Search
  • Follow NativePlanet
Share
» »ఉల్లాసాన్ని ఇచ్చే .. అవలబెట్ట యాత్ర !

ఉల్లాసాన్ని ఇచ్చే .. అవలబెట్ట యాత్ర !

By Mohammad

మీరెప్పుడైనా పర్యటన చిన్నది అని అనుకున్నారా ? రెండు మూడు రోజులు ట్రిప్ వేస్తేనే పర్యటన అని, ఒక్కరోజు వేస్తే అది పర్యటన కాదని భావిస్తున్నారా ? అయితే మీ అపోహాలను తొలగించే ఒక ట్రిప్ గురించి నేటివ్ ప్లానేట్ మీకు అందిస్తున్నది. ఈ పర్యటన కేవలం ఒక్కరోజుదే .. అయినా మీకు రెండురోజుల పర్యటన మాదిరి అనిపిస్తుంది.

ఇంతకీ ఆ ప్రదేశం ఏదో చెప్పలేదు కదూ ! అవలబెట్ట. సిలికాన్ సిటీ గా ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరం నుండి కేవలం రెండు గంటల దూరంలో .. ఎవర్ గ్రీన్ నంది హిల్స్ కు చేరువలో జాతీయరహదారి కి దగ్గరలో కలదు.

అవలబెట్ట ఎలా చేరుకోవాలి ?

మీ వద్ద సొంత వాహనం ఉంటే బెంగళూరు లోని విజయానగర్ లో ట్రాఫిక్ ను క్లియర్ చేసుకొని, హెబ్బాళ రోడ్ గుండా వయా యెలహంకా మీదుగా దేవనహళ్లి వైపుగా ప్రయాణించాలి. తెల్లవారుజామున బయలుదేరితే ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. ఎన్ హెచ్ 7 గుండా చిక్కబళ్లాపూర్ పట్టణానికి చేరుకోవాలి. అవలబెట్ట హిల్ స్టేషన్, బెంగళూరు నగరానికి 120 కిలోమీటర్ల దూరంలో కలదు. చిక్కబళ్లాపూర్ నుండి రెడ్డిగొల్లవరహళ్లి వైపు ప్రయాణం కొనసాగిస్తూ .. పేరేసంద్ర కు ఎడమ వైపు తిరగండి. బెంగళూరు నుండి అవలబెట్ట చేరుకోవటానికి ఇదే సులభ మార్గం. పేరేసంద్ర నుండి 16 కిలోమీటర్ల దూరం వరకు అలానే వెళితే మీకు చుట్టూ పచ్చదనంతో స్వాగతం పలుకుతుంది .. అవలబెట్ట.

ఇది కూడా చదవండి : బెంగళూరు - మీకు తెలీని 3 వారాంతపు విహారాలు !

అవలబెట్ట పర్యటన మీకు తప్పక ఆసక్తిని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇక్కడి మనోహర దృశ్యాలను ఒకసారి దిగువన ఉన్న ఫోటో లలో పరిశీలిస్తే .. !

దిగువ ఫోటో లకు చిత్ర కృప : Akshatha Vinayak

మేఘావృతమైన రోడ్డు మార్గం

మేఘావృతమైన రోడ్డు మార్గం

మాన్సూన్ అంటేనే పర్యాటకులను ముగ్ధులను చేసే సీజన్; మేఘావృతమైన ఎలహంక - దేవనహళ్లి జాతీయ రోడ్డు మార్గం.

కొండలు

కొండలు

బెంగళూరు నుండి అవలబెట్ట చేరేవరకు మీకు ఎన్నో కొండలు దర్శనమిస్తుంటాయి. అందులో ఒకటి నంది హిల్స్.

స్వాగతం పలుకుతున్న చెట్లు

స్వాగతం పలుకుతున్న చెట్లు

చిక్కబళ్లాపూర్ నుండి పేరేసంద్ర వెళ్లే మార్గంలో రోడ్డుకిరువైపులా స్వాగత తోరణం లా ఆహ్వానం పలుకుతున్న చెట్లు. పంటపొలాలు, గుడిసెలు, ద్రాక్ష పండ్ల తోటలు, పెద్ద పెద్ద వృక్షాలు దారిపొడవునా కనిపిస్తాయి.

అవలబెట్ట వెళ్ళుటకు సూచించే గుర్తు

అవలబెట్ట వెళ్ళుటకు సూచించే గుర్తు

పేరేసంద్ర నుండి అవలబెట్ట చేరుకొనేటప్పుడు చిన్న చిన్న గ్రామాలు మీకు కనిపిస్తుంటాయి. అవి దాటి వెళితే 14 KM ల దూరంలో ఒక బోర్డు కనిపిస్తుంది అవలబెట్ట వెళ్ళటానికి. ఆ బోర్డు గమనించి ఎడమ వైపు తిరిగితే అవలబెట్ట మార్గం కనిపిస్తుంది.

5 నిమిషాల ఘాట్ రోడ్ ప్రయాణం

5 నిమిషాల ఘాట్ రోడ్ ప్రయాణం

రెండు, మూడు మలుపుల ఘాట్ రోడ్ ప్రయాణం మిమ్మలను కొండపైకి తీసుకెళుతుంది.

కొండ యొక్క ప్రవేశం

కొండ యొక్క ప్రవేశం

అవలబెట్ట ఒక హిందూ పుణ్య క్షేత్రం. దీనిని ధేనుగిరి అని కూడా పిలుస్తారు.

ఇక్కడి నుంచే మొదలు

ఇక్కడి నుంచే మొదలు

ట్రెక్కింగ్ చేయటానికి మీరేమి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొండ పై వరకు మెట్లు ఉన్నాయి.

కోతులు .. జాగ్రత్త !

కోతులు .. జాగ్రత్త !

కొండ పై వరకు ఫుడ్ తీసుకొని వెళ్ళటం అంత ఈజీ కాదు ! కొండ ఎక్కేటప్పుడు కోతులు కాస్త ఇబ్బంది పెడతాయి.

పిట్టలు కొట్టే సాధనం తో కుర్రాడు

పిట్టలు కొట్టే సాధనం తో కుర్రాడు

కొండ పై భాగాన, దేవాలయం చేరువలో తినటానికి దోసకాయ, కారం బురుగులు, మరమరాలు, చుట్టలు, చెకోడీలు, కాల్చిన మొక్కజొన్నలు, వేరుశెనగలు మొదలైన చిరుతిండ్లు లభ్యమవుతాయి.

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

స్థానిక కధనం మేరకు నరసింహ స్వామి ఈ ప్రదేశంలో చెంచు లక్ష్మీ ని వివాహం చేసుకున్నట్లు చెబుతారు. నరసింహ స్వామి మీద కోపంతో చెంచులక్ష్మి కొండ పై వెలిసింది. ఇప్పటికీ చెంచు లక్ష్మీ ఆలయం నరసింహ స్వామి ఆలయం పై భాగాన ఉన్న కొండ పై ఉన్నది.

ధేనుగిరి

ధేనుగిరి

అవలబెట్ట ను ధేనుగిరి అని కూడా పిలుస్తారు. పురాణాల మేరకు, కామధేనువు ఈ ప్రదేశంలో ఉండిపోయిందని కధనం. 'అవల' అనేది తెలుగు పదం. అవల అంటే పశువులు అని, బెట్ట అంటే కొండ లేదా గిరి అని అర్థం.

కొండపై చెరువు

కొండపై చెరువు

నరసింహ స్వామి ఆలయాన్ని దాటి కొండ శిఖరం వైపు వెళుతున్నప్పుడు కనిపించే మొట్ట మొదటి చెరువు ఇది. అవలబెట్టలో చెరువులు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి.

వ్యూ పాయింట్లు

వ్యూ పాయింట్లు

చుట్టుపక్కల గల ప్రకృతి అందాలను, గ్రామాలను కొండ అగ్ర భాగాన వెళ్లి తిలకించవచ్చు.

ప్రధాన ఆకర్షణ

ప్రధాన ఆకర్షణ

కొండ శిఖరాన గల పొడవైన రాతి అవలబెట్ట ఆకర్షణలలో ఒకటిగా చెప్పవచ్చు. దాని మీద కూర్చొని ఫోటోలు తీసుకోవచ్చు.

కొండ మీద వీచే గాలులు

కొండ మీద వీచే గాలులు

ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి గాలులు వేగంతో వీస్తుంటాయి. కొండ అంచుల వద్ద గాలి అధికంగా ఉంటుంది. స్థిరంగా నిల్చోవటం మీ వల్ల కాదు. కనుక జాగ్రత్తగా ఉండండి.

బస్సు లో ఎలా వెళ్ళాలి ?

బస్సు లో ఎలా వెళ్ళాలి ?

ప్రవేట్ వాహనాన్ని అద్దెకు మాట్లాడుకొని వెళ్లడం ఉత్తమం. లేకపోతే, బెనెగలూరు నుండి బెంగళూరు నుండి చిక్కబళ్లాపూర్ వరకు ప్రభుత్వ బస్సులో ప్రయాణించండి. అక్కడి నుండి మండికల్ వరకు మరొక బస్సులో వెళ్ళండి. అవలబెట్ట, మండికల్ నుండి 11 KM ల దూరంలో కలదు. అక్కడి నుండి ఆటో రిక్షాలు అద్దెకు దొరకవచ్చో ? లేదో ఆ సమాచారం లేదు.

సదుపాయాలు

సదుపాయాలు

రెడ్డిగొల్లవరహళ్లి చేరుకుంటే అక్కడి నుండి ఎటువంటి హోటళ్లు ఉండవు. కనుక హైవే మీద కామత్ లేదా నంది హోటల్ లలో ఆహారం తినవచ్చు. అవలబెట్ట వద్ద దోసకాయ, మరమరాలు మాత్రమే దొరుకుతాయి. కోతుల మూలంగా కొండ పై కి ఫుడ్ తీసుకొని వెళ్ళటం కాస్త ఇబ్బంది కలిగించే విషయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X