Search
  • Follow NativePlanet
Share
» »పర్వతామలై ట్రెక్ వెళ్లారా?

పర్వతామలై ట్రెక్ వెళ్లారా?

పర్వతామలై ట్రెక్కింగ్‌కు అనుకూలమైన ప్రాంతం.

ఊటిని తమిళనాడులోని పర్వతాల రాణి అని అంటారు. అదేవిధంగా కొడైకెనాల్ పర్వతాల రాజకుమారి. అందువల్ల ఈ రెండు పర్వతాల చుట్టు పక్కల ఉన్న అనేక పర్వతాలు అంతో ఇంతో పర్యాటకంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొన్నవే. ఇదేవిధంగా ఇక్కడ పర్వతాల రాజకుమారుడు ఎవరన్న విషయం చర్చకు రావడం సహజం. ఆ రాజకుమారుడుగా పేరు గాంచిన పర్వతా మలై పర్వతం, అక్కడి ట్రెక్కింగ్ వివరాలు మీ కోసం...

 పర్వతామలై, తమిళనాడు

పర్వతామలై, తమిళనాడు

P.C: You Tube

పర్వతామలై ఒక పెద్ద శిఖరం. ఈ పర్వతం తిరువణ్ణామలై జిల్లాలోని పుల్లూరు పట్టణం నుంచి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రం. ముఖ్యంగా ట్రెక్కింగ్ వంటి సాహసక్రీడలంటే ఇష్టపడేవారికి ఈ చోటు చాలా బాగా నచ్చుతుంది.

 పర్వతామలై, తమిళనాడు

పర్వతామలై, తమిళనాడు

P.C: You Tube

ముఖ్యంగా వీకెండ్ సమయంలో ఎక్కవమంది ట్రెక్కింగ్ ప్రియులు, పర్వతారోహకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. వీరిలో స్థానికులే కాకుండా తమిళనాడుతో పాటు పొరుగున ఉన్న రాష్ట్రాలకు చెందిన వారు కూడా ట్రెక్కింగ్ కోసం ఇక్కడికి వస్తుంటారు.

 పర్వతామలై, తమిళనాడు

పర్వతామలై, తమిళనాడు

P.C: You Tube

ఈ ట్రెక్కింగ్ వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ధ`డత్వాన్ని పొందవచ్చునని చెబుతారు. ముఖ్యంగా యువత ఈ ట్రెక్కింగ్ పై ఎక్కువ ఆసక్తి కనబరుచుతున్నారు. రెండు మార్గాల ద్వారా పర్వత శిఖర ప్రాంతాన్ని చేరుకోవచ్చు.

 పర్వతామలై, తమిళనాడు

పర్వతామలై, తమిళనాడు

P.C: You Tube

అందులో మొదటిదానిని దక్షిణ మహా తవా మంగళ మార్గం అని అంటారు. మరో మార్గం పేరు ట్రెడ్ మిల్ మార్గం. ఈ రెండు మార్గాల్లో ఏ మార్గం నుంచి బయలు దేరిని కేవలం సగం దూరం వరకూ మాత్రమే విడివిడిగా ప్రయాణించాల్సి ఉంటుంది.

 పర్వతామలై, తమిళనాడు

పర్వతామలై, తమిళనాడు

P.C: You Tube

అటు పై కలిసే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ రెండు మార్గాలు ఈ పర్వతం సగభాగంలో కలిసి పోతాయి. సగం దూరం వెళ్లిన తర్వాత ప్రయాణం కొంత కఠినంతో కూడుకొని ఉంటుంది. ఈ మార్గాన్ని కుమారి మార్గం అని అంటారు.

 పర్వతామలై, తమిళనాడు

పర్వతామలై, తమిళనాడు

P.C: You Tube

సముద్ర మట్టం నుంచి దాదాపు 4,560 అడుగుల ఎత్తులో ఈ ఈ ట్రెక్కింగ్ సాగుతుంది. ఈ పర్వతమలై వద్ద మీరు ట్రెక్కింగ్ చేయాలనుకొంటే పగలు కొంత ఉక్కపోతగా ఉంటుంది. అందువల్ల తెల్లవారుజామున లేదా సాయంత్రం పూట ట్రెక్కింగ్ వెళ్లడం మంచిది. ఈ ట్రెక్కింగ్ మార్గంలో మీకు తమిళనాడు చరిత్రను తెలియజెప్పే కోటలు పలకరిస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X