» »కర్ణాటకలోని దివ్య క్షేత్రాలు

కర్ణాటకలోని దివ్య క్షేత్రాలు

Written By: Venkatakarunasri

ముక్తిప్రదేశాలకు సమానమైన ప్రదేశాలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. అవన్నీ కూడా శ్రీకృష్ణుని ఆలయానికి ప్రసిద్ధిచెందిన ఉడిపి పట్టణానికి చేరువలో ఉండటం విశేషం. అవి వరుసగా ఉడిపి, కుక్కేసుబ్రహ్మణ్యం, కుంభాషి, కోటేశ్వర, శంకరనారాయణ, కొల్లూరు మరియు గోకర్ణ. స్కందపురాణంలోని సహ్యాద్రికాండలో ఈ క్షేత్రాల ప్రస్తావన గురించి తెలుపబడింది.

భారతపురాణాలను ఒకసారి తిరగేస్తే, ముక్తిని ప్రసాదించే ఏడు దివ్యక్షేత్రాలు కానవస్తాయి. అవి అయోధ్య, మథుర, మాయ (హరిద్వార్), కాశీ, కంచి, అవంతిక(ఉజ్జయిని) మరియు పూరీ. దర్శన, స్మరణ, పఠన, శ్రవణ మాత్రానే మానవుడు ముక్తిని పొందగలడని, భగవంతుని సన్నిధికి చేరుకోగలడని భక్తుల నమ్మకం.

ఉడిపి పరిసర ప్రాంతాలలో ఉన్న ఈ ఏడు ముక్తిప్రదేశాలు పరుశురాముడు సృష్టించిన కొంకణ తీరంలో ఎన్నో శతాబ్దాల చరిత్రకు, ప్రత్యేకతలు నిలయాలుగా ఉన్నాయి. వీటినే పరుశురామక్షేత్రాలు అని కూడా పిలుస్తారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు సప్త ముక్తి ప్రదేశాలను దర్శిస్తుంటారు. వీటిగురించి మరింతగా తెలుసుకోవాలంటే ... !!

1. ఉడిపి

1. ఉడిపి

శ్రీకృష్ణ క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన ఉడిపి కి రెండు స్థలపురాణాలు ఉన్నాయి. మొదటిది : ఉడిపి అంటే నక్షత్రాల దేవుడు అని అర్థం. నక్షత్రాల దేవుడు చంద్రుడు. చంద్రుడు దక్షశాపం నుండి విముక్తిగావించబడి శివుడు శిరస్సుపై శాశ్వతంగా నిలిచిపోయే భాగ్యాన్ని పొందిన దివ్య స్థలం గా చెబుతారు. దానికి ఇక్కడ కొలువైన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయాన్ని సాక్ష్యంగా చూపుతారు.

చిత్రకృప : Shiva Shenoy

2. ఉడిపి

2. ఉడిపి

ఉడిపికి ఆ పేరు రావటానికి రెండవ కధనం, ఉడిపి అన్న పదం ఒడిపు అన్న 'తుళు' పదం నుండి వచ్చింది. దాని అర్థం పవిత్ర గ్రామం అని. శ్రీకృష్ణుడు కొలువైన ప్రదేశం కావున పవిత్రమైన గ్రామం అంటారు.

చిత్రకృప : Vaikoovery

3. మధ్వాచార్యులు వారి జన్మస్థలం

3. మధ్వాచార్యులు వారి జన్మస్థలం

ఇది శ్రీశ్రీశ్రీ మధ్వాచార్యులు వారి జన్మస్థలం. ఇక్కడ వారు క్రీ.శ. 13 వ శతాబ్దంలో ఒక శ్రీకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్టించి మఠాన్ని స్థాపించారు.

చిత్రకృప : syam

4. కుక్కే సుబ్రమణ్య

4. కుక్కే సుబ్రమణ్య

ఉడిపి సహా మిగిన ఐదు క్షేత్రాలు కొంకణ తీరంలో ఉంటే, ఇదొక్కటే కాస్త దూరంలో ఉడిపికి 157 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి ఒక పురాణగాథ ఉన్నది. తారకాసుర మొదలైన రాక్షసులను సంహరించిన శివ కుమారునికి దేవేంద్రుని కుమార్తె అయిన దేవ సేనతో ఇక్కడే వివాహం జరిగింది.

చిత్రకృప : C. Cunniah & co.

5. కుమారధార

5. కుమారధార

ఆ వివాహానికి హాజరైన దేవతలు స్కందునికి మంగళ స్నానం చేయించడానికి విశ్వంలో ప్రవహించే అనేక పవిత్ర నదీ జలాలను తీసుకొచ్చారు. ఆ జలాల ప్రవాహమే నేడు మనము చూస్తున్న కుమారధార.

చిత్రకృప : karthick siva

6. నాగదోష పూజలకు

6. నాగదోష పూజలకు

కుక్కే నాగదోష పూజలకు ప్రసిద్ది. దీనికి గల కారణం గురించిన గాధ ఇలా ఉన్నది. నాగరాజు వాసుకి శివుణ్ణి ప్రార్థించి గరుడుని నుంచి నాగ జాతిని విముక్తిని చేయాలంటూ తపస్సు ను ఆచరించాడు.

చిత్రకృప : karthick siva

7. సుబ్రమణ్యస్వామి

7. సుబ్రమణ్యస్వామి

నాగరాజు తపస్సు చేసిన ప్రదేశంలోనే ప్రస్తుతం గుడి నిర్మించారు. కుమారుని వివాహం ఆనందంలో ఉన్న శివుడు వాసుకికి అభయమిచ్చాడు. అందువల్ల ఇక్కడ సుబ్రమణ్యస్వామిని పూజిస్తే నాగదోషం తిలగిపోతుందని భక్తుల నమ్మకం.

చిత్రకృప : Adityamadhav83

8. సర్వేశ్వరుడు

8. సర్వేశ్వరుడు

గరుడుని వలన ప్రాణ భయం ఏర్పడటంతో సర్ప రాజు వాసుకి ఇక్కడ దాక్కొని సర్వేశ్వరుని గురించి తపము చేసాడు. కుమారస్వామి వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగారాజుకి అభయమిచ్చారు. అందువలన ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే నాగదోషం తొలగిపోతుంది.

చిత్రకృప : Mallikarjunasj

9. శంకర నారాయణ ఆలయం

9. శంకర నారాయణ ఆలయం

కర్ణాటకలో ఉన్న పరశురామ సృష్టిత సప్త ముక్తి క్షేత్రాలలో శంకరనారాయణలో ఉన్న శివ కేశవ ఆలయం చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనది. ఇక్కడి ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల క్రిందట సోమశేఖర రాయ అనే రాజు కట్టించినట్లుగా చెబుతారు.

చిత్రకృప : Prabhakar Bhat

10. శంకర నారాయణ ఆలయం

10. శంకర నారాయణ ఆలయం

'శంకర', 'నారాయణ' లిరువురూ ఒకేపానవట్టం మీద కొలువుదీరిన ఒకేఒక్క క్షేత్రం ఇదే! హరిహరులిద్దరూ లింగరూపాలలో పూజించబడతారు. ముఖమండపం సుందర శిల్పాలతో నిండి ఉంటుంది. క్రోధ గుహే, క్రోదగిరి దేవరు, కోటితీర్థ మొదలుగునవి దర్శించవచ్చు.

చిత్రకృప : Prabhakar Bhat

11. కోటేశ్వర

11. కోటేశ్వర

ఉడిపికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారు కొలువైనందున కోటేశ్వర అన్న పేరొచ్చింది.

చిత్రకృప : Nischitha H S

12. కోటేశ్వర దృశ్యం

12. కోటేశ్వర దృశ్యం

ఇరవై అయిదు అడుగుల ఎత్తు ప్రధాన ద్వారం, వంద అడుగుల ధ్వజస్తంభం, డమరుకము ఆకారంలో ఆలయ పుష్కరణి, శిలా శాసనం ఇలా ప్రతిఒక్కటి ఇక్కడ విశేషమే !

చిత్రకృప : Nischitha H S

Please Wait while comments are loading...