Search
  • Follow NativePlanet
Share
» »కేరళ రాష్ట్ర పర్యటన ఇపుడే ?

కేరళ రాష్ట్ర పర్యటన ఇపుడే ?

దక్షిణ భారత దేశపు చివరి భాగంలో కల కేరళ రాష్ట్రం ఇపుడు పర్యటనకు అనువైన వాతావరణం కలిగి వుంటుంది. ఈ రాష్ట్ర పర్యాటక ప్రదేశ అందాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయనతంలో సందేహం లేదు. ఎపుడు ఈ ప్రదేశాలలో ఎక్కడ చూసినా పూర్తి పచ్చదనమే. నదులు, కాలువలు అన్నీ నిండుగా ప్రవహిస్తూ వుంటాయి. ప్రసిద్ధి చెందిన ఇక్కడ కల బ్యాక్ వాటర్స్ తాజా నీటిని సంతరించుకొని పర్యాటకులను ఇక్కడ ప్రసిద్ధి చెందిన హౌస్ బోటు లలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకు వెళతాయి. అలసి సొలసిన పర్యాటకులను ఇక్కడకల అరేబియా మహా సముద్రం చక్కని ఆహ్లాద కర గాలులతో ఆహ్వానిస్తూ వుంటుంది. తేయాకు, కాఫీ తోటల నుండి వచ్చే తాజా గాలులు తాజా అనుభూతులు అందిస్తాయి. ఫోర్ట్ కోచి అక్కడ కల పోర్చుగీస్, చైనీస్, ముస్లిం శిల్ప శైలుల నిర్మాణాలతో మిమ్ములను స్వాగతీస్తుంది.

మీరు ఆహార ప్రియులా ? నోరు ఊరే రుచులు కల ఎన్నో స్థానిక వంటకాలు ఆర్డర్ పెడితే చాలు నిమిషాలలో సిద్ధం అయిపోయే హోటల్స్ కలవు. ప్రసిద్ధి చెందినా కల్లరి పయటు, కదాకలి, తేయం వంటి నృత్యాలు మీ మనసుకు పూర్తి వినోదాలను పంచుతాయి. కేరళ రాష్ట్రం గత ఎన్నో దశాబ్దాల నుండి పర్యాటక రంగంలో ఎంతో కృషి చేసి, పూర్తి అభివృద్ధి సాధించి పర్యటనకు అవసరమైన అస్న్ని సౌకర్యాలు అందిస్తోంది. మరి అటువంటి రాష్ట్రంలో ప్రధానంగా మీరు చూడవలసిన కొన్ని ప్రదేశాలు పరిచయం చేస్తున్నాం. పరిశీలించండి.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ!

హ్యాపీ క్లైమేట్ ...కేరళ!

వయనాడ్

కేరళలోని వయనాడ్ సందర్శనకు వేసవి అనుకూల సమయం. ఈ సమయంలో ఇక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. ఈ హిల్ స్టేషన్ కన్నూర్ మరియు కోజికోడ్ జిల్లాల మధ్య కలదు. ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు ఇక్కడకు వస్తున్నప్పటికీ వయనాడ్ ఏ మాత్రం కాలుష్యం లేక స్వచ్చంగా వుంది. వయనాడ్ లో మీరు చూడదగినవి పూకాట్ లేక్, బాణాసుర సాగర్ డాం, చేమ్బ్రా శిఖరం (గుండె ఆకార సరస్సు ఇక్కడ చూడవచ్చు), ఎదక్కాల్ కేవ్స్ వంటివి చూడవచ్చు.

మీరు సౌకర్యంగా ఉండేందుకు హోం స్టే ల నుండి రిసార్ట్ ల వరకూ అనేక వసతులు కలవు.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ!

హ్యాపీ క్లైమేట్ ...కేరళ!

పోన్ముడి కేరళ లో ప్రసిద్ధ సమ్మర్ హిల్ స్టేషన్. దీనిని గోల్డెన్ పీక్ అంటారు. కేరళ రాజధాని తిరువనంతపురం కు 60 కి. మీ. ల దూరంలో కలదు. పోన్ముడి లో మీరు గోల్డెన్ వాలీ, పెప్పర వైల్డ్ లైఫ్ సాన్క్చురి, మినీ జు వంటివి చూడవచ్చు. ట్రెక్కింగ్ చేయ వచ్చు.

Photo Courtesy: Thejas Panarkandy

హ్యాపీ క్లైమేట్ ...కేరళ!

హ్యాపీ క్లైమేట్ ...కేరళ!

దేవికులం

దేవికులం ట్రెక్కింగ్ కు ప్రసిద్ధి. మున్నార్ నుండి 16 కి. మీ. ల దూరం. అందమైన కొండలు, జలపాతాలు, సరస్సులు ఇక్కడ కలవు. ఇక్కడ కల సీతాదేవి సరస్సు లోని నీటికి వ్యాధులు నయం చేసే శక్తి వుందని నమ్ముతారు. ఈ సరస్సు గురించి పురాణాలలో కూడా పేర్కొనబడింది. ఇక్కడ మీరు పల్లివాసాల్ జలపాతాలు, మరియు తూవనం జలపాతాలు కూడా చూడవచ్చు.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ!

హ్యాపీ క్లైమేట్ ...కేరళ!

పీర్మేడ్ లో సమ్మర్ కూల్ గా వుంటుంది. ట్రెక్కింగ్ కు ఈ ప్రదేశం ప్రసిద్ధి. కేరళ లోని ఉత్తమ హిల్ స్టేషన్ లలో పీర్మేడ్ ఒకటి. అంతులేని పచ్చదనం ఈ హిల్ స్టేషన్ లో కనపడుతుంది. పీర్మేడ్ లో కుట్టికానం మరియు త్రిశంకు హిల్స్ కూడా చూడ దాగిన ప్రదేశాలు. ఈ హిల్ స్టేషన్ కొట్టాయం నుండి 75 కి. మీ. ల దూరంలో కలదు.

Photo Courtesy: Devika

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

నేల్లియంపతి పల్లక్కాద్ జిల్లాలో ఒక హిల్ స్టేషన్. చుట్టూ టీ, కాఫీ తోటలు కలవు.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

వైత్రి ఇడుక్కి జిల్లాలో కలదు. సముద్రమట్టానికి ఈ హిల్ స్టేషన్ 1300 మీ. ల ఎత్తున కలదు. కోజికోడ్ నుండి 60 కి. మీ. ల దూరంలో ఈ ప్రదేశం కలదు.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

లక్కిది

లక్కిది వైత్రి నుండి 5 కి. మీ. ల దూరంలో కలదు. ఈ ప్రదేశం వయనాడ్ జిల్లా కు ప్రవేశ ద్వారంగా వుంటుంది. ఈ ప్రదేశం ప్రపంచంలో రెండవ అధిక వర్షపాతం పొందే ప్రదేశం.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

పైతాల్ మాలా

పైతాల్ మాలా కేరళ లోని కన్నోర్ జిల్లాలో ఎవరూ అన్వేషించ్చని ప్రదేశం. సముద్ర మట్టానికి ఇది 4500 మీ. ల ఎత్తున కలదు. కన్నూర్ సిటీ కి 65 కి. మీ. ల దూరం. మంచి ట్రెక్కింగ్ ప్లేస్.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

రాణి పురం

రాణి పురం కేరళలో ఎవరూ అన్వేషించని ఒక హిల్ స్టేషన్. ఇది కాసర్గోడ్ జిల్లా లో కలదు. సిటీ నుండి 85 కి. మీ. ల దూరం. సముద్ర మట్టానికి 750మీ. ల ఎత్తున కల ఈ ప్రదేశం అనేక సుందర ప్రకృతి దృశ్యాలు కలిగి వుంది.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

కొచ్చి

కొచ్చి ప్రదేశ సందర్శనకు వింటర్ అనుకూలం. ఇక్కడ అనేక ఆకర్షణలు కలవు. ప్రతి పర్యాటకుడు కొరివి ఇక్కడ లభిస్తాయి. కొచ్చి లో బెస్ట్ హోటల్స్ కలవు. కొచ్చి ఆహారాలు రుచికరంగా వుంటాయి.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

తేక్కడి కేరళలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ ట్రెక్కింగ్ ప్రధాన క్రీడా. ఈ ప్రదేశం కేరళ - తమిళనాడు సరిహద్దులలో కలదు. రెండు రాష్ట్రాల సంప్రదాయాలూ ఇక్కడ కలవు. ఇక్కడ పెరియార్ వైల్డ్ లైఫ్ సాన్క్చురి, వండి పెరియార్, వందన్ మేదు లు ఇతర ఆకర్షణలు. సరసమైన రేట్ లలో వసతి సౌకర్యాలు కూడా కలవు.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

అల్లెప్పి లో బోటు విహారం

అల్లెప్పి కేరళ బ్యాక్ వాటర్స్ లో కలదు. ఇక్కదబొఅత్ విహారం ప్రసిద్ధి. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడకు వచ్చి బోటు విహారాలు ఆనందిస్తారు. స్థానిక ఆహారాలు, బోటు లోనే వండి సర్వ్ చేస్తారు.

Photo Courtesy: Ronald Tagra

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

తిరువనంతపురం జిల్లాలో కల కోవలం ఒక బీచ్ టవున్. దీనిని దక్షినాది స్వర్గం అంటారు. తిరువనంతపురం సిటీ కి ఇది 16 కి. మీ. ల దూరంలో కలదు. వసతి పొందేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

పూవార్

పూవార్, తిరువనంతపురం నుండి 25 కి. మీ. ల దూరంలో కల చిన్న గ్రామం. ఎంతో ప్రశాంతంగా వుంటుంది. ఇక్కడ బీచ్ ప్రసిద్ధి.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

తిరువనంతపురం

తిరువనంతపురం కేరళ రాష్ట్ర రాజధాని. ఇండియా లోని పది పచ్చటి నగరాలలో ఒకటి. తిరువనంతపురంలో అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. ఈ నగరం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. వసతి గృహాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

బెకాల్

బెకాల్ ప్రదేశ సందర్శన వర్షాకాలంలో బాగుంటుంది. ఇది అందమైన ఒక చిన్న పట్టణం. ఈ ప్రదేశం కాసర్గోడ్ కు 13 కి. మీ. ల దూరం. హిందీ సినిమా షూటింగ్ లు ఇక్కడ జరుగుతాయి.

Photo Courtesy: Renjith Sasidharan

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

అతిరాప్పల్లీ

అతిరప్పల్లీ అక్కా కల జలపాతాలకు ప్రసిద్ధి. ఈ ప్రదేశ సందర్శన వర్షాకాలంలో బాగుంటుంది. త్రిస్సూర్ పట్టనాన్నించి 60 కి. మీ. ల దూరం లోను కోచి పట్టణానికి 70 కి. మీ. ల దూరంలోను ఈ ప్రదేశం కలదు.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

అష్టముది బ్యాక్ వాటర్స్

అష్టముది బ్యాక్ వాటర్స్ కేరళ లోని కొల్లం జిల్లా లో కలదు. ఈప్రదేశం వర్ష రుతువులో సందర్శనకు బాగుంటుంది. ఇక్కడ కల అష్టముది సరస్సు కేరళ లోని అతి పెద్ద తాగు నీటి సరస్సు గా పేరు గాంచినది. ఈ ప్రదేశ పర్యటన మరువలేనిడిగా వుంటుంది.

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

హ్యాపీ క్లైమేట్ ...కేరళ !

త్రిస్సూర్

త్రిస్సూర్ కేరళ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని. ఇక్కడ జరిగే పండుగలు, వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినాయి. త్రిస్సూర్ సమీపంలోని కేరళ కళా మండపం లో అనేక ప్రోగ్రాం లు నిర్వహిస్తారు. కేరళ లోని నృత్య రూపకాలలో కదా కాళీ నృత్యం ప్రసిద్ధి చెందినది. త్రిస్సూర్ లోని టూరిస్ట్ ప్రదేశాల కొరకు ఇక్కడ చూడండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X