Search
  • Follow NativePlanet
Share
» »కలర్ ఫుల్ హోలీని ఈ ప్రదేశాల్లో అయితే మస్త్ ఎంజాయ్ చేయవచ్చు...

కలర్ ఫుల్ హోలీని ఈ ప్రదేశాల్లో అయితే మస్త్ ఎంజాయ్ చేయవచ్చు...

మన భారత దేశంలో హోలీ పండగకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. రంగులు జల్లుకుంటూ ప్రతీ ఒక్కరూ సంబరాలు జరుపుకుంటారు, ఒక వారం రోజుల పాటు జరుప

మన భారత దేశంలో హోలీ పండగకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. రంగులు జల్లుకుంటూ ప్రతీ ఒక్కరూ సంబరాలు జరుపుకుంటారు, ఒక వారం రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ దేశంలో ప్రతీ వీధి, ప్రతీప్రాంతం రంగులతో నిండిపోయే ఏకైక వేడుక ఇదే. అయితే హోలీ జరుపుకోవడంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో ప్రత్యేక ఉంటుంది. అందుకనే ఈ రంగురంగుల వేడక చాలా గ్రాండ్ గా మన దేశంలో ఏఏ ప్రదేశాల్లో చేసుకుంటారో ముందుగానే తెలుసుకుంటే ..ఈ సారి హోలీ పండుగను హ్యాపిగా ఎంజాయ్ చేయవచ్చు. మరి మన ఇండియాలో డిఫరెంట్ గా ...ఆనందోత్సవాలు జరుపుకునే ఆ హాఫ్ భీట్ ప్రదేశాలేంటో తెలుసుకుందాం..

హంపి:

హంపి:

కర్నాటకాలో ఉండే హంపి లో సాంప్రదాయమైన హోలీని చూడవచ్చు . రంగురంగుల కలర్స్ మంద్య హోలీ రోజు చారిత్రక కట్టడాల అలంకరణ అద్భుతంగా ఉంటుంది. రంగులతో పాటు అనేక డోలు శబ్దాలతో 2 రోజుల పాటు ఇక్కడ వేడుకలు జరుగుతాయి.

గోవా:

గోవా:

సమ్మర్ అలాగే హ్యాపీగా హోలీ ఎంజాయ్ చేయడానికి గోవా అద్భుతమైన ప్రదేశం. వారం రోజుల పాటు సెలబ్రేట్ చేసుకునే ఈ పండగ సమయంలో గోవా సందర్శించడం భలే ఆనందంగా ఉంటుంది. గోవాలో హోలీని షిగ్మో అంటారు. బాండ్స్, పరేడ్స్, రాత్రి వేళల్లో జరిగే మ్యూజికల్ ఈవెంట్స్ ను గోవా హాలిడే ప్యాకేజ్ లలో భాగంగా ఎంజాయ్ చేయవచ్చు.

ముంబై:

ముంబై:

మహరాష్ట్రాలో అతి పెద్ద నగరం ముంబై హోలీ వేడుకలు అద్భుతంగా జరుగుతాయి. ముంబాయ్ వీధి వీధిలోనూ రంగులు, సంగీతం హోరెత్తిపోతాయి. ఇక్కడ హోలీ వేడుకలను తెగ ఎంజాయ్ చేయవచ్చు.

పురులియా, పశ్చిమ బెంగాల్:

పురులియా, పశ్చిమ బెంగాల్:

కలర్ ఫుల్ రంగులతో పాటు సంప్రదాయ చఊ నృత్యంతో పురిలియాలో హోలీ వేడుకలు గ్రాండ్ గా జరుపుకుంటారు. ఇలాంటి నృత్యం మీరు ఇప్పటి వరకూ చూసి ఉండరు. అంతే కాదు ఇలాంటి నృత్యం ఈ హోలీ సందర్భంలోనే వేస్తారు కాబట్టి మిస్ కాకూడదు.

పంజాబ్:

పంజాబ్:

ఆనంద్ పూర్ లో హోలీ అంటే కేవలం రంగులు మాత్రమే కాదు, భౌతిక కార్యక్రమాలు కూడా. మార్షల్ ఆర్ట్స్ , శారీరక సామర్థ్యం వంటి ప్రదర్శనలతో వేడుకలు జరుగుతాయి. వీటిని చూసేందుకు రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు.

ఉదయపూర్, రాజస్థాన్:

ఉదయపూర్, రాజస్థాన్:

ఉదయపూర్ లో మీకోసం రాజరిక హోలీ వేడుకలు ఎదురుచూస్తున్నాయి. ఉదయపూర్ లో జరిగే మేవార్ రాజ కుటుంబానికి చెందిన గుర్రాల ప్రదర్శన అద్భుతం అనాల్సిందే. హోలీ వేడుకకు సరిగ్గా ముందు ఈ ప్రదర్శన జరగగా, ఆ తర్వాత నుంచి పట్టణం అంతా రంగులమయం అయిపోతుంది.

జైపూర్ :

జైపూర్ :

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో హోలీకి ప్రత్యేకత ఉంటుంది. వారి వేడుకలలో ఏనుగులు కూడా ఒక భాగం కావడం విశేషం. రంగురంగుల వస్త్రాలు అనేక రంగుల అలంకరణలతో ఏనుగులు చూడముచ్చటగా ఉంటాయి. ఏనుగులతో నిర్వహించే టగ్ ఆఫ్ వార్ ఇక్కడి ప్రత్యేకత. హోలీ అంటే ఇష్టపడేవారు జైపూర్ హోలీ ప్యాకేజ్ తో సంబరాలను సందర్శించవచ్చు.

ఇండోర్ :

ఇండోర్ :

హోలీ పండగ రోజు మనసులతో కూడా నృత్యం చేయించాలంటే ఇండోర్ వెళ్లాల్సిందే. అంతగా హోలీ వేడుకలు ఇక్కడ జరుగుతాయి. మొత్తం నగరం అంతా ఒక్కచోటకు చేరి డ్యాన్స్ చేసే సన్నివేశం కళ్ల నుండి చెదిరిపోవడం అసాధ్యం.

వారణాసి:

వారణాసి:

మీ మనసును తాకే వేడుకల కోసం అయితే వారణాసిని విజిట్ చేయాల్సిందే. ఈ ఆధ్యాత్మికత ప్రాంతం హోలీ పండుగకు కరెక్ట్ చాయిస్.

బర్సన :

బర్సన :

శ్రీకృష్ణుని ప్రేయసి రాధ పుట్టిన ప్రదేశ బర్సన. నందగామ్ నుంచి వచ్చిన పురుషులు, అమ్మాయిలతో ఆటలు ఆడేందుకు ఇక్కడకు చేరతారు. రంగులకు బదులుగా కర్రలతో పలకరించుకోవడం భలే ఉంటుంది. అందుకే ఇక్కడ హోలీ పండుగను ‘లాథ్ మార్ హోలీ' అని పిలుస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X