Search
  • Follow NativePlanet
Share
» »ఆకాశం నుంచి ఓం ఆకారంలో కన్పించే పుణ్యక్షేత్రం సందర్శనతో

ఆకాశం నుంచి ఓం ఆకారంలో కన్పించే పుణ్యక్షేత్రం సందర్శనతో

ఓంకార క్షేత్రానికి సంబంధించిన కథనం.

హిందూ మతంలో ఓం అక్షరానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోని ఈ జగత్తు మొత్తం ఈ ఓం అక్షరం నుంచే ఏర్పడిందని చెబుతారు. అందువల్లే ఓం అక్షరాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. అదే విధంగా హిందూ దైవ ఆరాధనలో మొదట ఓం అక్షరాన్నే పలుకుతారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఓం ఆకారంలో ఒక పుణ్యక్షేత్రం ఉంది.

ఆకాశం నుంచి చూస్తే ఈ క్షేత్రం ఓం ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ విశ్వం ఏర్పడటానికి ముందే ఇక్కడ దైవం వెలిసిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అందుల్లే ఈ పుణ్యక్షేత్రాన్ని ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు.

అందువల్లే ఈ క్షేత్రంలోని దైవాన్ని దర్శించడం వల్ల మొక్షం లభిస్తుందని అందరూ భావిస్తారు. వింద్యా పర్వతం గర్వ భంగం జరిగింది ఇదే క్షేత్రంలోనే. అంతేకాకుండా ఈ ఓంకార క్షేత్రంలోనే ఆది శంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ క్షేత్రం పూర్తి వివరాలు మీ కోసం

1. నారద మహర్షి

1. నారద మహర్షి

P.C: You Tube

ఒకనొక సమయంలో నారదమహర్షి గోకర్ణ క్షేత్రంలోని పరమేశ్వరుడిని పూజించి ఈ ప్రాంతానికి వస్తాడు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వింద్యాపర్వతం నారదుడితో వాదనకు దిగుతుంది. ఈ లోకంలో తనకంటే గొప్ప పర్వతం ఏదీ లేదని చెబుతుంది.

2. మేరు పర్వతం

2. మేరు పర్వతం

P.C: You Tube

మిగిలిన ఏ పర్వతంలో లేనన్ని రత్నాలు తన లోపల ఉందని గర్వంతో చెబుతుంది. దీంతో నారదుడు నీవు ఆ మేరు పర్వతం కంటే గొప్పవాడవు కాదని చెబుతాడు. మేరు పర్వత శిఖరం స్వర్గం వరకూ వ్యాపించి ఉందని గుర్తుచేస్తాడు.

3. శివుడి గురించి తపస్సు

3. శివుడి గురించి తపస్సు

P.C: You Tube

దీంతో సిగ్గు పడిన వింద్యా పర్వతం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తుంది. తాను మేరు పర్వతం కంటే ఎక్కువ ఎత్తుకు పెరగాలని వేండుకొంటాడు. అంతేకాకుండా తన పై నిత్యం నీవే కొలువై ఉండాలని వింద్యా పర్వతం శివుడిని వేడుకొంటుంది.

4. ఓంకారేశ్వరుడిగా

4. ఓంకారేశ్వరుడిగా

P.C: You Tube

బోళా శంకరుడైన ఆ పరమేశ్వరుడు ఇందుకు అంగీకరించి వింద్యా పర్వతం పై ఓం కారేశ్వరుడిగా కొలువుండిపోతాడు. ఇదిలా ఉండగా మేరు పర్వతం కంటే విద్యా పర్వతం ఎక్కువ ఎత్తుకు పెరిగడం వల్ల సూర్యగమనానికి అడ్డుపడుతుంది.

5. చీకటిగా

5. చీకటిగా

P.C: You Tube

దీంతో ఉత్తర భారతదేశం మొత్తం చీకటిగా మారుతుంది. ఈ పరిమాణంతో సమస్త జీవులు భయపడుతాయి. దీంతో మునులు ఈశ్వరుడిని తమను రక్షించమని కోరుకొంటారు.

6. అగస్త్యమహాముని

6. అగస్త్యమహాముని

P.C: You Tube

వారి మొరను ఆలకించిన ఆ పరమేశ్వరుడు వింద్యాపర్వతానికి గురువైన అగస్త్యమహముని ఒక్కరే ఆ పర్వతం గర్వం అనచగలడని చెబుతాడు. దీంతో మునులతో పాటు సాధారణ మానవులు మరోసారి అగస్త్యుడిని వేడుకొంటాడు.

7. దక్షిణానికి బయలు దేరుతాడు

7. దక్షిణానికి బయలు దేరుతాడు

P.C: You Tube

దీంతో ఉత్తరభారతదేశంలోని కాశీలో ఉన్నఆ విశ్వేశ్వరుడిని వదలలేక అయిష్టంగానే దక్షిణ భారత దేశానికి ప్రయాణమవుతాడు. అప్పుడు ఈ ఓంకారక్షేత్రానికి అగస్త్యుడి రాగానే తన గురువును చూసి వింద్యా పర్వతం తలవంచి నమస్కరిస్తుంది.

8. మరలా తిరిగి రాలేదు

8. మరలా తిరిగి రాలేదు

P.C: You Tube

దీంతో త్వరగా ప్రాంతాన్ని దాటుకొని తాను వచ్చే వరకూ ఆ వంచిన తలను అలాగే ఉంచాలని చెప్పి అగస్త్యుడు దక్షిణ దేశం వైపునకు వెళ్లి మరలా తిరిగి రాలేదు. దీంతో వింద్యా పర్వతం అలాగే తల వంచుకొని ఇక్కడ ఉన్నట్లు చెబుతారు.

9. నాలుగు అంతస్తుల్లో

9. నాలుగు అంతస్తుల్లో

P.C: You Tube

ఇక వింద్య పర్వతం పైన ఓం కార క్షేత్రంలోని దేవాలయం నాలుగు అంతస్తులో ఉంటుంది. మొదటి అంతస్తులో ఓంకారేశ్వరుడు ఉండగా, అతని పై అంతస్తులో మహా కాలేశ్వరుడు ఉంటాడు

10. అనేక ఉపాలయాలు

10. అనేక ఉపాలయాలు

P.C: You Tube

మూడో, నాలుగో అంతస్తులో అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఇక ఇక్కడ ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉంటుంది. మనం శివలింగాన్ని అభిషేకించిన వెంటనే ఆ అభిషేక జలం ఆ చీలిక ద్వారా వెళ్లి నర్మదానదిలో కలుస్తుంది.

11. పడమర దిశగా

11. పడమర దిశగా

P.C: You Tube

అందువల్లే నర్మదానది హిందువలుకు అత్యంత పవిత్రమైన నదిగా పేరొగాంచింది. ఇదిలా ఉండగా సాధారణంగా భారత దేశంలోని చాలా నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిస్తే నర్మదానది మాత్రం పడమర దిశగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది.

12. అమలేశ్వర లింగం

12. అమలేశ్వర లింగం

P.C: You Tube

ఓంకార లింగానికి ఎదురుగా అమలేశ్వర లింగం ఉంది. ఇక్కడ శివలింగానికి జరిగే సహస్ర శివలింగపూజకు చాలా ప్రత్యేకం ఉంది. ఈ పూజను భక్తులు నేరుగా చేయవచ్చు. అందువల్ల పూజా ఫలం మొత్తం భక్తులకు దక్కుతుందని భావిస్తారు.

13. భాష్యం రాశారు.

13. భాష్యం రాశారు.

P.C: You Tube

ఓంకార క్షేత్రంలోనే ఆదిశంకరాచార్యలువారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఇక్కడి గౌరీ సోమనాథ మందిరంలోని శివలింగాన్ని దర్శించుకొంటే పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు.వ అంతేకాకుండా రాబోయే తరాల జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయని చెబుతారు.

14. ఎక్కడ ఉంది.

14. ఎక్కడ ఉంది.

P.C: You Tube

మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో ఓంకార క్షేత్రం ఉంది. దీనిని ఓంకారేశ్వర, అమలేశ్వర లింగ క్షేత్రమని కూడా పిలుస్తారు. నర్మదానది పై పడవల ద్వారా ఓంకార క్షేత్రాన్ని చేరుకోవచ్చు. నిర్మలమైన నదీ జలాల పై పడవ ప్రయాణం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

15. ఎలా వెళ్లాలి

15. ఎలా వెళ్లాలి

P.C: You Tube

ఓంకారేశ్వర క్షేత్రానికి దగ్గరగా అంటే 77 కిలోమీటర్ల దూరంలో ఇండోర్ విమానాశ్రం ఉంది. అదే విధంగా ఉజ్జయినీ, ఇండోర్, ఖాండ్వా నుంచి ఇక్కడికి ప్రభుత్వ ప్రైవేటు బస్సు సర్వీసులు ఉన్నాయి. ఖాండ్వా నుంచి ఓంకారేశ్వర్ కు ప్రయాణ సమయం దాదాపు 2.30 గంటలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X