Search
  • Follow NativePlanet
Share
» »చూపుతిప్పుకోనీయని పచ్చని ప్రకృతి సౌందర్యంతో పార్వతి హిల్స్

చూపుతిప్పుకోనీయని పచ్చని ప్రకృతి సౌందర్యంతో పార్వతి హిల్స్

17 వ శతాబ్దం లో కట్టిన పార్వతి దేవాలయంతో ఈ పార్వతి కొండ పూణే లోని చూడతగిన ప్రదేశాల్లో ఒకటి. ఇది నగరానికి దక్షిణ భాగంలో ఉంది. ఈ కొండను 108 మొట్లు ఎక్కితే పార్వతీ దేవి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ

ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోన్న అజంతా, ఎల్లోరా, ఎలిఫెంటా గుహలు మరియు మహాలక్ష్మీ దేవాలయం, గేట్ వే ఆఫ్ ఇండియా వంటి ప్రదేశాలు మహారాష్ట్రలో తప్పక చూడదగినవి. భారతదేశంలో మహారాష్ట్ర సాంస్కృతిక వైవిధ్యం, శిల్పకళా విశిష్టత, మరియు సహజ ప్రదేశాల సౌందర్యం పర్యాటకులను ఆశ్చర్య చకితులను చేస్తుంది.

సహ్యాద్రి కొండలలోని మహారాష్ట్ర అద్భుత ప్రాంతాలతో పర్యాటకులకు తప్పక నచ్చుతుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహారాష్ట్ర రాష్ట్రానికి పశ్చిమ దిశలో ఎత్తైన కొండలతో, చూపుతిప్పుకోనీయని పచ్చని ప్రకృతి సౌందర్యంతో ఈ ప్రాంతం పర్యాటకుల మనసు దోచుకుంటోంది. సుందరమైన మహారాష్ట్ర వాతావరణంలో ఎన్నో హిల్ స్టేషన్లు ఉన్నాయి. ఈ హిల్ స్టేషన్లను చాలావరకు బ్రిటీష్ పాలకులు వారి పాలనలో వేసవి విడుదులుగా ఉపయోగించుకొనేవారు. లోనావాలా, ఖండాలా, మాధేరన్, పంచగని, మహాబలేశ్వర్, సావంత్ వాడి, జవహర్ మరియు తోరణ్మల్ ప్రదేశాలు పేరుపొందిన హిల్ స్టేషన్లు. ఈ హిల్ స్టేషన్లు చాలావరకు ముంబై, పూనే వంటి ప్రధాన నగరాలకు సమీపంలో ఉండి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగాకూడా నిలుస్తున్నాయి.

ముంబై నగరంలో పేరొందిన ముంబా దేవి దేవాలయం కలదు. ఔరంగాబాద్ లో గల కైలాస దేవాలయం, ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన షిర్డి, పంధార్ పూర్ మరియు బాహుబలి, పార్వతి హిల్ వంటివి కూడా పర్యాటకులు ఎంతో ఇష్టపడే స్థలాలు.

17 వ శతాబ్దం లో కట్టిన పార్వతి దేవాలయం

17 వ శతాబ్దం లో కట్టిన పార్వతి దేవాలయం

17 వ శతాబ్దం లో కట్టిన పార్వతి దేవాలయం. ఈ పార్వతి కొండ పూణే లోని చూడతగిన ప్రదేశాల్లో ఒకటి. ఇది నగరానికి దక్షిణ భాగంలో ఉంది. ఈ కొండను 108 మొట్లు ఎక్కితే పార్వతీ దేవి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ నాలుగు గుడులున్నాయి. ఈ నాలుగు గుడులు శివుడికి, గణేషుడికి, విష్ణువు మరియు కార్తికేయునికి అంకితం చేయబడనివి.

తొలినాళ్ళలో కేవలం పేష్వా రాజుల కోసం మాత్రమె కట్టిన ఈ గుడి

తొలినాళ్ళలో కేవలం పేష్వా రాజుల కోసం మాత్రమె కట్టిన ఈ గుడి

తొలినాళ్ళలో కేవలం పేష్వా రాజుల కోసం మాత్రమె కట్టిన ఈ గుడి తర్వాతి కాలం లో సామాన్యులకు కూడా ప్రవేశం కల్పించారు. పురాతన రాతి నిర్మాణంతో ఈ దేవాలయం కట్టబడింది. ఇక్కడ పూజలు చేసి ఆశీర్వాదం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇక్కడ ప్రధాన ఆలయం దేవ్ దేవేశ్వర ఆలయం. ఇంకా విఠల్ దేవుడు, రుక్మిణి దేవి, ఆలయాలు కూడా ఉన్నాయి. దేవ్ దేవేశ్వర ఆలయం ఆలయాన్నీ నల్లరాతితో నిర్మించారు. ఈ ఆలయాన్నిబాలాజీ బాజీరావ్ 1749లో పూర్తి చేశారు.

దగ్గరలో వుండే మ్యూజియం పేరు పార్వతి మ్యూజియం

దగ్గరలో వుండే మ్యూజియం పేరు పార్వతి మ్యూజియం

దగ్గరలో వుండే మ్యూజియం పేరు పార్వతి మ్యూజియం. ఇక్కడ అందమైన పెయింటింగ్స్ ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ మ్యూజియంలో బాలాజీ బాజీరావు సమాది ఉంది. అలాగే ఈ కొండపై ఉండే పార్వతి వాటర్ ట్యాంక్ పూణే సంగం నగరానికి నీటి సరఫరాను చేస్తుంది. కొండకు దక్షిణం వైపున సగ భాగంలో బుద్దిని గుహలున్నాయి. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జంగ్లీ మహరాజ్ రోడ్ మార్గంలో పటలేశ్వర్ గుహాలయం ఉన్నది. ఇది 1400 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఆలయ గొప్పతనం ఏమిటంటే, ఆలయాన్ని ఒక పెద్ద రాయిని ఒలిచి నిర్మించినారు.

పర్వతారోహకులకు

పర్వతారోహకులకు

పర్వతారోహకులకు పార్వతి కొండ మంచి ఆటవిడుపు. ఈ కొండ మీద నుండి చూస్తే పూణే నగరం మొత్త చాలా అందంగా కనబడుతుంది. పార్వతి హిల్స్ ను సంవత్సరం మొత్తం సందర్శించవచ్చు.
Photo Courtesy: Ankita Kolamkar

సరస్ బాగ్ పూణే లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ

సరస్ బాగ్ పూణే లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ

సరస్ బాగ్ పూణే లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ. విఖ్యాత నానాసాహెబ్ పీష్వా నిర్మించిన ఈ బాగ్ పార్వతి కొండల సమీపంలోని పెద్ద, అందమైన తోట.ఈ పార్క్ లో ప్రసిద్ధ గణపతి దేవాలయం వుంది. 1774 లో 200 ఏళ్ళ క్రితం మాధవ రావ్ పీష్వా దీన్ని కట్టించాడు.మనం నిత్యం పడే ఒత్తిడి నుంచి విరామం తీసుకోవాలంటే స్వర్గేట్ కి కిలోమీటర్ దూరంలోని ఈ ప్రదేశం లో ఓ చక్కని సాయంత్రం గడప వచ్చు.

చారిత్రకగా ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలో

చారిత్రకగా ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలో

చారిత్రకగా ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలో సుమారు 13 మ్యూజియంలు కలవు. వాటిలో పూనే లోని గిరిజన మ్యూజియం, ముంబై లోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం మరియు జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ, భారత దేశంలో పురాతన కాలంనుండి వాడుతున్న కరెన్సీ చరిత్రను తెలిపే నాసిక్ లోని కాయిన్ లేదా నాణేల మ్యూజియం, ప్రసిద్ధి గాంచినవి.నేషనల్ మేరిటైమ్ మ్యూజియం, షాహాజీ ఛత్రపతి మ్యూజియం మరియు మణిభవన్ మహాత్మాగాంధీ మ్యూజియంలు కూడా పేరొందినవే.

మహారాష్ట్ర ఆధ్యాత్మిక కేంద్రం కూడాను

మహారాష్ట్ర ఆధ్యాత్మిక కేంద్రం కూడాను

అరేబియా సముద్ర తీరంలో ఉన్న మహారాష్ట్ర అనేక బీచ్ లకు కూడా ప్రసిద్ధి గాంచింది. ఎంతో అందమైన మెరైన్ డ్రైవ్చౌ పట్టీ, బస్సీన్ బీచ్ వంటి వాటిని పర్యాటకులు బాగా ఇష్టపడతారు.

వేల్నేశ్వర్, శ్రీ వర్ధన్ హరిహరేశ్వర్ వంటివి నీటి క్రీడలకు పేరు. విశ్రాంతి ప్రియులకు దహను బోర్డి బీచ్ లేదా విజయ సింధు దుర్గ బీచ్ లలో చక్కటి విశ్రాంతిని పొందవచ్చు. మహారాష్ట్ర ఆధ్యాత్మిక కేంద్రం కూడాను. అనేక యాత్రా స్ధలాలు కలిగి ఉంది. నాసిక్ లో ప్రసిద్ధి గాంచిన కుంభ మేళా ప్రతి మూడు సంవత్సరాలకు జరుగుతుంది.

పూణే ఎలా చేరుకోవాలి ?

పూణే ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం
పూణే నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహేగావ్ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఇక్కడి నుండి డిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, దుబాయి, సింగపూర్ లకు కూడా నేరుగా విమానాల్లో ఎక్కి ప్రయాణించవచ్చు.
రైలు మార్గం
పూణే లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఈ రైల్వే జంక్షన్ నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు నిత్యం రైలు సర్వీసులు నడుస్తుంటాయి. పూణే నుంచి ముంబై 153 కిలోమీటర్ల దూరంలో వుంది. డెక్కన్ క్వీన్, శతాబ్ది ఎక్స్ ప్రెస్, ఇంద్రాయని ఎక్స్ ప్రెస్ లాంటివి ముంబై పూణే ల మధ్య తిరిగే రైళ్ళు.
రోడ్డు మార్గం
పూణే కి మహారాష్ట్ర లోను, ఇతర రాష్ట్రాల లోను వున్న ప్రధాన నగరాల నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి. ముంబై - పూణే రహదారి ప్రయాణించడానికి చాల సౌకర్యంగా వుంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పూణే వెళ్ళే దారిలో వుండే పశ్చిమాద్రి కనుమలు వర్షాకాలం లో ఓ అందమైన దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తాయి.
చిత్ర కృప : Jbritto

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X