Search
  • Follow NativePlanet
Share
» »పాపికొండల మధ్యలో మరుపురాని ప్రయాణం !

పాపికొండల మధ్యలో మరుపురాని ప్రయాణం !

కొన్ని ప్రదేశాలు మనం వేసుకున్న అంచనాలకు అందుకోక నిరాశను కలిగిస్తాయి. కొన్ని ప్రదేశాలు అంచనాలకు మించి మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలాంటి కోవకి చెందినవే పాపికొండలు.

కొన్ని ప్రదేశాలు మనం వేసుకున్న అంచనాలకు అందుకోక నిరాశను కలిగిస్తాయి. కొన్ని ప్రదేశాలు అంచనాలకు మించి మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలాంటి కోవకి చెందినవే పాపికొండలు. అనుకున్నదానికంటే బాగా రసానుభూతిని కలిగిస్తుంది ఈ ప్రదేశం.

నాగార్జునసాగర్ - శ్రీశైలం బోట్ ట్రిప్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండినాగార్జునసాగర్ - శ్రీశైలం బోట్ ట్రిప్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత ప్రాంతం. హైదరాబాదు నగరానికి 410 కిలోమీటర్ల దూరంలోను, ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోను ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణం మొత్తం అంతా చూసి మీరు 'ఆంధ్రా కాశ్మీరం' అని ఆనకమానదు. ఎండాకాలం, వర్షాకాలం ... ఇలా ఏ కాలమైన సరే ఇక్కడి వాతావరణం చల్లగానే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకిష్టమైతే ఒకరోజు లేదా రెండు రోజులు పాపికొండల చెంతన విహరించండి ఇలాగా ...

పాపి కొండల అందాలు

పాపి కొండల అందాలు

పాపికొండలు గోదావరి నది మధ్యలో ఉన్నాయి. ఈ కొండలు రాజమండ్రి కి సుమారుగా 100 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి పర్యాటకుడు బోట్ లో ప్రయాణించి పాపికొండల అందాలను చూస్తూ తననుతాను మరిచిపోతుంటాడు.

చూసి వచ్చే ప్రదేశాలు

గండిపోచమ్మ ఆలయం, పాపి కొండలు, పేరంటపల్లి ఆశ్రమం మరియు దేవాలయం

బోట్ లో ప్రయాణించేటప్పుడు చూసేవి

పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతం, దేవీపట్నం, కొరుటూరు బేంబూహట్స్‌ / కొల్లూరు వెదురు గుడారాలు

Photo Courtesy: KRISHNA SRIVATSA NIMMARAJU

అల్పాహారం

అల్పాహారం

విహారయాత్రలో భాగంగా ఉదయం పూట అల్పాహారం ( బ్రేక్ ఫాస్ట్ ) , మధ్యాహ్నం వెజిటెరియాన్ మీల్స్ మరియు మినరల్ వాటర్ దొరుకుతుంది.

Photo Courtesy: Prateek Rungta

రేవు వద్ద ఎక్కుతున్న ప్రయాణీకులు

రేవు వద్ద ఎక్కుతున్న ప్రయాణీకులు

ఉదయం ఎడుగంటల ముప్పై నిమిషాలకు రాజమండ్రి నుంచి రోడ్ జర్నీ ప్రారంభం అవుతుంది. పట్టుసీమ రేవు / పోలవరం రేవు / పురుషోత్తమపట్నం రేవు ల వద్దకి చేరుకుంటాం. ఇక్కడి నుంచి అసలు ప్రయాణం మొదలవుతుంది.

Photo Courtesy: KRISHNA SRIVATSA NIMMARAJU

గండి పోచమ్మ ఆలయం

గండి పోచమ్మ ఆలయం

ఉదయం తొమ్మిది గంటలకి బోట్ లో అల్పాహారం. అల్పాహారం చేసిన పిమ్మట పవిత్ర గోదావరి నది మీద ప్రయాణం ప్రారంభం అవుతుంది. పది గంటల ముప్పై నిమిషాలకి గండిపోచమ్మ ఆలయం చేరుకుంటాం. ఆలయ దర్శనం కూడా అక్కడే మరి.

Photo Courtesy: andhra temples

కేరింతల నడుమ ...

కేరింతల నడుమ ...

మధ్యాహ్నం ఒంటి గంటకి లంచ్ లో భాగంగా వెజిటెరియాన్ మీల్స్ వడ్డిస్తారు. లంచ్ గోదావరి నది పై బోట్ లో జర్ని చేస్తూ ఆరగించవచ్చు. రెండు గంటలకి పాపికొండలు చేరుకుంటాం. పాపి కొండల మధ్యలో ప్రయాణం కేరింత నడుమ ఉల్లసవంతంగా జరుగుతుంది.

Photo Courtesy: rameshkuruganti

రామకృష్ణ ఆశ్రమం

రామకృష్ణ ఆశ్రమం

మధ్యాహ్నం మూడు గంటలకు ఖమ్మం జిల్లాలోని పేరంటపల్లి గ్రామాన్ని చేరుకుంటాం, ఇక్కడే శివుని దర్శనం తో పాటుగా రామకృష్ణ ముని వాటిక (ఆశ్రమం) మరియు వీరేశ్వర స్వామి ఆలయం చూడవచ్చు.

Photo Courtesy: Praneeth Medukonduru

జ్ఞాపకాలను తిరగేస్తూ ..

జ్ఞాపకాలను తిరగేస్తూ ..

మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి బోట్ మీద పట్టుసీమ రేవు/ పోలవరం రేవు / పురుషోత్తమపట్నం రేవు లకి తిరుగు ప్రయాణం. రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి రాజమండ్రికి రోడ్డు ప్రయాణం ప్రారంభం మరియు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి రాజమండ్రి లో ఉంటాం.

ఛార్జీలు

పెద్దలకి 600 రూపాయలు
పిల్లలకి 400 రూపాయలు ( 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు )

Photo Courtesy: nekkantivk

బోట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ ఇలా

బోట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ ఇలా

బోట్ లో లభించే సౌకర్యాలు

బోట్ మానేజర్, సిబ్బంది మరియు గైడ్

గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చోవడానికి సీట్ లు మరియు టాయ్ లెట్ లు

మొదటి అంతస్తులో మైదానంతో కూడిన ఓపెన్ డెక్ మరియు ఆడియో సిస్టం

ఎంటర్‌టేన్‌మెంట్ అందిచేందుకు ప్రోగ్రాంలు

Photo Courtesy: ramanagsk

పాపి కొండల సుందర దృశ్యం

పాపి కొండల సుందర దృశ్యం

చూసే ప్రదేశాలు

గండి పోచమ్మ ఆలయం, పాపి కొండలు, పేరంటపల్లి, కొరుటూరు / కొల్లూరు క్యాంప్ సైట్

బోట్ నుంచి చూసేవి

పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతం, దేవీపట్నం

Photo Courtesy: Gireesh Reddy

ప్యాకేజీలో భాగంగా

ప్యాకేజీలో భాగంగా

మొదటి రోజు

రైల్వే స్టేషన్ నుంచి పిక్ అప్ చేసుకోవడం, బ్రేక్ ఫాస్ట్, వెజి టె రియాన్ లంచ్, సాయంత్రం టీ తో పాటు బిస్కుట్లు, రాత్రికి నాన్ - వెజ్ డిన్నర్ , రాత్రి కొల్లూరు వెదురు గుడారాలలో బస.

రెండవ రోజు

అల్పాహారం, నాన్ - వెజ్ లంచ్ మరియు సాయంత్రం టీ తో పాటు బిస్కట్లు . తిరిగి రాత్రి మిమ్మల్ని రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేయడం.

Photo Courtesy: KRISHNA SRIVATSA NIMM

మొదటి రోజు - రాజమండ్రి రైల్వే స్టేషన్

మొదటి రోజు - రాజమండ్రి రైల్వే స్టేషన్

ఉదయం 7 : 30 గంటలకి రైల్వే స్టేషన్ లో మిమ్మల్ని పిక్ అప్ చేసుకొని లాడ్జ్ కి తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెబుతారు. రోడ్డు మార్గం ద్వారా పట్టుసీమ రేవు వద్ద / పురుషోత్తమపట్నం రేవు వద్ద కి చేరుకుంటాం.

Photo Courtesy: Adityamadhav83

మొదటి రోజు - అల్పాహారం

మొదటి రోజు - అల్పాహారం

ఉదయం 9 గంటలకి బోట్ లోకి ప్రవేశం. బోట్ లోనే అల్పాహారం తరువాత పవిత్ర గోదావరి నది మీద యాత్ర ప్రారంభం.

Photo Courtesy: Neel Shah

మొదటి రోజు - లంచ్

మొదటి రోజు - లంచ్

ఉదయం 10 గంటలకి గోదావరి నది తీరాన ఉన్న గండి పోచమ్మ ఆలయ దర్శనం. ఉదయం 11 గంటలకి బోట్ జర్ని దేవీపట్నం మీదుగా ... ప్రయాణంలో ఉండగానే మధ్యాహ్నం ఒంటి గంటకి వెజిటెరియాన్ లంచ్ వడ్డిస్తారు.

Photo Courtesy: papihills

మొదటి రోజు - స్వయంభూ లింగాకార

మొదటి రోజు - స్వయంభూ లింగాకార

మధ్యాహ్నం 2 గంటలకి పాపికొండల వద్దకి చేరుకుంటాం. పాపి కొండల మధ్యలో జర్ని ఆహ్లాదంగా, ఉల్లాసభరితంగా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకి పేరంటపల్లి గిరిజన గ్రామాన్ని చేరుకుంటాం. 1927 వ సంవత్సరంలో పూజ్య స్వామీజీ బాలానంద సరస్వతి ఏర్పాటు చేసిన రామకృష్ణ ముని వాటిక ( ఆశ్రమం ) ని ఇక్కడ చూడవచ్చు. స్వయంభూ లింగాకార శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ దర్శనంతో పాటుగా చుట్టూ పక్కల ప్రాంతాల సందర్శన మరియు క్యాంప్ సైట్ (గుడారాలు) కి ప్రయాణం.

Photo Courtesy: Dineshthatti

మొదటి రోజు - రాత్రి బస

మొదటి రోజు - రాత్రి బస

సాయంత్రం 4: 30 గంటలకి ఖమ్మం జిల్లాలోని కొల్లూరు గిరిజన గ్రామంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన వెదురు గుడారాల ప్రదేశాన్ని చేరుకుంటాం. బోట్ లో నుంచి దిగిన వెంటనే టీ లో బిస్కట్లు అద్దుకొని తినటం మిగిలిన సమయాన్ని క్యాంప్ సైట్ లోనే గడీపేయడం. రాత్రికి నాన్ - వెజ్ తో కూడిన డిన్నర్ , బస గుడారాల్లో భోగిమంటల నడుమ.

Photo Courtesy: Surya Mukherjee

రెండవ రోజు - స్నానాలు చేస్తూ ..

రెండవ రోజు - స్నానాలు చేస్తూ ..

నడక మార్గాన తెల్లవారుజామున గైడ్ తో ఉదయం సరిగ్గా 6 గంటలకు అడవిలో సైడ్ సీయింగ్ మరియు పాపికొండల మధ్యలో ఉన్న పామలేరు వాగు లో స్నానం చెప్పలేనిది

Photo Courtesy: Surya Mukherjee

రెండవ రోజు - సైడ్ సీయింగ్ వెళుతూ ..

రెండవ రోజు - సైడ్ సీయింగ్ వెళుతూ ..

ఉదయం 9 గంటలకి అల్పాహారం గుడారాల వద్దనే ఏర్పాటు చేస్తారు. ఖాళీ సమయంలో చుట్టుపక్కలా ప్రాంతాల సందర్శన.

Photo Courtesy: Surya Mukherjee

రెండవ రోజు - లంచ్

రెండవ రోజు - లంచ్

మధ్యానం 2 గంటలకి 2 రకాల వంటలతో నాన్ - వెజ్ లంచ్, మధ్యాహ్నం 3 గంటలకి బోట్ లో తిరుగు ప్రయాణం.

Photo Courtesy: Surya Mukherjee

రెండవ రోజు - తిరుగు ప్రయాణం

రెండవ రోజు - తిరుగు ప్రయాణం

సాయంత్రం 6 : 30 గంటలకు పట్టుసీమ రేవు / పోలవరం రేవు / పురుషోత్తమపట్నం రేవు వద్దకి చేరుకోవడం, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు రాజమండ్రి కి రోడ్ ప్రయాణం మరియు మిమ్మల్ని తిరిగి సురక్షితంగా రైల్వే స్టేషన్ లో దించడం.

ఛార్జీలు

పెద్దవారికైతే 2200 రూపాయలు, పిల్లాలకైతే 1600 రూపాయలు (5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయస్సు లోపు వారికి) వసూలు చేస్తారు.

Photo Courtesy: bidyut_cse

రూ. 100 అదనం

రూ. 100 అదనం

ఒకవేళ మీరు తిరుగు ప్రయాణంలో రాజమండ్రి కాకుండా భద్రాచలం కి వెళ్ళాలి అనుకుంటే 100 రూపాయలు అదనం. అదికూడా ఎలా ఉంటుంది అంటే ... మిమ్మలని రెండవరోజైన కొల్లూరు క్యాంప్ సైట్ వద్ద ఎక్కించుకొని పోచవరం మీదుగా నాన్ ఏసి బోట్ లో ప్రయాణం సాగుతుంది. ఈ జర్ని మద్యాహ్నం 2 : 30 గంటల నుంచి సాయంత్రం 4 :30 గంటల వరకు సాగుతుంది. పోచవరం నుంచి భద్రాచలానికి 2 గంటల రోడ్ జర్ని. భద్రాచలానికి సాయంత్రం 6 గంటలకి చేరుకుంటాం. రాములవారి ఆలయ దర్శనం రాత్రి 9 గంటల వరకే.

Photo Courtesy: Mohan BVS

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X