Search
  • Follow NativePlanet
Share
» »దుర్మార్గుడైన దుర్యోధనుడికి ఒక ఆలయం ఉందంటే ఆశ్చర్యమే..!!

దుర్మార్గుడైన దుర్యోధనుడికి ఒక ఆలయం ఉందంటే ఆశ్చర్యమే..!!

కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో పోరువళి గ్రామంలో మలనాడు అనే ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మింపబడినది. అదే పెరువిరుతి మలనాడ గుడి. మలనాడు కొండ మీదే ఈ దుర్యోధనుడి ఆలయం ఉంది. ఈ కొండ

మహాభారతం గురించి తెలిసిన వారికి తప్పకుండా దుర్యోధనుడు గురించి కూడా తెలిసే ఉంటుంది. దుర్యోధనుడు అనగానే దుష్టత్వానికి ప్రతీకగా నిలిచే పాత్ర గుర్తుకువస్తుంది. దుర్యోధనుడు అనగానే అతి భయంకరుడు, నీచుడు, దుర్మార్గుడు ఎత్తుకి పై ఎత్తులు వేసే దుష్టిడిగా చెప్పుకుంటారు. అధికారం కోసం ఎంతటికైనా తెగించే దుర్మార్గం గుర్తుకువస్తుంది.

మరికొందరేమో దుర్యోధనుడిని స్నేహానికి అభిమానానికి ప్రతీకగా భావిస్తారు. అయినా కూడా ఆయన్ని కూడా దేవుడిగా కొలుస్తారు. అయితే దుర్యోధనుడు ఎంతటి దుష్టుడైనా ఆయనకు ఓ ఆలయమే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది. అక్కడి ప్రజలు దేవుడిగా ఎందుకు పూజిస్తున్నారన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం...

పెరువిరుతి మలనాడ గుడి.

పెరువిరుతి మలనాడ గుడి.

కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో పోరువళి గ్రామంలో మలనాడు అనే ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మింపబడినది. అదే పెరువిరుతి మలనాడ గుడి. మలనాడు కొండ మీదే ఈ దుర్యోధనుడి ఆలయం ఉంది. ఈ కొండను మలనాడ అని పిలుస్తారు. మలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థం! మల నాడ పరిసరాలు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాదు పచ్చని ప్రకృతికి నిలయాలు. చల్లని గాలి, నేత్రాలకు విందును చేసే ఏపుగా పెరిగిని వృక్షాలు, పచ్చని పొలాలు మనస్సుకు దేహానికి విశ్రాంతిని ప్రసాదిస్తాయి.

PC- Akhilan

భారత దేశంలోనే ఏకైక దుర్యోధనుని ఆలయం

భారత దేశంలోనే ఏకైక దుర్యోధనుని ఆలయం

భారత దేశంలోనే ఏకైక దుర్యోధనుని ఆలయంగా మలనాడు దేవాలయం విరాజిల్లుతోంది, అయితే మహాభారత కథ ఆధారంగా దుర్యోధనుడికి ఆలయాన్ని నిర్మించి అక్కడ దేవునిగా పూజలు అందుకుంటున్నాడంటే చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయమే.

PC- Ramanarayanadatta

ఈ ఆలయం వెనుక చాలా వింత చిరిత్రే దాగి ఉంది

ఈ ఆలయం వెనుక చాలా వింత చిరిత్రే దాగి ఉంది

ఈ ఆలయం వెనుక చాలా వింత చిరిత్రే దాగి ఉంది. కౌరవులతో జరిగిన జూదంలో ఓడిపోయిన పాండవులు 12ఏళ్లు అరణ్యవాసాన్నీ, ఏడాది అజ్ఝాతవాసాన్నీ అనుభవించేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే!

P.C:You Tube

స్థల పురాణం ప్రకారం,

స్థల పురాణం ప్రకారం,

స్థల పురాణం ప్రకారం, 12ఏళ్ళ అరణ్యవాసం తర్వాత పాండవులు చేసిన ఏడాది అజ్జాత వాసాన్ని భగ్నం చేయడానికి దుర్యోధనుడు, శకుని వేయని ఎత్తులు లేవు. మలనాడు ప్రాంతంలో నివసిస్తున్న సిద్ధులకి ఏవో అద్భుతమై శక్తులున్నాయని, ఆ రహస్యాలు కనుగొంటే కురుక్షేత్రంలో తన విజయం సాధించవచ్చని ఎవరిద్వారానో తెలుసుకుంటాడు దుర్కోధనుడు.

P.C:You Tube

శకునిని వెంటబెట్టుకుని, సిద్ధుల్ని వెతుకుతూ

శకునిని వెంటబెట్టుకుని, సిద్ధుల్ని వెతుకుతూ

దాంతో జిత్తులమారి మామ అయిన శకునిని వెంటబెట్టుకుని, సిద్ధుల్ని వెతుకుతూ కేరళలోని మలనాడు ప్రాంతానికి చేరుకున్నాక అలసిపోయి అక్కడే సేద తీరుతుండగా వారిద్దరికీ అక్కడి స్థానికులైన కురువలు స్వాగతం పలికి చల్లటి కొబ్బరి కల్లుతో దాహం తీర్చారు.

P.C:You Tube

ఆయన దర్శనానికి వచ్చినవారికి కొబ్బరి కల్లును తీర్థంగా ఇవ్వడమనే ఆచారం

ఆయన దర్శనానికి వచ్చినవారికి కొబ్బరి కల్లును తీర్థంగా ఇవ్వడమనే ఆచారం

అప్పటి నుండి ఈ ఆలయంలో కొబ్బరి కల్లును తీర్థంగా ఇస్తారని తెలిసి ఆశ్చర్యపోయేవాళ్లు, ఈ ప్రాంతవాసులు దుర్యోధనుడిని పూజించడానికీ ... ఆయన దర్శనానికి వచ్చినవారికి కొబ్బరి కల్లును తీర్థంగా ఇవ్వడమనే ఆచారం వెనుక బలమైన కారణమే కనిపిస్తూ వుంటుంది.

P.C:You Tube

పరమేశ్వరున్ని ప్రార్థించిన దుర్యోధనుడు

పరమేశ్వరున్ని ప్రార్థించిన దుర్యోధనుడు

దాంతో కల్లు రుచి చూసిన దుర్యోధనుడు మహా సంబరపడిపోయాడు. అక్కడి ప్రజల ఆతిథ్యాన్నీ, అక్కడి ప్రకృతి అందాలను చూసి ముగ్ధుడయ్యాడు. వెంటనే ఆ కొండ మీద కూర్చుని ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచమంటూ పరమేశ్వరుని ప్రార్థించాడు.

P.C:You Tube

 వంద ఎకరాల పొలాన్ని ఆ ప్రాంత వాసులకు దానం చేశాడు

వంద ఎకరాల పొలాన్ని ఆ ప్రాంత వాసులకు దానం చేశాడు

ఇక అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఓ వంద ఎకరాల పొలాన్ని ఆ ప్రాంత వాసులకు దానం చేశాడు. ఇప్పటికీ ఆ ప్రదేశం ప్రభుత్వ రికార్డులలో దుర్యోధనుడి పేరు మీదుగానే ఉంటుందని అంటారు. ఈ చుట్టుపక్కల ఆలయానికి ఉన్న భూములకు శిస్తు కూడా దుర్యోధనుడి పేరిటే ఇప్పటికీ చెల్లిస్తూ ఉండడం విశేషం.

P.C:You Tube

ఇదంతా జరిగిన ప్రదేశంలో దుర్యోధనుడికి ఓ ఆలయాన్ని

ఇదంతా జరిగిన ప్రదేశంలో దుర్యోధనుడికి ఓ ఆలయాన్ని

ఇదంతా జరిగిన ప్రదేశంలో దుర్యోధనుడికి ఓ ఆలయాన్ని నిర్మించారు ఆ ప్రాంతవాసులు. కాకపోతే ఆ ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం మాత్రం ఉండదు. గుడిలో ఒక ఎత్తైన ఖాళీ వేదిక మాత్రమే దర్శనమిస్తుంది.

P.C:You Tube

గుడిలోకి చేరుకునే భక్తులు తమ మనసులోనే ఆ మూర్తిని

గుడిలోకి చేరుకునే భక్తులు తమ మనసులోనే ఆ మూర్తిని

గుడిలోకి చేరుకునే భక్తులు తమ మనసులోనే ఆ మూర్తిని ఊహించుకుంటారు. ఈ ఆలయంలోని ‘కురవ' అనే కులానికి చెందిన వారు మాత్రమే పూజారులుగా సాగడం మరో విచిత్రం. దుర్యోధనుడికి కల్లుని అందించిన వృద్ధురాలు ‘కురవ' స్త్రీ కావడంతో ఈ ఆచారం మొదలై ఉంటుంది.

P.C:You Tube

ఆకాశమే పై కప్పుగా సప్తవర్ణ రంజిత పుష్పాలు,

ఆకాశమే పై కప్పుగా సప్తవర్ణ రంజిత పుష్పాలు,

తరతరాలుగా ఇక్కడి భక్తులు తమ ఆయురారోగ్యాలని,పంట పొలాలను కాపాడే దేవుడిగా దుర్యోధనుణ్ణి నిత్య పూజలతో కొలుస్తుంటారు. కేరళ కళా సంస్కృతి, నిర్మాణ శైలిలో ఆలయ ప్రధాన ద్వారాన్ని నిర్మించారు. ఆకాశమే పై కప్పుగా సప్తవర్ణ రంజిత పుష్పాలు, తళుకులీనే గొడుగులతో ఆలయం ఎంతో అందంగా అలంకరించి ఉంటుంది.

P.C:You Tube

ఈ ఆలయములోని గర్భగుడిలో నల్లరాతి గద్దె దర్శనమిస్తుంది

ఈ ఆలయములోని గర్భగుడిలో నల్లరాతి గద్దె దర్శనమిస్తుంది

ఈ ఆలయములోని గర్భగుడిలో నల్లరాతి గద్దె దర్శనమిస్తుంది. దానిమీద ఎలాంటి అర్చామూర్తి లేడు. ఆ గద్దె దుర్యోధనుని సింహాసనంగా, దానిమీదే అయన ఆసీనులై ఉన్నారన్న భావనతో భక్తులు పూజిస్తారు. ఈ గుడిలో ఉపదేవతలుగా కొలువై ఉన్నదెవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు! ఇంతకూ ఎవరో తెలుసా? దుర్యోధనుడి భార్య భానుమతి, అతడి తల్లి గాంధారి, సోదరి దుస్సల, గురువు ద్రోణుడు, ఆప్తమిత్రుడు కర్ణుడు.!

P.C:You Tube

మార్చిలో జరిగే ‘కెట్టుకజ’ లేదా మలక్కుడ ఉత్సవం

మార్చిలో జరిగే ‘కెట్టుకజ’ లేదా మలక్కుడ ఉత్సవం

మలనాడకి ప్రతిరోజూ భక్తులు వస్తూనే ఉంటారు. కానీ మార్చిలో జరిగే ‘కెట్టుకజ' లేదా మలక్కుడ ఉత్సవానికి మాత్రం రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది జనం వస్తారు. మన బోనాల సందర్భంగా ఎలాగైతే వెదురుతో తొట్టెలు చేస్తామో... అలాగే 100 అడుగుల ఎత్తున అలంకరణలు చేసి వాటిని భుజాన మోస్తారు. ఉత్తర భారతంలో అక్కడక్కడా దుర్యోధనుడిని ఆరాధించే ప్రజలు కనిపిస్తారు. కానీ దక్షిణభారతదేశంలో మాత్రం బహుశా ఈ ఒక్క ప్రదేశంలోనే ఆయన పూజ కనిపిస్తుంది.

P.C:You Tube

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

కేరళలో ముఖ్యపట్టణమైన అడోర్ నుంచి ఈ దేవాలయం కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

విమాన మార్గం: పొరువళికి సమీప విమానాశ్రయం త్రివేండ్రంకి 88 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు త్రివేండ్రంకు నేరుగా విమానంలో వెళ్ళవచ్చు, ఆపై అక్కడి నుండి పొరువళికి క్యాబ్ లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు.

రైలు మార్గం: కొల్లాంకు నేరుగా రైల్వే జంక్షన్‌ ఉంది, అక్కడి నుండి, క్యాబ్ లేదా బస్సు ద్వారా పొరువళి చేరుకోవడానికి ఉత్తమ మార్గం. పొరువళిలోని ఆలయానికి మరియు కొల్లంలోని రైల్వే స్టేషన్ కు మధ్య దూరం 34 కి.మీ.

రోడ్డు మార్గం: పొరువళి యొక్క కుగ్రామానికి అన్ని ఇతర నగరాలు మరియు పట్టణాల నుండి బస్సు మార్గం ఉంది, కాబట్టి బస్సు మార్గం ద్వారా కూడా సులభంగా చేరుకోవచ్చు.

P.C:You Tube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X