Search
  • Follow NativePlanet
Share
» »వింత పేర్లు - వింత ఊర్లు !

వింత పేర్లు - వింత ఊర్లు !

"పేరులో ఏమి వుంది " అన్నాడు మహా కై షేక్స్ పియర్ కాని ఉన్నదంతా పేరు లోనే వుంది. ప్రజలలో ఆసక్తి పెంచాలన్నా, హాస్యం కలగా చేయాలన్నా మీరు పెట్టుకొనే పేరు చాలు.

By Venkatakarunasri

"పేరులో ఏమి వుంది " అన్నాడు మహా కై షేక్స్ పియర్ కాని ఉన్నదంతా పేరు లోనే వుంది. ప్రజలలో ఆసక్తి పెంచాలన్నా, హాస్యం కలగా చేయాలన్నా మీరు పెట్టుకొనే పేరు చాలు. మన భారత దేశంలోని కొన్ని ప్రదేశాల పేర్లు చూస్తె నవ్వు వస్తుంది. మరి అవి ఎలా ఉంటాయో చూడండి.

డాల్ఫిన్స్ నోస్ , కూనూర్

డాల్ఫిన్స్ నోస్ , కూనూర్

తమిళనాడు రాష్ట్రం లోని కూనూర్ లో డాల్ఫిన్స్ అనే శిఖరం వుంది. ఈ శిఖరం డాల్ఫిన్ ముక్కు ఆకారంలో వుండటంచే దీనికి ఈ పేరు వచ్చింది. నీలగిరులలో అద్భుత ప్రకృతి దృశ్యాల మధ్య ఇది ఒక ట్రెక్కింగ్ స్పాట్.

Photo Courtesy: Kumaravel

సాస్ బహు టెంపుల్, ఉదయ పూర్

సాస్ బహు టెంపుల్, ఉదయ పూర్

అసలు ఈ టెంపుల్ కు సాస్ బహు అని పేరు ఎందుకు వచ్చింది ? అనుకుంటే ...సాస్ బహు అంటే 'అత్తా కోడలు 'అని అర్ధం. ఈ టెంపుల్ లో రెండు నిర్మాణాలు కలవు. ఒకటి అత్తా కట్టించాగా, రెండవది ఆమె కోడలు కట్టించింది.

Photo Courtesy: hartjeff12

డ్యూక్ నోస్, లోనవాల

డ్యూక్ నోస్, లోనవాల

ఆసక్తి కరంగా, లోనావాలా లోని ఒక కొండకు అది ముక్కు ఆకారం లో వుండటంచే ఆనాటి బ్రిటిష్ ప్రభువు అయిన డ్యూక్ వెల్లింగ్టన్ పేరుతో డ్యూక్ నోస్ అని పిలుస్తున్నారు.

గార్డెన్ అఫ్ ఫైవ్ సెన్సెస్, ఢిల్లీ

గార్డెన్ అఫ్ ఫైవ్ సెన్సెస్, ఢిల్లీ

గార్డెన్ అఫ్ ఫైవ్ సెన్సెస్ అంటే పంచేంద్రియాల తోట అని అర్ధం. అంటే ఈ గార్డెన్ లో మీ అయిదు ఇంద్రియాలు ఆనంద పడతాయని చెపుతారు. అందుకనే ఈ పేరు వచ్చిందట

Photo Courtesy: ZeePack

మ్యూజియం అఫ్ టాయిలెట్స్

మ్యూజియం అఫ్ టాయిలెట్స్

ఇండియా లో మీకు చరిత్ర చూపేందుకు అనేక మ్యూజియం లు కలవు. అయితే, అంతర్జాతీయ స్థాయి లో టాయిలెట్ ల చరిత్ర చెపుతూ ఢిల్లీ లో ఒక మ్యూజియం కలదు. మరి ఎప్పటికైనా దీనిని చూసే తీరాల్సిందే.

ఎకో పాయింట్, మున్నార్

ఎకో పాయింట్, మున్నార్

ఎకో అంటే ప్రతి ధ్వని. మున్నార్ వెళ్ళే వారికి చాలామందికి అక్కడ ఒక ఎకో పాయింట్ వుందని తెలియక పోవచ్చు. అయితే, ఇక్కడ ఒక ఎకో పాయింట్ కలదు. ఇక్కడ పర్యాటకులు చప్పట్లు, స్వరాలూ చేసి ఆ ధ్వని మరల వారికి చేరితే ఆనందిస్తారు.

Ech

వీసాల దేముడి టెంపుల్, హైదరాబాద్

వీసాల దేముడి టెంపుల్, హైదరాబాద్

వీసాల దేముడిని ఎప్పుడైనా కలిశారా ? హైదరాబాద్ లోని చిల్కూర్ అనే ప్రదేశంలో ఒక వెంకటేశ్వరుడి దేవాలయం కలదు. వీసా పొందటం విదేశాలకు వెళ్ళటం మీరు కల అనుకుంటే, ఇక్కడకు వెళ్లి ఆ స్వామిని దర్శించి, వీసా కోరండి. అంటే, మీకు విదేశాలకు వీసా రావటం ఖాయం. ఎంతో మంది విద్యార్ధులు, ఉద్యోగులు, తాము విదేశాలకు వెళ్ళాలంటూ ఇక్కడ మొక్కు కుంటారు.

photo credit: Adityamadhav83

చైన్ ట్రీ , వయనాడ్

చైన్ ట్రీ , వయనాడ్

కేరళ లో కల వయనాడ్ ప్రదేశం లో ఒక పెద్ద చెట్టు కలదు. ఈ చెట్టుకు ఒక ఆత్మా చైన్ వేసి కట్టబడిందని చెపుతారు. కేరళ లోని వయనాడ్ వెళితే ఈ చెట్టు తప్పక చూడండి.

రాణి కి వావ్, పటాన్

రాణి కి వావ్, పటాన్

రాణి కి వావ్ కు అర్ధం చెప్పాలంటే, రాణి గారి మెట్ల బావి అని అర్ధం. ఈ మెట్ల బావి ని ఒక మహారాణి తన భర్త పై గల ప్రేమకు చిహ్నంగా నిర్మించినది.

Photo Courtesy:Sudhamshu Hebbar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X