Search
  • Follow NativePlanet
Share
» »హాట్ ఎయిర్‌ బెలూన్ ఫెస్టివల్‌లో పాల్గొని కాశీ అందాల‌ను ఆస్వాదించండి!

హాట్ ఎయిర్‌ బెలూన్ ఫెస్టివల్‌లో పాల్గొని కాశీ అందాల‌ను ఆస్వాదించండి!

హాట్ ఎయిర్‌ బెలూన్ ఫెస్టివల్‌లో పాల్గొని కాశీ అందాల‌ను ఆస్వాదించండి!

వారణాసి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కాశీలోని బాబా విశ్వనాథ్ నగరంలో ఈ రోజు అంటే జనవరి 17 నుండి మొద‌ల‌వుతోంది. అంతేకాదు, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌తో పాటు బోట్ రేస్ కూడా ప్రారంభమవుతుంది. ఇలాంటి స‌మ‌యంలో ప‌ర్యాట‌కులు ఆకాశపు వీధుల నుండి అందమైన కాశీని మ‌న‌సారా ఆస్వాదించే అవ‌కాశం ఉంటుంది.

గుజరాత్‌లోని ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హించేందుకు వార‌ణాసిలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌తోపాటు ఈ రోజు నుండి నాలుగు రోజుల బోట్ ఫెస్టివ‌ల్ కూడా నిర్వహించబడుతోంది. కాబట్టి మీరు సాహస క్రీడ‌ల‌ను అమితంగా ఇష్ట‌ప‌డేవారు అయితే, జీవితంలో మ‌ర్చిపోలేని మ‌ధుర క్ష‌ణాల‌ను చేరువ చేసుకునేందుకు త‌ప్ప‌నిస‌రిగా ఈ ఫెస్టివ‌ల్‌లో పాల్గొనాల్సిందే.

పండుగ ప్రత్యేకత ఏంటి?

పండుగ ప్రత్యేకత ఏంటి?

బెలూన్ ఫెస్టివల్ ఏటా జనవరి 17న ప్రారంభమై జనవరి 20న ముగుస్తుంది. ఈసారి జరిగే బెలూన్ ఫెస్టివల్‌లో ఎస్‌సిఓ దేశాల (షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్) ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి పర్యాటక శాఖ ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

అధికారిక స‌మాచారం మేర‌కు, బెలూన్ ఫెస్టివల్‌లో ప‌ది మంది విదేశీ మరియు రెండు స్వదేశీ పైలట్లు హాట్ ఎయిర్ బెలూన్‌ను ఎగురవేస్తారు. దీని కోసం పర్యాటక శాఖ పోలాండ్, ఫిన్లాండ్, ఇటలీ, యుకె మరియు యుఎస్ నుండి పైలట్‌లకు ఆహ్వానాలు పంపింది. ఈ హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా పర్యాటకులు ఆకాశంలో ఐదు నుంచి ఏడు కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

హాట్ ఎయిర్ బెలూన్ ధరలు ఇలా ఉన్నాయి..

హాట్ ఎయిర్ బెలూన్ ధరలు ఇలా ఉన్నాయి..

హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ కోసం రుసుములు ఇప్ప‌టికే అధికారికంగా నిర్ణయించబడ్డాయి. హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ కోసం ఒక వ్యక్తి 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఎంతసేపు ఉంటుందనే అనుమానం క‌ల‌గ‌వ‌చ్చే. అందుకు సంబంధించిన స‌మాచారం కూడా వారు అందుబాటులో ఉంచారు. ఐదు వంద‌ల రూపాయలతో మీరు పూర్తిగా 45 నిమిషాల హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ చేయగలుగుతారు. ఇందులో మీరు వారణాసి ప‌రిస‌ర ప్రాంతాల్లో అంద‌మైన ప్ర‌కృతి అందాల‌ను మ‌న‌సారా ఆస్వాదించ అవ‌కాశం దొరుకుతుంది.

విమానయాన అవ‌కాశం..

విమానయాన అవ‌కాశం..

విమానయానం కోసం మూడు ప్రదేశాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి గంగా పర్ డోమ్రి, రెండవది సెంట్రల్ హిందూ బాయ్స్ స్కూల్ క్యాంపస్ కమ్‌ఛా మరియు మూడవది సంపూర్ణానంద్ సిగ్రా స్టేడియం. విశాల‌మైన ఈ ప్రాంగ‌ణాల్లో ఆహ్లాద‌ర‌క‌మైన క్రీడ‌ల‌ను ఆస్వాదించేందుకు అవకాశం క‌ల్పించారు.

హాట్ ఎయిర్ బెలూన్ అంటే ఏమిటి?

హాట్ ఎయిర్ బెలూన్ అంటే ఏమిటి?

ఈ బెలూన్ సాధారణంగా సింథటిక్ బెలూన్. దానికి ఒక పెద్ద బుట్ట జోడించబడి ఉంటుంది. ఈ బుట్టలో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో సేఫ్టీ గేర్ కూడా అమర్చబడి గాలిని విహ‌రించేందుకు అనువుగా రూప‌క‌ల్ప‌న చేయ‌బ‌డి ఉంటుంది. ఆకాశం నుండి మీరు క్రింద అందమైన దృశ్యాన్ని చూడవచ్చు. ప్ర‌కృతి మ‌ల‌చిన అంద‌మైన దృశ్యాల‌ను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఏలా సంద‌ర్శ‌కులు ఇక్క‌డ‌కి వ‌స్తూ ఉంటారు. మ‌రెందుకు ఆల‌స్యం మీరూ హాట్ ఎయిర్ బెలూన్‌లో గ‌గ‌న విహారం చేసేందుకు సిద్ధ‌మ‌వ్వండి.

Read more about: hot air balloon festival
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X