Search
  • Follow NativePlanet
Share
» »ప్రపంచంలోనే అరుదైన శివలింగం ... కావాలంటే మీరే చూడండి !

ప్రపంచంలోనే అరుదైన శివలింగం ... కావాలంటే మీరే చూడండి !

ప్రపంచంలో ఎక్కడా లేని, వినని అరుదైన శివలింగం ఒకటి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామం ఉన్నది.

By Venkatakarunasri

ఆలయాన్ని ఎప్పుడు కట్టారో అక్కడి శాశనాల ద్వారా తెలిసిపోతుంది కానీ ఆలయంలోని లింగాన్ని ఎవరు ప్రతిష్టించారో .. ఎప్పుడు ప్రతిష్టించారో తెలీదు. అయితే గుడికి సంభంధించిన ఆనవాళ్ళు ఎక్కడో ఉత్తరప్రదేశ్ లోని మథుర మ్యూజియంలో, ఉజ్జయినీ రాజ్య కాలంలో వాడిన నాణాల మీద కనిపించాయి.

ప్రపంచంలో ఎక్కడా లేని, వినని అరుదైన శివలింగం ఒకటి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామం ఉన్నది. ఇక్కడ ఆంధ్ర శాతవాహనులు హయాంలో నిర్మించినట్లు చెప్పబడుతున్న ఒక పురాతన శివాలయం ఉన్నది. దీనిని క్రీ.పూ. 1 -3 వ శతాబ్ధంలో కట్టించి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే చంద్రగిరి మ్యూజియం వెళ్ళి తెలుసుకోవచ్చు.

ప్రపంచంలో ఎక్కడా లేని, వినని అరుదైన శివలింగం ఇది

విశిష్టత

విశిష్టత

గుడిమల్లం శివాలయంలో శివుడు పరశురామేశ్వరునిగా పూజలందుకొంటున్నాడు. ఆలయంలో గర్భాలయం ముఖమండపం కన్నా కాస్త లోతుగా ఉంటుంది. గర్భాలయంలో శివుడు లింగ రూపంలో కాకుండా మానవుని రూపంలో వేటగాని వలె దర్శనమిస్తాడు. ఈ లింగం ముదురు కాఫీవర్ణం లో ఉండి 5 అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంటుంది.

చిత్ర కృప : Desugari

వర్ణన

వర్ణన

ప్రపంచంలో ఎక్కడా వినని, చూడని పురుష అంగాన్ని పోలి ఉండే సుమారు 5 -7 అడుగుల ఎత్తున్న ఈ శివలింగం పై కుడిచేతితో ఒక గొర్రెపోతును, ఎడమచేతిలో చిన్నగిన్నె పట్టుకొని, ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ... యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతి రూపాన్ని చెక్కారు.

శివలింగం గురించి వర్ణన

శివలింగం గురించి వర్ణన

స్వామి జటాభార తలకట్టుతో, చెవులకు అనేక రింగులు వివిధ ఆభరణాలు, నడుము నుండి మోకాళ్ళ వరకూ వస్త్రము ధరించి ఉంటాడు. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. రుద్రుని వస్త్ర ధారణ ఋగ్వేద కాలం నాటిదని పురావస్తు శాస్తవేత్తల అంచనా. ఇప్పటికీ ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించిన సమాచారం లభించటం లేదు.

వురావస్థు శాఖ

వురావస్థు శాఖ

గుడిమల్లం ఏడేళ్ల కిందటి వరకు వురావస్థు శాఖ వారి ఆధీనంలో ఉండటంతో ఎటువంటి పూజాపునస్కారాలు జరగలేదు. ఇక్కడ ఒక పురావస్తు ఉద్యోగి గైడ్ గా ఉండి, అరుదుగా వచ్చిపోయే సందర్శకులకు ఆలయం పుట్టుపూర్వోత్తరాలు వివరిస్తుంటాడు.

చంద్రగిరి కోట

చంద్రగిరి కోట

అంతదూరం వెళ్ళి ఈ ఆలయాన్ని చూడలేనివారు, ఆలయంలోని మూలవిరాట్టును అన్ని విధాల పోలిన ప్రతిరూపాన్ని చంద్రగిరి కోటలోని మ్యూజియంలో చూడవచ్చు.

ఎలా వెళ్ళాలి ?

ఎలా వెళ్ళాలి ?

గుడిమల్లం చేరుకోవటానికి రోడ్డు మార్గం సులభంగా ఉంటుంది. అయినా కూడా సమీపంలో విమాన మరియు రైలు మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

విమాన మార్గం

గుడిమల్లం సమీపాన రేణిగుంట దేశీయ విమానాశ్రయం 11 కి.మీ. దూరంలో ఉంటుంది. ప్రభుత్వ బస్సుల్లో లేదా ప్రవేట్ వాహనాలు ఎక్కి గుడిమల్లం చేరుకోవచ్చు.

రైలు మార్గం

రైలు మార్గం

గుడిమల్లం సమీపాన రేణిగుంట (11 కి.మీ) మరియు తిరుపతి(22 కి.మీ) రైల్వే స్టేషన్ లు కలవు. ఈ ఊర్ల నుండి గుడిమల్లం గ్రామానికి ప్రభుత్వ / ప్రవేట్ వాహనాలు వెళుతుంటాయి.

రోడ్డు/ బస్సు మార్గం

రోడ్డు/ బస్సు మార్గం

రేణిగుంట (11 కి.మీ), తిరుపతి(22 కి.మీ), చిత్తూర్ (85 కి.మీ), చంద్రగిరి (38 కి.మీ) ల నుండి గుడిమల్లం గ్రామానికి బస్సు సౌకర్యం తో పాటుగా జీపు, షేర్ ఆటో ల సౌకర్యం ఉన్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X