Search
  • Follow NativePlanet
Share
» »పాతాళ వినాయకుడి దర్శించుకుంటే సర్వం శుభకరం..అన్నీవిజయాలే!

పాతాళ వినాయకుడి దర్శించుకుంటే సర్వం శుభకరం..అన్నీవిజయాలే!

పాతాళ వినాయకుడి దర్శించుకుంటే సర్వం శుభకరం..అన్నీవిజయాలే!దక్షిణ భారత దేశంలో ఆ పరమేశ్వరుడు కొలువై ఉండే పుణ్య క్షేత్రాల్లో శ్రీకాళహస్తి అత్యంత ప్రసిద్ది చెందిన క్షేత్రం. రాహు కేతు పూజల జరిగే ఈ క్షేత్రం

దక్షిణ భారత దేశంలో ఆ పరమేశ్వరుడు కొలువై ఉండే పుణ్య క్షేత్రాల్లో శ్రీకాళహస్తి అత్యంత ప్రసిద్ది చెందిన క్షేత్రం. రాహు కేతు పూజల జరిగే ఈ క్షేత్రంలో చాలా మందికి తెలయని మరో రహస్యం పాతాళ గణపతి ఆలయం గురించి.

ఏ పండగైనా, ఏ శుభకార్యమైన తొలిపూజలు అందుకునే వినాయకుడు స్వయంభువుగా అనేక పుణ్య క్షేత్రాల్లో ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటి శ్రీకాళహస్తి. శివుడి పంచభూత క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తిలో 'పాతాళ వినాయకుడు' కూడా దర్శనమిస్తుంటాడు. ఈ పాతళ వినాయకుడి గురించి శ్రీ కాళహస్తి మహాత్యంలో ధూర్జటి, హరవిలాసంలో శ్రీనాథుడు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి ప్రసిద్ద పుణ్య క్షేత్రం. దక్షిణ భారత దేశంలో కెల్లా అతి ప్రాచీనమైన పుణ్య క్షేత్రంగా విరాజిళ్లుతుంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం ఉత్తర గోపురానికి దగ్గరలో ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు పాతాళంలో కొలువుదీరి ఉంటాడు. పాతాళ వినాయక స్వామి వారు 40అడుగుల ఎత్తులో కొలువై ఉండటం వెనుక ఒక కథనం ఉంది.

పూర్వకాలంలో అగస్త్య మహర్షి

పూర్వకాలంలో అగస్త్య మహర్షి

పూర్వకాలంలో అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలోని జీవనదిలో ప్రవేశించాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తుంటాడు. ఆ ప్రార్థనతో స్వర్ణముఖి నది పాయ ఏర్పడింది కానీ అందులో నీళ్లు ఉండవు. ఈ కార్యం మొదలు పెట్టే ముందు గణపతిని పూజించకుండా ఈ కార్యం తలపెట్టుటే అందుకు కారణమని గ్రహించిన అగస్త్యుడు గణపతిని ఆరాధించాడు. పాతాళ మార్గం గుండా అక్కడికి చేరుకున్న గణపతి అగస్త్య మహర్షి కోరికను నెరవేర్చాడు.

PC- Viknesh

అగస్త్యమహర్షి కోరిక మేరకు గణపతి

అగస్త్యమహర్షి కోరిక మేరకు గణపతి

అగస్త్యమహర్షి కోరిక మేరకు గణపతి దర్శనం ఇచ్చిన చోటునే వెలిశాడు. అందువలన ఈ శ్రీ కాళహస్తిలో వినాయుని పూజించడం వల్ల ఆటంకాలు, ఆందోళనలు తొలగిపోయి విజయాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అంతే కాదు, అక్కడికి దర్శించే భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

P.C: You Tube

శ్రీ కాళహస్తీశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తులంతా

శ్రీ కాళహస్తీశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తులంతా

శ్రీ కాళహస్తీశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తులంతా ఈ పాతాళ వినాయకున్నిసేవించుకోవడం పరిపాటి. పాతాళ వినాయకుడి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలోనికి కేవల 10 మందిని మాత్రం పంపుతారు. ముఖ్యంగా ఆక్సిజన్ సరిగా అందదనే ఉద్ధేశ్యంతో వయస్సైన వారిని, ఆస్త్మా ఉన్నవారి, ఆర్థ్రైటిస్ సమస్యలున్న వారిని లోనికి ప్రవేశించడానికి అనుమతి లేదు.

P.C: You Tube

లోనికి వెళ్ళే కొద్ది కొద్దిగా భయంతో పాటు..

లోనికి వెళ్ళే కొద్ది కొద్దిగా భయంతో పాటు..

లోనికి వెళ్ళే కొద్ది కొద్దిగా భయంతో పాటు, ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. చాలా చిన్న ద్వారం ఉండటం వల్ల గుడిలోకి వెళ్ళడం తిరిగి రావడం కొద్దిగా కష్టం అవుతుంది. ఒక బ్యాచ్ కు 10మందికి మాత్రమే లోనికి పోవడానికి అనుమతిస్తారు. మెట్లద్వారాలోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గము లోనికి ఉంది. దాదపు 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం ఉంది. ఈ స్వామి కోర్కెలు తీర్చేవాడని ప్రసిద్ధి.

P.C: You Tube

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది.

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది.

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు.

P.C: You Tube

ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి

ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి

ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు.

P.C: You Tube

శ్రీ కాళహస్తీశ్వర ఆలయం

శ్రీ కాళహస్తీశ్వర ఆలయం

ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులను ఆకర్షించే దేవాలయాలకు శ్రీ కాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ది చెందినది. వివిధ రూపాల్లో పూజలందుకునే శివ, విష్ణు రూపాల దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి.

 ఈ ప్రదేశంలో ఎన్నో

ఈ ప్రదేశంలో ఎన్నో

ఈ ప్రదేశంలో ఎన్నో గుళ్ళు నిర్మించిన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అందువల్ల ఇక్కడి ప్రతి దేవాలయ నిర్మాణ శైలిలో ఆ నాడు పాలించిన రాజుల విశిష్ట అభిరుచుల్ని ప్రతిబింబిస్తాయి.

ఈ కాళహస్తికి ఒక ప్రత్యేకత ఉంది.

ఈ కాళహస్తికి ఒక ప్రత్యేకత ఉంది.

ఈ కాళహస్తికి ఒక ప్రత్యేకత ఉంది. అనేక మంది రాజులు తమ తమ సమయాల్లో నిర్మించిన దేవాలయాలపై చోళ, పల్లవ, విజయనగర రాజులు తమదైన ముద్రతో నిర్మించారు. విజయనగర రాజులు చాలా మంది తమ పట్టాభిషేకంను అంతఃపురాలూ, రాజ ప్రాసాదాల్లో కాక పవిత్రమైన గుళ్ళలోనే జరిపించుకునే వారట. అచ్యుతరాయల వారి పట్టాభిషేకం శ్రీ కాళహస్తిలోని వంద స్తంభాల మండపంలోనే జరిగాక తన రాజధానికి వెళ్లి వేడుకలు చేసుకున్నాడు.

ఒక అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతి

ఒక అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతి

ఒక అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతి కాళహస్తిలోని ప్రసిద్ధ దేవాలయాలు అటు పర్యాటకులకు, ఇటు భక్తులకు కూడా ఒక దివ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, భరద్వాజ తీర్థం, కాళహస్తి దేవాలయం, శ్రీ దుర్గా దేవి గుడితో పాటు, పాతాళ గణపతి ఆలయం కూడా ఇక్కడి ప్రసిద్ధ దేవాలయాల్లో కొన్ని.

శ్రీకాళహస్తి ఎలా చేరుకోవాలి ?

శ్రీకాళహస్తి ఎలా చేరుకోవాలి ?

చిత్తూరు జిల్లా తిరుపతికి 38 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. శ్రీకాళహస్తి కి తిరుపతి నుండి ప్రతి 5 నిమిషాలకి ఒక ప్రభుత్వ బస్సు నడుస్తుంది. రైళ్లలో వచ్చే యాత్రికులు శ్రీకాళహస్తి లోని రైల్వే స్టేషన్ లో దిగి ఆలయానికి చేరుకోవచ్చు.


ఒకవేళ విమాన మార్గాల్లో వచ్చే వారైతే రేణిగుంట విమానాశ్రయంలో దిగి, క్యాబ్ లేదా తిరుపతి వద్ద కి వచ్చి ప్రభుత్వ బస్సులో ఎక్కి శ్రీకాళహస్తి చేరుకోవచ్చు.


చెన్నై నుండి 3 గంటల ప్రయాణం ఫ్రీక్వెంట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

P.C: You Tube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X