Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోనే అతి సుందరమైన వాటర్ ఫాల్స్..బాంగ్ బాంగ్ ఫాల్స్

భారతదేశంలోనే అతి సుందరమైన వాటర్ ఫాల్స్..బాంగ్ బాంగ్ ఫాల్స్

హిమజలపాతాల మధ్య సుందరమైన వాటర్ ఫాల్స్..బాంగ్ బాంగ్ ఫాల్స్

అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని వాయువ్య ప్రాంతంలో సముద్రమట్టానికి 6000 నుండి 22000 అడుగుల ఎత్తులో ఉంది తవాంగ్‌ పట్టణం. ఇది బౌద్ధమత ప్రాంతం. ప్రత్యేకించి శీతాకాల సమయంలో ఇక్కడ కురిసే హిమపాతం పర్యాటకుల్ని కనువిందు చేస్తుంది. ఈ ప్రదేశానికి సందర్శకులు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటారు. నిజానికి అరుణాచల్‌ప్రదేశ్‌లో బౌద్ధులు ఎక్కువ. అందుకే ఈ ప్రాంతం అతి ప్రాచీన బౌద్ధ ఆశ్రమాలకు ఆలవాలంగా వెలుగొందుతోంది.

బౌద్ధమతంలో మహాయాన వర్గం వారు ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. లాసా తర్వాత అతి ప్రాచీన ఆశ్రమం తవాంగ్‌లో మాత్రమే ఉంది. తవాంగ్‌ ఆశ్రమాన్ని మెరాగ్‌ లామా లోడ్రీ గిమాస్ట్సో నిర్మించారని చెబుతారు. ఆశ్రమం పక్కనే బౌద్ధ సన్యాసులు నివసించేందుకు వీలుగా వసతి గృహాలు ఏర్పాటు చేశారు. తవాంగ్‌ ఆశ్రమం విద్యుత్‌ దీపకాంతులతో నిత్యం సందర్శకుల్ని ఎంతగానో ఆకర్షిస్తుంటుంది. ఆశ్రమంలో లోపల ఎనిమిది మీటర్లు ఎత్తైన బౌద్ధ విగ్రహం ఉంది. లాసాలోని పోతలా ఆశ్రమం తర్వాత తవాంగ్‌ ఆశ్రమమే అతిపెద్దది.

బంగారు బుద్ధుని విగ్రహం

బంగారు బుద్ధుని విగ్రహం

ఈ తవాంగ్‌ ప్రాంతం హిమాలయ పర్వతాలపై దాదాపు 12 వేల ఆడుగుల ఎత్తున ఉంటుంది. ఇక్కడ టిబెటన్ల సంఖ్య కూడా ఎక్కువ. వీరు నిత్యం ప్రార్థనలు చేస్తూ బౌద్ధమత ఆరాధనలో నిమగ్నులై కనిపిస్తుంటారు. 27 అడుగుల ఎత్తులో ఉండే బంగారు బుద్ధుని విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి.

ఆకాశంలో నీలంరంగును ప్రతిబింబింపజేసే ఎత్తైన జలపాతాలు

ఆకాశంలో నీలంరంగును ప్రతిబింబింపజేసే ఎత్తైన జలపాతాలు

ప్రశాంతమైన, ఆహ్లాదపరిచే నీటి సరస్సులు, నదులు, ఆకాశంలో నీలంరంగును ప్రతిబింబింపజేసే ఎత్తైన జలపాతాలు సందర్శకులను మంద్రముగ్ధుల్ని చేస్తాయి. కొన్ని సందర్భాలలో నీలిమేఘాలు చేతికి అందినట్టుగా తేలియాడుతూ కనిపిస్తూ పర్యాటకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. ప్రకృతి అందాలను అతి దగ్గరగా ఆస్వాదించాలనుకునేవారికి అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం అత్యంత అనువైనది.

భారతదేశంలోనే అతి సుందరమైన వాటర్ ఫాల్

భారతదేశంలోనే అతి సుందరమైన వాటర్ ఫాల్

శీతాకాలంలో అయితే ఈ ప్రాంతం హిమజలపాతాల ప్రత్యేకతతో నిండిపోతుంటుంది. ఎటు చూసినా నీలి వర్ణంతో తారడే జలపాతాలే దర్శనమిస్తుంటాయి. ఇందులో జాంగ్‌ జలపాతం ఎంతో ప్రాముఖ్యత పొందింది. దీన్నే నురంగాంగ్ వాటర్ ఫాల్స్ లేదా బాంగ్ బాంగ్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లాలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ భారతదేశంలోనే అతి సుందరమైన వాటర్ ఫాల్. అందుకే అరుణా చల్ ప్రదేశ్ కు టూర్ వెళ్ళే వారు తప్పనిసరిగా ఈ వాటర్ ఫాల్ ను సందర్శించి వెళుతుంటారు.

నురానంగ్ నది..తవాంగ్ నదిలో కలవడానికంటే ముందు..

నురానంగ్ నది..తవాంగ్ నదిలో కలవడానికంటే ముందు..

ఈ వాటర్ ఫాల్ తవాంగ్ జిల్లాకు 40కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 6000అడుగుల ఎత్తులో ఈ వాటర్ ఫాల్ ఉంది. నురానంగ్ నది..తవాంగ్ నదిలో కలవడానికంటే ముందు...ఇలా వాటర్ ఫాల్ల్ లా పర్వత శిఖరం నుండి క్రిందికి పడుతుంది.

ఇక్కడ హైడెల్ పవర్ ప్లాంట్ 3X2 మెగా వాట్ల జలవిద్యుత్ కేంద్రం

ఇక్కడ హైడెల్ పవర్ ప్లాంట్ 3X2 మెగా వాట్ల జలవిద్యుత్ కేంద్రం

ఇక్కడ హైడెల్ పవర్ ప్లాంట్ 3X2 మెగా వాట్ల జలవిద్యుత్ కేంద్రం ఉంది. వాటర్ ఫాల్ నుండి జాలువారిన నీటితో అక్కడ విద్యుత్ ను ఉప్పత్తి చేస్తారు.ఉత్తరాఖండ్ లో, హిమాచల్ ప్రదేశ్ లో బోలెడంత సిమెంటూ, ఇనుమూతో చాలా పెద్ద పెద్ద జలవిద్యుత్ కేంద్రాలు కనిపిస్తాయి.

సందర్శించే సమయం

సందర్శించే సమయం

ఈ వాటర్ ఫాల్ ను వర్షాకాలం ప్రారంభం నుండి వర్షాకాలం పూర్తయ్యే లోపు సందర్శించవచ్చు. అంటే జూన్ నుండి అక్టోబర్ దాకా సందర్శించడానికి అనుకూలమైన సమయం. వర్షాలు ఎక్కువగా పడితే..జాలు వారే నీళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి. దాంతో అక్కడ మరింత సమయం ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. సుమారు 100 మీటర్ల ఎత్తు ఉన్న కొండ నుండి నీరు జాలువారడం..జలజలా పారే జలపాతంతో పాటు..పక్కనే ఉన్న తవాంగ్ మానస్టెరీని కూడా సందర్శించవచ్చు.

ఇక్కడి పరిసర ప్రాంతాలు స్కేటింగ్‌కు అనుకూలం

ఇక్కడి పరిసర ప్రాంతాలు స్కేటింగ్‌కు అనుకూలం

పంగంగ్‌ టంగ్‌ అనే సరస్సు తవాంగ్‌ పట్టణ ప్రాంతానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. శీతాకాలంలో ఈ సరస్సు గడ్డకట్టి పర్యాటకులకు ఓ ప్రత్యేక ఆకర్షణగా ఉండటం మరో విశేషం. ఇక్కడి పరిసర ప్రాంతాలు స్కేటింగ్‌కు అనువుగా ఉంటాయి.

ఎత్తైన పర్వతాలను 'ఘాట్‌రోడ్‌' మార్గాల్లో ప్రయాణాన్ని

ఎత్తైన పర్వతాలను 'ఘాట్‌రోడ్‌' మార్గాల్లో ప్రయాణాన్ని

ఎత్తైన పర్వతాలను 'ఘాట్‌రోడ్‌' మార్గాల్లో ప్రయాణాన్ని సాగించడానికి యాక్స్‌లు(జడ బర్రెలు) ఎంతగానో సహాయపడతాయి. తర్ఫీదు పొందిన యాక్స్‌లు పర్యాటకులకు అందుబాటులో ఉంటారు.

ఈ ప్రాంతంలో ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు.

ఈ ప్రాంతంలో ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు.

తవాంగ్‌ ప్రజలకు ప్రధాన ఉపాధి హస్తకళ. ఈ ప్రాంతంలో గిరిజనులు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. శీతల వాతావరణంలో యాక్స్‌, గొర్రెల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. కొండ దిగువ భూములలో పంటలు అధికంగా పండుతాయి.

తవాంగ్‌ ఆరామంలో డంగ్యూర్‌..

తవాంగ్‌ ఆరామంలో డంగ్యూర్‌..

తవాంగ్‌ ఆరామంలో డంగ్యూర్‌, టొర్గ్యా పండగలు ఉత్సాహంగా, సంప్రదాయ సహితంగా జరుగుతాయి. మొంపా, భోటియా, ఆది మొదలైన గిరిజన తెగలవారు ఇక్కడ జీవిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X