Search
  • Follow NativePlanet
Share
» »రాముడు నడియాడిన ... రామగిరి దుర్గం !

రాముడు నడియాడిన ... రామగిరి దుర్గం !

By Mohammad

రామగిరి ఖిల్లా .. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద శత్రుదుర్భేద్యమైన కోట. ఇది అద్భుత శిల్పకళా సంపదకు, నాటి శిల్పకళా నైపుణ్యానికి ననిలువెత్తు నిదర్శనం. హైదరాబాద్ నుండి 215 కి. మీ ల దూరంలో, కరీంనగర్ నుండి 40 కి. మీ ల దూరంలో ఒక ఎత్తైన కొండ మీద ఈ కోట నిర్మితమైనది.

చరిత్ర

రామగిరి ఖిల్లాను క్రీ.శ ఒకటవ శతాబ్దంలో నిర్మించినట్లు ... శాతవాహనాలు, పులోమావి వంశస్థులు పాలించినట్లు పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ కొన్ని ఆధారాల ద్వారా తేటతెల్లమయ్యాయి. ఆ తరువాత ఖిల్లాను ప్రతాపరుద్రుడు, బహమనీ సుల్తానులు, రెడ్డిరాజులు, మొఘలులు, గోల్కొండ నవాబులు, నిజాం నవాబులు పాలించారు. చివరగా స్వాతంత్య్ర భారతావనిలో అంతర్భాగమైనది.

శత్రుదుర్భేద్యమైన రామగిరి ఖిల్లా

శత్రుదుర్భేద్యమైన రామగిరి ఖిల్లా

చిత్రకృప : Urssiva

విశేషాలు

చుట్టూ ఆహ్లాదపరిచే ప్రకృతి రమణీయ దృశ్యాలు, సవ్వడి చేసే నీటి సెలయేర్లు, అబ్బురపరిచే కళాఖండాలు, ప్రాచీన కళావైభవాన్ని చాటుతూ నేటికీ రామగిరి ఖిల్లా పర్యాటకులను అలరిస్తున్నది. కాకతీయుల కాలం శిల్పకళా పోషణలు పెట్టింది పేరు. వారికాలంలో ఈ దుర్గం మీద అనేక కట్టడాలు నిర్మించినట్లు చెబుతారు.

తెలంగాణలో ఫ్రెండ్స్ తో కలిసి వెల్ళవలసిన పర్యాటక ప్రదేశాలు !

అప్పట్లో రామగిరి ఖిల్లా చుట్టూ 9 ఫిరంగులు, 40 తోపులు ఉండేవి. ప్రస్తుతం ఇక్కడ ఒక ఫిరంగి మాత్రమే ఉంది.

రామగిరి ఖిల్లా పోర్ట్ గేట్

రామగిరి ఖిల్లా పోర్ట్ గేట్

చిత్రకృప : Urssiva

రాముడు నడియాడిన నేల

పౌరాణికం లో రామగిరి ఖిల్లా గురించి ప్రస్తావించబడింది. ముఖ్యంగా రామాయణంలో. రాముడు వనవాస సమయంలో ఇక్కడ కొద్ది రోజులపాటు కుటీరం ఏర్పరుచుకొని నివసించినట్లు మరియు తపస్సు ను ఆచరించి శివలింగాన్ని ప్రతిష్టించినట్లు చెబుతారు. ఈ ప్రదేశంలో సీతారామలక్ష్మణులు సంచరించినట్లు ఆనవాళ్లు పర్యాటకులకు దర్శనమిస్తాయి.

ఫరహాబాద్ ఫారెస్ట్ - తెలంగాణ లో అతిపెద్ద టైగర్ ఫారెస్ట్ జోన్ !

ఖిల్లాలో బండరాతిపై రాముని పాదాలు, సీతాదేవి స్నానం ఆచరించిన కొలను, హనుమాన్ విగ్రహం, నంది విగ్రహం లు ఉన్నాయి. శ్రీరాముడు విగ్రహం ఉన్న చోట 1000 మంది తలదాచుకునేంత విశాల మైదానం ఉండటం విశేషం.

రామగిరి ఖిల్లా వ్యూ పాయింట్

రామగిరి ఖిల్లా వ్యూ పాయింట్

చిత్రకృప : Urssiva

చూడవలసిన ప్రదేశాలు

రామగిరి దుర్గం అంతర్బాగంలో సాలుకోట, సింహల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వశాల కోట, కొలువుశాల, మొఘల్‌శాల, చెరశాల, గజశాల, భజన శాల, సభాస్థలి వంటి వాటితో పాటు చెక్కరబావి, సీతమ్మ బావి, పసరుబావి, సీతమ్మకొలను, రహస్య మార్గాలు, సొరంగాలు లాంటి అనేక ప్రదేశాలు పర్యా టకులను మరిపిస్తాయి.

సకల దేవుళ్ళు కొలువైన క్షేత్రం .. సురేంద్రపురి !

శ్రావణమాసంలో సందడి

రామగిరి ఖిల్లా లో శ్రావణమాసం వచ్చిందంటే చాలు సందడి మొదలవుతుంది. వర్షాకాలం లో పచ్చదనం పరుచుకోవడంతో ... ఇది మొదలవుతుంది. దుర్గం లో ప్రకృతి అందాలను చూస్తూ పర్యాటకులు ముగ్ధులవుతారు. ఆయుర్వేద వైద్యులు ఇక్కడ లభించే ఔషధ మొక్కలను సేకరిస్తారు.

కనుచూపుమేర పచ్చదనమే

కనుచూపుమేర పచ్చదనమే

చిత్రకృప : Urssiva

రామగిరి ఖిల్లా కు వెళ్లాలంటే ...!

వాయు మార్గం : సమీపాన 215 కి. మీ ల దూరంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి రామగిరి ఖిల్లా చేరుకోవచ్చు.

రైలు మార్గం : పెద్దపల్లి రైల్వే స్టేషన్ రామగిరి ఖిల్లా కు 20 కి. మీ ల దూరంలో కలదు. ఈ స్టేషన్ న్యూఢిల్లీ - కాజీపేట రైలు మార్గంలో కలదు. పెద్దపల్లిలో దిగి ఆటోలు లేదా ప్రభుత్వ బస్సులలో చేరుకోవచ్చు.

ఎన్టీఆర్ గార్డెన్స్, హైదరాబాద్ !

రోడ్డు మార్గం / బస్సు మార్గం : కరీంనగర్ నుండి మంథని - కాళేశ్వరం వెళ్లే దారిలో రామగిరి ఖిల్లా కలదు. కమాన్ పూర్ మండలంలోని నాగపల్లె బేంగంపేట క్రాస్ రోడ్నుంచి బేంగంపేట గ్రామం మీదుగా 2 కి. మీ. ల దూరం కాలినడకన నడిస్తే రామగిరి కోట చేరుకోవచ్చు. ఈ కోట మొత్తం చూడాలంటే 16 కి.మీ ల దూరం నడవాల్సి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more