Search
  • Follow NativePlanet
Share
» »పంచగంగ టెంపుల్‌: ఇక్కడ ఐదు నదుల నీరు నంది నోటి నుండి ప్రవహిస్తుంది..

పంచగంగ టెంపుల్‌: ఇక్కడ ఐదు నదుల నీరు నంది నోటి నుండి ప్రవహిస్తుంది..

పంచగంగ టెంపుల్‌: ఇక్కడ ఐదు నదుల నీరు నంది నోటి నుండి ప్రవహిస్తుంది..

మహారాష్ట్ర, పుణెలోని, బలేశ్వర్ అనే ప్రాంతంలో లింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతంలోనే కృష్ణానది జన్మించింది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం దగ్గర పశ్చిమ కనుమల్లో జన్మించిన కృష్ణమ్మకు పుట్టిన చోటే ఓ ఆలయం ఉంది. అందులో చెక్కిన గోవు ముఖంలోనుంచి వచ్చే నీటి ధారే కొండలూ కోనలూ దాటి కృష్ణానదిగా ప్రవహిస్తుంది. నిజానికి ఈ ఆలయంలో శివుడికి పూజలు జరుగుతాయి.

కానీ కృష్ణమ్మ ఇక్కడే పుట్టింది కాబట్టి దీన్ని కృష్ణాబాయి ఆలయంగా పిలుస్తారు స్థానికులు. 17-18 శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయంలో చూడచక్కని కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది. కృష్ణాబాయి ఆలయానికి కిలోమీటరు దూరంలో ప్రసిద్ధి చెందిన పంచగంగ ఆలయం దర్శనమిస్తుంది.

4500 ఏళ్ల కిందటి ఈ కృష్ణుడి గుడిలో కృష్ణ, వేణీ, సావిత్రి, కొయనా, గాయత్రి నదులు సంగమిస్తాయని నమ్మకం. ఈ గుడిలోని గోముఖం నుంచి వచ్చే ధార ఆ అయిదు నదులకూ ప్రతిరూపమని చెబుతారు. ఇక్కడికి ఏడాది పొడవునా భక్తులు వస్తుంటారు.

 గోముఖం నుండి బయటకు వచ్చిన కృష్ణానది

గోముఖం నుండి బయటకు వచ్చిన కృష్ణానది

PC:Karthik Easvur

గోముఖం నుండి బయటకు వచ్చిన కృష్ణానది అతివేగంతో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆగ్నేయ మూలగా నుండి నలభై అయిదుమైళ్ళ ప్రవహించి తర్వాత దక్షిణ మహారాష్ట్రం గుండా మరో పదిమైళ్ళ సాగి వేణీ నదిని కలుపకుని కృష్ణవేణీనదిగా ఖ్యాతి చెందినది. తర్వాత దక్షిణ మహారాష్ట్రలో మరో 150మైళ్ళు ప్రవహించిన కృష్ణనది కర్ణాటకలో కలుస్తుంది.

ఐదు నదుల సంగమ ప్రదేశంలో నిర్మించిన ఆలయాన్ని

ఐదు నదుల సంగమ ప్రదేశంలో నిర్మించిన ఆలయాన్ని

PC: youtube

కృష్ణా, వీణా, సావిత్రి, కోయనా, గాయత్రి... ఈ ఐదు నదుల సంగమ ప్రదేశంలో నిర్మించిన ఆలయాన్ని ఇక్కడ చూడొచ్చు. ఆలయంలో గోముఖి విగ్రహం, శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూడొచ్చు. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత మూలంగా ఏడాది పొడవునా భక్తులు సందర్శిస్తుంటారు.

ఈ ఆలయాన్ని 13 వ శతాబ్దంలో దేవగిరి యాదవ్ రాజు సింఘండియో

ఈ ఆలయాన్ని 13 వ శతాబ్దంలో దేవగిరి యాదవ్ రాజు సింఘండియో నిర్మించారు. తరువాత, 16 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని మరాఠా చక్రవర్తి శివాజీ మార్చారు. ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది మరియు కృష్ణుడి అందమైన విగ్రహంతో అలంకరించబడింది.

ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది

ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది

Pc: SMU Central University Libraries

ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది మరియు అతని అందమైన విగ్రహాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం వెనుక ఉన్న పురాణం, బ్రహ్మ, విష్ణు మరియు శివునిపై సావిత్రి శాపంతో దగ్గరి సంబంధం ఉంది. అవి ఇక్కడ కోయనా, కృష్ణ, వెన్నా నదులలోకి ప్రవహిస్తాయి. అయితే వెన్నానది కొంత దూరం ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణ, వెన్నా ఈ రెండు నదులు కలసి కృష్ణవేణి నదిగా ముందుకు ప్రవహించగా, కోయినానది మహాబలేశ్వర్ కొండల్లో పుట్టి అందులో ఒక పాయ మహాబలేశ్వర్ వైపు వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. మహబలేశ్వరంలోని కొండమీదున్న కృష్ణవేణి ఆలయంలో గోముఖం నుంచి వెలువడే నీటిధార సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

ఇక కృష్ణానది జన్మించిన స్థానం ఒక కొండ మొదలులోనే

ఇక కృష్ణానది జన్మించిన స్థానం ఒక కొండ మొదలులోనే

ఇక కృష్ణానది జన్మించిన స్థానం ఒక కొండ మొదలులోనే ఒక ఎత్తైన చోట కొండ అంచు ఉంది. ఇది ఇలా ఉంటె ఆలయ ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఐదు తూములు లాంటి రంద్రాలు ఉండగా, ఇవి ఒకదానికి ఒకటి ఆరు అగుడుల దూరంలో ఉన్నాయి. ఈ ఒక్కో రంద్రం గుండా నీరు ఎపుడు వస్తూ ఉంటుంది. అయితే ఈ ఐదు నదులు ఆలయానికి వెనుకవైపు ఉన్న కొండమీద నుండి ప్రవహిస్తూ వస్తూ, ఈ రంద్రాల గుండా కాలువలోకి చేరి ఒకే నదిగా ప్రవహిస్తాయి. అదే కృష్ణానదిగా ప్రవహిస్తుంది. దీనినే పంచగంగ అని అంటారు.

అక్కడి గోముఖం నుంచి జాలువారే నీటిధారను

అక్కడి గోముఖం నుంచి జాలువారే నీటిధారను

PC: youtube

అక్కడి గోముఖం నుంచి జాలువారే నీటిధారను పవిత్రజలంగా భావించి, భక్తులు తలపై చల్లుకుంటారు. అక్కడి నుంచి కొంచెం దిగువకు వెళ్తే ఆలయాల కేంద్రంగా పేరుగాంచిన మహాబలేశ్వరం వస్తుంది. ఆ ప్రాంతాన్ని ‘వై' అనీ, ‘వాయి' అనీ పిలుస్తారు.వాయిలో దొడ్డ గణపతి మహాబలేశ్వరం తర్వాత కృష్ణమ్మ వాయి పట్టణం గుండా ప్రవహిస్తుంది. మహాభారత కాలంలో విరాట నగరంగా పిలిచిన ఈ పట్టణానికి ఆలయాల నగరంగా కూడా పేరుంది.

మహాబలేశ్వరుని ఆలయం కనిపిస్తుంది

మహాబలేశ్వరుని ఆలయం కనిపిస్తుంది

ఈ మందిరం నుండి బయటికి రాగానే అక్కడ మనకి మహాబలేశ్వరుని ఆలయం కనిపిస్తుంది. ఇది అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గర్భగుడిలోని మహాబలేశ్వరస్వామి శివలింగ విగ్రహ మూర్తిగా దర్శనం ఇస్తాడు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వచ్చి పంచగంగని చూసి తరిస్తారు. ఆలయం సమీపంలో ఉన్న దుకాణాల్లో రంగురంగుల హ్యాండీక్రాఫ్ట్స్ ను కొనుగోలు చేయవచ్చు.

ఎప్పుడు సందర్శించవచ్చు

ఎప్పుడు సందర్శించవచ్చు

pc:Karthik Easvur

మీరు ఉదయం 8:00 నుండి రాత్రి 10:00 వరకు ఆలయాన్ని సందర్శించవచ్చు మరియు మొత్తం ఆలయాన్ని చూడటానికి గంట సమయం పడుతుంది. ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా మద్యరీతిలో వాతావరణం ఉంటుంది మరియు అక్టోబర్ నుండి జూన్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం.

ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గం ద్వారా:
పర్యాటకులు ప్రైవేట్ లేదా పబ్లిక్ బస్సులు ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. పర్యాటకులు మహాబలేశ్వర్ నుండి టాక్సీలను ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం ద్వారా:
మహాబలేశ్వర్‌కు సమీప రైల్వే స్టేషన్ 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న వతూర్ వద్ద ఉంది.

విమాన మార్గం: సమీప విమానాశ్రయం పూణేలో 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X