Search
  • Follow NativePlanet
Share
» »కర్నూల్ సిటిలో అబ్బురపరిచే ఓర్వకల్ రాతి దృశ్యాలు చూశారా?

కర్నూల్ సిటిలో అబ్బురపరిచే ఓర్వకల్ రాతి దృశ్యాలు చూశారా?

రాయల సీమ భారతీయ పురాణ, ఇతిహాసాల్లోనే కాకుండా చరిత్రతో పాటు ప్రస్తుర రాజకీయ పరంగా అత్యంత ముఖ్యమైన ప్రాంతం. రాయలసీమ లోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే కర్నూలు ప్రామూఖ్యం కొంత ఎక్కువే. చారిత్రాత్మకంగానే కాకుండా భౌగోళికంగా కూడా ఈ జిల్లా విభిన్నమైనదే. ఈ కర్నూలు చుట్టు పక్కల మనకు అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి.

వీటిని సందర్శించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా వీకెండ్ సమయంలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేపర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు వీకెండ్ తో పాటు సాధారణ పర్యాటకానికి కూడా అనువైన ఐదు పర్యాటక ప్రాంతాలలో ఒకటి ఓర్వకల్లు రాతి ఉద్యానవనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం...

ఓర్వకల్లు రాతి ఉద్యానవనం కర్నూలు

ఓర్వకల్లు రాతి ఉద్యానవనం కర్నూలు

ఓర్వకల్లు రాతి ఉద్యానవనం కర్నూలు పట్టణం నుంచి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి సిద్ధంగా రాళ్లతో ఏర్పడిన కొన్ని నిర్మాణాలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. కర్నూల్ నుండి నంద్యాల కు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో(NH 18) ఓర్వకల్ రాతి ఉద్యానవనం 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సహజసిద్ధంగా ఏర్పడ్డ రాతి శిలలతో ప్రాకృతిక సౌందర్యంతో అలరారుతున్నది .

PC: Balamurugan Natarajan

ఓర్వకల్ ఒక పర్యాటక ప్రాంతమే కాకుండా ప్రముఖ సినిమా షూటింగ్ ప్రదేశం

ఓర్వకల్ ఒక పర్యాటక ప్రాంతమే కాకుండా ప్రముఖ సినిమా షూటింగ్ ప్రదేశం

ఓర్వకల్ ఒక పర్యాటక ప్రాంతమే కాకుండా ప్రముఖ సినిమా షూటింగ్ ప్రదేశం కూడా.. ఈ ఓర్వకల్లు రాతి ఉద్యానవనంలో జయం మనదేరా, టక్కరి దొంగ, సుభాష్ చంద్రబోస్, బాహుబలి వంటి ఎన్నో చిత్రాలను చిత్రీకరించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తోంది. పిల్లల విజ్ఞాన యాత్రలకు, బ్రైడల్ ఫోటో షూట్లకు అనువైన మంచి ప్రదేశం.

ఓర్వకల్ రాక్ గార్డెన్ జాతీయరహదారిని అనుకోని సులభంగా చేరుకొనే

ఓర్వకల్ రాక్ గార్డెన్ జాతీయరహదారిని అనుకోని సులభంగా చేరుకొనే

ఓర్వకల్ రాక్ గార్డెన్ జాతీయరహదారిని అనుకోని సులభంగా చేరుకొనే విధంగా ఉంటుంది. ఓర్వకల్ మండలానికి వెలుప ఉన్న ఈ రాక్ గార్డెన్ లో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత రెస్టారెంట్, బోటింగ్, కేవ్ మ్యూజియం మరియు పిక్నిక్ స్థలాలు, వసతి కై హరితా రిసార్ట్ ఉన్నాయి. గాజుపరిశ్రమలో విరివిగా ఉపయోగించే క్వార్ట్జ్, సిలికా వంటి ముడిపదార్ధాలతో ఇక్కడి రాతి శిలలు ఏర్పడ్డాయి. ఇవన్నీ సహజ సిద్ధంగా ఏర్పడినవే ! ఓర్వకల్ రాక్ గార్డెన్

ఓర్వకల్ రాక్ గార్డెన్ లో చూడవలసిన మరో స్థలం డిస్నీ బర్డ్ వాచింగ్ స్పాట్

ఓర్వకల్ రాక్ గార్డెన్ లో చూడవలసిన మరో స్థలం డిస్నీ బర్డ్ వాచింగ్ స్పాట్

ఓర్వకల్ రాక్ గార్డెన్ లో చూడవలసిన మరో స్థలం డిస్నీ బర్డ్ వాచింగ్ స్పాట్. ఇక్కడ నిలబడి పక్షుల శబ్దాలను, కిలకిలారావాలు, విహారాలు గమనించవచ్చు. లోయలు, కొండలు, నీటి ప్రవాహాలు, అబ్బురపరిచే రాతి దృశ్యాలు, అవి ఏర్పడ్డ తీరు ఇవన్నీ పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.

PC- Pratyusha kapavarapu

రాక్ గార్డెన్ సందర్శించు సమయం

రాక్ గార్డెన్ సందర్శించు సమయం

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 6 గంటగల వరకూ ఈ ఓర్వకల్లు రాతి ఉద్యానవనాన్ని వీక్షించడానికి అనుకూలం.

ఓర్వకల్ లో ఆధ్యాత్మికమైన ప్రదేశాలు కలవు

ఓర్వకల్ లో ఆధ్యాత్మికమైన ప్రదేశాలు కలవు

ఓర్వకల్ లో ఆధ్యాత్మికమైన ప్రదేశాలు కలవు. శ్రీ శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశ్వర స్వామి ఆలయం, శ్రీమాతా చౌడేశ్వరి దేవి ఆలయం, సూఫీ హజరత్ సయ్యద్ మహమ్మద్ షా ఖాద్రి దర్గా లు చూడదగ్గవి. ప్రతి సంవత్సరం ఆలయాల వద్ద ఉత్సవాలు, తిరునాల నిర్వహిస్తారు. దర్గా వద్ద శివరాత్రి తర్వాత ఉరుసు జరుగుతుంది.

పర్యాటకులను అబ్బురపరిచే కేతవరం కొండలు

పర్యాటకులను అబ్బురపరిచే కేతవరం కొండలు

పర్యాటకులను అబ్బురపరిచే కేతవరం కొండలు పదివేల ఏళ్లనాటి ఆదిమానవుని లిపి, బొమ్మలు, చిహ్నాలు ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామం కొండలపై కనిపిస్తాయి. క్రీస్తుకుపూర్వం 8 వేల ఏళ్లకింద ఇక్కడ ఆదిమానవులు సంచారం చేసిన ఆనవాళ్లు వున్నాయి.

pc:Balamurugan Natarajan

ఆదిమానవుని జీవిత విశేషాలు

ఆదిమానవుని జీవిత విశేషాలు

ఆదిమానవుని జీవిత విశేషాలు, ఆచార వ్యవహారాలు, లిపివర్ణ చిత్రాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్లే దారిలో పూడిచెర్ల మీదుగా కేతవరం వెళ్లవచ్చు. జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా సందర్శిస్తున్నారు.

PC- Poreddy Sagar

ఓర్వకల్ ఎలా చేరుకోవాలి ?

ఓర్వకల్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం ఓర్వకల్ చేరుకోవటానికి సమీపాన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(236 KM ) కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు మాట్లాడుకొని ఓర్వకల్ చేరుకోవచ్చు.

రైలు మార్గం ఓర్వకల్ కు సమీపాన కర్నూల్ రైల్వే స్టేషన్ (25 KM) కలదు. స్టేషన్ బయట ఆటో (లింక్ రూ. 10/-) ఎక్కి బస్ స్టాండ్ చేరుకొని, నంద్యాల కు లేదా బనగానపల్లె కు వెళ్లే పల్లెవెలుగు(ఇప్పుడు తెలుగు వెలుగు), ఎక్స్ ప్రెస్ బస్సులు ఎక్కితే ఓర్వకల్ చేరుకోవచ్చు. ఓర్వకల్ కు సమీపాన ఉన్న నంద్యాల రైల్వే స్టేషన్ ( 50 KM ) సమీపంలో ఉన్న మరొక రైల్వే స్టేషన్

బస్సు / రోడ్డు మార్గం కర్నూల్ నుండి ఓర్వకల్ కు తరచూ ప్రతి అరగంట కొకసారి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. నంద్యాల నుండి కర్నూల్ వెళ్లే బస్సులు ఓర్వకల్ లో ఆగుతాయి. ఓర్వకల్ రాక్ గార్డెన్ కూడా స్టాప్ ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X