• Follow NativePlanet
Share
» »ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

Written By: Venkatakarunasri

ఎల్లోరా గ్రామము మహారాష్ట్రలో ఔరంగాబాకు 30 కి.మీ. దూరములో ఉంది. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది.

చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు మరియు సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటి నిర్మాణం కాలం క్రీ.పూ 600 నుంచి 800 మధ్య ఉంటుంది.

13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీ.పూ 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం క్రీ.పూ 800-1000. ఈ గుహలన్నీ పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చాటి చెబుతున్నాయి.

ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి. ఇందులో బౌద్ధ చైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. మూడు మతాల భావ సంగమం ఇది. ఎల్లోరాని అక్కడి స్థానికులు వేరులిని అని పిలుస్తారు.

మేధావులకే అందని ఒక అద్భుతం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

టెక్నాలజీ పెరిగిపోయింది.ఆధునిక టెక్నాలజీతో అసాధ్యం కానిదీఏదీ లేదు అనుకుంటూవుంటాం. కానీ ప్రపంచంలో మానవ మేధస్సుకు అద్భుతాలు అనేకం. ఆ కాలంలో అవి ఎలా సాధ్యం అయ్యాయో ఇప్పటికి అంతు పట్టని రహస్యంగానే మిగిలిపోయాయి.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ఏ దేవాలయమైనా మామూలుగా భూమిలోనుండి పునాదులుతో ప్రారంభిస్తారు.కానీ ఈ ఆలయాన్ని మాత్రం శిఖరాగ్రం నుండి ప్రారంభించారు.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

క్రీశ7వ శతాబ్దంలో 757 నుండి 773 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇంజనీరింగ్ నైపుణ్యానికి,భారతీయ శిల్పకళాసంపదకు తిరుగులేనిది ఈ ఆలయం.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

పైన్నుండి చూస్తే ఒక xసింబల్ లా కనిపిస్తుంది.ఇది కైలాస పర్వతానికి ప్రతీకగా భావిస్తారు.ఇక్కడ పరమశివుడు ఒకే రాతితో చెక్కబడటం అత్యంత అద్భుతంగా వుంటుంది.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

తడిగా వున్న ఇసుకతో ఇళ్ళు, గోపురాలు కట్టడం, ఇసుకను గోపురంగా చేర్చి, లోపల కాలిని గాని, చేతిని గాని లేదా వస్తువునో గాని ఉంచి వాటిని మెల్లగా వెనక్కు తీసి, అక్కడి ఇసుకను తొలగించి ద్వారా మార్గాలు ఏర్పాటు చేస్తే గుహలా ఏర్పడుతుంది.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

సరిగ్గా అలాగే కొండలను తొలిచి శిల్పులు గుహాలయాలను నిర్మించారు. భారతదేశంలో శిలలను తొలిచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభమయింది.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకునే వారు. ఆ తరువాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కింది భాగానికి వచ్చేవారు.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ఎల్లోరా గుహలన్నింటిలో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్పకళతో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుడి గురించిన వివిధ మూర్తులు, బోధిసత్వుని మూర్తులున్నాయి.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

దీనిపై కప్పు పెద్దపెద్ద 12 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో సింహాసనాసీసుడై ఉన్న బుద్ధుని విగ్రహం ఉంది. ఈ శిల్ప విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం. మరి దీనిని 8వ శతాబ్దంలో నిర్మించివుండవచ్చని భావిస్తున్నారు.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ఈ ఆలయ నిర్మాణం అనేది ఒక అద్భుతంలా కొండని మలచిన ఈ విధంగా మలచిన తీరు మాటల్లో చెప్పలేం.మధ్యలో వున్న స్థంభంపైనుండి క్రిందవరకు ఖచ్చితమైన ఆకారంలో చెక్కడంఅనేది జరిగిన అద్భుతమైన శిల్పకళానైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

4 లక్షల క్వింటాల్ టన్నుల రాళ్ళను తొలగించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించాలంటే సుమారు 100సంల పైనే పడుతుంది.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

అప్పటికీ ఈ ఆలయం ఈ విధంగా ఖచ్చితమైన పరిమాణాలతో ఇంత అద్భుతంగా నిర్మించే అవకాశాలే వుండకపోవచ్చును.కానీ 8వ శతాబ్దంలో కేవలం 18సంలు ఈ ఆలయాన్ని నిర్మించిన తీరు అసలు ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇది ఎలా సాధ్యం అయింది.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

మరి మన ఇప్పటి కాలిక్యులేషన్ ప్రకారం రోజుకి 12గం లపాటు అవిరామంగా విశ్రాంతి లేకుండా,ఒక రోబో లాగా వర్షాలు వచ్చినా,తుఫాన్లు వచ్చిన ఎండలుమండినా, యుద్ధాలు వచ్చినా ఏదిఏమైపోయినప్పటికీ ఒక్క రోజుకూడా విరామం లేకుండా పని చేసిన శిల్పకారులు మరిఇక శిల్పాలు అందమైన ఏనుగులు,ఆకృతులు అనేవి పక్కనపెడితే కేవలం రాళ్ళు కొట్టడం వాటిని తీసివేయడం,వీటిని మాత్రమే కాలిక్యులేట్ చేస్తే 4లక్షల టన్నుల రాళ్ళు 18సంలలోవాటిని ఎలా తీసారు అనేది ఒక విచిత్రంగానే మిగిలిపోయింది.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

మరి ఈ నాలుగు లక్షల టన్నుల రాళ్ళను 18తో భాగిస్తే 22,222టన్నుల రాళ్ళనేవి రావటం జరుగుతుంది. మరి వీటిని 22,222టన్నుల రాళ్ళను 365రోజులతో భాగిస్తే ఒక రోజుకి 60టన్నులు.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

మరి 12గంటలతో భాగిస్తే ఒక గంటకి 5టన్నుల రాళ్లు వీటిని కొట్టడం,తీయటం అనేది ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీని వుపయోగించినా ఒక గంటలో 5టన్నుల రాళ్ళను కొట్టితీయటమనేది చాలా కష్టమూ అసాధ్యమూ అనే చెప్పవచ్చును.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

మరి అలాంటిది 8 వ శతాబ్దములో ఎలా సాధ్యం అయిందో అనేది ఇప్పటికీ అర్ధం కాలేదు. నిర్మాణం మాట పక్కనపెడితే వాటిని నాశనం చేయటం కూడా అసాధ్యం.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ఔరంగజేబ్ అనేక హిందుఆలయాలను నాశనం చేసాడు. ఆ క్రమంలో భాగంగా ఈ ఆలయాలను కూడా నాశనం చేయాలని వెయ్యిమందిని పంపించాడు.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

వారు విశ్రాంతి లేకుండా 3సంల పాటు ఎంతో ప్రయత్నించినప్పటికీకొంత మేరకు కొన్ని శిల్పాలను మాత్రమే నాశనం చేయగలిగారు తప్ప ఆలయాలను ఏమీ చేయలేకపోయారు.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

మరి ఇంత అద్భుతమైన ఆలయాన్ని ఎవరు కట్టారో.ఎలా కట్టారో తెలియదు. ఆ అద్భుతం వెనకవున్న రహస్యం ఏంటో ఇప్పటికీ అర్ధంకాలేదు.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

మరి మానవుడు ఈ ఆలయాన్ని నిర్మించాలన్నా,నాశనం చేయాలన్నా ఇప్పట్లో సాధ్యంకాదేమో.అజంతాఎల్లోరా గుహలు ఈ గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో అజంతా అనే గ్రామానికి సమీపంలో వున్నాయి.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

అజంతాఎల్లోరా గుహలు బౌద్ధుల కాలంలో ఏర్పడివుండవచ్చని దాదాపు 30వరకు వున్న ఈ గుహలను రాతి కొండలలో తొలిచారు.ఈ గుహలను యునెస్కో వారిచే ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించారు.

PC:youtube

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

ప్రపంచంలోనే ఏక శిలపై నిర్మించబడిన అతిపెద్ద శివాలయం అదే కైలాసదేవాలయం

గుర్రపునాడా ఆకారంలో వున్న కొండపై 56 మీ ల ఎత్తైన పర్వతాలలో ఈ గుహలను తొలచడమనేది జరిగింది.ఈ గుహల విస్తీర్ణం 2కి.మీ.మరి మొత్తం గుహలను నిర్మించటానికి దాదాపు 500సంలు పట్టి వుండవచ్చని భావిస్తారు. 29వ గుహ దగ్గర పైనుండి జాలువారే జలపాతం దీనినే దారాతీర్ధం అంటారు.

PC:youtube

ఎప్పుడు దర్శించాలి?

ఎప్పుడు దర్శించాలి?

ఎల్లోరాను దర్శించడానికి ఆగస్టు-అక్టోబరు మధ్య కాలం అనువైనది. కాని విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే-జూన్ నెలలలో పర్యాటకులు అధికంగా వస్తారు.

PC:youtube

ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

రైలు ద్వారా ఔరంగా బాద్ కు చేరుకుని, అక్కడి నుండి బస్సులో కానీ, కార్లు, జీపులలో కాని ఎల్లోరా గుహలకు చేరుకోవచ్చు.

హైదరాబాద్ నుండి ఎల్లోరా గుహలకు వెళ్ళటానికి నాందేడ్ మీదుగానయితే 11గంల 23ని లు పడుతుంది.

PC: google maps

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more