Search
  • Follow NativePlanet
Share
» »వీకెండ్ టూర్ ... పెంచ్ నేషనల్ పార్క్ !!

వీకెండ్ టూర్ ... పెంచ్ నేషనల్ పార్క్ !!

పెంచ్ పర్యాటక రంగం వారు పచ్ధర్ గ్రామం, నవేగాన్ నేషనల్ పార్క్, కన్హ నేషనల్ పార్క్, నాగపూర్, నాగ్జిరా అభయారణ్యం వంటి అందమైన ఆకర్షనలను అందిస్తున్నారు. ఈ ప్రదేశాలన్నీ పెంచ్ కి సమీపంలో ఉన్నాయి.

By Mohammad

అభయారణ్యం : పెంచ్ నేషనల్ పార్క్ మరియు వైల్డ్ లైఫ్ శాంక్చురి

రాష్ట్రం : మధ్య ప్రదేశ్

వైశాల్యం : 758 చ. కి. మీ.

పెంచ్ పర్యాటక రంగం ప్రధానంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర దక్షిణ సరిహద్దులో ఉన్న పెంచ్ నేషనల్ పార్కు లేదా పెంచ్ టైగర్ రిజర్వ్ కు ప్రసిద్ది చెందింది. ఈ పార్కు వృక్ష, జంతు సంపాదకు బాగా పేరుగాంచింది. జామున్, టేకు, లేన్దియ, పలాస్, బీజ, మహు, కుసుమ, సేమేల్, వెదురు వంటి కొన్ని రకాల గుల్మకాండపు మొక్కలు, గడ్డి ఇక్కడ కనిపిస్తాయి. లంగూర్, సివెట్లు, ఎలుగుబంట్లు, చీతాలు, పులులు, సంబార్లు, అడవి కుక్కలు, పందుల, చిరుతలు, అక్షం దుప్పులు ఈ పార్క్ లో నివసించే జంతువులు.

నేషనల్ పార్క్ ప్రవేశం

నేషనల్ పార్క్ ప్రవేశం

చిత్రకృప : Aditya Patawari

ఈ పార్కుకి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఈ స్థల గొప్పదనాన్ని, సహజ సంపదను గురించి అయిన్-ఇ-అక్బరి లో వివరించబడింది. పెంచ్ నేషనల్ పార్కు, దాని పరిసరాలు రుడ్యార్డ్ కిప్లింగ్ అందించిన "ద జంగిల్ బుక్" యొక్క ప్రత్యెక అమరిక.

పెంచ్ నేషనల్ పార్క్

పెంచ్ జాతీయ పార్కు సాత్పురా పర్వతాలకు దిగువన దక్షిణాన వుంది. ఈ పార్కు గుండా ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహించే పెంచ్ నది పేరిట ఈ పార్కుకు ఆ పేరు వచ్చింది. ఈ పార్కు మధ్య ప్రదేశ్ రాష్ట్ర దక్షిణపు సరిహద్దులో మహారాష్ట్రకు దగ్గరగా వుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పార్కును 1983, 1992 లలో జాతీయ పార్కుగా ప్రకటించింది, దీన్ని దేశంలోని 19వ పులుల అభయారణ్యంగా ప్రకటించారు.

గ్వాలియర్ - మధ్య ప్రదేశ్ పర్యాటక రాజధాని !గ్వాలియర్ - మధ్య ప్రదేశ్ పర్యాటక రాజధాని !

ఈ పార్కు లో పొదలు, అధిరోహకలు, చెట్లు, మూలికలు, కలుపు మొక్కలు, గడ్డి పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రదేశంలో 1200 కంటే ఎక్కువ రకాల చెట్లు ఉన్నాయి. ఈ పార్కు 164 రకాల పక్షులకు, 10 రకాల ఉభాయచరాలకు, 33 రకాల క్షీరదాలకు, 30 రకాల సరీసృపాలకు, 50 రకాల చేపలకు నివాసస్థలంగా ఉంది. అంతేకాకుండా, విస్తృత శ్రేణిలో కీటకాలను కూడా ఇక్కడ చూడవచ్చు.

రాయల్ బెంగాల్ టైగర్

రాయల్ బెంగాల్ టైగర్

చిత్రకృప : Rudraksha Chodankar

ఈ పార్కు గొప్ప వృక్ష, జంతుజాలాన్ని కలిగిఉంది. ఇక్కడ చిరుతలు, పులులే కాకుండా, ఈ నేషనల్ పార్కు లో దుప్పి, బ్లాక్ బక్, నల్లని మెడగల కుందేళ్ళు, హైనాలు, ఎగిరే ఉడతలు, సంబార్లు, నక్కలు, అడవి పందులు, ముళ్ళ పందులు, నక్కలు, చౌసిన్ఘాలు, నిల్గై వంటివి కూడా ఉన్నాయి. ఈ పార్కులో (వలస వచ్చిన అలాగే ఇక్కడ నివశించే) ఇండియన్ పీతాలు, తెల్ల కళ్ళ బజార్డ్ లు, వాటర్ ఫోవ్ల్స్, మలబార్ హార్న్ బిల్ లు, కొంగలు, పచ్చని పావురాలు, ఆస్ప్రేల వంటి అనేక రకాల పక్షులు కూడా ఉన్నాయి.

పెంచ్ లో చుట్టుపక్కల ఏమేమి చూడాలి ?

పెంచ్ పర్యాటక రంగం వారు పచ్ధర్ గ్రామం, మహారాష్ట్ర నవేగాన్ నేషనల్ పార్క్, కన్హ నేషనల్ పార్క్, నాగపూర్, నాగ్జిరా అభయారణ్యం, ఇతర సహజ అడవులు వంటి అందమైన ఆకర్షనలను అందిస్తున్నారు. ఈ ప్రదేశాలన్నీ పెంచ్ కి సమీపంలో ఉన్నాయి. కన్హ నేషనల్ పార్కు పెంచ్ నుండి 198 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పెంచ్ డ్యాం

పెంచ్ డ్యాం

చిత్రకృప : Dinar3993

పచ్ధర్ పెంచ్ తురియ గేట్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడ ప్రయాణీకులు మట్టిముద్దలతో అద్భుతమైన వస్తువులను తయారుచేసే కుమ్మరులను చూడవచ్చు. మంత్రముగ్ధులను చేసే ఈ చేతిపనిని చూసిన వారు ఒక నమూనాను వారి ఇంటికి పట్టుకుపోవచ్చు.

పెంచ్ పర్యాటకరంగం పెంచ్ నేషనల్ పార్కు చుట్టూ ఉన్న గ్రామాల సమూహాన్ని అందిస్తుంది, అక్కడ పర్యాటకులు గోండ్ తెగ స్థానిక ఆచారాలను, సంస్కృతులను చూడవచ్చు.

మండు - విహార యాత్రకు చక్కటి ప్రదేశం !మండు - విహార యాత్రకు చక్కటి ప్రదేశం !

పెంచ్ నేషనల్ పార్క్ సందర్శన

సందర్శకులు ఈ పార్కుని అక్టోబర్ 16 నుండి జూన్ 30 వరకు సందర్శించవచ్చు, జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉండే వర్షాకాల సమయంలో ఈ పార్కు మూయబడి ఉంటుంది. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల మధ్యలో ఈ నేషనల్ పార్కు సందర్శన సరైనది. ఈ పార్కు సందర్శకుల కోసం ఉదయం 6 గంటల నుండి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరవబడి ఉంటుంది.

నెమళ్ళు

నెమళ్ళు

చిత్రకృప : Dinar3993

పెంచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి ఎలా చేరుకోవాలి ?

పర్యాటకులు రైళ్ళలో, విమానాలు, అదేవిధంగా రోడ్డు ద్వారా పెంచ్ సందర్శించవచ్చు. మధ్యప్రదేశ్ లో ఉన్న సియోని పెంచ్ కి సమీప రైలు కేంద్రం. నాగపూర్ లోని సోనేగాన్ పెంచ్ కి సమీప విమానాశ్రయం. సియోని జక్షన్ పెంచ్ కి సమీప బస్ స్టాండ్, ఇక్కడి నుండి పర్యాటకులు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సుల ద్వారా పెంచ్ చేరుకోవచ్చు. ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య సమయం పెంచ్ సందర్శన ఉత్తమం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X