Search
  • Follow NativePlanet
Share
» »దక్షిణమంత్రాలయం సందర్శిస్తే అనుకొన్నకోర్కెలన్నీ...

దక్షిణమంత్రాలయం సందర్శిస్తే అనుకొన్నకోర్కెలన్నీ...

దక్షిణ మంత్రాలయంగా పేర్కొనే పప్పరపట్టి క్షేత్రానికి సంబంధించిన కథనం.

By Gayatri Devupalli

మా అమ్మ-నాన్నలు, మామ్మ-తాతగార్లు, నన్ను తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని ఒక చిన్న గ్రామమైన పప్పరపట్టికి తీసుకువెళ్లాలని అనుకున్నారు. ఈ ప్రదేశంలో రాఘవేంద్ర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది, దీనిని ప్రేమగా "దక్షిణ మంత్రాలయం" అని పిలుస్తారు. అనగా దక్షిణాన కొలువైన మంత్రాలయం అని అర్ధం. నేను చదివిన దాని ప్రకారం, పప్పరపట్టిని ఒకప్పుడు హొయసల రాజవంశం వారు పరిపాలించారు.

800 ఏళ్ల క్రితం, ఇది పురాతన మైసూర్ నగరంలో ఒక భాగం. ఇది ధర్మపురి నుండి 10 కిలోమీటర్ల దూరంలో, బెంగుళూరు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.హొయసల వంశ పాలకులచే నిర్మితమైన ఈ ఆలయంలో, తన దేవేరులైన భుదేవి మరియు శ్రీదేవిలతో కలసి వరదరాజ స్వామి వారు కొలువయ్యారు. స్నేహితులతో ఒక కలసి యాత్రలు చేయడం, ప్రతిఒక్కరు సాధారణంగా చేసేదే! కానీ ఈ సారి నేను, రోటీనుకు కాస్త భిన్నంగా, మా కుటుంబంలోని సీనియర్ సిటిజన్లతో కలిసి ప్రయాణిద్దామని నిర్ణయించుకున్నాను. ఆ వివరాలు మీ కోసం..

పప్పరపట్టి

పప్పరపట్టి

P.C: You Tube

ఉదయం 6 గంటలకు బెంగళూరులో మొదలైన మా ప్రయాణం, హోసూర్ రోడ్ (SH 17) గుండా సాగింది. ఇంటి వద్దనే తినుబండారాలు మరియు దోశలను తయారు చేసుకుని, ప్యాక్ చేసుకున్నాము కనుక అల్పాహారం కొరకు ఎక్కడా ఆగలేదు. ప్రయాణం చేస్తున్నంత సేపు, దారిపొడవునా పలుకరిస్తున్న ప్రకృతి అందాలు, నన్ను రెప్ప వేయ్యనివ్వలేదు.

పప్పరపట్టి

పప్పరపట్టి

P.C: You Tube

కాసేపటి తరువాత దారిలో ఒక దగ్గర కారును ఆపి, చెట్ల నీడలో క్రింద కూర్చుని అల్పాహారం కానిచ్చేసాం. ముఖం మీదుగా వీస్తున్న చల్లని పిల్ల తెమ్మెరలు, పక్షుల కిలకిలారావాల మధ్య, ఆ ప్రదేశాన్ని చూస్తుంటే, అల్పాహారం చేయడానికి ఇంతకన్నా మంచి వేదిక లభించిందని అనిపించింది. మేము ఆలయం నుండి కేవలం పది నిమిషాల దూరంలో ఉన్నాము.

పప్పరపట్టి

పప్పరపట్టి

P.C: You Tube

మా కడుపులు కన్నా ఎక్కువగా, మా మనసులు సంతృప్తి చెందాయనిపించింది. పప్పరపట్టికి దారితీసే రహదారులకు ఇరువైపులా మామిడి తోటలు ఉన్నాయి. గ్రామాల్లోని స్వచ్ఛమైన సౌందర్యాన్ని, చూపులతో జుర్రుకుంటూ ఉంటే, ఖచ్చితంగా మీరు గతంలోకి వెళ్ళిపోతారు. మీరెప్పుడో చూసిన పల్లెటూళ్లలో చిత్రీకరింపబడ్డ పాత సినిమా సన్నివేశాలు, మీ ముందు కదలాడతాయి. అలా మేము ఉదయం 8:30 గంటలకు పప్పరపట్టికి చేరుకున్నాము.

పప్పరపట్టి

పప్పరపట్టి

దేవాలయ వివరాలు:

P.C: You Tube
ఈ ఆలయ సముదాయం ఒక పెద్ద ప్రాంతంలో విస్తరించి ఉంది. మీరు కొంత సమయాన్ని ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య గడపాలనుకుంటే, ఇది మీకు సరైన గమ్యం. ఈ ఆలయ సముదాయంలో హనుమంతుడు, వేణు గోపాల స్వామి మరియు పండిత మధ్వాచార్యుని క్షేత్రాలు ఉన్నాయి.

పప్పరపట్టి

పప్పరపట్టి

P.C: You Tube

ఆలయంలో ఉన్న పెద్ద బావిని నీటి వనరుగా ఉపయోగిస్తున్నారు. 97 సంవత్సరాల నాటి శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. వరదరాజ స్వామి ఆలయం మాత్రం వెయ్యి సంవత్సరాల కన్నా పురాతనమైనదని చరిత్ర చెబుతుంది. ఇక్కడకు బృందావనం ఎలా వచ్చింది? అని చెప్పే కథ, చాలా అందంగా, ఆసక్తికరంగా ఉంటుంది.

పప్పరపట్టి

పప్పరపట్టి

P.C: You Tube

నేను స్థానికుల వద్ద నుండి విన్నదాని ప్రకారం, ఆలయ బాధ్యతలు నిర్వర్తించే పూజారికి, చాలాకాలం దాకా వారసులు కలగలేదు. చానాళ్లకు జన్మించిన బిడ్డకు కాలేయ లోపాలు ఉన్నాయి. ఆ తరువాత రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదాలను పొందటానికి ఆంధ్రప్రదేశ్ లోని మంత్రాలయంను సందర్శించి, పూజలు జరిపారు.

పప్పరపట్టి

పప్పరపట్టి

P.C: You Tube

ప్రార్ధన చేసినంతనే, బిడ్డకు అనారోగ్యం పూర్తిగా నయమయింది. తరువాత, ఆలయ పూజారి తన స్వప్న సందేశం అనుసారం, రాఘవేంద్ర స్వామికి పప్పరపట్టిలో ఆలయం నిర్మించారు. కథ ప్రకారం, మంత్రాలయంలో రాఘవేంద్రుని ఆశీర్వాదం పొందిన తరువాత, ఆలయ పూజారి పప్పరపట్టిలో బృందావనాన్ని నిర్మించడానికి ఒక మంచి శిల్పి అన్వేషణలో ఉన్నాడు.

పప్పరపట్టి

పప్పరపట్టి

P.C: You Tube

అదే సమయంలో, బెంగుళూరుకు చెందిన ఒక శిల్పి బళ్ళారిలో ఒక మఠం నిమిత్తం బృందావనాన్ని సిద్ధం చేసాడు. అదే రాత్రి , ఆ శిల్పి కలలో ఒక ముసలి వ్యక్తి కనపడి, బృందావనానికై వెదుకుతున్న పూజారి శిల్పి కొరకు వెతుక్కుంటూ వస్తాడని, తక్షణమే ఆ పూజరికి మఠం కొరకు తయారు చేసిన బృందావనం, అప్పగించమని ఆదేశిస్తాడు.

పప్పరపట్టి

పప్పరపట్టి

P.C: You Tube

1996 లో, సుశమీంద్ర తీర్థ ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు, తన భక్తులతో, మంత్రాలయం 40 ఏళ్ళ క్రితం అచ్చం పప్పరపట్టి వలె ఉండేదని, కనుక ఈ ప్రదేశం "దక్షిణాన మంత్రాలయ"మని తొలిసారిగా అన్నారు. ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్న భోజనాన్ని అందించడం లేదు.

పప్పరపట్టి

పప్పరపట్టి

P.C: You Tube

అయినప్పటికీ, మీరు ముందుగానే దేవాలయ పూజారికి మీ రాకను గురించి తెలియజేస్తే, వారు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇది ఒక చిన్న గ్రామం అయినందున ఎటువంటి హోటళ్ళు ఉండవు. మీరు ఇంటి నుండి కూడా ఆహారాన్ని తీసుకురావచ్చు.

పప్పరపట్టి

పప్పరపట్టి

P.C: You Tube

ఆలయ ప్రశాంతతలో, దైవిక వాతావరణంలో శాంతియుతంగా ఒక పూట గడిపిన తరువాత, ఆలయం నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోగెనక్కల్ జలపాతాలను సందర్శించాలని మేము అనుకున్నాం. అది వినగానే, మిగిలినవారు నా కంటే ఎక్కువగా సంతోషపడ్డారు.

పప్పరపట్టి

పప్పరపట్టి

P.C: You Tube

మా అమ్మ అక్కడ చేసే అద్భుతమైన తెప్పలపై ప్రయాణం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. జలపాతాల వద్ద కొంత సమయాన్ని ఆనందంగా గడిపాక, సాయంత్రం అవుతూనే ఘాటైన మురీ మసాలా మరియు దోసకాయ ముక్కలను, రుచి ఆస్వాదిస్తూ తిన్నాము. ఇంటికి తిరిగి వెళ్ళడానికి, సాయంత్రం 6 గంటలకు మేము అక్కడ నుండి వెనుదిరిగాము.

పప్పరపట్టి

పప్పరపట్టి

P.C: You Tube

నా మనస్సులో, పవిత్ర ప్రదేశమైన పప్పరపట్టికి మళ్ళీ తిరిగి రావాలని నేను భావించాను. నేను పొందిన అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతులలో ఇది ఒకటి. రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదం కోరుకునే వారందరికీ, ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని సందర్శించమని చెప్తాను.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X