Search
  • Follow NativePlanet
Share
» »శ్రీ శివశక్తుల సమైక్య తేజం శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం-పళని దర్శిస్తే ఆ ఆరోగ్య సమస్యలన్నీ మాయం

శ్రీ శివశక్తుల సమైక్య తేజం శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం-పళని దర్శిస్తే ఆ ఆరోగ్య సమస్యలన్నీ మాయం

దక్షిణ భారతం దేశంలో నెలకొని ఉన్నశ్రీ సుబ్రమణ్యస్వామి వారి ఆరు ప్రధాన క్షేత్రాలలో పళని క్షేత్రం ఒకటి. ఈ ఆరింటిలో మూడవదిగా ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రం ఆరోగ్యానికి మరియు ఆధ్యాత్మిక శోభకు నిలయంగా పేరుపొంద

దక్షిణ భారతం దేశంలో నెలకొని ఉన్నశ్రీ సుబ్రమణ్యస్వామి వారి ఆరు ప్రధాన క్షేత్రాలలో పళని క్షేత్రం ఒకటి. ఈ ఆరింటిలో మూడవదిగా ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రం ఆరోగ్యానికి మరియు ఆధ్యాత్మిక శోభకు నిలయంగా పేరుపొందినది. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్యం క్షేత్రం ప్రతి రోజు వేలాది భక్తులుతో కార్తికేయ స్వామి నామ స్మరణంతో ప్రతిద్వనించే పుణ్యదామం పళని దేవాలయం.

ఆహ్లదకరమైన వాతావరణంలో నయనానందకరంగా పళని ఆలయ పరిసర ప్రాంతాలు కనబడుతాయి. ముఖ్యంగా వర్షకాలం, శీతాకాలంలో ఇక్కడి ప్రక్రుతి మనోజ్ఞానంగా దర్శనమిస్తుంది. ఈ క్షేత్రం తమిళనాడు జిల్లాలోని దిండుగల్ జిల్లాలో మదురై నుండి సుమారు 120కిలో మీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతిగాంచిన మహిమానితమైన దివ్వ క్షేత్రం పళని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పళని కొండపైన స్వామివారి క్షేత్రం నిర్మింపబడినది

పళని కొండపైన స్వామివారి క్షేత్రం నిర్మింపబడినది

పళని కొండపైన స్వామివారి క్షేత్రం నిర్మింపబడినది. ఇక్కడి స్వామి వారిని దండాయుదపాని అని కొలుస్తారు. తమిళంలో ఈయనను పళని మురగ అని కీర్తిస్తారు. ఈ పళని క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపున దారియై, యుక్తకేశుడై నిలబడి చిరనవ్వులొలికిస్తుంటాడు.

PC: Jaseem Hamza

అదేశ్వరూపం భగవాన్ శ్రీరమణ మహర్షిది

అదేశ్వరూపం భగవాన్ శ్రీరమణ మహర్షిది

అదేశ్వరూపం భగవాన్ శ్రీరమణ మహర్షిది. భగవాన్ , రమణులు సుబ్రహ్మణ్యడి అవతారాలని చెబుతుంటారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపిణ్యంతో కనబడటంలో అంతర్థానం నన్ను చేరుకోవాలంటే, అన్నీ వదిలేసి నన్ను చేరుకోమని సందేషమిస్తున్నట్లు అర్థం.

ఈ పళనీ క్షేత్రం జ్ఞానాన్ని ప్రసాదించే క్షేత్రం

ఈ పళనీ క్షేత్రం జ్ఞానాన్ని ప్రసాదించే క్షేత్రం

ఈ పళనీ క్షేత్రం జ్ఞానాన్ని ప్రసాదించే క్షేత్రం, అంతే కాదు, ప్రఖ్యాత కారుడి ఉత్సవం మొదలైన ఈ క్షేత్రం పళని. ఇక్కడ పళని క్షేత్రంలోని గర్భగుడిలోని స్వామి వారి మూర్తి నవపాశ్వనాలతో చేయబడినది. ఇటువంటి దివ్వమైన స్వరూపం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్దబోగార్ అనే మహర్షి చేశారు. స్వామి వారి విగ్రహాన్ని అత్యంత విషపూరితమైన నవపాషాణాలతో భోగార్‌ ముని తయారు చేశారు.

PC: YOUTUBE

పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామి దేవతా మూర్తి శరీరంలో

పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామి దేవతా మూర్తి శరీరంలో

పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామి దేవతా మూర్తి శరీరంలో తొడ భాగం నుండి విభూది తీసి కుష్టురోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇవ్వగా వారికి రోగం పోయేదని, అలా ఇవ్వగా ఇవ్వగా స్వామి వారి తొడభాగం అరిగిపోవడంతో, కొద్ది కాలం తర్వాత అలా పంచడం మానేసారు. ఇప్పటికీ స్వామి వారి వెనుక బాగం నుండి చూస్తే అది కనబడుతుందని పెద్దలు చెబుతారు. కానీ మనకు సాధారణంగా ఆ అవకాశం కలగదు.

పళనిలో ప్రస్తుతం ఉన్నఈ సుబ్రహ్మణ్య స్వామి

పళనిలో ప్రస్తుతం ఉన్నఈ సుబ్రహ్మణ్య స్వామి

పళనిలో ప్రస్తుతం ఉన్నఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని క్రీ.శ 7వ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తర్వాత పాండ్యుళ కాలంలో ఇంకా అభివ్రుద్ది చెందినది.

PC: YOUTUBE

ఈ పళని క్షేత్రానికి ఒక పురాణ గాథ ఉంది.

ఈ పళని క్షేత్రానికి ఒక పురాణ గాథ ఉంది.

ఈ పళని క్షేత్రానికి ఒక పురాణ గాథ ఉంది. ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞాన ఫలాన్ని అందిస్తాడు. ఆ జ్ఞాన ఫలంపే శివపార్వతుల ఇద్దరు కుమారులలో ఎవరో ఒకరికి అందించమని చెబుతాడు. అయితే ఆ జ్ఞానఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారులిద్దరినీ ముల్లోకాలను తిరిగి రమ్మని వారు చెబుతారు. తక్షణం కుమార స్వామి తన నెమలి వాహనం తీసుకుని లోకాల ప్రదక్షిణకు వెళ్తాడు.

PC: Ranjithsiji

కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్లినా

కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్లినా

కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్లినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు. తిరిగి కైలాసాన్ని చేరుకుని జరిగిన విషయం తెలుసుకుంటాడు. వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల ప్రదక్షిణ పూర్తి చేశాడని తెలుసుకుని, నిరాశగా స్కందుడు భూలోకంలోని పళని ప్రదేశానికి చేరుకుంటాడు.

PC: YOUTUBE

కార్తికేయుడు చిన్నబుచ్చుకుని కైలాసం వదిలి భూలోకం వచ్చి

కార్తికేయుడు చిన్నబుచ్చుకుని కైలాసం వదిలి భూలోకం వచ్చి

కార్తికేయుడు చిన్నబుచ్చుకుని కైలాసం వదిలి భూలోకం వచ్చి పళనిలోని ఒక కొండ మీద మౌన ముద్రలో ఉంటాడు. విషయం తెలుసుకున్న గౌరీశంకరులు అక్కడకు చేరుకుంటారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని ఊరడిస్తాడు.

PC: YOUTUBE

అప్పుడు శివుడు కుమారా..

అప్పుడు శివుడు కుమారా..

అప్పుడు శివుడు కుమారా.. సకల జ్ఞానాలకు నీవే ఫలానివి అని బుజ్జగిస్తాడు. సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో పళం, నీవు అంటే నీ ఈ రెండు కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీదే కొలువు ఉంటానని తల్లిదండ్రులకు చెబుతాడు. అందుకు సరేనన్న శివపార్వతులు కైలాసానికి తిరిగి వెళ్తారు.

ఆలయానికి ఎలా వెళ్లాలి:

ఆలయానికి ఎలా వెళ్లాలి:

పళని క్షేత్రం దిండుగల్ జిల్లాలో మదురైకు 120కిలోమీటర్లు దూరంలో ఉంది.

PC: YOUTUBE

ఎయిర్ :

ఎయిర్ :

హైదరాబాద్ నుండి మదురైకి చేరుకుని అక్కడ నుండి రోడ్డు, రైలు, మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చు.

PC: YOUTUBE

రైలు:

రైలు:

చెన్నై సెంట్రల్ లేదా మదురై చేరుకోవాలి. మదురై నుండి కోయబత్తూర్ రైళ్ళు పొల్లాచి మీదుగా, పళని రైల్వేస్టేషన్ నుండే వెలుతాయి. చెన్నై సెంట్రల్-పళని ఎక్స్ ప్రెస్ తిరుచెందూర్ నుండి మదురై మీదుగా పళని చేరుతుంది. అక్కడి నుండి ఆలయం రెండు కిలోమీట్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి ఆయలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి ఆటో బస్సు సౌకర్యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X