Search
  • Follow NativePlanet
Share
» »శుచిగా, శుభ్రంగా లేకపోతే ఈ క్షేత్రంలో తేనెటీగలు మీకు శత్రువులు

శుచిగా, శుభ్రంగా లేకపోతే ఈ క్షేత్రంలో తేనెటీగలు మీకు శత్రువులు

పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం గురించి కథనం.

By Kishore

భారత దేశం అనేక దేవాలయాలకు నిలయం. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేతకత ఉంటుంది. ఆ ప్రత్యేకతలకు కొన్ని కథల రూపంలో ఉంటే మరికొన్ని మనకు కంటికి కూడా కనిపిస్తాయి. అయితే కంటికి కనిపించే ఆ సంఘటనలకు కారణాలు మాత్రం ఎంత వెదికినా కనిపించవు. శాస్త్రీయంగా ఎంత శోధించినా ఫలితం మాత్రం శూన్యం. అందుకే సైన్స్ కు కూడా అందని ఓ దివ్య శక్తి ఈ విశ్వంలో ఉందని చాలా మంది నమ్ముతారు. కొందురు ఆ దివ్య శక్తిని విష్ణువు అని మరి కొందరు పరమేశ్వరుడు అని చెబుతారు. మరికొంతమంది అల్లా అని పిలుస్తుండగా మరికొంతమంది ఏసు అని ప్రార్థిస్తున్నారు. పేరు ఏదైనా దివ్యశక్తి మాత్రం ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఇక ప్రస్తుత కథనంలో సైన్స్ కు కూడా అంతుపట్టని ఓ విషయాన్ని గురించి మనం తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఉన్న దేవతామూర్తుల విశిష్టతలను గురించి తెలుసుకొందాం.

మౌంట్ అబు చుట్టు పక్కల ఉన్న పర్యాటక కేంద్రాలు ఇవేమౌంట్ అబు చుట్టు పక్కల ఉన్న పర్యాటక కేంద్రాలు ఇవే

1. సప్త బుురుషుల కోరిక పై

1. సప్త బుురుషుల కోరిక పై

P.C: You Tube

భారత పురాణాల్లో సప్త బుురుషులకు ప్రత్యేక స్థానం ఉంది. వారు లోక కళ్యాణం కోసం ఈ దేశం మొత్తం మీద వివిధ చోట్ల అనేక యాగాలు చేశారని ఇందుకు ఆ త్రిమూర్తులు కూడా సహకరించారని తెలుస్తుంది.

2.స్వయంభువుగా

2.స్వయంభువుగా

P.C: You Tube

ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో ఒకసారి ఈ సప్త బుుషులు యాగం చేస్తూ పరమశివుడిని, విష్ణువును స్వయంభువుగా అవతరించాలని కోరుకొన్నారు.

3.పరమేశ్వరుడు సోమేశ్వరుడిగా

3.పరమేశ్వరుడు సోమేశ్వరుడిగా

P.C: You Tube

వారి కోరికను మన్నించి పరమేశ్వరుడు సోమేశ్వరుడిగా లింగ రూపంలో ఇక్కడ అవిర్భవించగా, విష్ణువు నరసింహుడిగా పక్క పక్కనే ఉన్న రెండు పర్వత గుహల్లో అవతరించారు. అందుకే ఈ క్షేత్రాన్ని సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అని అంటారు.

4.శివుడు, కేశవుడు ఒకే చోట

4.శివుడు, కేశవుడు ఒకే చోట

P.C: You Tube

శివుడు, కేశవుడు ఒకే చోట ఉండటం చాలా అరుదైన విషయం . అందువల్లే ఈ క్షేత్రం అటు శైవులతో పాటు వైష్ణవులకు కూడా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.

 5.ముసలి భక్తురాలు

5.ముసలి భక్తురాలు

P.C: You Tube

పూర్వం ఒక ముసలి భక్తురాలు ఇక్కడి సోమేశ్వరుడికి నిత్యం పూజలు చేసేది. ఇందుకోసం పర్వతం చుట్టుకొని రావాల్సి వచ్చేది. అయితే ఆరోగ్యం ఎంత బాగాలేకపోయినా, వయసు మీద పడుతున్నా ఆమె నిత్య పూజను మాత్రం విడిచిపెట్టేది కాదు.

6.పర్వతాన్ని చీల్చి

6.పర్వతాన్ని చీల్చి

P.C: You Tube

వ`ద్దురాలి ప్రయాసను గమనించిన పరమశివుడు ఆమె కోసం తన పర్వతాన్ని చీల్చి ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేసాడు.

7.అప్పటి నుంచి ఆ మార్గంలోనే

7.అప్పటి నుంచి ఆ మార్గంలోనే

P.C: You Tube

అప్పటి నుంచి ఆ మార్గంలోనే స్వామికి ప్రదక్షణ ఆ మార్గంలోనే చేస్తారు. ఈ సొరంగ మార్గం చిన్నగా ఉండి కొండ చీలి ఏర్పడినట్లు ఉంటుంది కానీ, ఎక్కడ కొండ పగలగొట్టినట్లు ఉండదు.

8.ఎంతలావు వారైనా

8.ఎంతలావు వారైనా

P.C: You Tube

ఎంత లావు ఉన్నవారైనా స్వామి పై భక్తితో ఆయన పేరును ఉచ్చరిస్తూ ఈ సన్నని మార్గం ద్వారా వెలుతారని భక్తుల నమ్మకం.

9.ఎంత సన్నగా ఉన్నవారు ప్రయత్నించినా

9.ఎంత సన్నగా ఉన్నవారు ప్రయత్నించినా

P.C: You Tube

అయితే అపనమ్మకంతో ఈ మార్గం గుండా స్వామి వారి దగ్గరికి వెళ్లాలని ఎంత సన్నగా ఉన్నవారు ప్రయత్నించినా వారి కోరిక నెరవేరదని స్థానిక పూజారులు చెబుతారు.

10.ఈ తేనెటీగలు వారిని తరుముతాయి

10.ఈ తేనెటీగలు వారిని తరుముతాయి

P.C: You Tube

అదే విధంగా ఇక్కడ ఈ గుహాలయంలో తేనెపట్లు చాలా ఉంటాయి. ఇవి భక్తులను ఏమీ చేయవు. అయితే ఎవరైతే శుచిగా, శుభ్రంగా లేకుండా ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే మత్రం ఈ తేనెటీగలు వారిని తరుముతాయని భక్తులు చెబుతారు.

11ముఖ్యంగా మహిళలు బహిష్టు సమయంలో

11ముఖ్యంగా మహిళలు బహిష్టు సమయంలో

P.C: You Tube

ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని స్థానికుల కథనం. అందువల్లే ఆ ఆలయంలోకి మహిళలతోపాటు పురుషులు కూడా చాలా శుచిగా శుభ్రంగా వెలుతారు. ముఖ్యంగా మహిళలు బహిష్టు సమయంలో ఆ ఛాయలకు కూడా వెళ్లరు.

12 శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని

12 శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని

P.C: You Tube

సోమేశ్వరుడిని పూజించి పక్కనే ఉన్న ఇంకొక గుహలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించడానికి అక్కడే మార్గం కూడా ఉంది. ప్రస్తుతం సోమేశ్వరుడిని దర్శించిన ప్రతి ఒక్కరూ లక్ష్మీ నరసింహస్వామిని కూడా తప్పక దర్శించుకొంటున్నారు.

13సిరిసంపదలతో పాటు

13సిరిసంపదలతో పాటు

P.C: You Tube

గుహాలయాల్లో ఉన్న పరమేశ్వరుడికి, నరసింహుడి రూపంలో ఉన్న విష్ణువుకు చాలా మహత్యం ఉందని భక్తుల నమ్మకం. ఈ స్వామిని సేవిస్తే సిరిసంపదలతో పాటు అపారమైన తెలివితేటలు లభిస్తాయని స్థానికుల నమ్మకం.

14కొబ్బరికాయ ముడుపు

14కొబ్బరికాయ ముడుపు

P.C: You Tube

సంతానం లేనివారు ఈ ఆలయంలో కొబ్బరికాయ ముడుపు కడితే పిల్లలు కలుగుతారని నమ్మకం. పిల్లలు పుట్టిన తర్వాత దంపతలు ఇద్దరూ స్వామిని దర్శనం చేసుకొని తొట్టెలు కట్టి తమ ముడుపును తీర్చుకొంటారు.

15కార్తీక మాసంలో

15కార్తీక మాసంలో

P.C: You Tube

ఈ క్షేత్రం దగ్గరగా గో రక్షణ శాల ఉంది. చాల మంది భక్తులు ఇక్కడ గో పూజ కూడా చేస్తుంటారు. కార్తీక మాసంలో ఈ క్షేత్రంలో విశేష పూజలు జరుగుతాయి.

16 లక్ష దీపారాధన

16 లక్ష దీపారాధన

P.C: You Tube

ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపారాధన జరుగుతుంది. దీనిని చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.

17పాలకుర్తి సోమేశ్వరుడి సమాధి

17పాలకుర్తి సోమేశ్వరుడి సమాధి

P.C: You Tube

ప్రఖ్యాత కవి పాలకుర్తి సోమేశ్వరుడి సమాధి కొండ దిగువన ఉంది. ఈయన రచించిన పండితారాధ్యుల చరిత్ర, దశమ పురాణం మొదలైన క్షేత్రాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఈయన తల్లిదండ్రులకు సంతానం లేకపోతే సోమేశ్వరుడిని పూజించిన తర్వాతనే సంతానం కలిగిందని చెబుతారు.

18బమ్మెర

18బమ్మెర

P.C: You Tube

ఈ క్షేత్రానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో భాగవతం రచించిన మహాకవి పోతన నివశించిన గ్రామం బమ్మెర ఉంది. ఈ క్షేత్రాన్ని సందర్శించిన చాలా మంది అక్కడకి వెలుతుంటారు.

19. స్టేషన్ ఘనాపూర్ రైల్వేస్టేషన్

19. స్టేషన్ ఘనాపూర్ రైల్వేస్టేషన్

P.C: You Tube

హైదరాబాద్ వరంగల్ దారిలో స్టేషన్ ఘనాపూర్ రైల్వేస్టేషన్ వస్తుంది. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తే పాలకుర్తి వస్తుంది.

20.నేరుగా బస్సు సౌకర్యం

20.నేరుగా బస్సు సౌకర్యం

P.C: You Tube

వరంగల్ నుంచి పాలకుర్తికి 40 కిలోమీటర్ల దూరం. వరంగల్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. భోజన వసతి అంతగా బాగా లేదు. కొండ దిగువన కాఫీ, టీ, బిస్కెట్ వంటివి మాత్రమే లభిస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X