక్క బండరాళ్ల కొండ కనిపిస్తుంది. దాని కింద నిత్య పూజయ్య స్వామి లింగం రూపంలో దర్శనం ఇస్తాడు. అలాగే కాస్త ముందుకు వెళితే ఒక గుహలో ఆవిర్భవించిన లింగం సాక్షాత్కరిస్తుంది. కానీ గుహలోకి వెళ్ళటమే పెద్ద కష్టం.

లింగ రూప దర్శనం

లింగ రూప దర్శనం

తపస్సు చేస్తూ ...

సాక్షాత్తూ శివుడే నిత్యానంద ఋషి అవతారమెత్తి కొండ సొరంగ మార్గంలోని గుహలో తపస్సు చేస్తూ శివలింగం గా మారినట్లు స్థానిక పూజారులు చెబుతారు. అలా లింగ రూపంలో మారిన స్వామి వారికి కొండ కింద ఉన్న అక్కదేవతలు నిత్యం పూజలు చేస్తూ వారి జీవితాలను అంకితం చేసారన్న భావన భక్తులలో లేకపోలేదు.

ప్రకృతి అందాలు

ప్రకృతి అందాలు

వానాకాలంలో ...

ఈ క్షేత్రంలో వారంలో ఒకరోజు (సోమవారం) అన్నదానం నిర్వహిస్తారు. క్షేత్రంలోని పరిసర ప్రకృతి అందాలు పర్యాటకులను, భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వానాకాలం అయితే చెప్పాల్సిన పనే లేదు నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్లాల్సివస్తుంది.

దారి

దారి

అక్కదేవతల కోన

ఇక్కడ చెప్పవలసినది మరొకటుంది అదే అక్కదేవతల కోన. నిత్య పూజయ్య స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కదేవతల కోన వెళ్ళటానికి ఒక దారి కూడా ఉన్నది.

 ఆలయం

ఆలయం

అక్కదేవతల కోన

దట్టమైన అడవి మధ్యలో ఉండే ఈ అక్కదేవతల కోన చుట్టూ పచ్చని చెట్లు, కొండలు ఉంటాయి. ఈ ప్రదేశంలోని ఒక చిన్న గుడిలో అక్కదేవత లు కొలువై ఉంటారు. వీరు నిత్యం స్వామిని కొలుస్తుంటారని ప్రతీతి.

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నడుచుకుంటూ వెళ్లే మార్గంలో కనిపించే కొండలు, గుట్టలు. చాలా జాగ్రత్తగా నుడుచుకుంటూ వెళ్ళాలి.

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నడక మార్గంలో కనిపించే రాళ్ళ, రప్పల దారి

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్య పూజ కోన క్షేత్రానికి నడక మార్గంలో చేరుకుంటున్న భక్తులు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్య పూజ కోన క్షేత్రానికి రాళ్లు, రప్పల మెట్ల మార్గంలో చేరుకుంటున్న భక్తులు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్య కోన వెళ్లే మార్గంలో కనిపించే సహజ ప్రకృతి సౌందర్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

రాళ్ళను దాటుకుంటూ పరవళ్ళు తొక్కుతున్న నీటి ప్రవాహం

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

స్వామియె శరణమయ్యప్ప ..!

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

జీపుల్లో, ఆటోల్లో ఇరుకైన దారి మార్గాన నిత్యపూజ కోన క్షేత్రానికి చేరుకుంటున్న భక్తులు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

జలపాతం వద్ద అయ్యప్ప స్వామి భక్తుల సందడి

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

మార్గానికి ఇరువైపులా ... పెద్ద పెద్ద ని చెట్లు, పచ్చని పొదలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

అడవి మార్గంలో కంటికి కనిపించే సహజ ప్రకృతి దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

కొండలు, పక్కనే మెట్ల మార్గం

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

అడవిలో కొండలు, గుట్టల మీద మొలకెత్తిన మొక్కలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

అంత పైకి చేరుకోవడం ఎలా ??

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

చెట్లతో కప్పబడిన లంకమల్ల అడవి ప్రాంతం

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

కొండ పై నుండి నడక దారి దృశ్యం

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

పైకి వెళ్లే మెట్ల మార్గం, పక్కనే ఓ చిన్న జలపాతం

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

పరవళ్ళు తొక్కుతున్న చిన్న నీటి ధార

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

క్షేత్రం పక్కనే సవ్వడులు చేస్తూ ప్రవహిస్తున్న సెలయేరు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నీటి దారో లేక నడక దారో మీరే చెప్పండి ..!

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

చెట్టుచేమలను పట్టుకుంటూ వెళ్లే దారి. ఏమాత్రం అ జాగ్రత్తగా ఉన్నా కింద పడతాం. ఇక్కడికి వెళ్ళాలంటే ఒక బృందం గా వెళ్ళాలి.

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

మార్గంలో కనిపించే నల్లని కొండ చరియలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

దట్టమైన అడవిలో చెట్ల మధ్యలో ప్రవహిస్తున్న నీటి ప్రవాహా దృశ్యం

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

నిత్యపూజ కోన వెళ్లే మార్గంలోని దృశ్యాలు

అచ్చం ఇలాంటిదే కర్నూలు జిల్లాలో కూడా ఒక క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రం పేరు ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి క్షేత్రం. ఇది అహోబిలం వద్ద ఉన్న దట్టమైన నల్లమల అడవుల్లో 20 - 30 కిలోమీటర్ల లోపల ఉన్నది. వర్షాకాలం వెళ్ళారా ?? అంతే ఇక మీ పని అయిపోయినట్టే ! ఈ క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

తిరుగు ప్రయాణంలో ...

తిరుగు ప్రయాణంలో ...

నిత్యపూజ కోన కి ఎలాగో వచ్చారు, చూశారు. ఇక తిరుగు ప్రయాణంలో సిద్దవటం మీదనే వెళ్ళాలి. అక్కడ కూడా కొన్ని ఆకర్షనీయ ప్రదేశాలు ఉన్నాయి. వాటిని కూడా చూసేస్తే ఒకపనై పోతుంది. మరి ఆలస్యం ఎందుకు అటువైపు కూడా ఒక లుక్ వేద్దాం పదండి

తిరుగు ప్రయాణంలో ...

తిరుగు ప్రయాణంలో ...

సిద్దవటం పెన్నా నది ఒడ్డున ఉన్న ఒక మండలం. అక్కడ చూడవలసినవి ఆలయాలు మరియు కోట. ఏటి పొడవునా దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రధానంగా చెప్పుకోవలసినది మాత్రం రంగనాథస్వామి ఆలయం. సిద్దవటం వెళితే దోసకాయలు తినటం మరిచిపోవద్దు. ఇవి ఇక్కడ ఎక్కువగా లభ్యమవుతాయి.

చిత్ర కృప : Lalithamba

తిరుగు ప్రయాణంలో ...

తిరుగు ప్రయాణంలో ...

సిద్దవటం కోట మధ్య యుగం నాటిది. పెన్నా నది ఒడ్డున ఈ కోట 36 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. కోటకు పశ్చిమం వైపున, తూర్పు వైపున రెండు ద్వారాలున్నాయి.

తిరుగు ప్రయాణంలో ...

తిరుగు ప్రయాణంలో ...

సిద్దవటం కోట ముఖద్వారానికి ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుడు శిల్పాలు ఉన్నాయి. పడమటి వైపు ఉన్న ద్వారానికి ఇరువైపులా నాట్య భంగిమలో అందమైన శిల్పాలు ఉన్నాయి.

చిత్ర కృప : Karthik Abhiram

తిరుగు ప్రయాణంలో ...

తిరుగు ప్రయాణంలో ...

సిద్దవటం కోట లోనికి వెళితే మధ్య భాగంలో అంతఃపురం శిథిలమై ఉంటుంది. అంతఃపురం లో రాణి దర్బారు, ఈద్గా మసీదు, నగారాఖానా లు ఉన్నాయి.

తిరుగు ప్రయాణంలో ...

తిరుగు ప్రయాణంలో ...

నగారాఖానా వెనుక కోట గోడకు మధ్య మంచినీటి కోనేరు ఉంది. కోటలో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం, కామాక్షి ఆలయం ఉన్నాయి.

చిత్ర కృప : Karthik Abhiram

తిరుగు ప్రయాణంలో ...

తిరుగు ప్రయాణంలో ...

సిద్దవటం కోటలోని తూర్పు ద్వారం విషయానికి వస్తే, సమీపంలో బిస్మిల్లా షావలి దర్గా ఉంటుంది. టిప్పు సుల్తాన్ కాలంలో దీన్ని నిర్మించారు. ప్రక్కనే ప్రార్థనలు చేసుకోవటానికి మసీదు కూడా ఉన్నది.

చిత్ర కృప : Karthik Abhiram

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం కోట యొక్క ప్రహారీ గోడలు

చిత్ర కృప : Karthik Abhiram

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

పాము చంద్రుణ్ణి మింగేస్తున్న శిల్ప దృశ్యం

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

కోట లోని జ్యోతి శివ ఆలయం

చిత్ర కృప : indian phots

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

జ్యోతి శివ ఆలయం లోని పాద ముద్రికలు

చిత్ర కృప :indian phots

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

కోట మీదికి చేరుకొనే మెట్ల మార్గం

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

ధ్వంసమైన విగ్రహం

చిత్ర కృప : indian phots

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం చేరుకోవటానికి గల రోడ్డు మార్గం

చిత్ర కృప : javeed JaM

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం లోని ఒక పురాతన ఆలయం

చిత్ర కృప :bgr mandava

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం లో కోనేరు తో కూడిన ఆలయం. భక్తులు కోనేరు లో స్నానాలు ఆచరించి ఆలయంలోకి ప్రవేశిస్తారు.

చిత్ర కృప :bgr mandava

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం లో ప్రసిద్ధి గాంచిన శివాలయం

చిత్ర కృప :bgr mandava

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం కోట మరిన్ని దృశ్యాలలో .. !

సిద్దవటం కోట లోని బిస్మిల్లా షావలి దర్గా

చిత్ర కృప :bgr mandava

రూట్ మ్యాప్

రూట్ మ్యాప్

కడప నుండి సిద్దవటం మండలానికి రూట్ మార్గం

రూట్ మ్యాప్

రూట్ మ్యాప్

సిద్దవటం మండలం నుండి నిత్య పూజ కోన బస్ స్టాండ్ వరకు రూట్ మార్గం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X