Search
  • Follow NativePlanet
Share
» »మీవి కెమరా కళ్లు అయితే ...ఈ ప్రాంతాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి

మీవి కెమరా కళ్లు అయితే ...ఈ ప్రాంతాలు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి

ఫొటోగ్రఫీ వృత్తికలిగిన వారే కాక దీన్ని ప్రవృత్తి గా కలిగిన వారు కూడా పర్యాటకం సమయంలో మంచి ఫొటోలు తీయాలని ఉవ్విళ్లూరడం సహజం. ఈ నేపథ్యంలో ఫొటోగ్రఫీ టూరిజం పై ప్రత్యేక కథనం.

By Beldaru Sajjendrakishore

గతంలో పర్యాటక ప్రాంతాల్లోని మరుపురాని ఘటనలను, అక్కడి ప్రాంతాలను చక్కిన ఫొటోల రూపంలో బంధించి తీసుకువచ్చేవారు. ఈ ఫొటోలను తమకు తెలిసిన వారందరికీ చూపించి ఎంతగానే సంతోషించేవారు. అయితే అన్ని రంగాల్లో మార్పు వచ్చినట్లే పర్యాటక రంగంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇప్పడు మంచి ఫొటోలను తీయడానికే టూర్లు వెలుతున్న వారూ ఉన్నారు. ఇక భారత దేశం విభిన్న సంస్కతి సంప్రదాయాల మేలు కలయిక. అంతే కాకుండా మన దేశ భూభాగంలో అటు ఎడారులతో పాటు ఇటు మంచు కొండలూ ఉన్నాయి. అంతేకాకుండా బీడు భూములతో పాటు ఎటు చూసిన పచ్చదనం ప్రతిబిభించే కొండ కోనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫొటోగ్రఫీ టూరిజానికి అత్యంత అనుకూలమైన పర్యాటక ప్రాంతాల వివరాలు నేటివ్ ప్లానెట్ మీ కోసం తీసుకువచ్చింది. మరెందుకు ఆలస్యం కెమరాను భుజాన వేసుకుని ట్రావెల్ బ్యాగ్ ను సర్దేసుకోండి....

1. అడవి జంతువుల ఠీవీ కోసం

1. అడవి జంతువుల ఠీవీ కోసం

Image source

బోనులో, సర్కస్ లో అడవి జంతువులను చూడటం వేరు, వాటి సహజ పరిసర ప్రాంతాలైన అడవుల్లో వాటి ఆహారాన్ని, గంభీరాన్ని చూడటం వేరు. సహజ పరిస్థితులకు క`త్రిమమైన వసతులకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల అడవి జంతువులు ముఖ్యంగా సింహం, పులి వంటి జంతువుల ఠీవిని అడవుల్లో చూడటం వాటిని కెమరా కంటిలో బంధించడం మరుపురాని ఘట్టం. ఇటువంటి ఫొటోలను తీసే వారిని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫర్స్ అని ఈ విధానాన్ని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అని అంటారు.

2.సింహపు ఠీవి...

2.సింహపు ఠీవి...

Image source

ఇందు కోసం భారత దేశంలో పలు ప్రాంతాలు రారమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్ లోని గిర్ అడువులు ఆసియా సింహాలకు ఆలవాలం అక్కడికి వెళితే సింహపు ఆహారపు అలవాట్లను మీ కెమరా కంటితో చూడవచ్చు.

3.పులి పంజా కోసం

3.పులి పంజా కోసం

Image source

ఇక భారత దేశంలో మొత్తం 39 పులి అభయారణ్యాలు ఉన్నాయి. ఇందులో అతి పెద్దదైన నాగార్జునసాగర్...శ్రీశైలం టైగర్ రిజర్వ్ వైల్డ్ లైఫ్ టూరిజానికి ఉత్తమమైనది. అదేవిధంగా దేశంలోని వేర్వేరు భౌగోళిక పరిస్థితులను అనుసరించి అక్కడ ఏనుగు, జింకలు, ఎలుగుబంట్లు వంటి వన్యమృగాల అభయారణ్యాలు ఉన్నాయి. అక్కడికి వెళితే మనతో పాటు మన కెమరాకంటికి కూడా పండుగే.

4.కువకువరాగాల కోసం

4.కువకువరాగాల కోసం

Image source

మరోవైపు వివిధ రకాల పక్షులను అత్యంత అరుదైన పక్షిజాతులను చూడాలను కునే వారికి బర్డ్ ఫొటోగ్రఫీ టూరిజం ఆహ్వానం పలుకుతోంది. ఇలాంటి పక్షి ప్రేమికులు ఎక్కువగా రాజస్థాన్ లోని తాల్ చాపర్ కు వెలుతుంటారు. ఇది పెద్దగా ప్రాచూర్యంలోకి రాని ప్రాంతమైనా ఒక్కసారి ఇక్కడికి వెలితే మరీ మరీ వెళ్లాలని పించే పర్యాటక ప్రాంతం. ఇక కర్ణాటకలో కూడా రంగనాతిట్టుతో సహా అనేక ప్రాంతాలు ప్రక్షిప్రేమికులతో ఫాటు వాటిని తమ ఫ్రేములో బంధించాలనుకునేవారికి ఆహ్వానం పలుకుతున్నాయి.

5. ప్రకృతి సోయగాలను బంధిస్తే

5. ప్రకృతి సోయగాలను బంధిస్తే

Image source

ఎన్విరాన్ మెంటల్ ఫొటోగ్రఫీ ఇటీవల బాగా ప్రాచూర్యంలోకి వచ్చిన ఫొటోగ్రఫీ టూరిజం. ఈ విధానంలో అత్యంత సుందరమైన ప్రక`తి హొయలను మన కెమరాతో బంధిస్తాం. ఇందులో సప్తవర్ణాల ఇంధ్రధనస్సు మొదలు కొని తామరాకు పై నీటి బొట్టును కూడా మన కెమరా కంటితో చాలా అద్భుతంగా చూపించవచ్చు. అయితే ఇందు కోసం ఆ ప్రాంతం భౌగోళిక స్వరూపం పై పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం మంచి ఫొటోలను తీయగలం.

6.పై నుంచి కిందికి ఉరికే నీటిని

6.పై నుంచి కిందికి ఉరికే నీటిని

Image source

ఇందులో వాటర్ ఫాల్స్ ఫొటోగ్రఫీ అత్యంత ఆకర్షీయమైనది. ఈ విధానంలో ఉరకలు వేస్తూ అంతెత్తు నుంచి కిందికి పడే జలపాతాల హోరులతో పాటు అక్కడి పరిసరాల్లోని మొక్కలను, చెట్లను ఎంతో అందంగా చూపించవచ్చు. ఇందు కోసం ఎక్కువగా దూద్ సాగర్, జోగ్, చిత్రకూట్ వాటర్స్ ఫాల్స్ దగ్గరకు వెళ్లవచ్చు.

7.గుహల అందాలను

7.గుహల అందాలను

Image source

మరోవైపు కేవింగ్ ను ఇష్టపడే వారు కూడా అత్యంత అరుదైన ఫొటోలను తీస్తుంటారు. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ లోని బొర్రగుహల వంటి భూగర్భ అందాలు తనలో దాచుకున్న ప్రాంతాలతో పాటు అంజంతా, ఎల్లోరా వంటి గుహాలయాలకు కూడా ఫొటోగ్రఫీ టూరిస్ట్ లు ఎక్కువగా వెలుతుంటారు.

8. సాగర గర్భంలోకి వెళ్లి

8. సాగర గర్భంలోకి వెళ్లి

Image source

మరోవైపు సాగరగర్భంలో దాగున్న జీవరాసులను అత్యంత అద్భుతంగా తీయాలనుకునే వారికి భారత దేశంలోని అనేక సముద్ర తీర ప్రాంతాలతో అండమాన్, నికోబర్, లక్షద్వీప్, చోచిన్ వంటి ద్వీపాలు ఆహ్వానం పలుకుతున్నాయి. సముద్ర గర్భంలోకి వెళ్లి ఫొటోలు తీయాలంటే మాత్రం కొన్ని ప్రత్యేక అనుమతులు తీసుకోవడం తప్పినిసరి.

9. అర్భన్ ఫొటోగ్రఫీ టూరిజం

9. అర్భన్ ఫొటోగ్రఫీ టూరిజం

Image source

కేవలం ప్రక`తికి సంబంధించిన విషయాలే కాకుండా పట్టణీకరణ అందువల్ల కలిగిన లాభాలు, నష్టాలను తమ ఫొటోల ద్వారా చెప్పాలను కునే వారు కూడా ఎంతో మంది ఉంటారు. అటువంటి వారికి బెంగళూరు నుంచి ముంబై వరకూ అనేక పట్టణాలు రారమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి. ఇక్కడ మెట్రోవంటి ఆధునిక రవాణా సౌకర్యం వల్ల కలిగిన ప్రయోజనం చూపిస్తూనే ఇందు కోసం నేలరాలిన చెట్లు దాని వల్ల పర్యవరణానికి కలిగిన కీడును కూడా మన ఛాయా చిత్రాల ద్వారా చెప్పవచ్చు.

10.చరిత్రను చెప్పే శిల్పాల అందాలు

10.చరిత్రను చెప్పే శిల్పాల అందాలు

Image source

భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలకు వివిధ చోట్ల ఉన్న దేవాలయాల్లోని శిల్పాలు నిలువుటద్దాలు. ఈ శిల్పాలను అంతే అందంగా తమ కెమరా కంటితో బంధించడానికి వీలుగా చాలా మంది విదేశీయులు కూడా భారత దేశానికి వస్తున్నారు. ఇటువంటి వారికి హంపి విరూపాక్షదేవాలయం దేశం నలుమూల ఉన్న దేవాలయాలు ఆహ్వానం పలుకుతున్నాయి. అయితే కొన్ని దేవాలయల్లో లేదా దేవాలయల్లోని కొన్ని విగ్రహాలను ఫొటోలు తీయడానికి ప్రత్యేక అనుమతి తప్పని సరి.

11. గిరిజనుల సంప్రదాయాలను

11. గిరిజనుల సంప్రదాయాలను

Image source

శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతోమందుకు వెళుతున్న భారత దేశంలో ఆధునిక ప్రపంచ పోకడాలు తెలియని ఎన్నో గిరిజన తెగలు ఉన్నాయి. వారి జీవన విధానాన్ని ఫొటోల రూపంలో బంధించాలని కొంతమంది ఎంతో ఉత్సాహపడుతుంటారు. అటు వంటి వారికి భారత దేశంలోని అనేక గిరిజన ప్రాంతాలు ఉత్తమమైన పర్యాటక ప్రాంతాలు. ఉదాహరణకు తెలుగు ఉభయరాష్ట్రాల్లో ఉన్న గడప, గోండవ తదితర తెగలు. వీరి కట్టే బట్ట నుంచి తినే తిండి వరకూ ప్రతి ఒక్కడి ఫొటోగ్రఫీకి పనికి వచ్చే అంశమే.

Read more about: travel tourism photography
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X