Search
  • Follow NativePlanet
Share
» »సపూతర కి రాణి: అబ్బురపరిచే పచ్‌మఢీ అందాలు తిలకించాల్సిందే..

సపూతర కి రాణి: అబ్బురపరిచే పచ్‌మఢీ అందాలు తిలకించాల్సిందే..

మధ్య ప్రదేశ్ ను 'భారత దేశపు హృదయ భాగం ' అని ముద్దుగా పిలుస్తారు. భౌగోళికంగా దేశానికి మధ్యలో కల ఈ రాష్ట్రంలో అనేక అద్భుత టూరిస్ట్ ఆకర్షణలు కలవు. కామకేలి ప్రదర్శించే అరుదైన శిల్పాల ఖజురాహో, పచ్మారి లోని ప్రశాంతమైన పర్వతాలు, బాంధవ్ ఘర్ లోని వన్య ప్రాణులు వంటివి మధ్య ప్రదేశ్ రాష్ట్ర అరుదైన ఆకర్షణలు. మరి మధ్య ప్రదేశ్ పర్యటనలో తప్పక చూడవలసిన ఆకర్షణలలో ఒకటి పచ్ మరీ లేదా పచ్ మఢీ.

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పంచమర్హీ ఒకటి మాత్రమే హిల్ స్టేషన్. దీనిని సాత్పూర కి రాణి లేదా క్వీన్ అఫ్ సాత్పూర అని పిలుస్తారు. ఇది సాత్పూర పర్వత శ్రేణులలో కలదు. సముద్ర మట్టానికి సుమారు 1110 మీటర్ల ఎత్తున కలదు.

ఇండియా లో ఇది అతి ఎత్తైన హిల్ స్టేషన్

ఇండియా లో ఇది అతి ఎత్తైన హిల్ స్టేషన్

పాచ్ మారి గోండ్ తెగ గిరిజన వంశస్తుల కు రాజధాని. గోండ్ తెగ రాజు భావుట సింగ్. 1857 సంవత్సరం లో బ్రిటిష్ ఆర్మీ కెప్టైన్ జేమ్స్ ఫోర్స్య్త్ పంచమర్హీ హిల్ స్టేషన్ ను కనుగొని ప్రపంచానికి పరిచయం చేసాడు. పంచామారి లో నేటి ఆధునికతలకు అతడే కారణం. అతని కారణంగా ఈ హిస్స్ స్టేషన్ ఒక ప్రతిష్టాత్మక హిల్ స్టేషన్ గా రూపొందింది. ఇండియా లో ఇది అతి ఎత్తైన ప్రదేశం కావటం చేత బ్రిటిష్ వారు దీనిని వారి సైనిక స్థావరంగా రూపొందించారు. 2009 సంవత్సరం లో పంచమర్హీ ప్రాంతాన్ని యునెస్కో సంస్థ జీవ వైవిధ్య పరి రక్షణా ప్రాంతంగా ప్రకటించింది.

దేశానికి నడిబొడ్డున సత్‌పురా పర్వతాల నడుమ వెలసిన అద్భుత ప్రదేశం

దేశానికి నడిబొడ్డున సత్‌పురా పర్వతాల నడుమ వెలసిన అద్భుత ప్రదేశం

ఈ ప్రదేశంలో చూడవల్సిన ఆకర్షణీయ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. దేశానికి నడిబొడ్డున సత్‌పురా పర్వతాల నడుమ వెలసిన అద్భుత ప్రదేశం పచ్‌మఢీ. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో ఉంది. బ్రిటిష్ కాలంలో ఇది సైనిక స్థావరంగా ఉండేది. పచ్‌మఢీకి ఈ పేరు ‘పాంచ్' (ఐదు), ‘మఢీ' (గుహలు) అనే అర్థంలో వచ్చిందని చెబుతారు. ‘పాంచ్‌మఢీ' కాలక్రమంలో పచ్‌మఢీగా మారిందని అంటారు.

PC- Twinkle Bhaisare

పంచ పాండవులు తమ అరణ్యవాస కాలంలో ఇక్కడి ఐదు గుహలలో

పంచ పాండవులు తమ అరణ్యవాస కాలంలో ఇక్కడి ఐదు గుహలలో

పంచ పాండవులు తమ అరణ్యవాస కాలంలో ఇక్కడి ఐదు గుహలలో ఉండేవారని ప్రతీతి. ఇక్కడి జలపాతాల దిగువన ఏర్పడిన కొలనును ‘ద్రౌపదీ కుండం/పాంచాలీ కుండం' అంటారు. మహాభారత గాథతో ముడిపడిన ఈ ప్రదేశాలను పచ్‌మఢీకి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించుకుంటారు.

సత్‌పురా పర్వతశ్రేణుల్లోనే అత్యంత ఎత్తయిన శిఖరం ‘ధూప్‌గఢ్

సత్‌పురా పర్వతశ్రేణుల్లోనే అత్యంత ఎత్తయిన శిఖరం ‘ధూప్‌గఢ్

సత్‌పురా పర్వతశ్రేణుల్లోనే అత్యంత ఎత్తయిన శిఖరం ‘ధూప్‌గఢ్' ఇక్కడే ఉంది. ఈ శిఖరం పైనుంచి చూస్తే పచ్‌మఢీ పట్టణంతో పాటు చుట్టుపక్కల కొండలు, లోయలు కనువిందు చేస్తాయి. పర్వతారోహణపై మక్కువ గలవారిని ఈ శిఖరం ఎంతో ఆకట్టుకుంటుంది.

PC- Twinkle Bhaisare

సత్‌పురా పర్వతశ్రేణుల్లో ఎక్కడికక్కడ కనిపించే జలపాతాలు

సత్‌పురా పర్వతశ్రేణుల్లో ఎక్కడికక్కడ కనిపించే జలపాతాలు

సత్‌పురా పర్వతశ్రేణుల్లో ఎక్కడికక్కడ కనిపించే జలపాతాలు పచ్‌మఢీలోనూ చాలానే కనిపిస్తాయి. పచ్‌మఢీ కొండల మీదుగా దూకే బీ, డచెస్, రజత్ ప్రపాత్, అప్సరా జలపాతాల అందాలను చూసి తీరాల్సిందే. వేసవిలో ఈ జలపాతాల వద్ద పర్యాటకులు జలకాలాడటానికి ఇష్టపడతారు.

PC- Dinesh Valke

ధూప్‌గఢ్ శిఖరానికి దిగువన చేరిన జలపాతాల నీటితో సహజసిద్ధంగా

ధూప్‌గఢ్ శిఖరానికి దిగువన చేరిన జలపాతాల నీటితో సహజసిద్ధంగా

ధూప్‌గఢ్ శిఖరానికి దిగువన చేరిన జలపాతాల నీటితో సహజసిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు బోటింగ్‌కు అనువుగా ఉంటుంది. ఈ సరస్సులో పడవ ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను తిలకించడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది.

PC- Dinesh Valke

 సత్‌పురా జాతీయ అభయారణ్యం

సత్‌పురా జాతీయ అభయారణ్యం

పచ్‌మఢీ చుట్టూ విస్తరించుకున్న సత్‌పురా జాతీయ అభయారణ్యంలో అరుదైన జాతులకు చెందిన వృక్షాలు, మొక్కలు, లతలు, వన్యప్రాణులు కనిపిస్తాయి. ‘ఇండియన్ జెయింట్ స్క్విర్రల్'గా పిలుచుకునే భారీ ఉడుతలు, పులులు, చిరుతలు, జింకలు, దుప్పులు, కణుజులు, ఎలుగుబంట్లు, ఏనుగులు ఈ అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ఈ అడవిలో పాములు కూడా విరివిగానే కనిపిస్తాయి. సత్‌పురా అభయారణ్యంలో సఫారీ థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

PC - Siddharth Biniwale

పురాతన నేపథ్యం గల పచ్‌మఢీ పరిసరాల్లో అనేక చారిత్రక

పురాతన నేపథ్యం గల పచ్‌మఢీ పరిసరాల్లో అనేక చారిత్రక

పురాతన నేపథ్యం గల పచ్‌మఢీ పరిసరాల్లో అనేక చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో జటాశంకర్ గుహలో వెలసిన శైవక్షేత్రం భక్తులను ఆకట్టుకుంటుంది. అలాగే, చౌరాగఢ్ శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇవే కాకుండా, బాబా మహాదేవ్, గుప్త్ మహాదేవ్ వంటి పురాతన ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా సందర్శకులకు చక్కని అనుభూతిని ఇస్తాయి.

PC- Dinesh Valke

పచ్‌మఢీ సమీపంలోని భీమ్‌బెట్కా, బాఘ్, ఉదయగిరి

పచ్‌మఢీ సమీపంలోని భీమ్‌బెట్కా, బాఘ్, ఉదయగిరి

పచ్‌మఢీ సమీపంలోని భీమ్‌బెట్కా, బాఘ్, ఉదయగిరి గుహలలో గుహాకుడ్యాలపై ప్రాచీన మానవులు చిత్రించిన అపురూప చిత్రాలు సందర్శకులను అబ్బురపరుస్తాయి. చరిత్ర పూర్వయుగానికి చెందినవిగా భావిస్తున్న ఈ చిత్రాలు కనీసం పదివేల ఏళ్ల నాటివని పరిశోధకులు తేల్చారు.

PC- Chaitnyags

పాచ్ మారి వాతావరణం సంవత్సరం పొడవునా అద్భుతంగా

పాచ్ మారి వాతావరణం సంవత్సరం పొడవునా అద్భుతంగా

పాచ్ మారి వాతావరణం సంవత్సరం పొడవునా అద్భుతంగా వుంటుంది. కనుక ఎపుడైనా సందర్శించవచ్చు. అయితే అక్టోబర్ నుండి జూన్ వరకూ అనుకూలమైన ఉత్తమ సమయం. ఈ ప్రదేశం చేరాలంటే, భోపాల్ కు ట్రైన్ లేదా ఫ్లైట్ లో చేరి అక్కడ నుండి రోడ్డు మార్గం లో ప్రయాణించాలి.

PC- Twinkle Bhaisare

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

విమానంలో రావాలనుకుంటే దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు విమానాలు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి పచ్‌మఢీకి రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది.

పచ్‌మఢీకి 47 కిలోమీటర్ల దూరంలోని పిపారియా వరకు దేశంలోని అన్ని మార్గాల నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయి. పిపారియా నుంచి బస్సు లేదా ట్యాక్సీలో పచ్‌మఢీకి చేరుకోవచ్చు.

మధ్యప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల నుంచి పచ్‌మఢీకి విరివిగా బస్సులు అందుబాటులో ఉంటాయి.

PC - Kritika027

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X