Search
  • Follow NativePlanet
Share
» » ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం పరిటాల వీరఅభయాంజనేయ స్వామి

వాయు దేవుని కుమారుడు వానర యోధులలో ప్రముఖుడు, ముఖ్యమైనవాడు హనుమంతుడు. హనుమంతుని ఆరాధిస్తే బలం, వర్చస్సు, మంచి వాక్కు, బద్ధకం నుంచి విముక్తి, కోరిన కోర్కెలు తీరడం వంటివి సిద్ధిస్తాయి. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు.

రామరావణ యుద్ధ సమయంలో ఆయన పెద్దగా ఎదిగి భయంకర రూపంతో రాక్షస సంహారం చేశాడని చెబుతారు. అందువల్ల పెద్ద ఆకారంలో హనుమంతుని విగ్రహాలు నిర్మించడం జరుగుతోంది. దేశంలో ఎన్నో ప్రసిద్ధ ఆంజనేయ విగ్రహాలు, ఆలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేక‌త‌ ఉంటుంది. అయితే విజయవాడలోని వెలసిన అతి ఎత్తైన వీరఅభయాంజనేయ విగ్రహం విశేషాలు తెలుసుకుందాం.

భారీ రూపం, అత్యంత ఎత్తైన విగ్రహం

భారీ రూపం, అత్యంత ఎత్తైన విగ్రహం

భారీ రూపం, అత్యంత ఎత్తైన విగ్రహం, 135 అడుగుల ఎత్తు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఇదేనని చెబుతారు. ఇక్కడి విగ్రహం బరువు 2,500 టన్నులు. నిర్మాణ కాలం 25 నెలలు. నిర్మాణానికి వాడిన సిమెంటు 14 వేల టన్నులు. ఇనుము 150 టన్నులు, ఇసుక వెయ్యి లారీలు. విగ్రహం పాదమే ఆరడుగుల ఎత్తులో ఉంది.

 విగ్రహం చేతిలోని గద

విగ్రహం చేతిలోని గద

విగ్రహం చేతిలోని గద చుట్టుకొలత 20 అడుగులు. కోటిన్నర రూపాయల వ్యయం తో నిర్మించినారు. 2003 సద్గురు శ్రీ శివానందమూర్తిగారు ఆలయ సముదాయాన్ని ఆవిష్కరించారు .

దుస్టశక్తులను దూరం చేసే మహిమాన్వితుడు

దుస్టశక్తులను దూరం చేసే మహిమాన్వితుడు

దుస్టశక్తులను దూరం చేసే మహిమాన్వితుడు ఈ వీరహనుమాన్ యాత్రికులు, భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్న ఆ ఆలయమే పరిటాల ఆంజనేయ దేవాలయం.

135 అడుగుల ఎత్తైన

135 అడుగుల ఎత్తైన

135 అడుగుల ఎత్తైన ఈ వీర అభయ ఆంజనేయ స్వామి విగ్రహం 2003 లో ప్రతిష్టించారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి 30 కి. మీ. ల దూరంలో కలదు. ఇండియాలో ప్రస్తుతానికి ఇది ఒక అతి ఎత్తైన విగ్రహం.

పరిటాల గ్రామంలో ఈ బారీ విగ్రంగా ఉంది

పరిటాల గ్రామంలో ఈ బారీ విగ్రంగా ఉంది

కృష్ణా జిల్లాలో కంచిక చర్ల మండలంలోని పరిటాల గ్రామంలో ఈ బారీ విగ్రంగా ఉంది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై 135 అడుగుల భారీ శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం చుట్టు ప్రక్కల అయిదు కిలోమీటర్ల దూరానికి కూడా దర్శనమిస్తుంది.

 అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటె ఎత్తైనది

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటె ఎత్తైనది

విగ్రహం క్రింది బేస్ మెంట్ లో 15 అడుగల వేదికను నిర్మించారు. ఈ విగ్రహాన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా భావిస్తారు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటె ఎత్తైనది అంటే ఆశ్చర్యం కలగకమానదు.

పరిటాల వీరఅభయాంజనేయ స్వామి కుడి చేతిలో అభయ ముద్ర

పరిటాల వీరఅభయాంజనేయ స్వామి కుడి చేతిలో అభయ ముద్ర

పరిటాల వీరఅభయాంజనేయ స్వామి కుడి చేతిలో అభయ ముద్ర, ఎడమ చేతిలో గదతో.. మీకు నేనున్నాను అనే అభయముద్ర ఇస్తూ, ఆశ్రిత జన రక్షకుడిగా వెలసిన ఈ ఆంజనేయుడు భక్తజన మందారుడై ఎందరో జన భక్తుల పూజలను అందుకుంటున్నాడు.

వీరఅభయాంజేయ స్వామి విగ్రం ఉన్నఆలయ

వీరఅభయాంజేయ స్వామి విగ్రం ఉన్నఆలయ

వీరఅభయాంజేయ స్వామి విగ్రం ఉన్నఆలయ ప్రాంగణంలో రేణుకా దేవికి మరియు సీతారామలక్ష్మణులకు ఉపాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆలయ ప్రాంగణంలో మలయ స్వామి వేద పాఠశాల నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా నిర్మించిన ఈ విగ్రహాన్ని చూడాలంటే

ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా నిర్మించిన ఈ విగ్రహాన్ని చూడాలంటే

ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా నిర్మించిన ఈ విగ్రహాన్ని చూడాలంటే తలను పూర్తిగా వెనక్కు వంచి చూడాల్సిందే. పర్యాటకులు కానీ, ఆధ్యాత్మికత భావన ఉన్నవారు కానీ, ఈ ఆలయాన్ని సందర్శిస్తే..యాత్రికులకు మార్గాయాసం నుండి ఉపశమనం కలగడమే కాక, దుష్ట శక్తుల నుండి రక్షణ కలిగి మానసిక ప్రశాంతత చేకూరుతుందని భక్తుల నమ్మకం.

ఈ పరిటాల గ్రామానికి మరో చరిత్ర కూడా ఉంది,

ఈ పరిటాల గ్రామానికి మరో చరిత్ర కూడా ఉంది,

ఈ పరిటాల గ్రామానికి మరో చరిత్ర కూడా ఉంది, గ్రామం సమీపంలో వజ్రాల గనిలో ప్రపంచ ప్రఖ్యాతి చెందని వజ్రాలైన కోహినూర్, గోల్కొండ, పిట్, ఆర్లాఫ్, నిజాం మొదలైన పేర్లు కలిగిన వజ్రాలు ఇక్కడే దొరికాయట. వీటి విలువ, ఆకర్షణ కారణంగా ఇవన్నీ సుప్రఖ్యాతమైనాయి.

ఎలా వెళ్ళాలి :

ఎలా వెళ్ళాలి :

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి.

సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. కంచికచెర్ల, ఇబ్రహీంపట్నం నుండి రోద్దురవాణా సౌకర్యం ఉంది.

రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 28 కి.మీ దూరంలో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X