Search
  • Follow NativePlanet
Share
» »పంచముఖ క్షేత్రం చూశారా

పంచముఖ క్షేత్రం చూశారా

పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం గురించిన కథనం.

రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో కొలువుదీరడానికి ముందు పన్నెండేళ్లు తపస్సు చేసిన స్థలం ఇదే. ఇక్కడ రాఘవేంద్రస్వామి హనుమంతుడిని దర్శించుకొన్నాడని చెబుతారు. అటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

ఎక్కడ ఉంది?

ఎక్కడ ఉంది?

P.C: You Tube

రాఘవేంద్రస్వామి 12 ఏళ్లు తపస్సు చేసిన ప్రాంతం రాయచూర్ లోని గాంధాల్ గ్రామంలోనే. ఇక్కడ రాఘవేంద్రస్వామి పంచముఖ ఆంజనేయుడి దర్శనాన్ని పొందాడని చెబుతారు.

పంచముఖి ఆంజనేయ

పంచముఖి ఆంజనేయ

P.C: You Tube

ఇక్కడ ఇప్పటికీ మనం పంచముఖ ఆంజనేయస్వామిని చూడవచ్చు. హనుమ, హయగ్రీవ, వరాహ, నరసింహ, గరుడ ముఖాలను ఆంజనేయస్వామి కలిగి ఉంటాడు.

పన్నెండు ఏళ్లపాటు

పన్నెండు ఏళ్లపాటు

P.C: You Tube

శ్రీ రాఘవేంద్రస్వామి పన్నెండేళ్ల కాలం పాటు తపస్సు చేసిన ప్రాంతం ఈ గ్రామంలో ఒక చిన్న గుట్ట పైన ఉంది. ఈ గుట్ట పై ఉన్న రాళ్లు సహజ సిద్ధంగా ఏర్పడిన శిల్పాలవలే కనిపించడం విశేషం. ఇందులోనే ఒక శిల్పం పంచముఖ ఆంజనేయస్వామి వలే కనిపిస్తుంది.

గుట్ట పై భాగంలో

గుట్ట పై భాగంలో

P.C: You Tube

మీరు ఒకసారి గుట్ట పై భాగానికి చేరుకొంటే అక్కడ ఒక గుహలోపల ఒక గర్భగుడి కనిపిస్తుంది. గుహలోనికి వెలితే ఇది ఒక పవిత్రమైన స్థలంగా మీకు గోచరిస్తుంది. అందువల్లే గురురాఘవేంద్రుడు ఈ గుహను తన తపస్సుకు ఎంచుకొనడంలో అశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే ఈ స్థలం అంత ప్రశాంతంగా ఉంటుంది.

పంచముఖి క్షేత్రం

పంచముఖి క్షేత్రం

P.C: You Tube

పంచముఖి ఆంజనేయస్వామి రాఘవేంద్రుడికి దర్శనమిచ్చిన ఈ ప్రాంతాన్ని మంచముఖి క్షేత్రం అని పిలుస్తారు. ఇది ఒక ప్రముఖ ధార్మిక క్షేత్రం. ఈ క్షేత్రంలో పంచముఖి ఆంజనేయుడికి నిత్యం పూజలు జరుగుతాయి.

గుహ

గుహ

P.C: You Tube

గుహలోపల ఒక బండ పై భాగంలో మనం పంచముఖి ఆంజనేయుడిని చూడవచ్చు. ఈ ప్రతిమకే నిత్యం పూజలు జరుగుతాయి. పూర్వం ఇక్కడ అనంతాచార్యులవారు ఇక్కడ శివుడు, గణపతి, నాగ దేవవతల విగ్రహాలను ప్రతిష్టించారని చెబుతారు.

పాదరక్షలు

పాదరక్షలు

P.C: You Tube

ఇక్కడి ఆంజనేయుడికి భక్తులు ప్రతి ఏడాది పాదరక్షలు అందజేస్తారు. ఆంజనేయుడు ఈ పాదరక్షలను వేసుకొని తిరుగుతాడని భక్తుల నమ్మకం. ఇక్కడ ఒక పొడవైన రాతి బండ ఉంది. దీని పైనే ఆంజనేయుడు విశ్రాంతి తీసుకొంటాడని ప్రతీతి.

గ్రామదేవత ఎరుకులమ్మ

గ్రామదేవత ఎరుకులమ్మ

P.C: You Tube

ఇక్కడకి కూతవేటు దూరంలో గ్రామదేవత ఎరుకులమ్మ దేవాలయం ఉంది. ఈమెను స్వయంభువుగా భావిస్తారు. బాలారిష్టాలతో బాధపడుతున్న పిల్లలకు ఇక్కడ తాయత్తులు కూడా అందజేస్తారు.

మంత్రాలయానికి దగ్గర్లో

మంత్రాలయానికి దగ్గర్లో

P.C: You Tube

మంత్రాలయానికి రాయచూరుకు మధ్య ఈ పుణ్యక్షేత్రం ఉంది. మంత్రాలయం నుంచి కేవలం 30 నిమిషాల ప్రయాణంతో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. సాధారణంగా మంత్రాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని తప్పకుండా సందర్శిస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X