Search
  • Follow NativePlanet
Share
» »ఈ రన్ వే పై విమానాలే కాదు మీరూ పరుగెత్తవచ్చు...అయితే ఒక్క చిన్నపనిచేసి ఉండాలి

ఈ రన్ వే పై విమానాలే కాదు మీరూ పరుగెత్తవచ్చు...అయితే ఒక్క చిన్నపనిచేసి ఉండాలి

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే పై జరిగే మారథాన్ విషయమై.

By Kishore

విమానాల్లో ప్రయాణం చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. మరికొంతమందికి ఆ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే రన్ వే పై కూడా నడవాలని ఉంటుంది. విమానంలో ప్రయాణం ప్రస్తుత కాలంలో సులభమే అయినా నడక దాదాపు అసాధ్యం. ఎన్ని కోట్లు ఇచ్చినా రన్ వే పై నడవడానికి లేదా పరిగెత్తడానికి మాత్రం అవకాశం దొరకదు. అయితే దేశంలో మొదటిసారిగా ఓ విమానాశ్రయ నిర్వాహకులు రన్ వే పై నడవడం కాదు ఏకంగా పరిగెత్తడానికి అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

త్రిభుజాకార లింగ దర్శనానికి మరో ఆరునెలలు మాత్రమే అవకాశంత్రిభుజాకార లింగ దర్శనానికి మరో ఆరునెలలు మాత్రమే అవకాశం

1. మారథాన్ లో అనుభవం ఉన్నవారికి

1. మారథాన్ లో అనుభవం ఉన్నవారికి

Image Source:

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం తన రన్ వే పై కొంతమంది పరగెత్తడానికి అవకాశం కల్పించింది. స్పోర్ట్స్ పర్సన్స్ తో పాటు మారథాన్ లో అనుభవం ఉన్నవారికి మాత్రమే ఈ రన్ వే పై పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది.

2. ఎందుకు

2. ఎందుకు

Image Source:

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం తన 10వ వార్షికోత్సవాన్ని ఈనెలలో జరుపుకొనబోతోంది. అందువల్ల ఈనెల 8న విమానాశ్రయం లోని రన్ వే పై పరిగెత్తడానికి అవకాశం కల్పించనున్నారు. ఆరోజు రాత్రి మధ్యాహ్నం సమయంలో రన్ వేను మూసి వేసి ఈ మారథన్ కు అవకాశం కల్పించనున్నారు.

3. ఇదే మొదటిసారి

3. ఇదే మొదటిసారి

Image Source:

ప్రపంచంలో ఇలా రన్ వే పై విమానాలను నిలిపి వేసి అప్పుడప్పుడు మారథన్ లను నిర్వహించడం సర్వసాధారణం. అయితే భారత దేశంలో ఇటువంటి ప్రక్రియ ఇదే మొదటిసారి. అందువల్లే ఈ రన్ వే పై పరుగెత్తడానికి చాలా మంది ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రన్ వే పై పరిగెత్తడానికి కొన్ని నియమాలను పాఠించాల్సి ఉంటుంది.

4. 18 ఏళ్లు నిండి ఉండాలి

4. 18 ఏళ్లు నిండి ఉండాలి

Image Source:

ఈ రన్ వే పై పరిగెత్తడానికి కనీసం 18 ఏళ్లు పై బడిన వారే అర్హులు. ఇక రన్ వే పై పరిగెత్తే సమయంలో ఎయిర్ పోర్టు అందజేసే ప్రత్యేక వస్త్రాలను మాత్రమే ధరించాల్సి ఉంటుంది. ఈ మారథాన్ మధ్యాహ్నం 12.45 గంటలకు మొదలయ్యి 2.15కు ముగియనుంది. ఈ సమయంలో గాయపడితే ఎయిర్ పోర్ట్ అథారిటికీ ఎటువంటి సంబంధం ఉండదు.

5. మీరు ఈ పనిచేసి ఉండాలి

5. మీరు ఈ పనిచేసి ఉండాలి

Image Source:

ఈ మారథన్ లో పాల్గొన దలిచిన వారు ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకొని ఉండాలి. గతంలో ఏఏ మారథాన్ లో పాల్గొన్నరో ఆ వివరాలు కూడా తెలపాలి. కేవలం మారథాన్ లోనే కాకుండా ఇతర క్రీడల్లో ప్రావీణ్యం ఉన్నవారు కూడా తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. అయితే ఇలా తమ పేర్లను నమోదు చేసుకొన్నవారిలో వందమందిని నిర్వాహకులు ఎంపిక చేసి ఈ రన్ వే పై పరిగెత్తిస్తారు.

6. వారిదే అంతిమ నిర్ణయం

6. వారిదే అంతిమ నిర్ణయం

Image Source:

ఎవరిని ఎంపిక చేయాలన్న విషయం పై ఎయిర్ పోర్టఅథరిటీదే అంతిమ నిర్ణయం. అందువల్లే ఇప్పటికే తమ పేర్లను రిజిష్ట్రేషన్ చేసుకొన్నవారికి మాత్రమే ఎయిర్ పోర్ట్ రన్ వే పై పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X