Search
  • Follow NativePlanet
Share
» »ఉండవల్లి గుహలు, గుంటూరు జిల్లా !!

ఉండవల్లి గుహలు, గుంటూరు జిల్లా !!

ఉండవల్లి గుహలు నాలుగు అంతస్తులలో నిర్మించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతిలో అనంత పద్మనాభ స్వామి శిల్పం చెక్కబడి ఉంది. ఇతర ఆలయాలు త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణువు, శివుడు దేవతలకు ఉద్దేశించినవి.

By Mohammad

రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్

జిల్లా : గుంటూరు

సమీప నగరాలు : గుంటూరు, విజయవాడ.

ఉండవల్లి గుహాలయం ఒక పర్వత సముదాయం. పర్వత ముందు భాగమునుండి లోపలికి తొలచుకుంటూ వెళ్ళడం చేసారు. మధ్యలో స్థంబాలు వాటిపై చెక్కిన అందమైన లతలు, గుహాంతర్భాగాలలో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు మెదలైన వాటితో విశాలంగా ఉంటుంది. ఇవి క్రీ.శ. 4, 5 వ శతాబ్దానికి చెందినవని చరిత్రకారులు భావిస్తున్నారు.

ఉండవల్లి గుహలు

ఉండవల్లి గుహలు

చిత్రకృప : Durgarao Vuddanti

ఇక్కడ నాలుగు అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతిలో అనంత పద్మనాభ స్వామి శిల్పం చెక్కబడి ఉంది. ఇతర ఆలయాలు త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణువు, శివుడు దేవతలకు ఉద్దేశించినవి. ఇవి గుప్తుల కాలంనాటి ప్రధమ బాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటి.

సర్పవరం భావనారాయణస్వామి దేవాలయం, కాకినాడ !సర్పవరం భావనారాయణస్వామి దేవాలయం, కాకినాడ !

పర్వతము బయటివైపు గుహాలయ పైభాగములో సప్తఋషుల విగ్రహాలు పెద్దవిగా చెక్కారు. ఒకే పర్వతాన్ని గుహలుగానూ దేవతాప్రతిమలతోడను ఏకశిలా నిర్మితముగా నిర్మించిన శిల్పుల ఘనత ఏపాటిదో ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. ఈ గుహల నుంచి పూర్వ కాలంలో మంగళగిరి వరకు సొరంగ మార్గం ఉండేదని మన పూర్వీకులు చెప్పేవారు. ఈ మార్గం నుండి రాజులు తమ సైన్యాన్ని శత్రు రాజులకు తెలియకుండా తరలించేవారని ప్రతీతి.

అనంత పద్మనాభ స్వామి ప్రతిమ

అనంత పద్మనాభ స్వామి ప్రతిమ

చిత్రకృప : Ramireddy.y

ఈ పర్వత గుహలలో పెద్దదైన ఒక గుహాలయము కలదు. ఈ గుహాలయములో లోదాదాపు 20 అడుగులపైబడి ఏకరాతితో చెక్కబడిన అనంతపద్మనాభస్వామి వారి ప్రతిమ ఉంటుంది. ప్రతిమ పొడవుగా శేషపానుపుతో కూడి గుహాంతర్బాగమున కమలంలో కూర్చున్న బ్రహ్మ మరియు సప్తర్షులు ఇతర దేవతల విగ్రహాలూ కలవు.

ఈ గుహల నిర్మాణ శైలి బౌద్ధ విహారాల శైలిని పోలి ఉంది. ఆలయాల చుట్టూరా పచ్చని పంటపొలాలు కనువిందు చేస్తాయి. ఈ గుహాలయాలు క్రీ.శ. 420 నుండి 620 వరకు సాగిన విష్ణుకుండినుల కాలానికి చెందినవి. అనంత పద్మనాభ స్వామి, నరసింహ స్వామి ఇక్కడ కొలువైన దేవుళ్ళు.

ఉండవల్లి గుహలు లోపలిభాగం

ఉండవల్లి గుహలు లోపలిభాగం

చిత్రకృప : Chaitanya Vuddanti

పల్లవుల కాలం నాటివని ఒక సమర్ధన

విష్ణుకుండినుల చిహ్నము - సింహం - ఉండవల్లి కనబడుతుందనీ, అందువల్ల అవి విష్ణుకుండునుల కాలము నాటివని కొందరి అభిప్రాయము. సింహము మాత్రమే కాదు, ఏనుగులు కూడా అర్ధ శిల్ప ఫలకాలలో - ఆ సింహాలతో పాటు -కనబడుతున్నాయి. శిల్పాలు తూర్పుచాళిక్యల నాటివి. శాతవాహనులు, ఇక్ష్వాకులు మెత్తనైన చలువ రాతిలో తీర్పించిన శిల్పాల తరువాత ఘంటసాలలో తీర్చిన వైదిక శిల్పాలు సరస్వతీ, కుమారస్వామి చైతన్య రహితాలు.

<strong>ప్రపంచంలో ఇలాంటి శివాలయం వుందని తెలుసా ?</strong>ప్రపంచంలో ఇలాంటి శివాలయం వుందని తెలుసా ?

ఇక్కడ అనంతశయిన విగ్రహమూ, పాపపానుపూ, ఫణములూ, ఎగిరే కుంభాండులూ మహాబలిపురపు అనంతశాయనుని పోలికలు విరివిగా పెంచుకున్నవి కనుక పల్లవులు నిర్మాణములే అందురు. మహాబలిపురం వలెనే ఈ అనంతశయనుడు గుహయొక్క పక్కగోడలో ఉన్నాడు.

గుహ బయటివైపు

గుహ బయటివైపు

చిత్రకృప : Rmuthuprakash

పల్లవుల ప్రధాన చిహ్నము - కొమ్ముల కిరీటము-ఉన్న విగ్రహాలు పల్లవుల అవ్వచ్చును. మొగల్రాజపుర, విజయవాటికా గుహాలయాలు పల్లవులవే. అక్కడి స్తంభాలు ఉండవల్లి స్తంభాలవలె ఉన్నాయి. మొగల్రాజపుర గుహలముందు చూరుమీద గూళ్ళు, ఆ గూళ్ళలో ముఖాలు చెక్కడము పల్లవులూ, వారితర్వాత తూర్పు చాళుక్యులూ చేశారు. మొగల్రాజపుర గుహలు పల్లవుల నిర్మాణమే. బెజవాడ గుహలూ ఉండవల్లి కూడా అంతటా పల్లవుల శిల్పాలున్నాయి.

తెలుగులో శాశనం

తెలుగులో శాశనం

చిత్రకృప : Visdaviva

ఇతర ఆలయాలు

శ్రీ భాస్కరస్వామివారి ఆలయం, శ్రీ భీమలింగేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) శ్యామసుందర భవనం - ఈ మందిరం అమరావతి కరకట్ట మార్గంలో ఉండవల్లి వద్ద ఉన్నది.

ఉండవల్లి ఎలా చేరుకోవాలి ?

ప్రకాశం బ్యారేజి దాటగానే "తాడేపల్లి సెంటర్" వస్తుంది. కానీ ప్రకాశం బ్యారేజి పై బస్సు సదుపాయం లేదు. తాడేపల్లి విజయవాడకు 2 కీ.మీ.లు, మంగళగిరికి 5కీ.మీ.ల దూరంలో ఉంది. ఆ సెంటర్ నుండి అమరావతి వైపుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండవల్లి కలదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X