Search
  • Follow NativePlanet
Share
» »రామాయణానికి కేరాఫ్ అడ్రస్.. గ్రేప్ సిటీగా ప్రకృతి సంపదకు లోటులేదు..

రామాయణానికి కేరాఫ్ అడ్రస్.. గ్రేప్ సిటీగా ప్రకృతి సంపదకు లోటులేదు..

సంవత్సరంలో ఒక్కసారైనా షిరిడీ దర్శించాలని కోరుకునే పర్యాటకులెందరో. ఎందుకంటే సాయినాధునిపై ఉండే భక్తిభావం, శిరిడి ప్రకృతి అందాలు మనస్సును కట్టిపడేస్తాయి. షిరిడీ దర్శించే వారు మార్గంలో నాసిక్ మరో మజిలీ.

సంవత్సరంలో ఒక్కసారైనా షిరిడీ దర్శించాలని కోరుకునే పర్యాటకులెందరో. ఎందుకంటే సాయినాధునిపై ఉండే భక్తిభావం, శిరిడి ప్రకృతి అందాలు మనస్సును కట్టిపడేస్తాయి. షిరిడీ దర్శించే వారు మార్గంలో నాసిక్ మరో మజిలీ. గ్రేప్ సిటిగా ప్రసిద్ది చెందిన నాసిక్ లో ఒక వైపు గోదావరి నదీ జలాల గలగలలు వినిపిస్తాయి. మరో వైపు నోరూరిస్తూ ద్రాక్షతోటలు విస్తారంగా కనబడుతాయి.

మహారాష్ట్రలో ఉన్న షిరిడి నుండి 86 కిలో మీటర్ల దూరంలో ఉండే నాసిక్ నగర ప్రకృతి సంపదకు లోటు ఉండదు. నేపా వ్యాలీ పడమటి కనుమలలో కలదు. నాసిక్ మొదటిలో శాతవాహన రాజుల రాజధానికిగా ఉండేది. మొఘల్ చక్రవర్తుల పాలనలో గుల్షనాబాద్ గా పేరొందిన ఈ నగరం..చారిత్రక నేపథ్యంతో పాటు పౌరాణిక ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక వైభవం కలిగి ఉంది. అంతే కాదు, నాసిక్ కు రామాయణంకు చాలా దగ్గరి సంబంధం ఉంది. రామాయణంలో ప్రస్తావించిన కొన్ని తాలు నాసిక్ లో ఉన్నట్లు పురాణాలు తెపుతున్నాయి. మరి ఆ పురాణగాథ ఏంటో ఆప్రదేశాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

నాసిక్ చుట్టుపక్కల ప్రాంతాలు

నాసిక్ చుట్టుపక్కల ప్రాంతాలు

నాసిక్ చుట్టుపక్కల ప్రాంతాలు రామాయణ గాథతో ముడిపడి ఉన్నాయి. శ్రీరాముడు 14సంవత్సరాలు అరణ్య వాసం చేసింది నాసిక్ లోని తపోవనంలోనే. ఈ ప్రదేశంలోనే లక్ష్ముణుడు..శూర్పణఖ ముక్కు చెవులు కోశాడనీ అందుకే ఈ ప్రాంతానికి నాసిక్ అని పేరువచ్చింది.

Photo Courtesy: Indi Samarajiva

నాసిక్ లో పంచవటి ప్రముఖ పర్యాటక ప్రదేశం

నాసిక్ లో పంచవటి ప్రముఖ పర్యాటక ప్రదేశం

నాసిక్ లో పంచవటి ప్రముఖ పర్యాటక ప్రదేశం. పాండవులు వనవాస కాలంలో సీతారామలక్ష్ముణులు ఇక్కడే ఉన్నారని స్థల పురాణం ఉంది. కాబట్టి రామాయణంలో పేర్కొనబడిన సీతా గుఫ చూసేందుకు పంచవటి తప్పక సందర్శించవలసిన ప్రదేశం.

Photo Courtesy: Nilesh.shintre

గోదావరి నదిపై రామ, లక్ష్మణ గుండాలున్నాయి.

గోదావరి నదిపై రామ, లక్ష్మణ గుండాలున్నాయి.

గోదావరి నదిపై రామ, లక్ష్మణ గుండాలున్నాయి. ఒడ్డున ఉన్న సీతాగుఫా(గుహ) ప్రాంతంలోనే రావణుడు సీతమ్మను అపహరించాడని చెబుతారు. ఈ ప్రదేశాలు నిత్యం యాత్రికులతో సందడిగా ఉంటుంది.

Photo Courtesy: World8115

17వ శతాబ్దంలో నిర్మించిన కాలారామ్

17వ శతాబ్దంలో నిర్మించిన కాలారామ్

17వ శతాబ్దంలో నిర్మించిన కాలారామ్ ఆలయంలో అనువణువునా అద్భుతమైన శిల్పకళ అలరిస్తుంది. పట్టణంలోని ముక్తిధామ్ ఆలయం పూర్తిగా పాలరాతితో నిర్మించారు.

PC - Official Website For Maharashtra Tourism

ఆలయం గోడలపై భగవద్గీతలోని శ్లోకాలన్నీ

ఆలయం గోడలపై భగవద్గీతలోని శ్లోకాలన్నీ

ఆలయం గోడలపై భగవద్గీతలోని శ్లోకాలన్నీ చెక్కడం విశేషం. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో పాండవ గుహలుంటాయి. వీటిలో బౌద్దం, జౌనమతాలకు చెందిన శిల్పాలను చూడొచ్చు.Photo Courtesy: Katyare

చిక్కటి అడవిలో

చిక్కటి అడవిలో

చిక్కటి అడవిలో ఉండే పాండవ గుహాల దగ్గర ట్రెక్కింగ్ , రాక్ క్లైంబింగ్ కు అనుకూలమైన ప్రదేశం.

Photo Courtesy: amol kataria

త్రయంబకేశ్వరం దగ్గరలో

త్రయంబకేశ్వరం దగ్గరలో

త్రయంబకేశ్వరం దగ్గరలో ఉన్న జలపాతం చూడటానికి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి సందర్శిస్తుంటారు.

P.C: You Tube

నాసిక్ నగరంలోని నాణేలా మ్యూజియం

నాసిక్ నగరంలోని నాణేలా మ్యూజియం

నాసిక్ నగరంలోని నాణేలా మ్యూజియం ఔత్సాహికులను ఆకర్షిస్తుంది. ఆసియా ఖండంలోనే ప్రసిద్ది చెందిన నాణేలా మ్యూజియం ఇక్కడ ఉండటం విశేషం. నాణేలు సేకరించే హాబీ ఉన్నవారు ఈ మ్యూజియంలో శతాబ్దాలనాటి నాణేలు ప్రదర్శించబడతాయి.

Photo Courtesy: RKBot

రామ్కుండ్:

రామ్కుండ్:

రామకుంద్ పర్యాటకం మరియు ఆధ్యాత్మికత సందర్శనకు అనువైన ప్రదేశం, రాంకుండ్ ఘాట్ సందర్శణ ఆహ్లాదం కలిగిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం, శ్రీరాముడు మరియు సీత స్నానం చేయడానికి ఉపయోగించిన ప్రదేశం రాంకుండ్ . అనేకమంది భక్తులు ఇక్కడ స్నానం చేసి ప్రార్థన చేస్తారు, అందుకే ఈ జలాంతర్గాములను మోక్షం ఇచ్చునని చెబుతారు.

PC- BOMBMAN

దుధ్ సాగర్ జలపాతం:

దుధ్ సాగర్ జలపాతం:

నాసిక్ రహదారి ద్వారా దుధసాగర్ వాటర్ ఫాల్స్ మరొక అందమైన ప్రదేశం. కాస్కేడింగ్ 10 మీటర్లు, ఈ జలపాతాలు 'దుద్ద్' లేదా పాలు అనే పదం నుండి తమ పేరును పొందుతాయి. ఇది ఒక ప్రసిద్ధ విహారయాత్రా స్థలం మరియు ఈ ప్రదేశంను సందర్శించడానికి బుతుపవన కాలం ఉత్తమమైనది.

సులా వైన్యార్డ్స్:

సులా వైన్యార్డ్స్:

విహారయాత్రకు ప్రత్యేకమైన ప్రదేశం. ఈ ప్రదేశం సందర్శించడానికి పర్యాటకలు చాలా ఆసక్తిని కనబరిచే ప్రదేశం సులా వైన్యార్డ్స్. పచ్చని పచ్చిక , ఆదునిక సదుపాయాల మంది , ద్రాక్షతోటలు పర్యాటకులను ముఖ్యంగా వైన్ ప్రేమికు ఆహ్లాదం కలిగిస్తాయి. ద్రాక్ష తోటలకి ప్రసిద్ది చెందినది సులా వైనార్డ్స్, నాసిక్ నుండి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాస్తవానికి, ఈ ప్రదేశంలో వైన్ కు ప్రసిద్ధి చెందినది మాత్రమే కాదు, సైకిల్ ట్రెక్కింగ్ కు , పిక్నిక్ స్పాట్ కు సుందరమైన ప్రదేశం.

ఎలా వెళ్ళాలి:

ఎలా వెళ్ళాలి:


నాసిక్ ప్రధాన నగరం ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి నాసిక్ వెళ్ళడానికి దేవగిరి రైలు ఉంది.

ఎయిర్ పోర్ట్: నాసిక్ పట్టణానికి 25కిలోమీటర్ల దూరంలో ఉంది

Photo Courtesy: Superfast1111

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X